బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన మెరుగు లక్ష్మణ్.

బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన మెరుగు లక్ష్మణ్

మహాదేవపూర్ జూన్5( నేటిధాత్రి )

మంథని నియోజకవర్గంలో అణగారిన వర్గాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత నాయకుడు మెరుగు లక్ష్మణ్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది
ముఖ్యంగా పార్టీకి రాజీనామా చేయడంలో పార్టీలో జరుగుతున్న అనగారిన వర్గాల కార్యకర్తల విషయంపై మంథని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మండల నాయకులు
పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కార్యకర్తల పట్ల వివక్ష చూపుతున్నారు కావున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది
ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో డబ్బులు ఉన్న వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
కాబట్టి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.!

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా

లక్ష తులసి పుష్పార్చన

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుబేర్ జన్మదిన వేడుకలు..

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుబేర్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు మహమ్మద్ జుబేర్ (హౌసింగ్ బోర్డ్) గారి జన్మదిన సందర్భంగా సందర్భంగా శనివారము ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,విజిలెన్స్ మెంబర్ రామకృష్ బంటు,హౌసింగ్ బోర్డు వార్డ్ అధ్యక్షులు వెంకట్ ,నాయకులు నర్సింహ రెడ్డి,యువ నాయకులు ముర్తుజా,జాకీర్,సలీం,అవేజ్,విజయ్ రాథోడ్ ,ఫహీం,తదితరులు.

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు…

నేటి ధాత్రి -గార్ల :-

వాణిజ్య పంటలో అధిక లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ పంటలను రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందాలని గార్ల వ్యవసాయ అధికారి కావటి రామారావు తెలిపారు.శనివారం మండల పరిధిలోని బుద్దారం గ్రామంలో డోర్నకల్ ఉద్వాన వన అధికారి శాంతి ప్రియ,ఏఈఓ రాజ్యలక్ష్మి లతో కలిసి ఆయిల్ ఫామ్ పంట క్షేత్ర సందర్శన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితిలు ఉన్నాయన్నారు.ఆయిల్ ఫామ్ పంట దిగుబడి వచ్చేంతవరకు అంతర పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.వరి,పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి,తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయని, నాలుగవ సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుందని అన్నారు.రైతులు ప్రతి ఏటా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం అవలంబించుకుంటూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను,నికర ఆదాయం లభించే పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర ఆదాయం పొందడమే కాకుండా భూసారం కాపాడుకోవచ్చు అన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ ఫామ్ కు మంచి డిమాండ్ తో పాటు రవాణా, మార్కెట్,ప్రాసెసింగ్ సౌకర్యంతో పాటు గిట్టుబాటు ధర ఉందని తెలిపారు.ఆయిల్ ఫామ్ పంటలో అంతర పంటలను నాలుగు సంవత్సరాల వరకు వేరుశనగ, మొక్కజొన్న,కూరగాయలు మరియు నాలుగు సంవత్సరాల తర్వాత పైనాపిల్,కోకో వంటి పంటలను సాగు చేసుకుని అధిక ఆదాయం పొందవచ్చు అని సూచించారు.ఆయిల్ ఫామ్ పంట సాగుకు చీడపీడల బెడద ఉండదని, కోతుల సమస్య రాదని,అకాల వర్షాలు,వడగండ్ల వాన ఇబ్బందులు ఉండవని అన్నారు.ఎకరా మొక్కలకు 11600, అంతర పంటలకు ప్రతి సంవత్సరంకు 4200 చొప్పున నాలుగు సంవత్సరాలకు 16,800, బిందు సేద్యానికి 22518 మొత్తము కలిపి 50 వేల 918 రూపాయలు రాయితీ పొందవచ్చు అని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

పార్కింగ్ గా మారిన బస్ స్టాప్ లు..

పార్కింగ్ గా మారిన బస్ స్టాప్ లు

నీరుకుళ్ళ బస్టాప్ లలో దర్జాగా ద్విచక్ర వాహనాలు పార్కింగ్

నిలవడానికి నీడ లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు

నేటిధాత్రి, ఆత్మకూరు.

హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం, నీరుకుళ్ళ క్రాస్ రోడ్డు వద్ద.., వరంగల్ నుండి ములుగు కు వెళ్లే ప్రధాన రహదారి నీరుకుళ్ళ క్రాస్ రోడ్డు వద్ద రహదారికి ఇరువైపుల ఉన్న బస్ స్టాపుల్లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తున్న తీరు. ప్రయాణికుల కోసం ప్రజలు నిల్చోవడానికి ఏర్పాటు చేసిన బస్ స్టాపుల్లో దర్జాగా ద్వి చక్ర వాహనాలు పార్కింగ్ చేసి వెళ్తున్న వాహనాదాలు. దీంతో ప్రజలు రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అసలే వర్షాకాలం ప్రయాణం చేస్తున్న ప్రజలు నీడ కోసం నిలబడే బస్ షెల్టర్ లలో వాహనాలు పార్కింగ్ చేయడం సమంజసం కాదు అని ప్రయాణికుల ఆవేదన. స్థానిక పోలీసు అధికారులు స్పందించి బస్ స్టాప్ లో ఉన్న ద్విచక్ర వాహనాలు తొలగించాల్సిందిగా ప్రయాణికుల విజ్ఞప్తి.

Two-wheeler parking

సదరు బస్ స్టాప్ దగ్గర వాహనాలు పార్కింగ్ చేయొద్దు అని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా!

సిబిల్ స్కోర్ లేదని లోన్ రిజెక్ట్ అయ్యిందా? ఈ టిప్స్‌తో లోన్ పొందడం చాలా ఈజీ

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే చాలా మంది లోన్ల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. కానీ బ్యాంకులు ఆ వ్యక్తికి సంబంధించిన సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాన్ని తిరస్కరిస్తున్నాయి. కాబట్టి సిబిల్ స్కోర్ గురించి రుణం తిరస్కరణకు గురవుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.సిబిల్ స్కోరు అంటే మీ క్రెడిట్ హిస్టరీతో పాటు క్రెడిట్ యోగ్యతకు సంబంధించిన రిపోర్ట్ కార్డ్. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత రుణ దరఖాస్తులను ఆమోదించడానికి 750 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తాయి. మంచి క్రెడిట్ స్కోరు అనేది క్రెడిట్ దరఖాస్తులను ఆమోదించడానికి పరిగణించే అంశాల్లో ఒకటిగా ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పేర్కొన్న నగరాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఆ నగరాల్లో నివసించే పౌరులకు మాత్రమే అవి క్రెడిట్ ఉత్పత్తులను ఆమోదించవచ్చు. ఉదాహరణకు హెచ్ఎస్‌బీసీ వెబ్‌సైట్ ప్రకారం హెచ్ఎస్‌బీసీ లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలలో ఒకటి దరఖాస్తుదారు నివసించే నగరం. చెన్నై, గుర్గావ్, ఢిల్లీ, పూణే, నోయిడా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్ లేదా కోల్‌కతా వంటి నగరాల్లో ఉంటేనే రుణాన్ని మంజూరే చేస్తాయి.

అలాగే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ దరఖాస్తుల కోసం ఆదాయ అర్హత ప్రమాణాలను నిర్దేశిస్తాయి. క్రెడిట్ కార్డుల విషయంలో ఒకే బ్యాంకుకు ఆదాయ అర్హత కార్డు నుంచి కార్డుకు మారుతుంది. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ కోసం రూ. 12,000 కంటే ఎక్కువ నికర నెలవారీ ఆదాయం ఉండాల్సి ఉంటుంది. ఇది ఎంట్రీ-లెవల్ క్రెడిట్ కార్డ్. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల కోసం రూపొందించారు. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) సంవత్సరానికి రూ. 6 లక్షల కంటే ఎక్కువగా ఉండాలి.

మీరు తరచుగా ఉద్యోగాలు మారుతుంటే మీ కెరీర్‌లో అస్థిరంగా ఉన్నందున బ్యాంక్ దానిని పరిగణిస్తుంది. బ్యాంకులు తమ రుణగ్రహీతలు స్థిరమైన కెరీర్‌ను కలిగి ఉండాలని ఇష్టపడతారు. కెరీర్ స్థిరత్వం నెలవారీ ఆదాయం క్రమం తప్పకుండా రావడానికి హామీ ఇస్తుంది. దీనిని వ్యక్తిగత రుణ ఈఎంఐ ఇతర బాధ్యతలకు చెల్లించడానికి ఉపయోగించవచ్చు.

ఎడ్జ్‌బాస్టన్‌లో కీలక ఇన్నింగ్స్…

ఎడ్జ్‌బాస్టన్‌లో కీలక ఇన్నింగ్స్.. ద్రవిడ్, సెహ్వాగ్ రికార్డులతో చెడుగుడు ఆడేసిన పానీపూరీ వాలా

India vs England 2nd Test: బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది.

India vs England 2nd Test: టెస్ట్ క్రికెట్ తొలి దశలో ఉన్న యశస్వి జైస్వాల్, రికార్డు సృష్టించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా 21 టెస్ట్ మ్యాచ్‌ల ద్వారా ఈ రికార్డులో చేరడం గమనార్హం. ఈ మ్యాచ్‌ల ద్వారా యశస్వి జైస్వాల్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులను బద్దలు కొట్టడం విశేషం.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మొత్తం 115 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన యశస్వి, రెండవ ఇన్నింగ్స్‌లో 28 పరుగులకు ఒక వికెట్ ఇచ్చాడు. దీని ప్రకారం, మొత్తం 115 పరుగులు చేయడం ద్వారా, జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేశాడు.

 

 

దీంతో, యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన భారతీయుడిగా నిలిచాడు. గతంలో, ఈ రికార్డు టెస్ట్ స్పెషలిస్ట్ రాహుల్ ద్రవిడ్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.

 

 

రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా 25 టెస్ట్ మ్యాచ్‌ల్లో 40 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు సాధించారు. దీంతో టీమ్ ఇండియా తరపున అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌ల్లో, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఈ రికార్డును బద్దలు కొట్టడంలో విజయం సాధించాడు. టీం ఇండియా యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 2000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 21 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే తీసుకున్నాడు. ఈ 21 టెస్ట్ మ్యాచ్‌లలో 40 ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వి జైస్వాల్, భారతదేశం తరపున అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో, అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

 

మీ కిచెన్‎లోనే గోంగూర చికెన్ బిర్యానీ..

మీ కిచెన్‎లోనే గోంగూర చికెన్ బిర్యానీ.. ఎలా తయారుచేసుకోవాలి అంటే?

భారతదేశంలో చాలామంది ఇష్టపడే వాటిలో బిర్యానీ ఒకటి.  బిర్యానీలో చాల రకాలు ఉన్నాయి. వాటిలో గోంగూర చికెన్ బిర్యానీ ఒకటి.  గోంగూరతో పచ్చడి, కూరలు మాత్రమే కాదు. గోంగూర చికెన్ బిర్యానీని కూడా చేయవచ్చు. పుల్ల పుల్లగా నోరూరించే టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ నానా వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బిర్యానీలలో ఒకటి. ఈ రోజు ఆంధ్రాస్టైల్ లో నోరూరించే గోంగూర చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.కావాల్సిన పదార్ధాలు: బోన్ లెస్ చికెన్ కేజీ, ఉల్లిపాయలు – 2 పెద్దవి నిలువుగా కట్ చేసినవి, అల్లం వెల్లుల్లిపేస్ట్,టొమాటో – ప్యూరీ, గోంగూర- రెండు కట్టలు (సుమారు 100 గ్రాములు), కారం – 2 టీస్పూన్,పసుపుచిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె – తయారీకి సరిపడా, నీరు – ఒక కప్పు, మసాలా పొడి

ఈ బిర్యానీ కోసం ముందుగా గోంగూర ఆకులను ఉడికించి పేస్ట్ గా చేసుకొని పక్కన ఉంచండి. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి.. తగినంత నూనె వేసి వేడి చేయాలి. తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వీయించి టొమాటో పేస్ట్ , గోంగూర ఆకులు వేసి తక్కువ మంటలో వేయించాలి.
బోన్ లెస్ చికెన్ పీసెస్ వేసి తక్కువ మంటతో కొంచెం సేపు ఉడికించాలి. తర్వాత కొంచెం కారం, పసుపు వేయండి. తర్వాత కాస్త  నీరు ఆడ్ చేసి పాన్ మీద మూత పెట్టండి. సుమారు 10-15 నిమిషాలు ఉడికించి మూత తెరిచి మసాలా పొడి వేసి బాగా కలపండి. ఉప్పు వేసి గోంగూర చికెన్ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్ధాలు: బాస్మతి రైస్ – 750 గ్రాములు, వేయించిన నిలువగా కట్ చేసిన ఉల్లి పాయ ముక్కలు, జీడిపప్పు, కుంకుమపువ్వు – కొంచెం ,రోజ్ వాటర్ ,పచ్చిమిర్చి – 8 నుంచి 10, పుదీనా ఆకులు – 1 టీస్పూన్, కొత్తిమీర, ఉప్పు రుచికి సరిపడా.ముందుగా బాస్మతి రైస్ ను 80 శాతం వరకు ఉడికించి ముందుగా రెడీ చేసుకున్న గోంగూర చికెన్ మిశ్రమన్నీ అందులో వేసుకోవాలి. తర్వాత నెయ్యి, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తమీర , నిలువగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి , జీడిపప్పు ,వేసి, వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసుకొని మూత పెట్టండి. చివరిగా తక్కువ మంటపై 20 నిమిషాల పాటు ఉడికించండి. అంతే ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ బిర్యానీ తినడానికి సిద్ధం.

వర్షాకాలంలో చూడాల్సిన ప్రదేశాలు..

వర్షాకాలంలో ఈ ప్రదేశాల అందం చూసేందుకు రెండు కళ్ళు చాలవు.. సేఫ్ అండ్ సెక్యూర్ పర్వత ప్రాంతాలు ఇవే..

కొత్త కొత్త ప్రదేశాల్లో పర్యటించడం ఇష్టమా..! అది కూడా వర్షాకాలంలో మన దేశంలోని పర్వత ప్రాంతాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే వర్షాకాలంలో కూడా మీరు ఎటువంటి భయం లేకుండా ప్రకృతిని ఆస్వాదించగల కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలకు భయపడితే ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు ట్రై చేయండి.

వర్షాకాలంలో ప్రజలు తరచుగా పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి వెనుకాడతారు. ఎందుకంటే ఈ సమయంలో పర్వతాలపై వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య ప్రాంతంలోని కొండ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే సంఘటనలు కనిపిస్తాయి. ఇది ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి మాత్రమే కాదు పర్యాటకుల సెలవులను కూడా పాడు చేస్తుంది.

అటువంటి పరిస్థితిలో.. వర్షాకాలంలో ప్రకృతిని ఆస్వాదించాలనుకునేవారికి.. ప్రమాదాలను నివారించాలనుకునే వారికి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం చాలా తక్కువగా లేదా దాదాపుగా లేని కొన్ని హిల్ స్టేషన్లు ఉన్నాయి. కనుక ఈ రోజు భారతదేశంలోని నాలుగు ప్రదేశాల గురించి తెలుసుకుందాం.. ఇవి వర్షాకాలంలో కూడా పూర్తిగా సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. సందర్శించడానికి కూడా చాలా అందంగా ఉంటాయి.మధ్యప్రదేశ్ లోని పంచమర్హి కొండచరియలు విరిగిపడకుండా ఉండాలనుకుంటే.. పంచమర్హి మంచి గమ్యస్థానం. ఇది మధ్యప్రదేశ్‌లోని సాత్పురా కొండలలో ఉన్న ఒక హిల్ స్టేషన్, ఇది అందంగా, సురక్షితంగా ఉంటుంది. ఇక్కడ భూమి రాతితో కూడుకున్నది. కనుక ఇక్కడ కొండచరియలు విరిగిపడే సంఘటనలు చాలా తక్కువ. వర్షాకాలంలో ఇక్కడి పచ్చదనం, జలపాతాలు, గుహలు చూడదగినవి. ప్రకృతిని ఆస్వాదించడానికి, తక్కువ జనసమ్మర్థం ఉన్న ప్రదేశం ఇది.

లోనావాలా మంచి ఎంపిక. పూణే, ముంబై మధ్య ఉన్న లోనావాలా వర్షాకాలంలో సందర్శించదగిన ప్రసిద్ధ వారాంతపు విహార ప్రదేశం. ఇది మీకు హిల్ స్టేషన్ పూర్తి వైబ్‌ను అందిస్తుంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా చాలా తక్కువ. వర్షాకాలంలో ఇక్కడి జలపాతాలు, పచ్చదనం, భూషి ఆనకట్ట, రాజ్‌మాచి కోట చూడదగినవి. సురక్షితమైన రోడ్లు, మెరుగైన కనెక్టివిటీ దీనిని కుటుంబంతో సందర్శించడానికి సరైన ప్రదేశంగా చేస్తాయి.

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త…

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర!

ముఖ్యంగా బంగారం ధరలు దిగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి బంగారం ధర తగ్గి రావడమే ఒక కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పెట్టుబడిదారుల ఆసక్తి స్టాక్ మార్కెట్స్ పై ఉండడంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశం. నిన్నటితో పోల్చి చూస్తే గోల్డ్‌ నేడు మరింతగా తగ్గినట్లు గమనించవచ్చు. కొద్ది రోజుల వరకు బంగారం ధరలు లక్ష రూపాయలు వరకు దాటగా, ప్రస్తుతం స్వల్పంగా దిగివస్తున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బంగారం ధరలు దిగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి బంగారం ధర తగ్గి రావడమే ఒక కారణం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉండటం, పెట్టుబడిదారుల ఆసక్తి స్టాక్ మార్కెట్స్ పై ఉండడంతో బంగారం ధరలు తగ్గాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

జూలై 5వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,870, 22 క్యారెట్ల ధర రూ.90,640 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,09,900 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 గా ఉంది.

– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.98,720 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,19,900 లుగా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,09,900 లుగా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,720 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.90,490 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,720, 22 క్యారెట్ల ధర రూ.90,490లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,19,900 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు..

ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు..

జహీరాబాద్ నేటి ధాత్రి;

బిజెపి జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్ జన్మదిన వేడుకలు నిన్న రాత్రి జహీరాబాద్ లో డాల్ఫిన్ బర్త్డే సెలబ్రేషన్స్ పాయింట్ లో శాలువా పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బిజెపి సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

బరువు తగ్గడానికి కూడా కందను ఉపయోగించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, ఈ కంద స్థూలకాయ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ సమ్మేళనం కారణంగా ఇది స్థూలకాయ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఊబకాయం, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.

కూరగాయల్లో ప్రత్యేకమైనది కంద. దీనినే ఎలిఫెంట్‌ ఫుట్‌, గోల్డెన్‌ సీల్‌ అని కూడా పిలుస్తారు. కొంతమందికి ఈ కంద ఇష్టమైన కూరగాయ. మరికొందరు దాని వాసనను కూడా తట్టుకోలేరు. ఆరోగ్య పరంగా చూస్తే.. దీనిని సహజ ఔషధ మూలికగా పరిగణిస్తారు. ఈ కంద ఏనుగు పాదంలా కనిపిస్తుంది. అందుకే దీనిని ఏనుగు పాదం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో ప్రతిరోజూ కంద తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ సమాచారం ఉంది .

1. మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

కంద, ఏనుగు పాదం అని పిలిచే ఈ కూరగాయ (గోల్డెన్ సీల్) మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో సహజంగా లభించే అల్లంటోయిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. అల్లంటోయిన్ డయాబెటిక్ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉందని శాస్త్రీయ పరిశోధనలో తేలింది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడం ద్వారా అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా డయాబెటిస్‌ను నివారించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

2. క్యాన్సర్‌ను నివారిస్తుంది:

క్యాన్సర్‌ను నివారించడానికి కంద ఉపయోగించవచ్చు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఒక అధ్యయనం ప్రకారం, గోల్డెన్‌సీల్‌లోని అల్లంటోయిన్ అనే సమ్మేళనం క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా క్యాన్సర్‌ను నివారించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

3. బరువు తగ్గడంలో సహాయపడుతుంది:

బరువు తగ్గడానికి కూడా కందను ఉపయోగించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, ఈ కంద స్థూలకాయ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ సమ్మేళనం కారణంగా ఇది స్థూలకాయ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఊబకాయం, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.

4. మెనోపాజ్ లక్షణాల నుండి ఉపశమనం:

ఆకస్మిక వేడి ఆవిర్లు, నిద్రలేమి, వింత ప్రవర్తన మహిళల్లో రుతువిరతి లక్షణాలు కావచ్చు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, గోల్డెన్ సీల్ సారం ఉపయోగించడం వల్ల రుతుక్రమం ఆగిన లక్షణాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.

5. రక్తహీనతను తగ్గిస్తుంది:

శరీరంలో ఇనుము, ఫోలేట్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. గోల్డెన్‌సీల్‌లో ఇనుము, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య..

20 ఏళ్లుగా ఒకే కుక్కర్లో అన్నం వండిన భార్య.. లెడ్ పాయిజనింగ్తో ఆస్పత్రి పాలైన భర్త

జహీరాబాద్ నేటి ధాత్రి:

Lead Poisoning | వంట( Cook ) చేసేస్తుంటారు. ఎందుకంటే వంట పని అయిపోతే రిలాక్స్ గా ఉండొచ్చని. ఇక త్వరగా వంట అయ్యేందుకు చాలా మంది మహిళలు ప్రెజర్ కుక్కర్ లను వినియోగిస్తుంటారు. అన్నం వండే సమయంలో ఒక రెండు విజిల్స్ పెడితే.. ఐదు నిమిషాల్లో అన్నం రెడీ. ఇక కూరల విషయంలో ఓ ఐదారు విజిల్స్ పెడితే.. 10 నిమిషాల్లో కూర రెడీ. ఇలా ఓ అర గంటలో నాలుగైదు రకాల వంటలు తయారు చేస్తారు.కానీ ఈ ప్రెజర్ కుక్కర్లో వంటలు చేయడం ఏ మాత్రం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకే ప్రెజర్ కుక్కర్ ను ఏండ్ల తరబడి వినియోగించొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఓ మహిళ 20 ఏండ్లుగా ఒకే ప్రెజర్ కుక్కర్లో అన్నం వండుతుంది. ఆమె భర్త ఆ కుక్కర్లో వండిన అన్నం, ఇతర పదార్థాలను తిని లేట్ పాయి జనింగ్ గురయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.ముంబైకి చెందిన ఓ 50 ఏండ్ల వ్యక్తి.. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్ గబాలే.. బాధిత వ్యక్తిని పరిశీలించి షాక్ అయ్యాడు. అతని శరీరమంతా లెడ్ పాయిజనింగ్ అయిందని వైద్య పరీక్షల్లో తేలింది. అతను మెమోరీ కోల్పోవడం,కాళ్లల్లో తీవ్రమైన నొప్పి, కడుపు నొప్పి రావడం వంటి లక్షణాలు ఉన్నాయి. ఇదంతా లెడ్ కెమికల్ టాక్సిసిటీ వల్ల జరుగుతుందని డాక్టర్ తెలిపారు.బాధిత రోగిని పరిశీలించి, వైద్య పరీక్షలు చేసినప్పుడు అన్ని రిపోర్ట్స్ సాధారణంగా ఉన్నాయి. కానీ హెవీ మెటల్ స్క్రీనింగ్లో అతను లెడ్ పాయిజనింగ్కు గురైనట్లు నిర్ధారణ అయింది. లెడ్ స్థాయిలు డెసిలీటర్కు 22 మైక్రోగ్రాముల చొప్పున అతని శరీరంలో ఉన్నాయి. ఇది దీర్ఘకాలిక లెడ్ పాయిజనింగ్కు దారి తీసిందని డాక్టర్ గబాలే పేర్కొన్నారు. లెడ్ పాయిజనింగ్ వల్ల శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. బ్రెయిన్, కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

మరి లెడ్ పాయిజనింగ్కు ఎలా గురయ్యాడంటే..?

రోగితో పాటు అతని భార్యను విచారించినప్పుడు లెడ్ పాయిజనింగ్కు గల కారణాలు బయటపడ్డాయని డాక్టర్ తెలిపారు. గత 20 ఏండ్ల నుంచి రోగి భార్య ప్రెజర్ కుక్కర్లోనే వంట చేస్తుందని తేలింది. పాత, పాడైన అల్యూమినియం కుక్కర్లలో సీసం ( Lead), అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోతాయని, తద్వారా లెడ్ పాయిజనింగ్కు గురవుతారని నిర్ధారించారు. దీంతో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి, మెదడు పని నెమ్మదిస్తుందన్నారు. రోగికి కీలేషన్ థెరపీ నిర్వహించామని, ప్రస్తుతం కోలుకుంటున్నాయని డాక్టర్ గబాలే పేర్కొన్నారు.

వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు.

వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ అసెంబ్లీ న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమములో జరుగుతున్నా వారహిదేవి నవరాత్రి మహోత్సవులో శుక్రవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశ్రమ పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ దేవగిరి మహారాజ్ ఆశీస్సులు తీసుకోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.

గ్రామాలలో పడకేస్తున్న పారిశుధ్యం..

గ్రామాలలో పడకేస్తున్న పారిశుధ్యం..

◆: కరువైన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ

◆: సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు సోకె అవకాశం

◆: పంచాయతీల్లో నిధులు లేక అనేక అవస్థలు

◆: పారిశుధ్యాన్ని పాటించక చేతులెత్తేస్తున్న కార్యదర్శులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం : మండలంలోని 35 గ్రామపంచాయతీలలో వివిధ గ్రామాలలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది.డీజిల్ కు డబ్బులు లేక పారిశుధ్య కార్మికులు పనిచేయడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు సొంత తన జేబులో డబ్బులు ఇచ్చి డీజిల్ కి చిన్నచిన్న రిపేర్లకు వారి జీతంలో నుండి పెట్టుబడి పెడుతున్నామని వాపోతున్నారు. గ్రామపంచాయ తీలో నిధులు లేక ఇబ్బందులతో పనులను చేయలేక పోతున్నామన్నారు. ఇప్పటివరకు 35 గ్రామ పంచాయతీలలో కొన్ని గ్రామపంచాయతీలలో సపాయి కార్మికులుగా పనిచేస్తున్న కొంతమంది పనిచేయకుండా జీతాలు అడుగుతున్నారని మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బడ్జెట్ లేక మేము ఏమి చేయలేకపోతున్నాము ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలరని అధికారులు పంచాయతీ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి మండలం లోని గ్రామంలోని 35 గ్రామపంచాయతీలో గల పారిశుధ్య పనులు చక్కబెట్టి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. ప్రత్యేక అధికా రులను నియమించిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు.

చిరంజీవి పాట రీమిక్స్ లోనూ ఆయనే…

చిరంజీవి పాట రీమిక్స్ లోనూ ఆయనే…

పాత పాటలు రీమిక్స్ చేసి యంగ్ హీరోస్ నటించడం చూశాం. కానీ, ఇప్పుడు తన ఓల్డ్ సాంగ్ ను రీమిక్స్ చేసి, అందులో తానే నర్తించడానికి సిద్ధమయ్యారు మెగాస్టార్. ఆ ముచ్చటేంటో చూద్దాం.

కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) అభిమానులను ఊరిస్తూనే ఉంది ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం. జనవరిలో సంక్రాంతి కానుకగా వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశ కలిగింది. తరువాత అదుగో ఇదుగో అంటూ కాలం కరిగిపోతోంది. ఈ చిత్రంలోని కొన్ని లిరికల్స్ అభిమానులను అలరించాయి. ఇటీవల ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారని విశేషంగా వినిపిస్తోంది. అది ఓ రీమిక్స్ సాంగ్ అనీ చెబుతున్నారు. అంతేకాదు – అది చిరంజీవి నటించిన సాంగ్ కు రీమిక్స్ అనీ తెలుస్తోంది. అదే ఇప్పటి విశేషం! ఇంతకూ అది ఏ సినిమాలోని సాంగ్ అంటే చిరంజీవి హిట్ మూవీ ‘అన్నయ్య’ (Annayya) లోని ‘ఆట కావాలా. పాట కావాలా…’ అంటూ సాగే ఐటమ్ సాంగ్. అప్పట్లో నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సిమ్రన్ ఆ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఈ సాంగ్ రీమిక్స్ రూపంలో ‘విశ్వంభర’లో ఉందని తెలిసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.

‘విశ్వంభర’లో తన పాట రీమిక్స్ లో చిరంజీవి తానే నర్తిస్తూ ఉండడం ప్రస్తుతం విశేషంగా మారింది. గతంలో ఇలా ఎవరూ చేయలేదా అంటే పౌరాణికాల్లో పద్యాలు, సీన్స్ లో యన్టీఆర్ (NTR) ఏ నాడో రీమిక్స్ లో నటించేశారు. సోషల్ మూవీస్ లో చేయలేదా అంటే కృష్ణ ఉన్నారు. 1968లో కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ సినిమాలోని ‘ఓ చిన్నదాన.’ పాటను తరువాత 1995లో తాను హీరోగా నటించిన ‘డియర్ బ్రదర్’లో ఉపయోగించు కున్నారు.

గతంలో పేరడీ సాంగ్స్ లో తమ పాత పాటలకు తామే నర్తించి అలరించిన స్టార్స్ ఉన్నారు. కానీ, ఒకే పాటను వేరేగా రీమిక్స్ చేసి నటించిన వారు అంతగా కానరారు. ఆ రూటులో చిరంజీవి సాగుతూ, నవతరం ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ‘అన్నయ్య’ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. అందులోని పాటను ఈ సారి రీమిక్స్ చేయడానికి భీమ్స్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ‘విశ్వంభర’కు కీరవాణి సంగీతం అందించారు. కానీ, ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ‘అన్నయ్య’ రీమిక్స్ కు వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కంపోజ్ చేయించారని సమాచారం. మరి ‘అన్నయ్య’లోని రీమిక్స్ తో చిరంజీవి ఫ్యాన్స్ ను ఎలా చిందేయిస్తారో చూద్దాం.

అందరి దృష్టి స్టార్ కిడ్ పైనే…

అందరి దృష్టి స్టార్ కిడ్ పైనే…

సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఇప్పుడు హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అతని రెండో సినిమా సర్ జమీన్ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) ఇదే యేడాది ‘నాదానియన్’ (Nadaaniyan) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వీక్షకులను పెద్దంత ఆకట్టుకోలేదు. అంతేకాదు… సైఫ్ అలీఖాన్ కొడుకు కాబట్టే.. ఇబ్రహీంతో కరణ్ జోహార్ (Karan Johar) ఈ ప్రాజెక్ట్ చేశాడని, ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదని చాలామంది పెదవి విరిచారు. నెపోటిజమ్ కు వ్యతిరేకంగా గళం ఎత్తిన చాలామంది నెటిజన్స్ ఈ సినిమాను విమర్శించారు.

అయినా వెనుకడుగు వేయకుండా ఇబ్రహీం అలీఖాన్ సినిమాలు చేస్తున్నాడు. అలా జనం ముందుకు రాబోతున్న అతని రెండో సినిమా ‘సర్ జమీన్’. మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ దేవ్ గన్ (Kajol Devgon) జంటగా నటించిన ఈ సినిమాలో ఇబ్రహీం అలీఖాన్ వారి కొడుకుగా నటిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా రిలీజ్ డేట్ ట్రైలర్ ను చూసిన వారు అప్పుడూ ఇబ్రహీం నటనను చూసి పెద్దంతగా ప్రశంసించలేదు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ తో వారి అంచనాలు మారిపోయాయి. ఇందులో ఇబ్రహీం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాడని, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ సీన్స్ కూ ఆస్కారం ఉందని అర్థం చేసుకుంటున్నారు. దేశకోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ ఆఫీసర్ గా పృథ్వీరాజ్ నటిస్తుంటే, ఇటు భర్త, అటు కొడుకు మధ్య నలిగిపోయే తల్లిగా కాజోల్ యాక్ట్ చేస్తోంది. తండ్రి నిర్లక్ష్యంతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే స్పాయిల్డ్ చైల్డ్ పాత్రను ఇబ్రహీం చేశాడు. కాయోజ్ ఇరానీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ను కరణ్ జోహార్ నిర్మించాడు. ఇది కూడా ‘నదానియన్’ తరహాలోనే థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే వస్తోంది. ఈ నెల 25 నుండి జియో హాట్ స్టార్ లో ఈ సినిమా చూడొచ్చు.

పూజా కిట్ లో మరో తమిళ మూవీ..

పూజా కిట్ లో మరో తమిళ మూవీ..

హీరో ధనుష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే విజయ్, రాఘవేంద్ర లారెన్స్ మూవీస్ లో నటిస్తున్న పూజా… రజనీకాంత్ కూలీలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది.

పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ కు ఇక ఫుల్ స్టాప్ పడిపోయినట్టు అనుకుంటున్నప్పుడల్లా ఫీనిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తోంది. గత కొంతకాలంగా పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ బరిలో సందడి చేయలేదు. దాంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఇక పూజా తట్టాబుట్టా సర్దుకోవడమే తరువాయి అనుకుంటున్న టైమ్ లో మళ్ళీ చిత్రంగా ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం పూజా హెగ్డే… తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సౌతిండియన్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) లో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. వీటితో పాటు రాఘవేంద్ర లారెన్స్ ‘కాంచన -4’ (Kanchana -4)లోనూ పూజా నటిస్తోంది. తాజాగా జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌ (Dhanush) 54వ సినిమాలోనూ ఆమె హీరోయిన్ గా ఎంపికయినట్టు తెలుస్తోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా ను ఈ నెల రెండో వారంలో సెట్స్ పైకి తీసుకెళ్ళి 90 రోజులలో పూర్తి చేస్తారని తెలుస్తోంది.

రెండో షెడ్యూల్‌లో ఎన్సీ 24..

రెండో షెడ్యూల్‌లో ఎన్సీ 24

నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం ఎన్సీ 24 వర్కింగ్‌ టైటిల్‌ తెరకెక్కుతోంది.

నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం (ఎన్సీ-24-వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కుతోంది. బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు యూనిట్‌ తెలిపింది. నెలరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో నాగచైతన్యతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. ఈ సందర్భంగా యూనిట్‌ నాగచైతన్య పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో తాడుతో మాస్‌ లుక్‌లో నాగచైతన్య ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి అజనీష్‌ బి లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రఘుల్‌ ధరుమాన్‌

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version