మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఇఫ్తార్ విందులు: షాకిర్ అలీ
జహీరాబాద్. నేటి ధాత్రి:
పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని కోహీర్ మండల మాజీ ఎంపీపీ ఎండి షాకీర్ అలీ అన్నారు. కోహీర్ పట్టణంలోని అజిజియా మజీద్ ప్రాంగణంలో ప్రజాబంధు షాకీర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో షాకీర్ అలీ మాట్లాడుతూ… పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో అల్లా ద్వారా పవిత్రమైన దివ్య ఖురాన్ మానవాళికి అందిందని, ఈద్ ఉల్ ఫితర్ పండుగను పురస్కరించుకొని నిర్వహించే ఇఫ్తార్ మరియు సెహ్రీ విందు కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతికలుగా నిలుస్తూ ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తున్నాయన్నారు. సూర్యోదయానికి ముందు ఉదయం నిర్వహించే విందును సెహ్రీ అంటారని,సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం నిర్వహించే విందును ఇఫ్తార్ అంటారని, రంజాన్ మాసంలో రోజాలో ఉన్నవారు సెహ్రీ మరియు ఇఫ్తార్ విందుల ధ్వారా ఉపవాస దీక్షలను విరమించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రంజాన్ మాసంలో జకాత్ ద్వారా పేద ప్రజలకు దానధర్మాలు చేయడం సంప్రదాయంగా వస్తుందన్నారు. ఘనంగా జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కోహీర్ మండల మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మన బిన్ ఫౌండేషన్ చైర్మన్ మొఖీమ్, కాంగ్రెస్ నాయకులు మహ్మద్ గని,సాజిద్ అలీ,అక్షయ్ జాడే, బిఆర్ఎస్ నాయకులు నాగరిగారి సంపత్ కుమార్,ఉమర్ అహ్మద్, వస్త్ర వ్యాపారులు రాచూరి చంద్రశేఖర్, రాచూరి కనకరత్నం,ముక్క శ్రీనివాస్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
`జనం ఏ పార్టీని నమ్మొచ్చు! ఏ పార్టీని నమ్మకపోవచ్చు!!
`బీసీ నినాదంతో బలపడేదెవరు! బాగుపడేదెవరు!
`ఇప్పుటి దాక వున్న బీసీ కమీషన్లు ఏం సాధించాయి!
`బీసీ కార్పోరేషన్లు ఎంత మందిని ఉద్దరించాయి?
`బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పార్టీలకు లాభమా!
`ప్రజలకు మేలు జరుగునా?
`బీసీలు కుర్చీలో కూర్చుంటే ఆ కులాలకు మేలు చేస్తారా?
`బీసీ రాజకీయ రిజర్వేషన్లు ఏ పార్టీకి లాభిస్తాయి?
`స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి మేలు!
`42శాతం అమలు చేసిన కాంగ్రెస్‌కు వరమౌతుందా?
`ప్రతిపక్షాలు గెలవటానికి కారణమౌతుందా?
`బీసీ బిల్లుతో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెల్చుకుంటుందా?
`పల్లె రాజకీయాలలో పార్టీల పాత్ర పని చేస్తుందా?
`ఇప్పటికిప్పుడు బీసీ నినాదం కాంగ్రెస్ కు మేలు చేస్తుందా?
`ప్రతిపక్షాలకు వరమౌతుందా?
`ఇంతకీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం తెలుపుతుందా?
`లేకుంటే జనరల్ స్థానాలన్నీ బీసీలకు కేటాయిస్తారా?
`పల్లెల్లో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వున్నాయా!
`పల్లెల్లో రైతులు సంతోషంగా వున్నారా?
`ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ నెరవేర్చిందా?
`ఉద్యోగ కల్పనతో పల్లెల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
`ప్రజా వ్యతిరేకత బీసీ బిల్లులో కొట్టుకుపోతుందా?
`బీసీ, ఓబీసీ రుణాలు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పట్టం కడతాయా?
`తాజాగా ప్రభుత్వం యువతకిచ్చే రుణాలు ఓట్లు రాల్చుతాయా!
`కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడంలో సఫలమౌతుందా!
`ప్రతిపక్షాలకే మేలు జరిగేలా వుంటుందా!
,హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలలో బిసి నినాదం తుఫాను సృష్టించేలా వుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో బిసి ఓటర్లు తమ ప్రభావాన్ని చూపారని తేలింది. అంతే కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకటించింది. అప్పటి నుంచి బిసి నినాదం ఊపందుకున్నది. ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు చిన్నారెడ్డి అద్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది. 42 మంది కాంగ్రెస్‌ఎమ్మెల్యేల సంతకాలతో తెలంగాణ వాదానికి మలి దశ ఊపిరి పోసింది. తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. కాకపోతే తెలంగాణ తీర్మాణం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎంతో దోహదంచేసింది. అదే సమయంలో బిఆర్‌ఎస్‌కు రాజకీయంగా కూడా పనికి వచ్చింది. తర్వాత పద్నాలుగు సంవత్సరాలకు తెలంగాణవచ్చింది. కాని కాంగ్రెస్‌కు మేలు జరగలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. కాని తెలంగాణ కల నెరవేర్చినట్లైంది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందన్న పేరు చరిత్రలో నిలిచిపోయింది. అలాగే గతంలో ఎన్ని బిసి ఉద్యమాలు వచ్చినా రాజ్యాధికారం కోసం ఏనాడు వాణ వినపడలేదు. ఎంత సేపు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లపై పోరాటాలు సాగేవి. అంతే కాకుండా బిసి కార్పోరేషన్ ద్వారా బిసి యువతకు రుణాల కోసం పోరాటాలు జరిగేవి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించిందో ఒక్కసారిగా బిసి సంఘాలలో కదలిక వచ్చింది. బిసి కుల సంఘాలలో చైతన్యం నిండిర ది. రాజకీయ పార్టీలన్నీ జై బిసి నినాదం అందుకున్నాయి. ఇక్కడ కూడా ఆ పుణ్యం కాంగ్రెస్‌కే దక్కుతుంది. కాని దాని ఫలితం ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేకుండా వుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో బిసిలకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు కూడా ముందుకొచ్చాయి. గతంలో ఈ వాతావరణం కనిపించలేదు. ఇప్పుడు జనరల్ సీట్లలో మొత్తానికి మొత్తం ఓసిలకు కట్టబెట్టేందుకు రాజకీయ పార్టీలు ఒకటికిపదిసార్లు ఆలోచించే పరిస్దితి వచ్చింది. ఇక తాజాగా మంత్రి వర్గ విస్తరణలో కూడా బిసిల ప్రాధాన్యం పెంచాలని చూస్తున్నారు. మరో వైపు బిజేపి బిసి నినాదాన్ని ఎంచుకున్నది. గత ఎన్నికల సమయంలోనే బిసి ముఖ్యమంత్రి నినాదం ప్రకటిస్తారని అనుకున్నారు. కాని కుదరలేదు. బిఆర్‌ఎస్ పార్టీ కూడా బిసి విధానాన్ని, నినాదాన్ని కూడా వినిపిస్తూ వుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిసి విధానమే ఏకైక ఎజెండాగా రాజకీయాలకు ఎంచుకున్నది. బసిలకు రాజ్యాదికారం కోసం బిఆర్‌ఎస్ కూడా ముందుకు రావాల్సి వస్తోంది. కవిత మూలంగా బిఆర్‌ఎస్ కూడ బిసి నినాదం అందుకోవాల్సి వస్తోంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కల్వకుంట్ల కవిత గత రెండు సంవత్సరాలకు పైగా బిసి నినాదాన్ని వినిపిస్తోంది. కాని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తర్వాతే బిసిలలో మరింత చైతన్యం నిండిరది. ఎందుకంటే సామాజిక న్యాయం అన్నది కాంగ్రెస్‌లోనే సాద్యం. బిఆర్‌ఎస్‌లో అది సాధ్యం కాదు. పదేళ్ల అదికారంలో సాద్యం కాలేదు. కనీసం ఓ నలుగురు బిసి మంత్రులు లేరు. ఇక బిజేపి ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ బిసి అంటూ చెప్పుకుంటారు. కాని ఇప్పటి వరకు వారి బిసి విదానాన్ని ప్రకటించలేదు. అయినా బిసిలు బిజేపిని మిగతా పార్టీలకన్నా ఎక్కువ నమ్ముతున్నారన్నది ఇతర పార్టీలు గుర్తించాలి. పైగా ఇటీవల బిసి కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ ఇచ్చారు. బిసిల విషయానికి వస్తే సామాజిక న్యాయం జరగాలంటే సహజంగా జాతీయపార్టీలతోనే సాద్యమౌతుంది. అయితే బిఆర్‌ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీగా అవతరించాలని అనుకుంటోంది. భవిష్యత్తులో బిసిల రాజ్యాధికారం విషయంలో బిఆర్‌ఎస్ ఒక అడుగు ముందుకు వేస్తుందా? లేదా? అన్నది తెలుస్తుంది. కాని బిసిలకు తగిన న్యాయం చేయడంలో జాతీయ పార్టీలకే సాధ్యమౌతుందని చెప్పాలి. కొన్ని నిజాలు కటువుగా వుంటాయి. వాటిని జీర్ణించుకోవడం కొన్ని పార్టీలకు కష్టంగానే వుంటుంది. ఒక వేళ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అదికారంలో వుంటే బిసి నినాదం వుండేదా? బిసి నినాదం చేపట్టేవారుండేవారా? వున్నా బిఆర్‌ఎస్ పట్టించుకునేదా? కేసిఆర్ బిసిలకు సపోర్టు చేసేవారా? బిసి బిల్లు తెచ్చేందుకు అంగీకరించేవారా? అంటే అసలే వుండేది కాదు. బిసి అనే ఉద్యమమే పురుడు పోసుకునేది కాదు. ఇంత త్వరగా బిసి బిల్లు వచ్చేదే కాదు. కాని కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. కాని ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కుఎంత వరకు దక్కుతుందనేది కూడా ప్రశ్నార్ధకమే. ఇప్పడు బసి బిల్లుకు మేం సంపూర్ణ మద్దతు తెలిపామంటూ బిఆర్‌ఎస్ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బిజేపి కూడా బిసి కార్డు వినియోగించుకునేందుకు ఏ మాత్రం వెనుకాడదు. ఇలాంటి పరిస్తితుల్లో కాంగ్రెస్‌కు ఏ మేర రాజకీయంగా ఉపయోగపడుతుందనేది ఎన్నికలు జరిగితే గాని తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అసవరం వుంది. లేకుంటే రాజకీయంగా ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కువ జరుగుతుంది. దశాబ్దాల బిసి పోరాటం ఇప్పుడు నిజమైంది. ఎంతో కొంత ఫలితాలు మోసుకొస్తుంది. బిసిలకు రాజకీయంగాఎంతో ఉపకరిస్తుంది. ఓసిల ఆధిపత్యం పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడ చాల వరకు తగ్గుతుంది. ఇంత ముందుకు జనరల్ అంటే ఓసిలే అన్నట్లుగా భావిస్తూ వచ్చేవారు. అందువల్ల బిసిలు పెద్దగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చే వారు. ఎవరైనా ముందుకొచ్చినా వారికి అవకాశాలు అంతగా దక్కేవి కాదు. కాని ఇప్పుడు అటు జనరల్‌లో అయినా, ఇటు బిసి రిజర్వేషన్లలో అయినా బిసిలకు తప్పని పరిస్ధితులత్లో టికెట్లు ఇవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజకీయ పార్టీలు బిసి నాయకులకు జై కొట్టాల్సి వస్తుంది. ఇంత వరకు బాగానే వుంది. కాని ఇప్పటికిప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్ధితులు ఎలా వున్నాయన్నది కూడా ఎంతో ముఖ్యం. ఇప్పటికిప్పుడు పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం ఏ మాత్రం మంచిది కాదు. పల్లెల్లో ఎవరు ఔనన్నా, ఎంత కాదన్నా కాంగ్రెస్‌కు అంత అనుకూలమైన పరిస్ధితులు లేవు. ఎంత గొప్పగా చెప్పుకున్నా రైతుల్లో కొంత నిస్తేజం ఆవహించి వుంది. పల్లెల్లో సాగు నీటి వసతి తగ్గింది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించని పరిస్ధితి ఎదురౌతోంది. ఎన్నికల హామీల అమలుపై ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ మాటలకన్నా, బిఆర్‌ఎస్ మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. రైతు బంధుపై అపోహలను ప్రజలకు వివరించే ప్రయత్నాలు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, మంత్రులే చేయలేకపోతున్నారు. ఏక కాలంలో రైతు రుణమాఫీ జరిగిందన్న వాస్తవాలు కళ్లముందే వున్నా, అవి అందరికీ అందలేదన్న అసంతృప్తి కూడా వుంది. ఇక ఇ ందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఎంత వరకు కాంగ్రెస్ సక్సెస్ అవుతుందన్నదానిలో అంచనాలు లేవు. మరో వైపు