రామాయంపేట పట్టణానికి చెందిన చింతల ఉష శ్రీనివాస్ దంపతుల కూతురు గీతాన్విత రామాయంపేట పట్టణంలోని వివేకనంద విద్యాలయం లో 5వ తరగతి చదువుతున్నది.
Eaxms
ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గోల్డ్ మెడల్ ప్రభుత్వం అందజేయడం జరిగింది.
Eaxms
రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతాన్వితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పట్టణవాసులు అభినందించారు.
తిమ్మాపూర్ ఎలికేశ్వరం తోపాటు మహాదేవపూర్ పుసుక్పల్లి, క్వారీల్లో అక్రమ వసూళ్లు ఝాట్కా బకెట్ వ్యవహారం నేటి ధాత్రి వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. ఇసుక క్వారీల అక్రమాలు దౌర్జన్యాలను తిర పైకి తీసుకువస్తూ నేడు “నేటి ధాత్రిలో”‘ పైసా వసూల్” కథనాన్ని ప్రచురించడం జరిగింది. నేటి ధాత్రి వరుస కథనాల పై స్పందించిన అధికారులు, మైనింగ్ శాఖ ఏడి, విజిలెన్స్ అధికారులు, క్వారీ వద్ద చేరుకొని విచారణ కొనసాగించడం జరుగుతుంది. టిఎస్ఎండిసి జనరల్ మేనేజర్ కూడా అక్రమ వ్యవహారం కొనసాగిస్తున్న ఇసుక క్వారీల తనిఖీలకు రాలినట్లు తెలుస్తుంది.
హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో హోరాహోరీ పోటీ:-
స్వల్ప మెజారిటీతో గట్టెక్కేనా పులి సత్యనారాయణ:-
హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ శుక్రవారం రోజున రసవత్తరంగా ముగిసాయి. అధ్యక్షునిగా తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన పులి సత్యనారాయణను తన ప్రత్యర్థి మొలుగూరి రంజిత్ ముప్పుతిప్పలు పెట్టాడు, కేవలం 26 ఓట్ల మెజారిటీ తో పులి సత్యనారాయణ హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గెలుపొందారు.
Elections
హన్మకొండ బార్ అసోసియేషన్ లో 867 ఓట్లకు గాను 752 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఇందులో పులి సత్యనారాయణకు 336 ఓట్లు రాగా తన సమీప అభ్యర్తి మొలుగూరి రంజిత్ కు 310 ఓట్లు వచ్చాయి. అలాగే ప్రధాన కార్యదర్శి గా కొత్త రవి ఎన్నికయ్యారు. ఇతను తన సమీప అభ్యర్థి అయిన వి. నరేందర్ పై 109 ఓట్ల మెజారీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షులుగా చిర్ర రమేష్ బాబు గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా అంబేద్కర్, లైబ్రరీ సెక్రటరీ గా వెంకటేష్, స్పోర్ట్స్ సెక్రటరీ గా మల్లేష్, ట్రెస్సరర్ గా సాంబశివ రావు, 30 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా రాజేశ్వర్, 20 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ అశీర్వాదం, మరియు మహిళా సంయుక్త కార్యదర్శిగా నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా శివకుమార్, సునీల్ కుమార్, కమలాకర్, నిఖిల్, మరియు మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా వేద, స్వాతి గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన వారికి పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ ————– అలాగే వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వలస సుదీర్ మరియు ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్ ఎన్నికైనారు, వీరిని వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా సత్కరించి తమ శుభాకాంక్షలు తెలిపారు.
ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పార్టీ క్లస్టర్ ఇంఛార్జి, న్యాయవాది మోటురి రవి కోరారు. అందుకు సంబంధించిన గోడ పత్రికలను నర్సంపేట మండలలోని జి.జి.ఆర్ పల్లె(గుర్రాల గండి రాజపల్లి)గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోటురి రవి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో పార్టిని స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను ఏర్పాటు చేస్తుందన్నారు.తెలంగాణ సాధించిన 10 ఏళ్లలో రాష్ట్ర అభిృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుత్తురు కోమల – రమేశ్,మాజీ ఎంపీటీసీ బండారి శ్రీలత – రమేశ్,గ్రామ పార్టి ప్రధాన కార్యదర్శి పురాణి రవీందర్,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,యాదవ సంఘం అధ్యక్షుడు తుత్తురు సాంబయ్య,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,మండల నాయకుడు కత్తుల కుమారస్వామి,గురిజాల గౌడ సంఘం అధ్యక్షుడు మంచిక దేవేందర్,దుగ్గొండి మండల యూత్ నాయకుడు బాణోత్ జై కుమార్,గురిజాల ఎస్ఎంసి మాజీ ఛైర్మన్ కొమ్మ రవి,తుత్తురు వెంకటేష్,గుంటూర్ పల్లి గ్రామ ఇన్చార్జి సంగెం శ్రీకాంత్,తుత్తురు దేవేందర్,మూలం రాజు,జక్కుల అనిల్,మంద బాలయ్య,బర్ల కుమారస్వామి,జక్కుల కనకయ్య,పురాని ఎల్లయ్య,మూలం ఐలయ్య తదితరులు ఉన్నారు.
ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జిల్లా ఎలకతుర్ధిలో జరగనున్న బి ఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ తాజా మాజీ ఎంపీపీ మంజుల నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 వ సంవత్సరంలో గులాబీ పార్టీ జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగాయిపేట రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తుంకులపల్లి సంతోష్ రావు , మోత్కు మల్లేశం, వేమారెడ్డి, పరిగి రమేష్ కుమార్ , బిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణా సంఘం సమావేశం వాయిదా పార్టీలో అనిశ్చితికి సంకేతం
బీజేపీలో నెలకొన్న జోష్
వక్ఫ్‌బిల్లు ఆమోదంతో కొన్ని ముస్లిం వర్గాల్లో తృణమూల్ పట్ల ఆగ్రహం
తృణమూల్‌లో బట్టబయలైన విభేదాలు
హైదరాబాద్,నేటిధాత్రి
ఒక చిన్న అగ్గిపుల్ల చాలు పెద్ద దావానలం సృష్టించడానికి…అన్న సామెత తృణమూల్ కాంగ్రెస్ విషయంలో ఇప్పుడు నిజం కావడం వర్తమాన ఆశ్చర్యకర పరిణామం. బెంగాల్ టైగర్‌నంటూ చెప్పుకొని, ప్రత్యర్థులను నోరెత్తనీయకుండా ఏక ఛత్రాధిపత్యంగా బెంగాల్‌ను ఏలుతున్న మమతాబెనర్జీ ఇప్పుడు బయల్పడిన తన పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా నోరెళ్లబెట్టే పరిస్థితి దా పురించడం వర్తమాన చరిత్ర! 34సంవత్సరాలు ఏకబిగిన ఉడుంపట్టుతో బెంగాల్‌ను ఏలిన వా మపక్ష కంచుకోటను కుప్పకూల్చి అధికారాన్ని చేపట్టిన మమతమ్మకు ఇప్పుడు తానొక అగ్నిపర్వ తంపై కూర్చునానన్న సంగతి స్పష్టమైవుంటుంది. ఇంతకూ జరిగిందేమంటే ఏప్రిల్ 4న, రాష్ట్రం లో డూప్లికేట్ ఓటర్ ఐ.డి. నెంబర్ల విషయంలో ఢల్లీిలోని ఎన్నికల కమిషన్‌కు ఒక పత్రాన్ని ఇ వ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే వెళ్లేముందు పార్టీ ఎంపీలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని మరీ ఎన్నికల సంఘాన్ని కలవాలని కోరింది. అయితే పార్టీ ఎం.పి. కళ్యాణ్ బెనర్జీతో పాటు ఎన్నికల సంఘాన్ని కలిసే పార్టీ ఎంపీల జాబితాలో కృష్ణనగర్ ఎంపీ మహువా మొయిత్రా పేరు లేదు. ఆయనే నేరుగా ఎన్నికల సంఘాన్ని కలవడానికి యత్నించారు. దీంతో ఎన్నికల సంఘం ఆఫీసుకు వచ్చిన ఈమె తన పేరు జాబితాలో లేకపోవడంతో కళ్యాణ్ బెనర్జీని ప్రశ్నించినప్పుడు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకదశలో మొయిత్రా ఆగ్రహంతో అక్కడి సి.ఐ.ఎస్.ఎఫ్ జవాన్లను ఏకంగా బెనర్జీని అరెస్ట్ చేయమని కోరడం వరకు వెళ్లింది. అంతేకాదు ఆమె విలపిస్తూ, ఎంపీల వాట్సాప్ గ్రూపు నుంచి కూడా తప్పుకోవడం అనంతర పరిణామం.
‘‘నాకు నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం వుంది. కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలకు వ్యతిరే కంగా పోరాడిన రాజకీయానుభవం వుంది. ఈ మహిళా ఎంపీకి కేవలం ఆదానీ, నరేంద్రమోదీ తప్ప మరో సమస్యే కనిపించదు. పార్లమెంట్‌లో తనకు ఇష్టంవచ్చినంతసేపు మాట్లాడాలి. నా కుమార్తెపై కూడా ఈమె కొన్ని కామెంట్లు చేసింది. నేను వక్ఫ్‌బిల్లుపై పార్లమెంట్‌లో మాట్లాడిన దగ్గరినుంచి ఆమెకు నాపై కోపం’’ అంటూ కళ్యాణ్ బెనర్జీ రెచ్చిపోయారు. ఇక విలేకర్ల సమావే శంలో మాట్లాడుతూ మరో ఎంపీ సౌగత్‌రాయ్‌పై కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ‘‘నారదా స్కామ్‌లో సౌగత్‌రాయ్ లంచాలు తీసుకోవడం వల్లనే కదా పార్టీ పరువు గంగలో కలిసింది.ఒకళ్లపై మరొకరిని రెచ్చగొట్టడం, గోతులు తీయడమే ఆయన పని. ఒకవేళ దీదీ కోరితే రాజీనామా చేస్తాను’’ అని కళ్యాణ్ బెనర్జీ అన్నారు.
దీనిపై సౌగత్‌రాయ్ స్పందస్తూ, ‘‘మొహువా మెయిత్రా ఏడుస్తూ వెళ్లిపోయింది. బెనర్జీని పార్లమెంట్‌లో ఛీఫ్ విప్ పదవినుంచి తొలగించాలి’’ అంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు కళ్యాణ్ బెనర్జీ ఒక ‘అనాగరిక వ్యక్తి’ వక్ఫ్‌బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కూడా గ్లాసును పగులగొట్టి ఛైర్మన్ ప్యానల్‌పై విసిరేయడం ఎంతవరకు సమంజసమంటూ’ ఆయన ప్రశ్నిం చారు.
ఈ బాగోతానికి చెందిన వీడియో షార్ట్స్‌ను బీజేపీ ప్రతినిధి, ఐ.టి.సెల్ చీఫ్ అమిత్ మాలవ్యా ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఆ వీడియోలో క ళ్యాణ్‌జీ గట్టిగా అరుస్తున్నట్టు రికార్డయింది. దీని తర్వాత ఏప్రిల్ 8న సీరామ్‌పూర్ ఎం.పి. కళ్యాణ్ బెనర్జీ, బర్ద్వాన్`దుర్గాపూర్ ఎం.పి. కీర్తి అజాద్‌మధ్య మాటలయుద్ధం జరిగింది. ఈ సంద ర్భంగా కళ్యాణ్‌జీ ‘‘ఇటువంటి రాజకీయాలు నెరపినందుకే బీజేపీనుంచి గెంటేశారని’’ ఆగ్రహం తో ఊగిపోయారు. ఇక ఆజాద్ ‘‘పదేపదే నేరాలకు పాల్పడే చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తించవద్దంటూ’’ ఎదురుదాడికి దిగడంతో మరింత రచ్చ అయింది. ఇక్కడ ఆజాద్ మొహువా మెయిత్రాకు మద్దతుగా నిలవడం గమనార్హం. కళ్యాణ్ బెనర్జీ ఈ సందర్భంగా ‘‘ఆ మహిళా ఎంపీ దురు సు స్వభావం కలది మాత్రమేకాదు, నాగరికత లేనిదంటూ’’ విమర్శించారు. కేవలం తన పేరులేదన్న కారణంగా నాపై విరుచుకుపడిరదంటూ ఆయన ఆరోపించారు. అంతకుముందు బెనర్జీ ‘‘కీర్తీ ఆజాద్, సీ.ఆర్.పార్క్‌లోని పార్లమెంట్ క్యాంటీన్‌లో ‘షోందేష్’ పేరుతో ఒక స్వీట్ షాపు తెరవడానికి స్పీకర్ అనుమతికోసం ఎంపిల సంతకాలు సేకరిస్తున్నారు. నాకీ విషయం తెలిసి దీన్ని వ్యతిరేకించాను. ఫలితంగా ఈ లేఖను స్పీకర్‌కు సమర్పించలేకపోయారు. దీనివెనుక ఏ డీల్స్ వున్నాయో? దీంతో కక్షను పెంచుకొని నాపై విమర్శల దాడికి దిగుతున్నారంటూ’’ ఆరోపించారు.
ఇప్పుడు బీజేపీ విడుదల చేసిన వీడియోలు, ఎంపీల మధ్య విభేదాలను వెల్లడిరచినప్పటికీ, ఈ స్పర్థలు కేవలం ఇప్పటివి కావని ఎప్పటినుంచో పార్టీలో నివరుగప్పిన నిప్పులా వున్నాయన్నది తెలుస్తోంది. గతంలో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మొహువా మెయిత్రా, శత్రుఘ్నసిన్హా, కీర్తీ ఆజాద్‌లు కొన్ని కామెంట్స్ చేశారు.
2022లో పార్టీ ఎంపీ శతృఘ్నసిన్నా పార్టీ నాయకత్వ పనితీరుపై తన అసంతృప్తిని నేరుగా వ్య క్తం చేశారు. 2019లో భాజపాను వీడి టీఎంసీలో చేరినప్పటినుంచి తన సేవలను పార్టీ నాయ కత్వం గుర్తించడంలేదన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల ఆయన ఇ ప్పటికీ తీవ్ర అసంతృప్తితో వున్నారు. అదేవిధంగా పార్టీ తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత లేదంటూ, టీఎంసీ పనితీరును కీర్తీ ఆజాద్ తప్పు పట్టారు. ఇక మొహువా మెయిత్రా కూడా పార్టీ అధిష్టానంపై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే వుంటారు. ఆమె మమతాబెనర్జీకి విధేయంగా వున్నప్పటికీ, పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. 2021లో ఆమె జాతీయ రాజకీయాలపై పశ్చిమబెంగాల్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. మమ తా బెనర్జీ కోటరీ అనుసరిస్తున్న కేంద్రీకృత వ్యవహారశైలిని ఆమె విమర్శించారు కూడా. స్థానికంగా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యవహారశైలిని ఆమె కొన్ని సందర్భాల్లో విభేదించారు. అయితేపార్టీలో ఆరోగ్యకరమైన చర్చ జరగడానికే తానీ విమర్శలు చేస్తున్నట్టు సమర్థించుకున్నారు. ఇక2023లో సౌగత్‌రాయ్, కళ్యాణ్ బెనర్జీల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. బెనర్జీ వ్యవహారశైలివల్ల పార్టీ ఇమేజీ దెబ్బతింటున్నదని సౌగత్ రాయ్ విమర్శించడంతో, పార్టీలో ఫ్యాక్షన్ రాజకీయాలు బయటకు పొక్కాయి.
ఒకపక్క కళ్యాణ్ బెనర్జీ, సౌగత్ రాయ్, మొహువా మెయిత్రా, కీర్తీ ఆజాద్‌ల కారణంగా తృణమూల్ కాంగ్రెస్‌లో వాతావరణం హాట్‌హాట్‌గా మారిన తరుణంలోనే, తృణమూల్ కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం సమావేశం ఆకస్మికంగా వాయిదాపడటం పార్టీ అంతర్గత వ్యవహారాల విషయంలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి 30మంది పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ఈ క్రమశిక్షణా సంఘం ఏప్రిల్ 8న సమావేశం కావాల్సివుంది. కానీ ఇప్పుడీ సమావేశం నిరవధికంగా వాయిదాపడిరది. ఈ క్రమశిక్షణాసంఘానికి పార్లమెంట రీ వ్యవహారాల మంత్రి సోబందేవ్ చటోపాధ్యాయ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమావేశం వా యిదాపడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ కమిటీ సభ్యుడు నిర్మల్ ఘోష్‌ఈ సమావేశం ప్రస్తుతానికి వాయిదాపడిరదని, ఎప్పుడు జరిగేదీ మళ్లీ తెలియజేస్తామని విలేకర్ల కు చెప్పారు. ఇదిలావుండగా ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతూ, ‘‘సౌగత్‌రాయ్, కళ్యాణ్ బెనర్జీ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉన్న విభేదాల కారణంగానే ఈ సమావేశం వాయిదా పడిరదని’ చెప్పడం గమనార్హం. నిజానికి గత మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా శాఖ సహాయ మంత్రి మనోజ్ తివారీ సహా 30మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజర య్యారు. ఈ క్రమశిక్షణా సంఘం సమావేశంలో వారిని సంజాయిషీ కోరాల్సి వుంది. బడ్జెట్ సమావేశానికి హాజరుకావాలంటూ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు పార్టీ జారీచేసిన విప్‌ను వీరు ధిక్కరించినట్లయింది.
తృణమూల్ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు బీజేపీలో జోష్ పెంచడం సహజమే. పార్టీ ప్రతినిధి, ఐ.టి.సెల్ ఛీఫ్ మాలవ్యా ఏప్రిల్ 8న మరో షార్ట్ వీడియోను ఎక్స్‌లో విడుదల చేశారు. అందులో కళ్యాణ్ బెనర్జీ ‘‘అసలు మమతా బెనర్జీదే తప్పు. కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలనుంచి తక్షణమే తప్పుకుంటా’’ అని వుంది. ఈయనకు వెనుక దన్నుగా ఎవరున్నారంటూ మాలవ్యా ప్రశ్నించడం కీలకం! తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు బయటకు రావడంతో, పార్టీలో క్రమశిక్షణ డొల్ల అనేది స్పష్టమైంది. ఇప్పటికే ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటన దగ్గరి నుంచి పార్టీ ప్రతిష్ట గణనీయంగా దిగజారింది. గతంలో నారదా స్కామ్‌లు, అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు మమతను కదల్చలేకపోయినా, ఆర్జీకర్ సంఘటన పార్టీని కుదిపేసింది. దీనికి తోడు వక్ఫ్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం, మంగళవారం నుంచి అమల్లోకి రావడంతో, ఏ ముస్లిం ఓట్లను నమ్ముకొని అధికారంలో వున్నదో, ఆ వర్గాల్లోనే చాలామంది పార్టీనాయకత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కేరళలో కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా వుందో, తృణమూల్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. హిందువుల్లో ఇప్పటికే నెలకొన్న వ్యతిరేకత, వక్ఫ్‌బిల్లు పుణ్యమాని ముస్లింలలో కొందరు దూరమయ్యే పరిస్థితి నెలకొనడం మమతా బెనర్జీని ఊపిరి సలపనీయడలేదు.
తానే ఒక ఫైర్ బ్రాండ్ అనుకుంటే పార్టీలో ఉన్న ఫైర్‌బ్రాండ్లన్నీ ఇప్పుడు, సొంత కొంపకే నిప్పు పెట్టే స్థితికి చేరుకోవడంతో, మమతా బెనర్జీ ఒక్కసారిగా ‘కూల్’గా, ‘సైలెంట్’గా మారక తప్పలే దు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఆమె నియంత్రణాపరిధిని దాటిపోయినట్టు తెలుస్తోం ది. ఏ చర్య తీసుకున్నా మొత్తం పార్టీ పుట్టిమునగడం ఖాయమన్నది స్పష్టమైంది. ఇప్పటికే తృణ మూల్‌కు సవాల్ విసురుతున్న భాజపాకు ఈ పరిణామాలన్నీ సానుకూల సంకేతాలిస్తూ, వచ్చే ఎన్నికల్లో అధికారం దగ్గడం ఖాయమన్న విశ్వాసం పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నా యకత్వంలో జోష్ నెలకొంది. తన ‘నోరు బలం’తో నెట్టుకొస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు సైలెంట్ కాక తప్పడంలేదు. అవసాన దశలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సామ్రాజ్యం ముక్కలు కావడాన్ని వీక్షించి విపరీతంగా బాధపడిన చందంగా, ఇప్పుడు మమతా బెనర్జీకూడా విభేదాలతో కుప్పకూలి పోతున్న పార్టీని నిస్సహాయంగా చూడక తప్పదా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీలో ఉన్నవారిలో అధికసంఖ్యాకులు అవినీతి అక్రమాలకు పాల్పడేవారే గనక, తమకిక్కడ రక్షణ లేదనుకుంటే నిర్దాక్షిణ్యంగా పార్టీని వీడటం ఖాయం. అన్నింటికంటే విచిత్రమేమంటే ఈ విభేదాల దెబ్బకు, ఓటర్ ఐ.డి.కార్డుల బాగోతం తెరమరుగైపోయింది. దీన్నెవరూ పట్టించుకోవడంలేదు. సామ్రాజ్యమే కుప్పకూలిపోయేటప్పుడు, దాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానం కానీ, ఎదురుదాడికి సమయం కాదు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఇదే!
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. సబ్ రిజిస్ట్రార్ల జీవితాలు ఇందుకు బాగా అద్దం పుడుతున్నాయి. ప్రతి ఒక్కరూ బెదిరించేవాళ్లే..ప్రతి ఒక్కరూ నిందలేసేవాళ్లే. ప్రతి ఒక్కరూ నిలదీసేవాళ్లే..ప్రతి ఒక్కరూ నీ సంగతి చూస్తా? అని భయపెట్టేవాళ్లే? అసలు ఏం జరుగుతుతందో అర్ధం కాని త్రిశంకు స్వర్గంలో సబ్ రిజిస్ట్రార్లున్నారు. ఇంకా కొందరైతే భయపెట్టి పని చేయించుకోవాలని చూస్తున్నప్పుడు వాళ్ల పని వాళ్లు ఎలా చేసుకోగలరు. ప్రజలు న్యాయం ఎలా చేయగలరు. మరో వైపు సమాజం నుంచి నిందలు, అపనిందలు, చీత్కారాలు ఎదుర్కొంటూ, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేశాఖలో కొలువులు. అయినా సరే అందరీ సమాదానం చెప్పాలి. లేకుంటే భయపడుతూ బతకాలి. నిత్యం అంటు ఒత్తిళ్లు, ఇటు బెదిరింపులతో కాలం గడపాలి. సామాన్యుల నుంచి వచ్చే ఇబ్బందేమీ లేదు. కాని నాయకుల మూలంగా ఇటీవల కాలంలో సబ్ రిజిస్ట్రార్లు పని చేయలేకపోతున్నారు. అందరూ నాయకులే. అందరూ రిజిస్ట్రార్ల మీద పెత్తనం చేసేవారే. మేం చెప్పినపని చేయాలని హుకూం జారీ చేసేవాళ్లే..ఇంత మంది బెదిరింపుల మధ్య పని ఎలా చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. వాళ్లు చెప్పే అక్రమ పనులు చేయలేమంటే ఒక తంటా? చేస్తే జనం నుంచి మరో తంటా? ఇలాంటి సందిగ్ధావస్తలో పని చేయలేకపోతున్నాం మహా ప్రభో అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మాపై నాయకుల ఒత్తిళ్లు లేకుండా చూడాలంటూ వేడుకుంటున్నారు. ఎందుకంటే నాయకులను కాదని కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. పని చేయడం కష్టంగా వుందని భోరు మంటున్నారు. ఇదీ తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ల ఆందోళన, ఆవేదన. ఇటీవల సబ్ రిజిస్ట్రార్లంతా ముక్త కంఠంతో ఒకటే మాట చెబుతున్నారు. మేం తప్పు చేస్తే సహించకండి. అది ప్రభుత్వమైనా, ఇంకెవరైనా? కాని తమతో తప్పుడు పనులు చేయించకండి? అని వేడుకుంటున్నారు. నాయకల ఒత్తిళ్లతో తీవ్ర మనోవేదనే కాకుండా, ఉద్యోగాలు పోతాయేమో? అని భయపడుతున్నారు. పనులు చేయించుకునే నాయకులు బాగానే వుంటారు. కాని కొలువులు పోతే తమ జీవితాలు వీదిన పడతాయని భయపడుతున్నారు. కనిపించిన ప్రతి భూమిని మా పరం చేయమని, మా పేరున రిజిస్ట్రేషన్ చేయమని ఒత్తిడిచేస్తున్ననాయకులు మరీ ఎక్కువౌతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఒత్తిడి చేసి బెదిరించి పనులు చేయించుకున్నా అది సక్రమం కాదు. దాని వల్ల వివాదాలపాలు సబ్ రిజిస్ట్రార్లే అవుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీడియాలో వార్తలౌతున్నారు. తప్పు చేసే వాళ్లే కాదు..చేయించిన వాళ్లు కూడా నేరానికి పాల్పడినట్లే. కాని వాళ్లు తెరమీదకు రారు. తప్పులు సబ్ రిజిస్ట్రార్ల మీద తోసేసి చేతులు దులుపుకుంటారు. పైగా నెల నెల మేం అడిగింది ఇవ్వాలి. మేం చెప్పినలెక్క ముట్ట జెప్పాలంటే ఎక్కడి నుంచి తేవాలి. వారికి కప్పం ఎలా కట్టాలి. గత పాలకులకు ఎలా సహకరించారో మాకు అలాగే సహకరించాలంటారు. గతంలో ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది. గతంలో ఏం చేయించుకున్నారో మాకు అవసరమేముంది? అక్రమ పనులు చేయించమని బెదిరిస్తే కొంత మంది సబ్ రిజిస్ట్రార్లు సెలవులపై వెళ్లిపోతున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తోంది. ప్రజలకు మేలు చేయాలనిచూస్తోంది. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేలా నూతన పద్దతులు తెచ్చిపెడుతోంది. మాకు చాలా వరకు సులభరతమైన పని రానుంది. ఒక రోజులో మరిన్ని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునే వెసులుబాటు కానున్నది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు ఎక్కువ కాలం రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లేకుండా సరికొత్త విధానం అందుబాటులోకి వస్తోంది. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరగడానికి వీలుండదు. మధ్య వర్తులు అసలే వుండరు. ప్రజలు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. పైగా సబ్‌రిజిస్ట్రార్లు ఏ చిన్న తప్పు చేసినా ఉపేక్షించే పరిస్దితి వుండదని ప్రభుత్వం హెచ్చరిస్తూనే వుంది. ఎక్కడ పట్టిద్దామా? అన్నట్లు మీడియా డేగ కన్నులేసుకొని చూస్తోంది. ఇలాంటి సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలు సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఆ ఎమ్మెల్యే నేను చెప్పింది వింటావా? లేదా? నేను చేయమన్న రిజిస్ట్రేషన్ చేస్తావా? లేదా? అంటూ భయపెడుతున్నాడట. ఈ నియోజకవర్గానికి నేనే బాస్. నేను చెప్పిందే నవ్వు వినాలని ఆర్డర్ వేస్తున్నాడట. మీరు చెప్పమన్నవన్నీ చేస్తే నా ఉద్యోగం పోతుందని సబ్ రిజిస్ట్రార్లు అంటుంటే, మీ ఉద్యోగాలకు నేనే భరోసా ఇస్తాను. నేను చెప్పిన పని చేయకుంటే నేరుగా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని శంకరగిరి మాణ్యాలు పట్టిస్తానని బెదిరిస్తున్నారట. దాంతో సబ్ రిజిస్ట్రార్లకు ఏంచేయాలో అర్దం కాకుండాపోతోందిన వాపోతుందన్నారు. ప్రభుత్వమే ఎలాంటి తప్పులు జరగకూడదని నూతన ఆవిష్కరణలు తెచ్చి,సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తే, అదే ప్రభుత్వంతో చెప్పి మీ అంతు చూస్తామంటూ ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే ఎవరికి చెప్పుకుంటారు? కాపాడమని ఎవరిని వేడుకుంటారు? సంబంధిత శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఓ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి. మంత్రి రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్న తప్పును కూడా సహించేది లేదని ఇప్పటికే ప్రకటనలుచేస్తున్నారు. అలాంటి మంత్రి ఇన్‌చార్జిగా వున్న జిల్లాలో ఓ ఎమ్మెల్యే నేను మంత్రికన్నా సీనియర్‌ని. మంత్రి నాకు చెప్పేదేమిటి? నేను వినేదేమిటి? నేనే నీకు బాస్..మంత్రి చెప్పినట్లు కాదు..నువ్వు కొలువులో వుండాలంటే నేను చెప్పిందే చేయాలి. నేను చెప్పినట్లే చేయాలంటూ ఎమ్మెల్యే బెదిరింపులమీద బెదిరింపులు సాగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పార్టీలో మేం సీనియర్లం. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తిమంత్రి అయినంత మాత్రాన మాకన్నా తోపు కాదు..మాపై ఆయన పెత్తనం సాగనివ్వం. మా జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పెత్తనానికి స్ధానం లేదు. ఆయనకు మా జిల్లాలో ఎలాంటి ప్రాదాన్యత లేదు. అర్దమౌతుందా? అని కొంత మంది సబ్ రిజిస్ట్రార్లను పిలిపించుకొని ఓ ఎమ్మెల్యే తన పటాటోపం చూపించనట్లు తెలుస్తోంది. దాంతో తాము ప్రజలకు సేవ చేయడానికి వున్నామో..నాయకులకు ఊడిగం చేయడానికి కొలువులు చేయాలో అర్దం కావడం లేదని సబ్ రిజిస్ట్రార్లు మధన పడుతున్నారు.. ఇటీవల ఆ ఎమ్మెల్యే సబ్ రిజిస్ట్రార్లను పిలిచి చెప్పిన పనులు చేయకపోవడంతో, ఆ రిజిస్ట్రార్లు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు రాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వార్తలు ఎందుకొస్తున్నాయని మిగతా మీడియా ప్రతినిదులు సబ్‌రిజిస్ల్రార్లను ప్రశ్నించారు. చూస్తున్నారు… ఎమ్మెల్యే వ్యక్తిగత కక్షతో ఇలాంటి వార్తలు రాయిస్తుంటే నేనెలా భాధ్యుడినౌతానంటూ ఆ సబ్‌రిజిస్ట్రార్ తన భాధను వెలుబుచ్చారు. అయినా తాము తప్పు చేస్తే శిక్షించేస్ధాయిలో వున్న ఎమ్మెల్యేలు మాపై తప్పుడు కథనాలు రాయిస్తే మేంఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి మా గోడు విన్నవించుకోవాలని సబ్ రిజిస్ట్రార్లు ఆవేదన చెందుతున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ల శాకపై ఒక్క మచ్చ కూడా పడకూడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంతో సీరియస్‌గా వ్యవస్ధను గాడిలో పెట్టాలని చూస్తున్నారు. అందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అటు రెవిన్యూ, ఇటు రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలకు సొంత భవనాలు వుండాలనుకుంటున్నాడు. తెలంగాణలో వున్న 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు నిర్మాణం తన హయాంలోనే జరగాలనికోరుకుంటున్నాడు. తాను మంత్రిగా వున్నంత కాలం రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి అన్న పదం వినిపించకుండా వుండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు ఇప్పటి వరకు వున్నట్లు కాకుండా ఎంతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశాలు జారి చేస్తున్నారు. ప్రజలకు కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని చెబుతున్నారు. పారదర్శకమైన రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగాలని అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేలు మా నెత్తి మీద తాండవం చేయాలని చూస్తున్నారు. ఈ ఒత్తిడి భరించలేక ఉద్యోగాలు వదులుకొని వెళ్లాలనుకుంటున్నామని కొంత మంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నర్సంపేట నియోజకవర్గo నుండి 25000 మంది కార్యకర్తలు తరలి రావాలి
బిఆర్ఎస్ నాయకులతో కలసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఉద్యమ పార్టీకి 25 యేండ్లు పూర్తి కానున్నదని తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం కెసిఆర్ పాలన స్వర్ణయుగంగా ఉన్న తరుణంలో నేడు కాంగ్రెస్ పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు. గత 15 నెలల కాంగ్రెస్ పాలన సాగుతున్న క్రమంలో ప్రజల గుండెల్లో నేటికీ కేసీఆరే ఉన్నారని తెలిపారు. రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో రాబోయే భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదే అని తేల్చి చెప్పారు. ఈనెల 27న వరంగల్ జిల్లాలో చేపట్టబోయే భారత రాష్ట్ర సమితి రజితోత్సవాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజితోత్సవ సంబరాల గోడ పత్రికలను పెద్ది ఆవిష్కరించారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే సభలు నిర్వహించిన సత్తా బిఆర్ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పనితీరును గత కేసిఆర్ ప్రభుత్వ పనితీరు పట్ల గ్రామాల స్థాయి నుండి మండలాల వరకు ప్రజలతో చర్చ మొదలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల విసుకు చెందుతున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని గుర్తుకు చేసుకుంటున్నారని తెలిపారు. పార్టీ కోసం గత ఎన్నికల్లో కష్టపడ్డ వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి మెజారిటీ స్థానాలను గెలిపించే బాధ్యత నాది అని పెద్ది హామీ ఇచ్చారు. రాజకీయంలో గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో బతికేవాడే నిజమైన నాయకుడని అదే స్థాయిలో నిత్యం ప్రజల్లో ఉంటున్నానని గుర్తుకు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే నా హాయంలోనే అన్ని గ్రామాల్లో 10 రేట్ల పనులు ఎక్కువ పనిచేశామని అధికార పార్టీ వాళ్లు అంటున్నారని పేర్కొన్నారు. 27 న సభ విజయవంతం చేసే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గం నుండి 25 వేల మంది కార్యకర్తలను తరలించి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద నర్సంపేట పౌరుషం చూపించాలని,రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉందడం వలన అధిక సంఖ్యలో పురుషులు హాజరవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్,అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సొసైటీ చైర్మన్ లు , మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
సాయి బాబా ఆలయంలో కాశీ విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్టాపన…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణం లోని ఏ జోన్ సూపర్ బజార్ శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మితమైన పరివార దేవత సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి స్థిర ప్రతిష్ట కార్యక్రమాలు మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం గర్తన్యాసం,బీజన్యాసం, రత్నన్యాసం తో మొదలై యంత్ర ప్రతిష్టాపన తదుపరి దేవత స్థాపన, ప్రాణ ప్రతిష్ట,కళ్యాణసం, మహాబలిహరణ,నేత్రోన్మిలనం, మహా పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ముంజల సుజాత కుటుంబానికి 20వేల రూపాయల ఖరీదు గల కుట్టు మిషన్ సహాయం —————— KANA ప్రతినిధులకు తెలంగాణ గౌడ సంఘం తరఫున అభినందనలు ధన్యవాదాలు ——————- వర్దన్నపేట (నేటిదాత్రి):
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నల్లబెల్లి గ్రామానికి ముంజల సుజాత భర్త అనిల్ వయసు 30 సంవత్సరాలు భర్త అనిల్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీదనుండి కిందపడి హాస్పిటల్ తీసుకువెళ్లగా చనిపోవడం జరిగింది. సుజాత అతి చిన్న వయసులో భర్త ను కోల్పోయి ఇద్దరు పిల్లలతో నిరాశ్రయురాలుగా జీవనం గడుపుతున్నది. పేదరికంలో ఉన్నారని వీరికి సంబంధించిన వివరాలు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్ మరియు జనగామ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ గారి ద్వారా విషయం తెలుసుకున్న. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా టెస్ట్ సభ్యులు వెంటనే వారి కుటుంబానికి రూ.20 వేల ఖరీదు గల కుట్టు మిషన్ మరియు గార్మెంట్స్ ను సాయం చేశారు ఈరోజు గడ్డం రాజు గౌడ్, మరియు పట్టాపురం ఏకాంత గౌడ్ KANA స్థానిక వాలంటీర్లు నాతి గణేష్ వారి సహకారంతో అందజేశారు. ముందుకి వచ్చి సహాయం చేసినందుకు KANA కానా సంస్థని తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు మరియు నల్లవెల్లి గ్రామ గౌడ సంఘం తరపున కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నల్లబెల్లి గ్రామం మాజీ సర్పంచ్ ముత్యం సంపత్ గౌడ్ గౌడ సంఘం గిరగాని యాదగిరి గౌడ్ ముత్యం పాపయ్య అంబాల సంపత్ గౌడ్ అంబాల యాకన్నా బొమ్మెర రాజు గౌడ్ బొమ్మెర ఎల్లగౌడ్ ముత్యం అనిల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు
తెలంగాణ అమర్నాథ్ యాత్ర గా సలేశ్వరం జాతర చైత్ర పున్నమి సందర్భంగా జరిగే మూడు రోజుల జాతర దర్శనం కోసం పక్కరాష్ట్రాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్న జనం ఇక్కడ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం. గిరిజన ఆధ్వర్యంలో ఈ జాతర జరుపబడును.
*డయల్ యువర్ ఆర్టీసి డిపో మేనేజర్ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ . . .
రాయికల్ .నేటిదాత్రి.తేదీ 11.04. 2025
శుక్రవారం రోజున డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం లో భాగంగా డిపో మేనేజర్ కల్పన మేడం గారితో జగిత్యాల – బోర్నాపెల్లి బస్ కడెం వరకు కొనసాగించడం ద్వారా రామాజీపేట, భూపతిపూర్,లింగాపూర్,చింతలూరు, బొర్నపెల్లి గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులకు గురిఅవుతుంద్రు అని ప్రస్తావించగా, ప్రభుత్వ ఆదేశానుసారం కడెం వరకు బస్సు వేయడం జరిగింది అని మేడం తెలుపారు, కాబట్టి ఇక్కడున్న స్థానిక ఎంఎల్ఏ గారికి విజ్ఞప్తి, మన నియోజక వర్గంలో చివరి గ్రామం బోర్నపెల్లి,కావున ఇక్కడి ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి కొన్ని నెలల క్రితం పరిమితికి మించి ప్రయాణికుల ఎక్కడం ద్వారా రాయికల్ కు వచ్చే బస్ వెనక టైర్లు రెండు ఊడి పోవడం జరిగింది అదృష్ట వశాత్తూ ఆ సంఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు, అన్ని రోజులు ఒక్కల ఉండవు కావున అలాంటి సంఘట మరొకటి జరుగకముందే బోర్నపెల్లి బస్ అక్కడి వరకే కొనసాగిస్తూ కడేంకు ఇంకొక బస్ వేయడం ద్వారా ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభుత్వ స్పందించక ఇలాగే పరిస్థితి కొనసాగిస్తే ప్రజల సౌకర్యార్థం ఎలాంటి నిరసనలు ఉద్యమాలు చేయడానికి అయినా సిద్ధం అని మండల ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ అనడం జరిగింది
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ MP లాడ్స్ నుండి మండలానికి వచ్చిన బోర్ బావిలను ఈరోజు రెండు గ్రామాల్లో సిరికొండ,కథలాపూర్ లో కొబ్బరికాయ కొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,బద్రి సత్యం,జిల్లా కౌన్సిల్ మెంబర్ కథలాపూర్ మహేష్,కాసోజీ ప్రతాప్,గాందారి శ్రీనివాస్, తెడ్డు మహేష్,సునీల్,జీవన్ రెడ్డి,ప్రసాద్,భూమేష్,శ్రీనివాస్, ప్రమోద్,శ్రీకర్,రాకేష్,రాజారెడ్డి,గంగామల్లయ్య ఉన్నారు.
ఇందిరా మహిళాశక్తి క్యాంటిన్ ను ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి
మహిళలను కోటీశ్వరురాళ్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని మెప్మా విభాగం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మాతృ దీవెన క్యాంటీన్ ను మెప్మా మహిళా స్వశక్తి భవనం ఆవరణలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని,ప్రతి రంగంలో మహిళలు ముందుండి ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని అందుకు తన సహాయ సహకారాలు అహర్నిశలు అందిస్తానని,ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MLA
క్యాంటీన్ నిర్వహకురాలైన గోవిందు సంతోషమ్మ మరియు వారి టీం సభ్యులందరినీ కూడా ఎమ్మెల్యే అభినందించారు.మెప్మా విభాగం సిబ్బందిని ప్రియదర్శిని పట్టణ సమాఖ్య అధ్యక్షులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ కె.నారాయణ,ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు,తహసీల్దార్ ఏ. విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేష్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుష్మా సబ్ రిజిస్ట్రార్ డి సృజన్ కుమార్,సిఐ క్రాంతికుమార్,మెప్మా డీఎంసీ యం.రజితా రాణి,మెప్మా పరకాల టీఎంసీ తడుగుల సతీష్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, మెప్మా ప్రియదర్శిని ల,పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు సరిత, రుక్మిణి ల,అమరావతి, పరంజ్యోతి,సాంబయ్య, గోవిందు కుమార్,మెప్మా ఆర్పీలు,ఎస్ఎస్జి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని కాంగ్రెస్ పార్టీ మొట్లపల్లి గ్రామ ఉపాధ్యక్షుడు కె ప్రతాప్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ ఒక కుడి భుజం లాంటిదని, కాంగ్రెస్ పార్టీకి యువకులే పట్టుకొమ్మలని, పార్టీకి యూత్ సేవలు కీలకమని ఈ సందర్భంగా అభివర్ణించారు. ఏఐసీసీ నుంచి మండల కమిటీ వరకు ఏ పిలుపు వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొని, పార్టీ కార్యకలాపాలలో ముందుండి పార్టీని నడిపించే విధంగా యూత్ కాంగ్రెస్ ఎప్పుడు ముందుండాలని ఆయన యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
శాయంపేట మండలం కేంద్రంలోని కూడలి వద్ద వెనుకబడిన వర్గాల అభ్యున్న తకై అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల బానిస బతుకుల నుంచి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు మన భారత దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలు మరవలేవనని గ్రామస్థాయి నుంచి నేటి యువత మహాత్మజ్యోతి రావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అరికెల దేవయ్య, ముక్కెర ముఖేష్, తుడుం వెంకటేష్, గజ్జి రమేష్ కొమ్ముల తిరుపతి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు, పాపయ్య, ప్రసాద్, ఎమ్మార్పీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం ఝరాసంగం మండలం చిలేపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సింలు తన పని ముగించుకొని రాత్రి ఆటోలో జహీరాబాద్ నుండి తన స్వగ్రామమైన చిలేపల్లి కి వస్తున్న క్రమంలో పస్తాపూర్ గ్రామ సమీపంలో గల బ్రిడ్జి వద్ద ఆటో ఎదురుగ వస్తున్న డీసీఎం తో ఆటో అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.
Road accident
ఈ దూర్ఘటనలో చిలేపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సింలు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలలోనే మృతి చెందాగా, డ్రైవర్ కు గాయాలు కావడతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని పరిస్థితుల్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన నర్సింలు కు, సింధు (5), స్వాతి (3) సంవత్సరల ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు తెలిపారు.
ముఖ్య అతిథిలుగా హాజరైన ఎస్ఐ మహేందర్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి నేటి ధాత్రి:
#నెక్కొండ , నేటి ధాత్రి: మండలంలోని అంబేద్కర్ కూడలిలో నెక్కొండ నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం నెక్కొండ ఆటో యూనియన్ అధ్యక్షుడు సురేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట టి పి సి సి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ ఎస్ఐ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చలివేంద్రం ను ప్రారంభించారు ఈ సందర్భంగా టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి నవత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేసవికాలం దృష్ట్యా ప్రయాణికులకు త్రాగునీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, చల్ల పాపిరెడ్డి, గంధం సుధాకర్, నవత ఆటో యూనియన్ సభ్యులు శ్రీరంగం శ్రీనివాస్, పొదిల సురేష్, వాగ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.
ఒకలక్ష కిలోమీటర్ల మా భూమి రధయాత్ర ను విజయవంతం చేయండి
ధర్మసమాజ్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు నాగ మహారాజ్ నేటి ధాత్రి:
పరకాల నేటిధాత్రి మండలంలోని బీసీ,ఎస్సీ,ఎస్టీల హక్కులు మరియు రాజ్యాధికార సాధన జేఏసీ,ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ డైట్ కాలేజీ గ్రౌండ్లో డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టబోయే ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.ఈ కసందర్బంగా పరకాల మండల అధ్యక్షులు నాగరాజు మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం ప్రజలైన బీసీ,ఎస్సీ,ఎస్టీలు ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని అందిస్తూ ఈ దేశంలోనే ఎవరూ ఇంతవరకు చేయని సాహసోపేతమైన ఒక లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర అంతర్లీనంగా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగిస్తూ వీరిని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అధిక సంఖ్యలో వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు,ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపును ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రశాంత్,సూర్యం,ప్రవీణ్, ప్రభాస్,సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.