డీసీఈ బిఅసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మోడల్ స్కూల్లో సోమవారం రోజున 10వ తరగతి ప్రత్యేక తరగతులను సందర్శించిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులను కోరారు,
అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశముల మేరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ కొనసాగించాలిఅని. పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సూచనలు చేస్తూ ఉపాధ్యాయులు ఎస్ ఏ -1పరీక్ష ఫలితాలలో వచ్చిన విద్యార్థి స్థాయిని బట్టి ఏబిసి గ్రూపులుగా విభజించి సీ గ్రూపు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని. ఉపాధ్యాయులు వారిని అడాప్ట్ చేసుకోవాలిఅని వెనుకబడిన విద్యార్థులపై ప్రారంభము నుండే ప్రత్యేక శ్రద్ధ చూపాలిఅని . విద్యార్థుల ఇండ్ల ను సందర్శించి 100% హాజరు కొరకు కృషి చేయాలి. ఎవరైనా ఉపాధ్యాయులు రానిచో ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. డిసెంబర్ 2023 వరకు సెలబస్ పూర్తి చేయాలి. రివిజన్ చేయడానికి ప్రత్యేక తరగతుల కాల నిర్ణయ పట్టికను తప్పక అమలు చేయాలి .ప్రత్యేక తరగతుల నిర్వహణ సజావుగా జరిగేటట్లు ప్రధానో పాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి తగిన కృషి చేయాలి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక నిర్వహణకు తప్పనిసరిగా హాజరు కావలెను ప్రత్యేక తరగతుల నిర్వహణ కొరకు ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహించాలి పర్యవేక్షణ అధికారులు సందర్శించినప్పుడు అట్టి రిజిస్టర్లను చూపించాలని ఉపాధ్యాయులను కోరినారు.