కళ్యాణ లక్ష్మి వంటి పధకాలు అమలు జరుగుతున్నా, తులం బంగారం విషయం ప్రజల్లో అసంతృప్తి వుంది. ఇక నాలుగు వేల పింఛన్లపై అందుకుంటున్న వారిలో కూడా ఎప్పుడెప్పుడా అన్న ప్రశ్నలే నెలకొని వున్నాయి. ఇక రేషన్ కార్డులు ఇప్పటికిప్పుడు ఎంత మందికి అందుతాయన్నదానిపై పూర్తి క్లారిటీ లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినా సరే, అది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టినట్లు కనిపించడం లేదు. ఇలా ఎన్నికల హమీల అమలుపై ప్రజల్లో అసహనం వుంది. ముఖ్యంగా రైతాంగానికి ఎంతో కొంత అసంతృప్తి వుంది. పదేళ్ల కాలంలో చెరవులు నిండుకుండుల్లా కాలంతో సంబంధం లేకుండా నీళ్లుండేవి. అవి కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరించాల్సిన పరిసి ్దతి. చెరువులను ఎప్పటికిప్పుడు నింపే ప్రయత్నం చేస్తే తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటేవి కాదు. రైతులు కొత్తగా బోర్లు వేసుకునే పరిస్దితి వచ్చేది కాదు. ఇంకా వేసవి ముదరలేదు. పంటలు చేతికొచ్చే సమయం వరకు పంటల పరిస్దితి ఎలా వుంటుందో ఎవరూ చెప్పలేని పరి స్ధితి. గత పదేళ్ల కాలంలో అసెంబ్లీకి ఎండిన వరి కర్రలు కాంగ్రెస్ ఎప్పుడూ పట్టుకురాలేదు. కరంటు లేదని కందిళ్లు తెచ్చే అవసరం రాలేదు. ఇప్పుడు అవకాశం దొరికితే చాలు బిఆర్‌ఎస్ ఈ సమస్యలను ముందు పెడుతోంది. వానా కాలంలోనే చెరువులు నింపితే ఈ పరిస్ధితి వచ్చేది కాదు. బిఆర్‌ఎస్ మాట్లాడేందుకు అవకాశముండేదే కాదు. గత పంట కాలంలో రికార్డు స్ధాయి పంటలు పండినా, ఇప్పుడు ఒక్క ఎకరా ఎండినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.. అలాంటి సమయంలో బిసి బిల్లు తెచ్చిన సంతోషం నాయకుల్లో కనిపించినా, ఓట్లుగా మల్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు కృషి చేస్తుందో చూడాలి. లేకుంటే బిసి బిసి బిల్లు పేరుతో పంచాయతీ గెలుపు బిఆర్‌ఎస్ చేతుల్లో పెడుతుందో చూడాలి. అంతే కాకండా ఇటీవల బిసి యువతకు సుమారు రూ.6వేల కోట్ల రూపాయలలో కొన్ని లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది. బిసిల నినాదం ఎంచుకొని అమలు దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌కు ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా చూడాలి. మరో వైపు ఉద్యోగ కల్పనలో బిఆర్‌ఎస్ కన్నా ఒక అడుగు ముందుకు వేసి, ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆ ప్రభావం కూడా స్ధానిక సంస్దల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసి వస్తే మాత్రం తెలంగాణలో ఇక కాంగ్రెస్‌కు ఎదురుదండదు. తిరుగుండదు. చూద్దాం…బిసిలు ఎటు వైపు నిలుస్తారో..ఎటు వైపు నడుస్తారో…
సినీనటుడు విజయ్ కొత్త పార్టీతో ద్రవిడ పార్టీలకు సరికొత్త సవాలు
జయలలిత భజన ఏఐడీఎంకేకు ఎంతోకాలం లాభించకపోవచ్చు
ఛరిష్మా నాయకుడు లేక కునారిల్లుతున్న పార్టీ
స్టాలిన్ తర్వాత డీఎంకే పరిస్థితీ ఇంతే
క్రమంగా ప్రజల్లో పట్టు సాధిస్తున్న సనాతనధర్మ వాదం
బీజేపీతో మైత్రి తప్ప ఏఐడీఎంకేకు మరో మార్గంలేదు
ఎన్నికలకు ఏడాదిముందునుంచే పదునెక్కుతున్న వ్యూహాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఒకప్పుడు కలిసుండి తర్వాత ఎడమొ హం పెడమొహంగా మారిన పార్టీలు ఎన్నికలు సమీపంలోకి వచ్చేసరికి, జ్ఞానోదయమై మళ్లీ ‘అవసరం’రీత్యా తిరిగి సన్నిహితం కావడం రాజకీయాల్లో అత్యంత సహజ పరిణామం. ఇక్కడ అధికారమే అవసరం కనుక విభేదిస్తే మునిగిపోతామన్న సత్యం రాజకీయ నాయకులను, శాశ్వత శత్రువులుగా కొనసాగనివ్వదు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఇప్పటినుంచే రాజకీయంగా హాట్‌హాట్ గా వున్న రాష్ట్రంలో పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయనడానికి మంగళవారం ఏఐడీ ఎంకే నాయకుడు పళనిస్వామి, కేంద్ర హోమంత్రి అమిత్ షాను ఢల్లీిలో కలవడం ఒక ఉదా హరణ. నిజానికి 2016లో జయలలిత మరణం తర్వాత ఏఐడీఎంకే, భారతీయ జనతాపార్టీతో జట్టు కట్టింది. అయితే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసినా 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అప్రతిహత విజయం సాధించిన తర్వాత ఈ పొత్తు అచ్చిరాలేదన్న ఉద్దేశంతో 2023లో పళనిస్వామి బీజేపీకి రాంరాం చెప్పారు. అయినప్పటికీ అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. అయితే పొత్తు లేకపోవడంతో, బీజేపీ ఫైర్‌బ్రాండ్ అధ్య క్షుడుగా తనను తాను నిరూపించుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై, ఎన్నికల ప్రచారంలో ద్రవిడ పార్టీలను తన విమర్శల వాగ్ధాటితో చీల్చి చెండాడారు. ఈ ఎన్నికల్లో ఏఐడీఎం కే సోదిలో లేకుండా పోవడానికి, అన్నామలై అప్రతిహత విమర్శల దాడులే కారణమని తమిళ నాడు రాజకీయ పండితులు మాత్రమే కాదు, అన్నాడీఎంకేలోని తలపండిన నాయకులుకూడా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్నామలై అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా విమర్శించకుండా వదిలిపెట్టలేదు. జయలలిత భజనను నమ్ముకున్న ఏఐడీఎంకే నాయకులకు అన్నామలై వ్యవహారశైలి నచ్చకపోవడం కూడా పొత్తునుంచి విరమించుకోవడానికి ఒక కారణంగా చెబుతారు. పొత్తునుంచి బయటకు వచ్చినా ఏఐడీఎంకే గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీకి రాష్ట్రంలో బలం లేదు కనుక పెరిగే ఓట్లశాతం పరంగా లాభం తప్ప, సీట్లు సాధించే స్థాయికి ఎదగలేదు. ఇక్కడ ఏఐడీఎంకేలో ఛరిష్మా నాయకుడు లేకుండా, ఇంకా జయలలిత భజనతో సీట్లు సాధించలేరన్నది గత ఎన్నికలు స్పష్టం చేశాయి.
తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త మార్పు సినీ స్టార్ విజయ్ రూపంలో రాబోతున్నది. మరో సినిమానటుడు కమల్‌హసన్ ప్రభావం తమిళ రాజకీయాలపై లేదన్న సంగతి తేలిపోయింది. మరి విజయ్ ‘తమిళ వెట్రి కజగం’ (టీవీకే) అనే కొత్త పార్టీని పెట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. తమిళనాడులో ఆయనకు గొప్ప పాలోయింగ్ వున్నదన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ, ఈ ‘ఛరిష్మా’ ఎంతవరకు ‘ఓటు బ్యాంకు’ను సృష్టిస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే ప్రస్తుతం ప్రధానంగా తలపడే రెండు ద్రవిడపార్టీల అవకాశాలను విజయ్ దెబ్బకొట్టే అవకాశాలే ఎక్కువ. గత ఎన్నికల పోరాటాల్లో ఘోరంగా ఓటమిపాలై తిరిగి సత్తువ కూడగట్టుకో లేని స్థితిలో ఉన్న ఏఐడిఎంకేపైనే విజయ్ ప్రభావం పడకూడదనేం లేదు. ఆయన అధికారంలోకి వస్తారా, రారా అన్నది కాదు ప్రశ్న. ఆయన చీల్చే ఓట్లు ఎవరి కొంప ముంచుతాయన్నది అసలు పాయింటు. ఈ లెక్కలు వేసుకున్న అన్నాడీఎంకే నాయకులు, తాము ముందుగా మేల్కనక పోతే పార్టీ అడ్రస్‌లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యమే పళనిస్వామి ఢల్లీిపయనం, అమిత్‌షాతో ములాఖాత్ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. నిజం చెప్పాలంటే ఏఐడీఎంకేకు ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అన్నామలై స్టార్ లీడర్‌గా ఎదుగుతున్నారు. ఆయన ప్రసం గాల ప్రభావం ప్రజలపై చాలా అధికంగా వుంటోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆయన నేతృత్వం లో బీజేపీ రాబోయే ఎన్నికల్లో మరింత పుంజుకొని తమిళ యవనికపై తన గుర్తింపును ప్రస్ఫు టంగా చూపగలిగే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే క్రమంగా ఓట్ల శాతం పెంచుకుంటూ వస్తున్న బీజేపీ రాబోయే ఎన్నికల నాటికి సీట్లు సాధించే స్థాయికి ఎదిగితే ఇక ద్రవిడవాదానికి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం కూడా అన్నాడీఎంకే నేతల్లో వుంది.
అధికార డీఎంకే కూడా ద్రవిడవాద పార్టీయే కనుక ప్రస్తుతం తనకున్న అధికార హంగు, ఆర్భా టాలతో బీజేపీని యధాశక్తి కట్టడిచేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది. భాషా వివాదం, డీలిమిటేషన్ సమస్యలు ఇందులో భాగమే. అయితే డీఎంకే ఇక్కడ భాష పేరుతో పెంచు తున్న వివాదం దానికే బూమరాంగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ఉద్యోగావకాశాలు కేవలం తమిళనాడుకు మాత్రమే కాదు, భారతదేశం యావత్తు విస్తరించాయి. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం వుంటేనే ఉద్యోగార్థులు రాణిస్తార న్న సత్యం ద్రవిడ పార్టీలకు తెలియంది కాదు. కాకపోతే భావోద్వేగ రాజకీయాలను నెరపడం ద్వారా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం వాటి లక్ష్యం తప్ప, నిజమైన భాషాభిమానం కనిపిం చదు. నిజమైన భాషాభిమాని అన్ని భాషలను సమానంగా ప్రేమిస్తాడు. తన మనుగడకు అవసర మైన ప్రతి భాషను నేర్చుకొని, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి యత్నిస్తాడు. ప్రస్తుతం తమిళనాడులో పాతతరం వారికి భాషా దురభిమానం ఉపయోగపడినా, నేటి తరానికి ఈ వా దం ఎంతమాత్రం ఉపయోగకరమైంది కాదనేది క్షేత్రస్థాయిలో వెల్లడవుతున్న నిష్టుర సత్యం.
దేశవ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న బీజేపీ, తమిళనాడులో ద్రవిడవాదాన్ని ఎదుర్కోవడానికి సనాతనధర్మ వాదం అనే అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇది ఫలితాలనిస్తోంది కూడా. ఏఐడీఎంకేకు ఇది తెలియంది కాదు. ఏ వాదమైనా కొంతకాలం వరకే ప్రభావం చూపుతుందనేది చరిత్ర చెబుతున్న సత్యం. కొత్త వాదాల హోరులో పాత వాదాలు కొట్టుకుపోవడం సహజం. ఈ నేపథ్యంలో ఏఐడీఎంకే తన స్థానాన్ని కాపాడుకోవడానికి, బీజేపీ అధికాయకత్వంతో బేరసారాలు అడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే, దీన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు ఒక ‘స్టీరింగ్ కమిటీని’ ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నాయకులు కోరుతున్నట్టు తెలుస్తోంది. అంటే స్టీరిం గ్ కమిటీ పేరుతో అన్నామలే స్వేచ్ఛను కట్టడి చేయాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నదని చెబుతు న్నారు.
బుధవారం ఎడప్పాడి కె.పళనిస్వామి ఢల్లీిలో విలేకర్లతో మాట్లాడుతూ కేవలం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరడానికి మాత్రమే తాను అమిత్ షాను కలిసానని యధాలాపం గా చెప్పినప్పటికీ, ఏ రాజకీయ ఉద్దేశము లేకుండా ఇటువంటి సమావేశాలు జరగవన్నది అందరికీ తెలిసిందే. న్యూఢల్లీిలో కొత్తగా ఏఐడీఎంకె పార్టీ ఆఫీసు ప్రారంభం పేరుతో వచ్చిన పళని స్వామి అమిత్ షాతో 45 నిముషాలు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న భాషావివా దం, టీఏఎస్‌ఎంఏసీపై ఈడీ దాడులు, కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడం వంటి అంశాలను చర్చించి, ముల్లయార్ పెరియార్ డ్యామ్‌ను పటిష్టం చేయడం, కావేరి, గోదావరి న దుల అనుసంధానంతో పాటు రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం జోక్యాన్ని కోరినట్టు ఆయన చెబుతున్నప్పటికీ అంతర్గత వ్యూహం మాత్రం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది మాత్రమే అయివుంటుందన్నది తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ఇట్టే అర్థమవుతుంది. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విలేకర్లతో మాట్లాడుతూ అమిత్ సా`పళనిస్వామిల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి మరింత విస్త రించే అవకాశాలున్నాయని చెప్పడం గమనార్హం.
*ఐదు మండలాల గిరిజనులకు సర్వసభ్య సమావేశానికి హక్కు లేదా.*
*సమస్యల పరిష్కారానికి వేదిక సర్వసభ్య సమావేశనికి*
*గిరిజనులు దూరం ఎందుకు.*
*మహాదేపూర్ జిసిసి లో ఏం జరుగుతుంది. గుట్టు చప్పుడు కాకుండా తీర్మానాలు ఎందుకు.?*
*నేటి ధాత్రి ,డిఎం ను వివరణ కొడితే పొంతనలేని సమాధానాలు. పిఓ దృష్టికి తీసుకువెళ్లిన “నేటి ధాత్రి.*
*మహదేవపూర్ -నేటి ధాత్రి:*
గిరిజన సహకార సంస్థ జిసిసి మహదేవ్పూర్ లో ఏం జరుగుతుంది. గిరిజనుల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన జిసిసి, గిరిజనులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందా, గిరిజనుల హక్కులను కాలరాసే కుట్ర జిసిసి నుండి అధికారులు చేస్తున్నారా, అనే విషయానికొస్తే వాస్తవమే అని ప్రత్యక్షంగా కనబడుతుంది. గురువారం రోజు జిసిసి సర్వసభ్య సమావేశం గుట్టుచప్పుడు కాకుండా చేయడం, గిరిజనులను అనగా దోక్కడమే లక్ష్యంగా అని చెప్పడంలో సందేహం లేదు. సర్వసభ్య సమావేశాల పేరుతో గిరిజనులకు తెలవకుండా జిసిసి అధికారులు గుడుపుటానిలు చేస్తున్నారనేది చెప్పడానికిబ్ గురువారం జరిగిన సర్వసభ్య సమావేశమే సాక్ష్యం.
గిరిజనులకు తెలవకుండానే జిసిసి సర్వసభ్య సమావేశం
5 మండలాలకు సంబంధించిన మహాదేవపూర్ గిరిజన సహకార సంస్థ, గిరిజనుల అభివృద్ధి అటవీ ఉత్పత్తుల కొనుగోలు ధర నిర్ణయం గిరిజనుల సమస్యలను పరిష్కరించుకొనుటకు గిరిజనుల సమక్షంలో, సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ అధికారులు అలా కాకుండా ,ఐదు మండలాలకు సంబంధించిన గిరిజనులకు ఎలాంటి సమాచారం లేకుండా గురువారం రోజు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. గిరిజనుల సమక్షంలో చేపట్టాల్సిన తీర్మానాలు కేవలం అధికారులు డైరెక్టర్ల సమక్షంలో నిర్ణయించుకోవడం వెనుక కారణాలు ఏమిటో తెలియ రావడం లేదు.
మహాదేపూర్ జిసిసి లో ఏం జరుగుతుంది. గుట్టు చప్పుడు కాకుండా తీర్మానాలు ఎందుకు.?
దీనికి సంబంధించి ప్రస్తుతం మహాదేవపూర్ మండల కేంద్రంలో జిసిసి గుట్టుచప్పుడు కాకుండా సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడంపై, జీసీసీలో గుడుపుటాని జరుగుతుందన్న వాదనలు ప్రజల్లో బలంగా వినబడుతున్నాయి, జిసిసి సర్వసభ్య సమావేశం నిర్వహణపై నీటి ధాత్రి డిఎం వివరణ కోరగా, నేను ఆహ్వానం మేరకు వచ్చానని స్థానిక మేనేజర్కు వివరాలు కోరాలని, కొత్త డైరెక్టర్లకు సన్మానం చేయడం జరిగిందని, గుంతల లేని సమాధానం చెబుతూ ఫోన్ కట్ చేయడం జరిగింది. జిసిసి లో గుర్తుచేప్పుడు కాకుండా నిర్వహించిన సర్వసభ్య సమావేశం బియ్యం పొంతన లేని సమాధానాల వ్యవహారం నీటి ధాత్రి పిఓ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది, గిరిజనుల సమక్షంలో నిర్వహించాల్సిన సమావేశాన్ని జిసిసి అధికారులు గిరిజనులు లేకుండా ఇలా నిర్వహించడం జరిగిందో విచారణ జరిపి ఇలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.
సికింద్రాబాద్ సెంచనరీ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఏపీ గవర్నమెంట్ తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని తెలపడం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్, వెంకటేష్ యాదవ్ స్వీటీ, సంజీవరావు బాబు సత్యనారాయణ గుండా నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి డిమాండ్
మహబూబాబాద్/కొత్తగూడ,నేటిధాత్రి:
వేసవి కాలంలో ప్రభుత్వం చేపడుతున్న తునికాకు 50 ఆకుల కట్టకు ఐదు రూపాయలు చెల్లించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ (ఎంఎల్) కొత్తగూడ, గంగారం సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కొత్తగూడ తాసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపెళ్లి రవి మాట్లాడుతూ మరో పంటలాగా సాగుతున్న తునికాకు సేకరణ జరుగుతూ ఉంటుందని గిరిజనులు ఎక్కువగా దీనిమీదనే ఆధారపడి జీవిస్తుంటారని అలాంటి కష్టానికి అనుగుణంగా 50 ఆకుల కట్టకు ఐదు రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని అన్నారు. ఎండనకా, రాళ్లు, రప్పలు, గుట్టలు ఎక్కుతూ ఎంతో కష్టపడుతూ తునికాకు సేకరించడం జరుగుతుందని, అదేవిధంగా పాము పురుగు అడవి జంతువుల బారిన పడి అనేకమంది చనిపోవడం కూడా గతంలో జరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఆలాంటి ప్రమాదానికి గురై మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా ప్రమాదవశాత్తు గాయాలు, దెబ్బలు తరిగిన వారికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వమే నేరుగా చెల్లించి వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తునికాకు కల్లాలలో ఇతరత్రా పనులు చేస్తున్న వారికి గతంలో ఇచ్చిన డబ్బులకంటే 20% పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కొత్తగూడ, గంగారం సంయుక్త మండలాల కమిటీ కార్యదర్శి పూనెం ప్రభాకరన్న, సహాయ కార్యదర్శి ల్యాదల్ల రాజు, నాయకులు కంగాల పాపన్న, కుర్సం రంగన్న, సువర్ణపాక నాగేశ్వరరావు, చిద్రబోయిన పాపన్న, గోగ్గేల లక్ష్మణ్ రవి తదితరులు పాల్గొన్నారు.
బెట్టింగ్స్ కు ఆకర్షతులై డబ్బులు నష్టపోయి జీవితాలను సర్వం నాశనం చేసుకోవద్దని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఐపిఎల్ క్రికెట్ సీజన్ ప్రారంబమైన నేపథ్యంలో. మండలంలోని యువతకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ. తల్లిదండ్రులు, తమ కష్టార్జితాన్ని కన్న బిడ్డలు, బెట్టింగుల రూపంలో. డబ్బులను దోపిడీ దొంగలపాలు చేసి చివరకు తమ ప్రాణాలను తీసుకుంటున్నారని. పిల్లల్లో ఏదైనా మార్పులు గమనించినట్లయితే తల్లిదండ్రులు, పెద్దలు, వెంటనే తగిన చర్యలు తీసుకొని బెట్టింగులకు పాల్పడకుండా వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నం చేసి వారిని సరియైన దారిలోకి తేవాలని అన్నారు. బెట్టింగులకు పాల్పడే వారిపైనా ప్రత్యేక నిఘా ఉంచామని బెట్టింగులకు పాల్పడి కోలుకొని విదంగా ఆస్థి నష్టం జరిగి చివరికి ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను రోడ్డున పడేయద్దని ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే మాకు సమాచారం ఇవ్వాలని మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ మండల ప్రజలను కోరారు.
నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సంజయ్ కుమార్
2025 – 26 బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొడిదేల సంజయ్ కుమార్ 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.2025 – 26 సంవత్సరానికి గాను నర్సంపేట కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ నర్సంపేట 2025 – 26 ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుని ఎన్నికల్లో ఆర్ లక్ష్మీ నారాయణకు 13 ఓట్లు రాగా కొడిదేల సంజయ్ కుమార్ 22 ఓట్లు వచ్చి 9 ఓట్ల తేడాతో గెలుపొందారు.అలాగే ఉపాధ్యక్షుని ఎన్నికలో నారగోని రమేష్ కు 15 ఓట్లు రాగా కొంగరీ రాజు 20 ఓట్లు పోలై 5 ఓట్ల తేడాతో ఉపాధ్యక్షునిగా గెలుపొందారు.ప్రధాన కార్యదర్శి ఎన్నికలో దొంతి సాంబయ్యకు11 ఓట్లు రాగా మోటురి రవి 24 ఓట్లతో 13 ఓట్ల భారీ మెజారిటీతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.మొత్తం బార్ అసోసియేషన్ లో 39 ఓట్లు ఉండగా 35 మంది ఓట్లు వినియోగించుకున్నారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల్లో నూతన అధ్యక్షుడుగా కోడిదేల సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడుగా కొంగరి రాజు,ప్రధాన కార్యదర్శిగా మోటురి రవి ఎన్నికైనట్లు అదికారులు తెలిపారు.
2025 – 2026 జనరల్ బాడి..
2025 – 2026 జనరల్ బాడి కమిటీలో అధ్యక్షుడు కొడిడేలా సంజయ్ కుమార్,ఉపాధ్యక్షుడు కొంగరి రాజు, ప్రధాన కార్యదర్శి మోటురి రవి, సహాయ కార్యదర్శి కాంసాని అశోక్, కోశాధికారి దాస్యం రంగనాథస్వామి, ఈ.సి మెంబర్లుగా బొడ్డుపెల్లి అజయ్, లావుద్య తిరుమాల్ చౌహాన్,ఎం.ప్రభాకర్,ఎం.ఎం కృష్ణలు ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారులు కొమ్ము రమేష్ యాదవ్,పుట్టపాక రవి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్ ) మండల కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని చేనేత సహకార సొసైటీలో ఎన్ను కున్నారు.
మండల అధ్యక్షుడి గా సామలమధుసూదన్ ఇటీవల ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల్ ప్రసాద్, కందగట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులుగా బాసని చంద్రమౌళి, గుర్రం అశోక్, ప్రధాన కార్యదర్శి సామల రవీందర్, కోశాధికా రిగా రంగు శ్రీధర్, సహాయ కార్యదర్శులు బడుగు రవీందర్, బాసని సదాశివుడు, కార్యనిర్వాహకులు బాసని నాగభూషణం, సోషల్ మీడియా ఇంచార్జిలు బడుగు అశోక్, దాసి శ్రావణ్ కుమార్, ముఖ్య సలహాదారులు పల్నాటి జలేందర్, బాసని లక్ష్మీ నారాయణ, బూర ఈశ్వరయ్య, సామల మల్లయ్య, బాసని కుమార స్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు రాష్ట్రనాయకుడు బాసని చంద్ర ప్రకాష్ వెల్లడించారు.
ఈ సందర్భంగా చంద్రప్రకాశ్ పాటు పలువురు నూతన కార్యవ ర్గానికి శుభాకాంక్షలు తెలిపి, గ్రామాలలో సంఘసభ్యత్వా లు చేయించాలని సభ్యత్వ పుస్తకాలను గ్రామ కమిటీలకు అందజేశారు. పద్మశాలి సంఘం సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.
కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు
మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలి
ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు
శ్రీరాంపూర్,(మంచిర్యాల(నేటి ధాత్రి:
దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి హక్కులను లేకుండా కార్పొరేట్ శక్తులు కొల్లగొడుతున్నాయని,కార్మిక చట్టాల సవరణలో భాగంగా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలుకుతూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు.గురువారం శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై, హమాలి యూనియన్ల సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏప్రిల్ 1 నుండి వాటి అమలును నిరసిస్తూ వెంటనే ఆపాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు,ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు,సివిల్ సప్లై హమాలీ కార్మికులు పానుగంటి సత్యనారాయణ,తిప్పని సత్తయ్య,పోరాండ్ల సంపత్,నరేష్,రాజన్న, మామిడి చంద్రయ్య పాల్గొన్నారు.
నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:*
రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హత గల ప్రతీ ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.దుగ్గొండి మండల గిర్నిబావి గ్రామంలో గల జిఆర్బీ ఫంక్షన్ హాల్లో జరిగిన రాజీవ్ యువ వికాస పథకం సమావేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథిగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ల కార్పొరేషన్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లతో ఈ పథకాన్ని తీసుకురావడం హర్షణీయమని వెల్లడించారు.
మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు,మండల యూత్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ మాట్లాడుతూ దుగ్గొండి మండల యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోడానికి దరకాస్తులు చేసుకోవాల్సిందిగా శ్రీనివాస్ రెడ్డి కోరారు.
GRB function hall
ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధన్జ్యానాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నరసింగరావు ,తాజా మాజీ సర్పంచులు క్లస్టర్ ఇంఛార్జ్ లు ఇంగోలి రాజేశ్వర్ రావు,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి ,గోగుల ప్రకాశ్ రెడ్డి,నర్సంపేట బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొమ్మినేని భరత్,బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుకినే నాగరాజు,గ్రామ పార్టీ అధ్యక్షులు పెండ్లి వెంకటేశ్వర్లు,రొట్టె రమేష్,వివిధ గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారు ఫారం ను అందిఇవ్వాలని ఎంపీడీవో రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలంలో గల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువత నూతన అప్లై చేసుకున్న దరఖాస్తు ఫామ్ తో సహా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, జిరాక్స్లు కార్యాలయంలో అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ నర్సింలు, బాలయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై సమగ్రహ విచారణ చేయాలి.
సీబీఐ విచారణకు డిమాండ్.
తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్.
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:
తిరుపతి జీవకోన షెకినా చర్చి నందు తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్రా తెలంగాణా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్రైస్తవ సువార్తికుడు ప్రవీణ్ పగడాల గత 25 వ తేది తన బైక్ మీద రాజమండ్రి నుండి వెళుతూ దివాన్ చెరువు దగ్గర ప్రమాదం సంభవించి మరణించారన్న సంగతి విన్న క్రైస్తవ సమాజం తీవ్ర నిరాశకు గురియై శోక సంద్రంలో మునిగిపోయారు.
అయినా గొప్ప బైబిల్ పండితుడు. పేదలకు తమ సొంత ఖర్చులుతో సహాయం చేస్తు, అనేక మంది అనాధులకు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించారు.
అయితే ఆయన మరణించిన విధానం చూడగా అది ప్రమాదం కాదు హత్య జరియుండవచ్చుననని అక్కడ ఆక్సిడెంట్ జరిగిన స్థలాన్ని పరిశీలించగా అనుమానం వ్యక్తమైంది.
క్రైస్తవ సమాజమంతా ఎలుగెత్తి నిరసన చేయగా పోలీసులు శాఖా వారు అనుమానాస్పద మరణముగా కేసు నమోదు చేసుకొని క్రైస్తవ నాయకుల సమక్షంలో పోస్ట్ మార్టం చేసారు.
పోస్ట్ మార్టం అయిన తరువాత ఎస్పీ,హోం మంత్రి, ముఖ్యమంత్రి అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ డిపార్ట్మెంట్ కమిటీ వేసి తీవ్ర విచారణ చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.
అయితే తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ డిమాండ్ చేస్తు ఏదో విచారణ మాటలతో పరిమితం కాకుండా నిజం నిగ్గుతేల్చి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సెక్రటరీ జైపాల్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజం మంచి వ్యక్తిని కోల్పోయామని బాధను వ్యక్తం చేసారు.
బీఎస్పీ పార్టీ నాయకులు వెంకట్ ప్రవీణ్ పగడాలా మరణం సందేహాలు ఉన్నాయని సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో పాస్టర్.సగేయు, అజరయ్య,దిలీప్ కుమార్,పీటర్, పీరారెడ్డి, జెర్నియా, తిమోతి దేవర్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
డి.సి.ఆర్.బి. నలివేల లక్ష్మణ్ ముదిరాజ్’కి ఘన సన్మానం
నేటిధాత్రి :హన్మకొండ
రామగుండం కమిషనరేట్ ఏ.ఎస్సై’గా విధులు నిర్వహించి, బదిలీ’పై ములుగు జిల్లా’ కు నూతనంగా విచ్చేసిన నలివేల లక్ష్మణ్’ ముదిరాజ్’ కు మెపా జిల్లా కార్యాలయానికి ఆహ్వానించి, ముదిరాజ్’ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని ఇచ్చి, శాలువా’తో ఘనంగా సన్మానించడం చేశారు అనంతరం మెపా జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి బదిలీ పై ములుగు జిల్లా కు విచ్చేసిన ఉద్యోగులందరని మెపా ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుందని, జాతి బిడ్డలు ఎక్కడ ఉన్నా ఒకరికొకరు మర్యాదపూర్వకంగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం జాతి ఐక్యత’కు నిదర్శనం అని తెలిపారు. డి.సి.ఆర్.బి. నలివేల లక్ష్మణ్’ముదిరాజ్ మాట్లాడుతూ సన్మానం చేసినా మెపా టీమ్ కి, ముదిరాజ్ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శి సింగారపు రామకృష్ణ ముదిరాజ్, మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్, మెపా జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి రాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పనులను మంగళవారం హౌసింగ్ పిడి మాణిక్యం పరిశీలించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు.. గ్రామంలో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రాజిరెడ్డి, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి లు ఉన్నారు.
◆ శిథిలావస్థలో మరుగుదొడ్లు, ◆ మూత్రశాలలు నిరుపయోగంగా వాటర్ ట్యాంక్ పాఠశాలలో లోపించిన పారిశుధ్యం
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరా సంగం మండలంలోని సంగం (కె) గ్రామంలో గల ప్రాథ మిక పాఠశాల అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపడుతున్నప్పటికీ ఈ పాఠశాల రూప రేఖలు మార్చలేకపోయాయి. ఈ పాఠశాల ఆవరణలో ఉన్న మరు గుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థలో ఉండటంతో విద్యా ర్థులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ శిథిలాలతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్న వాటిని తొలగించడం లేదు. అలాగే నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ రంధ్రాలు పడి నిరుపయోగంగా మారింది. ఈ పాఠశాల చుట్టూ పూర్తిస్థాయిలో కాంపౌండ్ వాల్ లేనందున పశువులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. పాఠశాల భవనానికి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయాయి. రంగులు వెలిసిపోయి భవనం కళ హీనంగా కనిపిస్తుంది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం నెలకొని పారి శుద్ధ్యం లోపించింది. ఈ పాఠశాలలో ఇంకా పలు సమ స్యలు నెలకొనడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యాభివృద్ధికై పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని విద్యార్థినీ, విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.
నిమ్స్ పనులను వేగవంతం చేయాలి అసెంబ్లీ ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లో గతం లో ఏర్పడి నిమ్స్ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని నేడు అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని కోరిన *గౌరవ శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు …. గతం లో (2011 వ సంవత్సరం లో ) ఏర్పాటైన నిమ్స్ ప్రాజెక్ట్ లోని కంపెనీలకు సంబంధించి పనులు ప్రారంభించిన ఎటువంటి పనులు ముందుకు సాగడం లేదు అని *కావున ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి , పనులను త్వరగా పూర్తి చేయాలని దీని ద్వారా జహీరాబాద్ నియోజవర్గ ప్రజలకు ఉపాధి కలుగుతుంది అని కోరారు.. అలాగే జహీరాబాద్ నియోజవర్గం లోని బాలికల ఉర్దూ మీడియం కళాశాలలో లెక్చరర్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు అని వెంటనే ప్రభుత్వ లెక్చరర్లు ను నియమించాలని నియోజకవర్గ విద్యార్థినిల భవిషత్తును కాపాడాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు..
రాజకీయ నాయకులు ప్రజాసేవకై ఆసక్తి ఉన్నవారు దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది కార్యదర్శి పాలన ద్వారా గ్రామ పరిపాలన జరుగుతుంది ప్రజా ప్రతినిధు లకు ఎన్నుకునేందుకు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంది ఈ విషయంలో గ్రామాల్లో పోటీ చేసేందుకు రాజకీయ నాయకు లు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు సర్పంచ్ ఈసారి నిలబడడానికి ఆసక్తి ఎక్కు వగా చూపుతున్నారు. ఇంకా ఎవరెవరు నిలబడడానికి ఆసక్తి చెబుతున్నారు తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండల కేంద్రంలో ఇప్పటికే పలువురు పేర్లు వినబడుతున్నాయి. వారిలో ఎవరికీ చాన్స్ లభిస్తుందని సీక్రెట్ గా పలువురు ఆశావాహులు సర్వే చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ప్రజల్లో తన పట్ల ఏ విధంగా ఉందో సర్వేలు చేసుకుని, తన పట్ల అభిప్రాయం ఏ విధంగా ఏవిధంగా ఉందో తెలుసుకుం టున్నారు. పైగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని నమ్మకంతో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖర్చు అయితే పర్వాలేదు కానీ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం భారీ మెజార్టీతో గెలువాలని రాజకీయ నాయకులు చూస్తున్నారు ఇంకొందరు అయితే ఏమాయమీలు సైతం ఏమాత్రం భయపడకుండా ముందుకు కదులుతున్నారు ఇప్పటికే కొందరు గ్రామాల్లో మంచి పేరు కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు
గట్టి పోటీ తప్పదా! ఇదివరకు ఎన్నడి లేని విధంగా ప్రతి ఒక్కరు పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ,బిజెపి పార్టీలకు తలనొప్పి తప్పదన్న భావన ఆయా పార్టీల నేతల్లో వ్యక్తం అవుతుంది పార్టీలకు అతీతం గా జరిగే ఎన్నికలు ఎప్పుడైనా పరోక్షంగా మద్దతు ఎవరికి ఉంటుందోనన్న టెన్షన్ మాత్రం ఆయా పార్టీల నేతల్లో నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాదులు సంఖ్య ఎక్కువగా ఉండటం ఈసారి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులకు నిలబెట్టడంలో పార్టీ అనుకున్నది ఆ పార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది ఇప్పటికి పలువురు ఆశావా దులు ఆయా పార్టీల పెద్దలను కలుస్తూ తమ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పార్టీ మద్దతు తన వారికి వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు అధిష్టానం పెద్దల సైతం ఎవరు వచ్చినా కాదనకుండా అందరికీ అభయమిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులపై చాలా నుంచి పోటీకి సిద్ధమవు తున్నారు రాజకీయంలో ఉంటే ఏదైనా సాధించవచ్చునున్న నమ్మకంతో కొందరు డబ్బు సంపాదనతో పాటు పరపతి పెరుగుతుందని మరికొందరు బ్రహ్మ పడుతున్నారు వ్యవస్థను ఎంతో కొంత మార్చడం కోసమైనా రాజకీయం అవసరమైన ఉద్దేశంతో పలువురు సర్పంచులు నిలబడుతు న్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ నిబంధన ఎత్తివేత
సర్పంచ్ గా పోటీచేసే ఆశా వాహులకు శుభవార్త
స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారని ప్రధానమైన నిబంధన ఉండేది కానీ సర్పంచ్ గా పోటీ చేసే ఆశావాహులకు నుంచి వినతులు పెద్ద ఎత్తున రావడంతో ఈ నిబంధనకు రేవంత్ అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో వెసులుబాటు కల్పించారు ఈ మేరకు సర్పంచ్ గా పోటీ చేయాలను కునే ఆశావాహులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిసిందే ఇదివరకు సర్పంచ్ పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు ఎక్కువగా ఉండకూడదని నిబంధన ఉండేది కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనను తొలగిస్తూ ముగ్గురు లేదా ఆపై ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హులు అవుతారని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లలు ఉండే సర్పంచ్ గా పోటీ చేయడానికి రేవంత్ ప్రభుత్వం ఊరట కల్పించింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.