•బడీడు పిల్లలను బడిలోకి పంపించాలి
నిజాంపేట: నేటి దాత్రి
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు అన్నారు. పాఠశాల ఉపధ్యాయుల చే బడి బాట కార్యక్రమం నిర్వహించారు…..ఈ మేరకు నస్కల్ గ్రామం లో మంగళవారం నాడు గ్రామ పురవిదులగుండా తిరుగుతూ ఇంటికి కి వెళ్లి బడిడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్లం బోధించడం జరుగుతున్నారు. విద్యార్థులకు ఆటలు,పాటల పై కూడా మంచి శిక్షణ ఒక ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉంటుందన్నారు. విద్యార్థి నైపుణ్యాన్ని బట్టి ఆ స్థాయికి తీసుకువెళ్ళే విధంగా కృషి చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ ఉపాధ్యాయులు సాగరిక, సంధ్యారాణి, బాలకిషన్, ఎల్లం, రాజయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.