భద్రాచలం నేటిదాత్రి
ఈరోజు భద్రాచలం మండలంలో నన్నపనేని మోహన్ జడ్పీ హెచ్ ఎస్ హై స్కూల్ లో ప్రొ,, జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఇష్టంగా చదువుకొని ఉన్నత స్థాయిలకు ఎదగాలని, నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకొని డాక్టర్ అయ్యాను. మీరు కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయికి రావలని కోరారు.
విద్యార్థులకు బట్టలు, పాఠ్యపుస్తకాలు మరియు నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదగా ప్రారంభించారు.
ప్రభుత్వ బడులలో చదువులు – మీ పిల్లల జీవితానికి వెలుగులు నింపాలని తెలియజేశారు
ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, రత్నం రజనీకాంత్,నర్రా రాము,తాళ్ళపల్లి రమేష్ గౌడ్,చింతాడి రామకృష్ణ, యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు