బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూధన్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
మంగళవారం రోజున బిఆర్ఎస్ పరకాల మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.
కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలననే..! ప్రతీకార పరిపాలన కాదు…!
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
Congress rule is people’s rule..!
కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజాపాలనే తప్ప ప్రతీకార పరిపాలన కాదని,ఎన్నికలవేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం రాజ్యాంగంలోని భాగమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ అమరవాది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కార్యకర్తలు, నాయకులు, కార్యక్రమ సమన్వయకర్త అంజన్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ భారీ ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలవేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.
Congress rule is people’s rule..!
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాపు అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, ఆవశ్యకతను తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో దాచుకోవడం, దోచుకోవడమే తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయించారని దుయ్యబట్టారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని తెలిపారు.
బిజెపి పాలకులు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను కాలరాస్తు, మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జంగం కళ, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకుబ్ ఆలీ, శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, కుర్మ సురేందర్, బత్తుల వేణు, సంఘ రవి, మహిళా నాయకురాలు పుష్పా, శారద, రాజేశ్వరి, సునిత ,కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం…PDSU
పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ
చెన్నూర్:: నేటి ధాత్రి
చెన్నూర్ కేంద్రంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఉస్మానియా క్రాంతి ధార కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…ఉస్మానియా యూనివర్సిటీలోమతోన్మాదానికి ,మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి పోరాడిన విప్లవ, విద్యార్థి నాయకులు కామ్రేడ్ జార్జి రెడ్డి క్యాంపస్ లో జరుగుతున్న అన్యాయాలను లంపెన్ గుండాల దాడులను ఎదిరించాడు అన్నారు. సమసమాజ స్థాపనకు ఉద్యమిస్తున్న జార్జి రెడ్డి ఎదుగుదలని జీర్ణించుకోలేని మతోన్మాద గుండాలు హత్య చేశారన్నారు.ఆయన ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాహుల్, రవికిరణ్, స్నేహ, రవళి, లక్ష్మి, పూజ తదితరులు పాల్గొన్నారు
పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామం సీతారాంపురంకు చెందిన కుసుంబ మోతే రావు రోజువారి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు.రోజువారి లాగే ఏప్రిల్ 8న కూలి పనికి వెళ్తూ వడదెబ్బ తాకడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.కుటుంబ యజమాని మరణించడంతో శోకసముద్రంలో మునిగిపోయారు.మోతే రావుకు భార్య కుమారుడు కూతురు ఉన్నారు.
దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి, హజీలపూర్, చౌదర్ పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. గ్రేడ్-ఏ రకం (సన్నాలు) ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకం (దొడ్డు) ధాన్యం క్వింటాకు రూ.2,300 మద్దతు ధర ఇస్తామని, సన్నరకం ధాన్యం క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు. రైతుల తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరుణాకర్ రెడ్డి తండ్రి బుచ్చి రెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ గారు వారి నివాసానికి చేరుకొని స్వర్గస్థ బుచ్చి రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం అందించారు.
◆- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్. నేటి ధాత్రి:
రాజ్యాంగ పరిర క్షణ అందరి బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి అన్నారు.జైబాపు, జైభీం, జైసంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లీ, బూర్దీపాడ్ గ్రామాల్లో పాద యాత్ర నిర్వహించారు.డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నాయన్నారు.
Congress Party leaders
అనంతరం జహీరాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని విమర్శించారు.కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టాలని నిర్దేశించారని చెప్పారు.ఈకార్యక్రమంలో సిడిసి చైర్మన్ మహ్మద్.ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ భీమయ్య,మాజీ సర్పంచ్ లు నర్సింహారెడ్డి,జగన్మోహన్,మాజీ కౌన్సిలర్ శేఖర్,మాజీ యం.పి.టి.సి లు హన్మంత్ రెడ్డి,నాగి శెట్టి,అశ్విన్ పాటిల్,నాథా నేయల్,మాజీ ఏ ఎం సి వైస్ చైర్మన్ అక్బర్,ఇమామ్ పటేల్,సునీల్ కుమార్,దిలీప్ కుమార్ మరియు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు,ఆయా గ్రామాస్తులు,యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
దెబ్బతిన్న కరకట్టను ఈ.ఎన్.సీ శంకర్ తో కలిసి పరిశీలన
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
సిరిసిల్ల మానేరు వాగులో దెబ్బతిన్న చెక్ డ్యాంను పునర్నిర్మించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణ సమీపంలోని మానేరు వాగులో సాయిబాబా ఆలయం సమీపంలో దెబ్బతిన్న చెక్ డ్యాంను కలెక్టర్, ఈఎన్ సీ శంకర్ తో కలిసి బుధవారం పరిశీలించారు. వెంటనే పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.
