జడ్చర్ల / నేటి ధాత్రి
జడ్చర్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే
జనంపల్లి అనిరుధ్ రెడ్డి జన్మదిన వేడుకలు బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, ఉర్కొండ, నవాబుపేట మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ కేక్ కట్ చేసి పలువురికి పంచారు. రాజాపూర్ మండల కేంద్రంలో మహిళల కోలాటాలు, యువకుల డప్పు నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. బాలానగర్ మండల మండల కేంద్రంలో జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులకు వాలీబాల్ నెట్ ప్రాక్టీస్ పరికరాలను అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు