
ఎ‘వరి’దీ రాజకీయం!?
రైతులను రెచ్చగొట్టింది ఎవరు? వరి వేసేలా ఉసిగొల్పింది ఎవరు? డప్పుయాత్రలు చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వంచే కొనిపించే బాధ్యత నాదన్నవారెవరు? పరిస్ధితులను అర్ధం చేసుకోకుండా వ్యాఖ్యలు చేసిందెవరు? ఇప్పుడు నూకలు తినమంటున్నదెవరు? తెలంగాణ వాతావరణ పరిస్ధితులేమిటి? ఎలాంటి పంటలకు అనుకూలమో ఎంత మందికి తెలుసు? తెలంగాణలో రైతు రాజకీయం చేస్తున్న పార్టీలు ఒక్కసారి తెలంగాణ తల్లి విగ్రహం చూడండి. ఆ తల్లిచేతిలో ఏముందో ముందు తెలుసుకోండి….ఒక చేతిలో బతకుమ్మ…మరో చేతిలో పజ్జొనన, మొక్కజొన్న కంకులు. నీటి జాడలు…