Collector
మానేరు బ్రిడ్జి నుంచి సాయి బాబా ఆలయం వరకు మూడు కిలోమీటర్ల పొడవు కరకట్ట పునర్నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈ.ఈ.లు అమరేందర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల చంద్ర పురుషుల సంఘం సభ్యుడు అజ్మీర సారయ్య ఇటీవల కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా మృతుని కుటుంబ సభ్యులకు సంఘం అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన దుగ్గొండి పురుషుల సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ చేతుల మీదుగా బుదవారం పాలకవర్గం సమావేశంలో భీమా డబ్బులను అందజేశారు. సాముహిక నిది పథకం నుండి రూ.70 వేలు,అభయనిధి పథకం నుండి రూ.10 వేలు మొత్తం రూ. 80 వేలు మృతుని భార్య శ్యామలకు అందజేసినట్లు అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు బానోతు రమేష్, పాలకవర్గ సభ్యులు వడ్డేపల్లి మృత్యుంజయుడు, భాషబోయిన రాజు,సలపాల ప్రభాకర్, ఉప్పుల రాజు,మామిడి ఐలయ్య, భాషబోయిన చరణ్ రాజ్,పాక రాజయ్య,బానోతు సాంబయ్య,సయ్యద్ బషీర్, సంఘ ఘణకులు ఏడెల్లి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మహ్మద్ ఖాన్ పల్లి తాండా సమస్యలు తీరుస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని మహ్మద్ ఖాన్ పల్లి తాండా 16వ వార్డులో కొలువైన శ్రీ వీర ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో జరిగిన ధ్వజస్థంభం ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ వీరాంజనేయ స్వామి సంపూర్ణ కటాక్షం గ్రామ ప్రజలందరి పైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని అందరం కలిసి అన్నివిధాలా అభివృద్ధి చేసుకుందాం అన్నారు.
MLA
దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు మోతిలాల్, జాజి మొగ్గ నర్సింహులు, దేవేందర్ నాయక్, అబ్దుల్ హక్, శ్రీనివాస్ యాదవ్, జోజ్య నాయక్ , డి.ఎం.నాయక్, మాజీ ఎంపిటిసి గోపి నాయక్, శరత్ చంద్ర, హన్మంతు నాయక్ , కృష్ణ, కుమార్, రవి నాయక్, శంకర్ నాయక్, గోపాల్, చర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం (నేటి ధాత్రి) యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం
అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామంలో ఇటీవలే అనారోగ్య సమస్యతో అకాల మరణం పొందిన దౌపాటి మహేష్ కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి స్నేహం అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. అడ్డగూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2009-10, పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.30 వేల నగదును సేకరించి అందుబాటులో ఉన్న స్నేహితులు బుధవారం మృతుడి తల్లికి అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు దౌపాటి మహేష్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి మల్లేష్, పయ్యావుల రమేష్, గూడెపు నరేష్, తాడోజు లక్ష్మణా చారి,కత్తుల నరేష్,చుక్క లోకేష్,తోట నగేష్, బాలెంల శంకర్, కప్పల మహేష్ పలువురు ఉన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎన్.ఎస్. యు.ఐ 55 ఆర్బో వేడుకలు పాల్గొన్న రాష్ట్ర కోఆర్డినేటర్ వేల్పుల వేణు యాదవ్ మాట్లాడుతూ నేడు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జై భీమ్, జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహించడం గర్వకారణంగా ఉంది.అని అలాగే ఎన్నో సంవత్సరాలనుండి విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎన్.ఎస్.యు.ఐ నేడు 55వ ఆవిర్భావ దినోత్సవం సిరిసిల్ల పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని తెలిపారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ ఆవిర్భవ దినోత్సవం సిరిసిల్ల జిల్లా స్థాయిలో పట్టణ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రభాకర్, పద్మశాలి పట్టణ అధ్యక్షులు గోలి వెంకటరమణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్,తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్,టోనీ తదితర కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ గ్రామంలో వీధి కుక్కలకు రాబిస్ వైరస్ సోకి చనిపోతున్నాయని పట్టణ బీజేపీ అధ్యక్షులు బసంతపూర్ రమేష్ రెడ్డి తెలిపారు. కుక్కలకి రాబిస్ వ్యాక్సిన్ ఇచ్చి వైరస్ బారినపడకుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను కోరారు. అదేవిధంగా వైరస్ సోకి మరణించిన కుక్కలను మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తొలగించాలని కోరారు.
నూతన ఎమ్మార్వోను కలిసిన రైతుల సాధన సమితి అధ్యక్షుడు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నూతన ఎమ్మార్వో దశరథ్ ను బుధవారం రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యపై ఎల్లవేళలా తమకు అండ ఉండాలని నూతన ఎమ్మార్వో ను రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఝరాసంగం: రెక్కాడితే గానీ డొక్క నిండని పరి స్థితి వారిది.. వారి శ్రమతోనే వారి జీవితాలు ఆధారప డీ ఉన్నాయి. విధి వారి జీవితాలను ఒక విషాదభరిత మై న నాటకంగా మార్చింది. వారి శ్రమపై ఆధారపడ టం ఇష్టం లేదన్నట్టుగా వారి జీవితాలు మరింత దయ నీయ స్థితికి చేర్చి కుటుంబాలలో తీరని దుఃఖాన్ని నింపింది. ముగ్గురు స్నేహితులు మూడు రోజుల వ్య వధిలో మృత్యు ఒడిలోకి చేరుకున్న విషాద ఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చోటు చేసు కుంది.
Government
గ్రామస్తులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్ర కా రం… సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం రత్నా పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు కూలీ స్నేహితులు మున్నూరు రమేష్, ఇస్మాయిల్, చాకలి బస్వరాజ్ రోజులాగే ఆదివారం ఉదయం నవ్వుతూ ఇంటి నుంచి కూలి పనికి వెళ్లారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి కూలి పనికి వెళ్లారు. పని ముగించుకుని బైక్పై తిరిగి వస్తుండగా బీదర్ జిల్లాలోని బాల్కి ఖానాపూర్ సమీపంలో వారిని వెనుక నుంచి వేగంగా వచ్చిన టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్మాయిల్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రోజు వారి కూలి కార్మికుడు. ఆయన తల్లిదండ్రులు ఆయన పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మున్నూరు రమేష్, చాకలి బస్వరా జును బీదర్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. రమేష్ మృ త్యువు తో పోరాడుతూ సోమ వారం తుదిశ్వాస విడి చాడు.
Government
మృతుడికి ఒక అ మ్మాయి ఒక అబ్బాయి ఉ న్నారు. ర మేష్ రోజు వారి కూలిగా ఉంటూ గ్రామంలోని 40 నుంచి 50 మం ది కులీ కార్మి కులకు పని కల్పించేవాడు. భార్య శ్రీదేవి కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే వా రు. ఇక మిగిలిన మరో స్నే వెంటిలేటర్పై ప్రా ణాలతో పోరాడుతున్నాడు. ఇ తడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య పుష్పమ్మ కూలి పని చేస్తుంది. ఒకరి తర్వాత మరొకరి మృతదేహాలు గ్రామానికి చేరుతుండటంతో గ్రామ స్తులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ది గ్రాం తికి గుర య్యారు. గ్రామస్తుల కన్నీటి ధార అగడం లేదు. రత్నా పూర్ లో విషాద ఛాయలు అలుముకు న్నాయి. మృతు ల తల్లిదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనా దాలు అక్క డున్న వారందరిని కంటతడి పెట్టిస్తు న్నాయి. మరో మృత దేహం వస్తుందేమోనని భయప డుతూ, ప్రాణాలతో పోరాడుతున్న బస్వరాజు ఆయుష్షు పెంచాలని గ్రామస్తులు దేవుడిని వేడుకుంటున్నారు. ఇంతటి విషాదం సంభవించినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకులు ఎవరూ స్పందించకపో వడం, వారిని పరామర్శించకపోవడం రత్నాపూర్ గ్రామస్తులను మరింత దుఃఖానికి గురిచేసింది. ఘటన కర్ణాటకలో జరగడంతో ఖానాపూర్ పరిధిలోని దన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగినందున సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా.
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌక్ లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్లకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది. సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలపై వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య, మానవులకు అందుబాటులో లేకుండా ఉండడానికి బిజెపి ప్రభుత్వం చూస్తుందని అన్నారు. అలాగే సిపిఐ పంతం రవి మాట్లాడుతూ నిరుపేద ప్రజలందరికి వంట గ్యాస్ ధర ఆకాశన్ని అంటే విధంగా కేంద్ర ప్రభుత్వo పెంచుతున్నారని. దానివల్ల మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుంది అని పేర్కొన్నారు. ఈ ధర్నాలో కడారి ప్రవీణ్, పంతం రవి తదితర సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవరం సమీ పంలో వంతెన నిర్మాణంలో జాప్యం నెలకొంది.ప్రతిఏటా వర్షాకాలంలో వరద ఉద్ధృతి పెరిగినప్పుడు గ్రామానికి వెళ్లలేని పరిస్థితి. వంతెన నిర్మించి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్థులు పార్టీలకు అతీతంగా అధికా రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి నిధులు మంజూరు సాధించు కున్నా… నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎంపీ సురేష్ షె ట్కార్, ఎమ్మెల్యే మాణిక్ రావు నాలుగు నెలల కిందట పనులకు శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మా ణానికి పీఆర్ఆర్ శాఖ నుంచి రూ.3 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి కైనా త్వరితగతిన వంతెన పనులు ప్రారంభించి వర్షాకాలం నాటికల్లా పూర్తిచేస్తే ప్యాలవరం, దేవరంపల్లి, ఈదులపల్లి, దిగ్వాల్ గ్రామాల ప్రజలు ఇబ్బందులు తొలగిపోతాయి.
యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్ గేమ్ యాప్ కి అలవాటు పడి అప్పు లపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రని, అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ యాప్లోగేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు. నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో అవగాహన లోపం వల్ల చాలామంది ప్రజలు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అవగాహన లేక అత్యాశకు పోయి ఆన్ లైన్ నందు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ప్రజలు మోసాల బారిన పడుతున్నారు.
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు
బెట్టింగ్ యాప్ లు చాలా ప్రమాదకరమైనవి. వీటిల్లో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుంది. యాప్ నిర్వాహ కుల నుండి బెదిరింపులు వస్తాయన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపా దించవచ్చన్న భ్రమలో యువత.విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కి బానిసలుగా మారి అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకొని విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్ లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లు ఆయా యాప్ నిర్వహకుల సూచనల మేరకే ఆపరేట్ చేయబడుతాయని, ఆన్లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ ప్రాక్టీస్ ఉంటుంది ఫేక్ లింక్స్ తో వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు తెలుసుకొనే అవకాశం ఉన్నందున గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండా లన్నారు. ఈఅక్రమ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ఎవ రిపైనా ఉపేక్షించేది లేదని ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి. ఇటువంటి కార్యకలాపా లపై వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జి ల్లాలో సోషల్ మీడియా ఇన్ఫ్ ఎన్సర్లు బాధ్య తాయుతంగా వ్యవహరించాలని, అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచారాన్ని చేయవద్దని, ఆన్లైన్ బెట్టింగ్. ఆన్లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్ తెలిపారు.
అన్నామలై తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారు, భాజపా నాయకత్వ పగ్గాలు చేపట్టి, అట్టడుగునుంచి 18శాతం ఓట్లు సాధించే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణలో బండిసంజయ్ ఎట్లానో, తమిళనాడులో అన్నామలై పార్టీకి అంత ముఖ్యం. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒంటరిగా పోటీచేస్తే ఓట్లశాతం ఒక పరిమితికి పెరగవచ్చు కానీ సీట్లు వచ్చే అవకాశం లేదు. ఏఐడీఎంకేది కూడా ఎదురీదుతోంది. దీనికి బీజేపీ ఆసరా అవసరం. బీజేపీకి అధికారంలోకి రావడం ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు గత ఎన్నికల లెక్కలకు సంబంధించి కూడికలు తీసివేతల ప్రకారం అన్నాడీఎంకేతో పొ త్తు మాత్రమే అధికారాన్ని అందించగలదన్నది స్పష్టమైంది. అన్నామలైకి పొత్తు ఇష్టంలేదు. పళనిస్వామికి, అన్నామలై పొడ గిట్టలేదు. పార్టీ విశాలహితం రీత్యా పదవీకాలం పూర్తయిన అన్నామలై అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇదిలావుండగా తమిళ సినీస్టార్ విజయ్ ‘తమిళగ వెట్రి కజగం ట్రాన్సిల్’ పేరుతో పార్టీని పెట్టి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. మరి ఆయన ఏ ద్రవిడ పార్టీ ఓట్లకు గండికొట్టి కొంప ముంచుతాడో తెలియడంలేదు. ఎక్కుమంది మాత్రం ఆయన ఎంట్రీ డీఎంకేకు నష్టమన్న అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే అన్నాడీఎంకేGబీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమవుతుంది. ఇదిలావుండగా తెలంగాణలో బండిసంజ య్‌ను తప్పించినప్పుడు ఎట్లా నిరసనలు వ్యక్తమయ్యాయో, ఇప్పుడు అన్నామలై తప్పుకోవడం వల్ల తమిళనాడులో కూడా పార్టీ అభిమానుల్లో కూడా నిరసన వ్యక్తమవుతోంది. పార్టీకి ఒక దశ దిశ ఏర్పరచిన నాయకుడిని తప్పించడం ఎంతమేర సమంజసమన్న వాదనలు వినపిస్తున్నాయి. ఈ రాజకీయ వైకుంఠపాళిలో ఎవరిని నిచ్చెన వరిస్తుందో, ఎవరిని పాము కాటేస్తుందో అంచనా వేయడం కష్టం. అధ్యక్షపదవికి రాజీనామా పాము కాటుగా మారుతుందా లేక నిచ్చెన పైకి లాక్కెళుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
పొత్తుకు ఇష్టపడని అన్నామలై
2023 మార్చి నుంచి అన్నామలై, ఎ.ఐ.డి.ఎం.కె.తో పొత్తు కుదుర్చుకోవడానికి ఇష్టపడటంలేదు. ఆవిధంగా పొత్తు కుదుర్చుకోవడం రాష్ట్రంలో పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను పళంగా పెట్టడ మే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 1G1R2 అన్న సూత్రం పనిచేయదు. ఒక్కో సారి 1G1R11 కూడా కావచ్చు! గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అప్రతిహత విజ యానికి, ఎ.ఐ.డి.ఎం.కెGబిజేపీ అలయన్ లేకపోవడమే కారణమన్న సత్యాన్ని విస్మరించడానికి వీల్లేదు. కోయంబత్తూరులో గత లోక్‌సభ ఎన్నికల ఫలితాన్ని పరిశీలిస్తే, ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు, డీఎంకే అభ్యర్థికంటే ఎక్కువ. అంటే అలయన్స్‌లో ఉన్నట్లయితే ఇక్కడ అన్నామలై గెలిచివుండేవారని స్పష్టమవుతోంది. ఇదే పరిస్థితి మరో 12 నియోజకవర్గాల్లో కూడా కనిపించింది. 12సీట్లలో బీజేపీ ఓట్లశాతం విషయంలో ఏఐడీఎంకేను వెనక్కు నెట్టేసిన సంగతి కూడా వాస్త వం. అన్నాడీఎంఏ చరిత్రలో 7 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోవడం కూడా ఇదే ప్రథమం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ జరగబోతున్నది. మరి కొత్తగా పార్టీని స్థాపించి ఎన్నికలబరిలో దిగుతున్న సినీనటుడు విజయ్ ఈ రెండు ద్రవిడ పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనేది ప్రధాన ప్రశ్న. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ పోటీ డీఎంకేకు లాభం చేకూరుస్తుంది. కానీ మరికొందరు మాత్రం విజయ్ డీఎంకే ఓట్లను చీల్చే అవకాశమే ఎక్కువని చెబుతున్నారు. ఈ చీల్చడం 15శాతం వరకు ఉంటే డీఎంకే కుప్పకూలడం ఖాయమన్నది వారి అంచనా. ఇదిలావుండగా అన్నామలై గత ఎన్నికల్లో రెండు ద్రవిడ పార్టీలను విమర్శల బాణాలతో చీల్చి చెండాడారు. అంతేకాదు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కూడా విమర్శించడం పళనిస్వామికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది కూడా. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢల్లీిలో ఆయన అమిత్‌షాను కలిసినప్పుడు, అన్నామలైను తప్పించాలని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పళనిస్వామి, అన్నామలై ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు మాత్రమే కాదు ఇద్దరిదీ గౌండర్ కులమే! తమిళనాడులో కుల రాజకీయాలు ఎంతటి స్థాయిలో వుంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ నియమావళి ప్రకారం మరోసారి అన్నామలైని రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కొనసాగించవచ్చు. కానీ ఆయనకు అన్నాడీఎంకేతో పొత్తు అస్సలు ఇష్టంలేదు. కానీ పార్టీ అధిష్టానం ఆలోచనలు వేరే వు న్నాయి. కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వచ్చే సానుకూల పరిస్థితులున్నాయి. తెలంగాణలో పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో భాగస్వామిగా వుంది. కేరళలో ఇంకా కష్టంగా ఉన్నప్పటికీ ప్రయత్నాలు మాత్రం మానడంలేదు. ఇక తమిళనాడు విషయానికి వస్తే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈసారి డీఎంకేను చావుదెబ్బ కొట్టవచ్చున న్నది ఎన్నికల లెక్కలు చెబుతున్న సత్యం. దీనికి తోడు అన్నాడీఎంకే నుంచి మరిని సీట్లు కోరవచ్చు కూడా. ఆవిధంగా అధికారంలో భాగస్వామి కావచ్చు.
అన్నామలై భవితవ్యం?
ఇప్పుడు పార్టీ తమిళనాడు అధ్యక్షపదవికి 39 ఏళ్ల మాజీ ఐపీసీ ఆఫీసర్ అన్నామలై రాజీనామా తో బీజేపీ కేంద్ర వర్గాల్లో ఆయన భవితవ్యంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అన్నామలై, ఇటు మోదీకి అటు అమిత్‌షాకు అత్యంత ఇష్టుడైన యువ నాయకుడు. ఈ నేపథ్యంలో మూడు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటిది ఆయనకు రాజ్యసభ సభ్యత్వం క ల్పించడం. రెండవది కేంద్రంలో ఏదో ఒక పదవి ఇవ్వడం. మూడవది పార్టీలో కీలకమైన పదవికట్టబెట్టడం. ఇందులో రాజ్యసభ సభ్యత్వం విషయానికి వస్తే, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల ఎంపీ ల విమర్శనలను గట్టిగా ఎదుర్కొనే వాక్పటిమ, విషయపరిజ్ఞానం అన్నామలైకి పుష్కలం. ఈ కా రణంగా ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశమున్నదన్నది మొదటి అంచనా. ఇక రెండవది కేంద్రంలో మంత్రిపదవి ఇవ్వడం. ఆవిధంగా చేయడం అంత సమంజసమైన నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీని అట్టడుగు స్థాయినుంచి బీఆర్‌ఎస్ ఢీకొట్టే స్థాయికి తీ సుకొచ్చిన బండిసంజయ్‌ను ఆకస్మికంగా అధ్యక్ష పదవినుంచి తప్పించి కేంద్రంలో సహాయమం త్రి పదవిని ఇచ్చారు. దీంతో ఆయన పాత్ర తెలంగాణ రాజకీయాల్లో కుంచించుకుపోయింది. ఆయన్ను తప్పించిన కారణంగానే గత ఎన్నికల్లో పార్టీ సీట్లు ఆశించిన స్థాయిలో పెరగలేదన్న విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఈ కారణంగానే తెలంగాణలో బండి సంజయ్‌ను తొల గించినప్పుడు చాలా గొడవైంది.ఇప్పుడు అన్నామలై పరిస్థితి కూడా తమిళనాడులో సరిగ్గా ఇదే మాదిరిగా వుంది. అయితే తమిళనాడులో భాజపా ఎదుగుదలను ద్రవిడవాదం ఒక స్థాయికి మించి ఎదగనీయదనేది అక్షరసత్యం. రాష్ట్రంలో దాదాపు 70`80శాతం మంది ప్రజలు ద్రవిడ వాదానికే మద్దతిస్తారు. తమిళనాడులో 25శాతం ఓట్లు వచ్చినా భాజపాకు సీట్లు రావడం కష్టం. లోక్‌సభలో 18శాతం ఓట్లు వచ్చాయంటే అంటే మోదీ కోసం అనుకోవాలి. అసెంబ్లీకొచ్చేసరికి ఈ శాతం ఇంకా పడిపోతుంది. ద్రవిడ రాజకీయాలు నడిచినంతకాలం బీజేపీకి 25శాతం మించి ఓట్లు వచ్చే ప్రసక్తే లేదు. ఇది బీజేపీ నాయకత్వానికి బాగా తెలుసు. అంటే అన్నామలై ఎంతగా శ్రమించినా ఈ శాతానికి మించి ఓట్లు సాదించడం కష్టం, పార్టీ అధికారంలోకి రావ డం మాట అట్లావుంచి, సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నట్లయితే అధికారంలోకి రావడం ఖాయం. స్టాలిన్ తన తండ్రి మాదిరిగా ఛరిష్మా నాయకుడు కాదు, ఆయన కుమారుడు ఉదయనిధి మారన్ అంతకంటే కాదు! వీరిద్దరూ ద్రవిడవాదాన్ని భుజానేసుకొని నెట్టుకొస్తున్నారు. డీఎంకే నుంచి పుట్టిన అన్నాడీఎంకే పరిస్థితి అంతకంటే మెరుగ్గా లేదు. జయలలిత మరణం తర్వాత పార్టీకి నేతృత్వం వహిస్తున్న పళనిస్వామికి పార్టీని అధికారంలోకి తెచ్చే ఛరిష్మా లేదు. దీనికి తోడు పన్నీర్‌సెల్వంతో గొడవలు. బీజేపీతో పొత్తు విరమించుకోవడం వల్ల గత ఎన్నికల్లో పెద్దమూల్యమే చెల్లించాల్సి వచ్చిందన్న నగ్నసత్యం కళ్ల ముందు కదలాడుతోంది. దీనికి తోడు జయలలిత చివరిదశలో నరేంద్రమోదీ అండగా నిలవడమే కాకుండా, అన్నాడీఎంకేకు మేలు చేయడానికే కృషిచేశారు. ముఖ్యంగా శశికళ కబంద హస్తాలనుంచి పార్టీని కాపాడే క్రమంలో పన్నీర్‌సెల్వంకు భాజపా అండగా నిలిచింది. చివరకు పళనిస్వామి కూడా భాజపా చేసిన మేలును మరచిపోలేదు. మొత్తంగా అన్నాడీఎంకేకు నరేంద్ర మోదీపట్ల కృతజ్ఞతాభావం వుంది. కాకపోతే అన్నామలై కొరకరాని కొయ్యగా వున్నాడు కనుక ఆయ న్ను తప్పించాలని పళనిస్వామి కోర్కె! ఇప్పుడాయన వాంఛ నెరవేరింది. అన్నామలైని తప్పించడానికి అంగీకరించిన భాజపా, పన్నీర్‌సెల్వంతో కలిసి పనిచేయాలన్న షరతు విధించినట్టు తెలు స్తోంది.
ఇక మూడో అంశానికి వస్తే పార్టీలో కీలక పదవి ఇవ్వడం. అన్నామలైకి పార్టీని నడిపే సామ ర్థ్యం, అద్భుతమైన వాక్పటిమ, విషయ పరిజ్ఞానం వున్నాయి. కాకపోతే ఆయన రాజకీయ ప్రొఫైల్ కేవలం ఐదున్నరేళ్లు మాత్రమే. పార్టీలో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే కొందరికి 30 ఏళ్లు, 40ఏళ్లు మరికొందరికి జీవితకాలం పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ అనుభవం కంటే, ఛరిష్మాతోపాటు, తన ఆకర్షణశక్తిని ఓట్లుగా మార్చే సామర్థ్యమున్న నాయకుడు పార్టీకి అవసరమవుతా రు. ప్రస్తుతం జాతీయస్థాయిలో బీజేపీ అధ్యక్షుడి పదవీకాలం ముగియడంతో నడ్డా తప్పుకోవడంఖాయం. మరి ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు? నితిన్ గడ్కరీ అంగీకరించరు. రాజ్‌నాథ్‌సింగ్‌కు వయసైపోయింది. దేవేంద్ర ఫడ్నవిస్ ఛరిష్మా మహారాష్ట్రకే పరిమితం. వీటితోపాటు ఇప్పుడు బీజేపీ పరంగా ఆలోచిస్తే ఉత్తరభారత దేశంలో, ఓట్లు, సీట్లు సాధించే విషయంలో ఒక సంతృప్తస్థాయికి చేరుకుంది. అంటే అక్కడ తిరుగులేని స్థాయిలో స్థిరంగా వుంది. తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హేమంత్ బిశ్వాస్ శర్మ నాయకత్వంలో పూర్తిగా బలపడిరది. ఇప్పుడు పార్టీ బలపడాల్సింది దక్షిణ భారతదేశంలో. దక్షిణాదిలో భాజపాకు ఉత్తరాది పార్టీ అన్న ముద్ర పడిపోయింది. ఈ అపప్రధ తొలగించుకొని దక్షిణాదికి కూడా తాము ప్రాధాన్యమిస్తామన్న అంశాన్నిపార్టీ నిరూపించుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో కూడా ఈ రాష్ట్రాల్లో పార్టీ పెద్దగా బలపడలేదు. ఇప్పుడు అన్నామలై యువనేతగా, ఛరిష్మా కలిగినవాడిగా, ద్రవిడ రాజకీయాలను ఎదుర్కొనే సామర్థ్యం వున్న వాడిగా నిరూపించుకున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జాతీయ అధ్యక్షపదవి ఇవ్వడం ద్వారా పార్టీ అధినాయకత్వం ఒక ప్రయోగం చేయవచ్చు! ఆవిధంగా చేయడం ద్వారా తమ పార్టీలో సామర్థ్యమున్నవారెవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునన్న బలమైన సంకేతాలను ఇవ్వవచ్చు. ఒక తమిళుడిగా, కేరళ రాజకీయాలను కూడా ఆయన ప్రభావితం చేయగలరు. ఇన్ని లక్షణాలున్నా, ఇన్నిసానుకూలతలున్నా, మోదీ`అమిత్ షా ద్వయం తమకు అత్యంత ఇష్టుడైన అన్నామలైకి ఇంతటి బృహత్తర బాధ్యత ఇచ్చే సాహసం చేస్తారా? అన్నది ప్రశ్నార్థకమే.
పొత్తు లెక్కలు
గత లోక్‌సభ ఎన్నికల్లో ఎ.ఐ.డి.ఎం.కె.కి తమిళనాడులో వచ్చిన ఓట్లు 23శాతం. భాజపాకు 18 శాతం. అదే డీఎంకేకు 46శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 23G18 శాతాలను కలిపితే 41శాతం అవుతుంది. ఒక ఐదారుశాతం ఓట్లు సంపాదించగలిగితే డీఎంకేను మట్టికరిపించవచ్చు. ఇది పొత్తుకు ప్రధాన కారణం. మరి అన్నామలై పార్టీని జీరో స్థాయినుంచి ఆ స్థాయికి పెంచారు. ఒక బేస్ ఏర్పాటుచేశారు. కానీ ఆయనకు కొన్ని పరిమితులున్నాయి. ఎంతగొప్పగా చదువుకు న్నా, తమిళనాడుకు వచ్చేసరికి ద్రవిడియన్ రాజకీయాల్లోకి మారిపోతారు. అంటే యాంటీ హిందీ, యాంటీ నార్త్, యాంటీ బిహార్ గురించి మాట్లాడుతుంటారు. అన్నామలై ఆవిధంగా సంకుచితంగా ఆలోచించే మనిషి కాదు. చాలా విస్తృతమైన ఆలోచనా పరిధి వున్నవాడు. ఇక్కడ తమిళుల్లో ఒక గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఇతర ప్రాంతాలకు చెందినవారిని కూడా రాష్ట్రనాయకత్వాన్ని చేపట్టడానికిఅవకాశం ఇస్తారు. ఉదాహరణకు ఎంజీఆర్ మళయాళీ, జయలలిత కర్నాటకకు చెందినవారు.డీఎంకే నుంచే ఏఐడీఎంకే పుట్టింది. రజనీకాంత్‌ది మహారాష్ట్ర. అదేవిధంగా స్టాలిన్ పూర్వీకులు నెల్లూరు ప్రాంతంవారు. వైగో పూర్వీకులు కూడా ఆంధ్రప్రాంతం వారే! అంటే తమిళనాడులో వేరే ప్రాంతం నాయకత్వాన్ని ఆమోదించే సంస్కృతి కొనసాగుతోంది. ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ముఖ్యమంత్రులైన ద్రవిడ పార్టీన నాయకులంతటి స్థాయి హై ప్రొఫైల్ నాయకుడు అన్నామలై కాకపోయినా మంచి ప్రభావాన్ని మాత్రం సృష్టించగలిగారన్నది అక్షరసత్యం.
ఒకేసారి వాతావరణం మార్పుతో వేడికి ఆట్టుడుకుతున్న మండలం 7: గంటల సమయం అనుకోని రీతిలో భారీ ఎదురుగాలు ప్రారంభమై కొద్దిసేపు వ్యవస్థను అతలాకుతలం చేసింది.పెద్ద మొత్తంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడం మొదలుపెట్టింది. పెద్ద మొత్తంలో ఎదురుగా గాలులు సుమారు అరగంట పాటు గీయడంతో, పాదాచారులు వాహనదారుల్లో నడవలేక ఎక్కడి వారు అక్కడే ఆగిపోవడం జరిగింది. ఎదురుగాలులు వీస్తున్న క్రమంలోనే భారీ మెరుపులు ఉరుములతో కుండపోత వర్షం ప్రారంభమైంది. ఉమ్మడి మండలంలో ప్రస్తుతం ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కొనసాగుతుంది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.