వనపర్తి లో పూర్తికాని రోడ్ల విస్తరణ పనులు
విస్తరణ పనులు పూర్తి చేయాలి
జనసమితి జిల్లా అధ్యక్షులు
వనపర్తి నేటిదాత్రి.
వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు పానగల్ రోడ్డు కొత్తకోట రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి చేయలేదని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా తెలిపారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం వనపర్తి లో అంబేద్కర్ చౌక్ నుండి పాత బజారు వరకు రోడ్ల విస్తరణ జరిగిందని అన్నారు . ప్రస్తుతం కర్నూల్ రోడ్ వివేకానంద చౌరస్తా నుండి రాజావారి పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు కొత్త బస్టాండ్ వరకు రోడ్డు చిన్నగా ఉన్నదని బాలాజీ క్లాస్ స్టోర్ బస్ డిపో టర్నింగ్ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండటం టూ వీలర్స్ వాహనాలు నడిపే వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఖాదర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మున్సిపల్ కమిషనర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆస్తులు కోల్పోయే వారికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పానగల్ రోడ్డు నిరుపేదలు ఉన్నారని వారికి ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు
