బీజేపీ సర్కారు బీసీల పట్ల నిర్లక్ష్యం

– మహిళ రిజర్వేషన్ బిల్లు లో బిసి ల వాటా తేల్చాలి

– మహిళా బిల్లును వచ్చే సార్వత్రిక ఎన్నికలలోనే అమలు చెయాలి

-బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్

#నెక్కొండ, నేటి ధాత్రి: కేంద్రంలోని బీజేపీ సర్కారు చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ను కల్పిస్తూ పార్లమెంట్ లో పెట్టిన బిల్లును స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం హరి ప్రసాద్ మాట్లాడుతూ బిసి మహిళ ల వాటా ఎంతో కేంద్ర ప్రభుత్వాన్ని తేల్చాలని బిసి ల పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగావ్యవహరిస్తోందని,భారత దేశ జనాభా లో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్‌లు ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రకటన విడుదల చేయాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్ మేరు ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్ణంగాఉందని, అందులో బిసి మహిళల ఊసే లేదని , అదేవిధంగా మహిళా బిల్లును వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిసి జన గణన చేపట్టి,బిసి జనాభా లెక్కలు తీయాలని,బిసిలకు దామాషా ప్రకారం రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించాలని డిలిమిటేషన్ తరువాత మహిళ రిజర్వేషన్ బిల్లు ను అమలు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తీరును చూస్తే వింతగా అనిపిస్తోందని,2029 సంవత్సరం ఎన్నికలకు ముందు డిలిమిటెషన్ జరుగుతుందని అంటే అప్పటి వరకు మహిళ బిల్లుకు మోక్షం లేదన్నట్లే కదా అని వ్యాఖ్యానించారు.అసలు దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారని, కానీ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం 2020 సంవత్సరం లో జన గణన ను చేపట్టలేదని అన్నారు. డి లిమిటీషన్, జన గణన లో కులాల వారిగా గణన సాకు తో 2029 కాదుగదా 2034 ఎన్నికల్లో కూడా మహిళ రిజర్వేషన్ బిల్లు అమలయ్యే జాడ కనబడటం లేదని పేర్కొన్నారు. మహిళ ఓట్లను ఎన్నికల్లో దండుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడగా అనిపిస్తోందని విమర్శించారు. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే బిసి ల వాటా ను తేల్చుతూ,మహిళా రిజర్వేషన్ బిల్లు ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో కేవలం లోక్ సభలో భారతీయ మహిళలకు రిజర్వేషన్స్ ఇచ్చి,రాజ్యసభ లో మాత్రం ఇవ్వకపోవడం శోచనీయమనిఅన్నారు.ఇప్పటికైనా కేంద్రం స్పందించి చట్ట సభల్లో బీసీ లందరికి సంబంధించిన రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్ మేరు డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *