అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ.

జహీరాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జహీరాబాద్ పట్టణంలో డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ సభకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈసందర్భగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ..ఆర్థికవేత్త రాజా నీతిజ్ఞుడు భారత రాజ్యాంగ రూపకర్త మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి జహీరాబాద్ పట్టణంలో పూలమాలవేసి నివాళులర్పించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.యావత్ భారత్ మొత్తం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్.కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మాజీ జెడ్పీటీసీలు రాందాస్,నరేష్,మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లుశేఖర్,తాహేరా బేగం,మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,హర్షద్ పటేల్,అశ్విన్ పాటిల్,తాహేర్ పాటిల్,కె.జగదీశ్వర్ రెడ్డి,రాజు నాయక్,సునీల్,నర్సింహా యాదవ్,అక్షయ్ జాడే,రాజు,జహీర్ అరబ్బీ,ప్రమోద్, జగదీష్,మోహిన్,నిజాం మరియు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి

మహోన్నతుడి ఆశయాలను కొనసాగించాలి సోమరపు శ్రీరాములు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మహోన్నతుడు మహనీయుడు భారతదేశపు రాజ్యాంగ పితామహుడు భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్) 135 వ జయంతి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మోహినుద్దీన్ ఆదేశాల మేరకు సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎన్ హెచ్ ఆర్ సి అండ్ డబ్ల్యు ఈ ఓ కేసముద్రం మండల ప్రెసిడెంట్ సోమారపు శ్రీరాములు, జన్ను శీను పూలమాలతో సత్కరించిన అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఈ గొప్ప మహనీయుడి జయంతి జరుపుకోవాలని చాలా సంతోషకరం వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిస్తూ  తెలియజేశారు.

అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు

జహీరాబాద్. నేటి ధాత్రి:

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంద

 

ర్భంగా ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని జమియత్ ఉలమా-ఇ-హింద్ మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్
ఘన నివాళులు అర్పించారు.అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని చెప్పారు.

డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

ఘనంగా డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో ఎమ్మెల్యే .పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్
134వ జయంతి సందర్భంగా డాక్టర్..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ మేధావి,నవభారత నిర్మాత,బహుముఖ ప్రజ్ఞాశాలిగా అణగారిన పేద,బడుగు,బలహీన వర్గాల క్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు..అత్యంత మేధోసంపతితో భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ .అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించి వారి జీవితాల్లో సామాజిక విప్లవ స్ఫూర్తి నింపిన ప్రదాత అంబేద్కర్ అని పేర్కొన్నారు..స్వాతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కులాలకు,మతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ జీవనం గడపాలని ఆశించి భావితరాలకు సమ సమాజాన్ని అందించాలని కాంక్షతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానీ రచించారన్నారు..అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో
మండల కిషన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు , మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ , మండల నాయకులు షేక్ రఫీ , బరపటి వెంకన్న , చందా నాగేశ్వరరావు , ఒగలబోయిన శ్రీను , పూజారి వెంకన్న, కొమరం వెంకటేశ్వర్లు , బిలపాటి సంపత్ , తోలేం కృష్ణ , గాంధర్ల రామనాథం , పోలేబోయిన చందర్రావు అశ్రపునిసా , కార్యకర్తల,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు.

జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సినారె గ్రంథాలయంలో
డాక్టర్,భీమ్ రామ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించారు.
అనంతరం గ్రంథాలయ విద్యార్థినీ,విద్యార్థులను పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జిల్లా గ్రంథాలయంలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి. మహనీయుడైన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు .
ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు కమటం మల్లయ్య, గ్రంథాలయ సిబ్బంది, సాయి,
మహేష్ మరియు, విద్యార్థులు,పాఠకులు పాల్గొని విజయవంతం చేశారు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు.

నేటినుండే అగ్నిమాపక వారోత్సవాలు

పరకాల అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య

బాబా సాహెబ్ చిత్రపటానికి,విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు

 

పరకాల నేటిధాత్రి

 

సోమవారం రోజున పరకాల పట్టణంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల మొదటి రోజైన ఏప్రిల్ 14వ తేదీన దేశంలోని అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి అగ్నిమాపక అధికారి వి. భద్రయ్య శ్రద్ధాంజలి ఘటించి మౌనంపాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు,కోల్డ్ స్టోరేజీలు, పరిశ్రమలు,మొదలైన వాటిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలని తెలిపారు.ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరకాల అగ్నిమాపక కేంద్రం 8712699306, 8712699307 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.అగ్ని ప్రమాద సమాచారం త్వరగా తెలియజేస్తే ప్రమాద నష్టం ఎక్కువగా జరగకుండా చూడవచ్చునని అన్నారు.

అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు

అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక అధికారి వి.భద్రయ్య భారత రాజ్యాంగ నిర్మాత 134వ జయంతి సందర్బంగా అంబెడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో అగ్నిమపక సిబ్బంది పాల్గొన్నారు.

రక్తదానం – మహాదానం.

‘రక్తదానం – మహాదానం’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

రక్తదానం మహాదానమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని.. ఏనుగొండ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగరంలోని ఏనుగొండ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఎస్విఎస్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మరియు ఉచిత మెడికల్ క్యాంపు శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్త దాతలను ఆయన ప్రత్యేక అభినందించారు. ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ సభ్యులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకు యూత్ కాంగ్రెస్ నాయకులను ఆయన అభినందించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు కిరణ్, వెంకటేష్ గౌడ్, సాయిబాబా, ప్రవీణ్ కుమార్, సంజీవ్ రెడ్డి, అబ్దుల్ హక్, సంజీవ్ రెడ్డి, పురుషోత్తం, చర్ల శ్రీనివాసులు, అశ్వాక్, మురళీధర్ గౌడ్, శాంతి కుమార్, మహ్మద్ కలీం, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 134వ జయంతి.

ప్రపంచ మేధావి, సమ సమాజ కాంక్షి,రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 134వ జయంతి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

అబ్రహం మాదిగ మాట్లాడుతూ… అంబేడ్కరిజం అంటే కేవలం అయన గారి జన్మ.మరణ దినాలు కాదు నిర్వహించాల్సింది,ఆయన ఆశయాలను కోనసాగించటమే అయనకు మనమిచ్చే నివాలి.
సమాజంలోని కుల వివక్షతకు,అంటరానితనానికి వ్యతిరేకంగా తన ఆఖరి శ్వాస వరకు పోరాటం చేసి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సాహెబ్ గారు.
ఎస్సీ వర్గీకరణ పై జీ ఓ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ పక్షాన ధన్యవాదములు తెలుపుతున్నాము…
ఈట్టి కార్యక్రమంలో… ఉల్లాస్ మాదిగ, జైరాజ్ మాదిగ, సుకుమార్ మాదిగ, రాజు మాదిగ, కిట్టు మాదిగ, టీంకు మాదిగ, రాజు మాదిగలు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు పురస్కరించుకొని తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జై భీమ్ జై అంబేద్కర్ నినాదాలతో విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్మించారు ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు కన్నె అరుణ్ కుమార్ జనరల్ సెక్రెటరీ కన్వీనర్ రెడ్డి మల్ల సుఖేందర్ పోకల శ్రీనివాస్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ బీజేవైఎం అధ్యక్షులుకోసిని వినయ్ యాదవ్ ఉపాధ్యక్షులు బక్క శెట్టి రాజు ఇటికల మహేందర్ సహాయ కార్యదర్శి రెడ్డి మల్ల ఆశీర్వాద్ మహేష్ బలగం భాస్కర్ గౌడ్ నిఖిల్ బాబు అధ్యక్షులు జంగం కిషన్ బుజ్జ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు…

– నివాళులర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్….

కొల్చారం, (మెదక్)నేటి ధాత్రి :-

 

 

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తా, పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

B.R. Ambedkar

ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, వివిధ కుల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు
అంబేద్కర్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి
ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

కల్వకుర్తిలో ఘనంగా బి”ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో భారతరత్న, రాజ్యాంగ ప్రధాత, ప్రపంచమేదావి, బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టణంలోని బిజెపి నాయకులు పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు తదనంతరం పాలమూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా తరలి వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గాప్రసాద్, మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్,
మాజీ అధ్యక్షులు బోడ నరసింహ,
జిల్లా కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ రెడ్డి,
బీసీ మోర్చా పాలకూర రవిగౌడ్,
మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుండోజు గంగాధర్,
పట్టణ ఉపాధ్యక్షులు కొల్లూరి శ్రీధర్, నాయకులు నాప శివ, వాకిటి శ్రీకాంత్,అరవింద్ రెడ్డి, లక్ష్మీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు

ప్రజాసేవయే నా జీవిత ఆశయం…

ప్రజాసేవయే నా జీవిత ఆశయం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల నక్క రవిపై.ప్రత్యేక కథనం. ఈ సందర్భంగా వారి మాటల్లోనే తాను చిన్నతనంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక ప్రముఖ వైద్యులు దగ్గర వైద్యం నేర్చుకొని ఎలాగైనా పల్లెటూరు ప్రజలకు వైద్య సేవలు అందించాలని నిశ్చయంతో ఊరిలో ప్రాక్టీసు ప్రారంభించానని తద్వారా ఏ రాత్రి అయిన గ్రామ ప్రజలకు గాని చుట్టుపక్కల ప్రజలకు గాని అత్యవసరమైన సమయంలో వైద్య సేవలు అందించడం నా పూర్వజన్మ సుకృత ముగ భావిస్తునని ఇలా ప్రజలకు ప్రథమ చికిత్స చేసి అత్యవసర సమయంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రక్రియ చేసి మెరుగైన వైద్యం కొరకు ప్రజలకు ముందుగాసేవ చేసే అదృష్టం ఆ దేవుడు నాకు కల్పించడానికి అదృష్టంగా భావిస్తున్నాను తెలియజేస్తూ అలాగే నాపై ఉన్న అభిమానంతో నేను గ్రామీణ ప్రజలకుచేస్తున్న సేవలను గుర్తించి ప్రజలు నాపై నమ్మకంతో రాజకీయాలకు రావాలని ఆహ్వానించడం మాజీ మంత్రి కేటీ రామారావు ప్రత్యేక ఆహ్వానంతో రాజకీయాలకు వచ్చి ప్రజలకు ప్రతి సమయంలో ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరిపి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఇటువంటి అదృష్టం ఈ జన్మ కి.దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను తెలియజేస్తూ ఇట్టి మంచి అవకాశాన్ని దేవుడు నాకు ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని ప్రతి ప్రాదించడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఇంతకంటే అదృష్టం దేవుడు ఇవ్వడం అలాగే గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకముందు కూడా ప్రజలకు రాజకీయం గాని వైద్య వృత్తిలో గాని ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని వారికి ఎల్లవేళలా వైద్యపరంగా రాజకీయపరంగా కృషి చేస్తాననిఈ సందర్భంగా తెలియజేశారు దయచేసి ఏమైనా పొరపాట్లు ఉన్నచో గ్రామ ప్రజలు రాజకీయ నాయకులు దయచేసి పెద్ద మనసుతో మన్నించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

డాక్టర్. బి..ర్.అంబేద్కర్ గారి జయంతి వేడుకలు.

ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో  డాక్టర్. బి..ర్.అంబేద్కర్ గారి జయంతి వేడుకలు:-

వరంగల్/హనుమకొండ, నేటిధాత్రి(న్యాయ విభాగం):-

 

 

14-04-2025 నాడు ఉమ్మడి బార్ అసోసిషన్ల ఆధ్వర్యంలో డాక్టర్ బి. ర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.  జిల్లా  కోర్టు కాంప్లెక్స్ లో గల డాక్టర్ బి. అర్ అంబేద్కర్ భవనంలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. 
వరంగల్, హన్మకొండ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు అయిన వలస సుదీర్, పులి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి  పూల మాల వేసి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇరువురు అధ్యక్షులు మాట్లాడుతూ అంబేద్కర్ గారు మనకు అందించిన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగంలో కెల్లా అతి పెద్ద రాజ్యాంగం అని అన్నారు. అంబేద్కర్  పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పోరాడార‌ని,  ఆయన గొప్ప మానవతా వాది అని తెలిపారు. న్యాయవాదులు మరియు యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వరంగల్ బార్ అసోియేషన్ వైస్ ప్రెసిడెంట్ జైపాల్, ప్రధాన కార్యదర్శి D.రమాకాంత్, హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, ఇరు బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు,  తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జయాకర్, జనార్ధన్ మరియు  సీనియర్, జూనియర్ న్యాయవాదులు.   మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

భానుడి…… భగభగ.

భానుడి…… భగభగ.

#సుర్రు మనిపిస్తున్న సూరీడు.

#ఎండలకు భయపడి బయటకు రాని ప్రజలు.

#నిర్మానుషమైన ప్రధాన రహదారులు.

#41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.

#వేసవిలో జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన.

 

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

సూరీడు సుర్రుమంటున్నాడు ఉక్క పోత చికాకు పుట్టిస్తుంది వడగాల్పులు వెంటాడుతున్నాయి. వేసవిలో ఎండలు దంచి కొట్టడంతో రహదారులన్నీ నిప్పుల కుంపటిగా మారిపోయి నిర్మానుషంగా కనిపిస్తున్నాయి కొద్ది రోజులుగా సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఉదయం 8 గంటల నుండి ఇంటి నుండి బయటకు రావడానికి జనం జంకుతున్నారు తప్పని పరిస్థితుల్లో ఉద్యోగులు, ఉపాధి కూలీలు, కార్మికులు వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకొని నిర్దిష్ట సమయానికే పని ముగించుకుని ఇండ్లలోకి చేరుకుంటున్నారు ఏప్రిల్ మాసంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయమని పలువురు వాపోతున్నారు గత వారం రోజులుగా మండలంలో 41డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనర్వం ఈ అధిక వేడిని తట్టుకోలేక మనుషులతో పాటు పశుపక్షాలు సైతం తల్లాడిల్లుతున్నాయి చెరువులలో, కుంటలలో తగినంత నీరు నిల్వ లేకపోవడంతో మూగజీవాల సైతం మృత్యువాత పడుతున్నాయి మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత మరింత ఎక్కువ కావడంతో ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్త వహించిన అనారోగ్యం బారిన పడతారని కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో ప్రజలు బయటకు రావడం లేదు మధ్యాహ్నం12 నుండి సాయంత్రం4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వాహనాల రాకపోకలు లేకపోవడం వల్ల ప్రధాన రహదారులన్నీ నిర్మానుషంగా మారిపోయాయి రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల మండల ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొందేందుకు పలు రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు అందులో భాగంగా ఎయిర్ కండిషన్, కూలర్ల లాంటి వాటిని ఇంటి లోపల సమకూర్చుకుంటున్నారు ఉపాధి హామీ కూలీ పథకానికి వెళ్లే కూలీలు ఉదయం తెల్లవారుజామునే పనికి వెళ్లి 11 గంటల సమయంలోపే పని ముగించుకుని ఇండ్లకు చేరుకొని నిమ్మరసం, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను సేవించి సేద తీరుతున్నారు రైతులు అరకొర వ్యవసాయ పనులు ఉండడం వల్ల ఉదయాన్నే పనులను ముగించుకుంటున్నారు వాహనాదారులు రాకపోకల సమయంలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పండ్ల రసాలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ , కొబ్బరి బోండాలు, వాటర్ మిలన్,మజ్జిగ లాంటి వాటిని సేవించి ఎండ ఎద్దడినుండి ఉపశమనం పొందుతున్నారు.

#వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలి…

sun is shining brightly.

#డాక్టర్ ఆచార్య వైద్యాధికారి . నల్లబెల్లి.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంవల్ల అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు ఎండలో తిరిగే వారికి వేడి గాలులు వీచే సమయంలో డిహైడ్రేషన్ తో పాటు, వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి వడదెబ్బ బారిన పడినవారు ఆకలిని, శక్తిని కోల్పోయి బలహీనపడి సొమ్మ సీలి పడిపోతారు. ముఖ్యంగా వేసవిలో వృద్ధులు, పిల్లలు ఎండ వేడిమిని తట్టుకోలేరు కావున వేసవి నుండి ఉపశమనం పొందుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పని పరిస్థితుల్లో ఎండలో తిరిగేవారు తప్పనిసరిగా గొడుగు, టోపీ, తలపాగా ధరించాలి ఈ వేసవిలో ప్రతి ఒక్కరు వేసవి జాగ్రత్తలు పాటించాలి.

వక్స్ సవరణ బిల్లుపై నిరసనలు..

వక్స్ సవరణ బిల్లుపై నిరసనలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

కేంద్రం తీసుకొచ్చిన వర్ఫ్ (సవరణ) బిల్లును రాజ్యాంగంపై దాడిగా జహీరాబాద్ నియోజకవర్గానికి ఝరాసంగం న్యాల్కల్ మండలానికి చెందిన సయ్యద్ మజీద్ మొహమ్మద్ యూనుస్ చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ట్యాంక్ బాండ్ వద్ద వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమని, మతానికి వ్యతిరేకమని, వక్స్ బిల్లును రద్దు చేయాలనీ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.

పల్లెల్లో పడకేసిన……!

పల్లెల్లో పడకేసిన……!

ప్రత్యేకాధికారుల పాలన.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: గ్రామాలలో సర్పంచుల పదవీ కాలం ముగి సిన తర్వాత పంచాయతీల పాలనను నిర్వహించేందుకు ప్రభుత్వం నియమిం చిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించకపోవడం, పాలన ఆస్తవ్యస్థంగా మారడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల, డివిజన్ స్థాయి గెజిటెడ్ ఉద్యోగులకు మూడు కంటే ఎక్కువ పంచాయతీ బాధ్యతలు అప్పగిం చగా, వారి ఇప్పటి పనిభారం కారణంగా గ్రామాల పరిస్థితులను పరిశీలించేం దుకు ఉదాసీనత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రత్యేకాధికారులు గ్రామా లకు రాకపోవడం గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం లేకుండాపోతోంది.

 

Solving the problems

ఝరసంగం మండల కేందంలోని 8వ వార్డులో మురుగు కాలువలో చెత్త చెదారం పేరుకుపోవడంతో నీరు ప్రవహించడం లేదు. ఒక కాల నిలో నెలల తరబడి మురుగు నీరు నిలిచి చిన్న కుంటా తలపిస్తోంది. దీనివల్ల దుర్వాసన వ్యాపిస్తోంది మరియు పందులు స్వైరంగా తిరుగుతున్నాయి. ఝద సంగం, కుప్పానగర్ గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా అడ వుల్లో పారచడం జరుగుతోంది, దీనివల్ల ముగజీవులు ప్లాస్టిక్ కవర్లను తింటు న్నాయి. కాలువల్లో మురుగు పేరుకుపోవడం, కొన్ని చోట్ల మురుగునీరు రోడ్లపై ప్రవహించడం, దోమలు విజృంభించడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్యులు పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనలో సర్పంచులు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల నిర్లక్ష్యం గ్రామాల పరిస్థితిని దిగజార్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం కోసం చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని లేదా ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో డిఎల్పిఓ అమృతను సంప్రదించగా, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

200 కు 200 కిలోల ఇసుక.

200 కు 200 కిలోల ఇసుక.

కలెక్షన్ కింగ్ టిఎస్ఎండిసి. పలుకుల6, పుసుపల్లి లో దర్జాగా వసూళ్లు.

కాంటాల వద్ద టీఎస్ఎండిసి సిబ్బంది మాఖామ్,దర్జాగా వసళ్ళు.

పాసింగ్ పై ఎక్కువ ఇసుక వేయాల్సిందే,, టిఎస్ఎండిసి సిబ్బంది.

వసూళ్ల పర్వం పై ఆగ్రహిస్తున్న డ్రైవర్లు.

బొమ్మపూర్ పుసుపల్లి మహాదేవపూర్, లకు ధీటుగా, పూసుకుపల్లి పలుగుల6, పుసుపుపల్లి వన్.

మహాదేవపూర్ -నేటిధాత్రి:

 

ఇసుక అక్రమ రవాణా ఎక్కడ ఆగుతుంది, అక్రమ వసూళ్లకు టి ఎస్ ఎం డి సి కాంట్రాక్టర్లకు గుమస్తాలుగా మారి, దర్జాగా వసూళ్లు చేస్తూ లక్షల రూపాయలను కట్టబెట్టడం జరుగుతుంది. ఇప్పటికే మహాదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్ ఎలికేశ్వరం, తోపాటు మహాదేవపూర్ పుసుపల్లి, పేరుతో నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ లలో, అక్రమ వసూళ్లు ఝాట్కా బకెట్ లాంటి కొనసాగుతుంటే, మరోవైపు కాళేశ్వరం పరిధిలోని పుసుపల్లి పలుగుల ఆరు,పూసుకుపల్లి ఒకటి నంబర్ క్వారీలు దర్జాగా, పాసింగ్ తో పాటు మరో 200 కిలోల ఇసుక, 200 రూపాయలు తీసుకొని వేయడం జరుగుతుంది, పలుగుల ఆరు దర్జాగా టీఎస్ ఎం డి సి సిబ్బంది, కాంటా వద్ద ఉండి వసూలు చేస్తున్నారు. మరోవైపు పలగుల ఒకటవ క్వారీ వద్ద టిఎస్ఎండిసి సిబ్బంది, పాసింగ్ తర్వాత 100 నుండి 200 కిలోల ఇసుక వేయడం శరమాములే అని, దర్జాగా చెప్పడం జరుగుతుంది.

200 to 200 kg of sand.

 

ఇప్పటికే మండలంలో బొమ్మ పూర్ లింగేశ్వరం మహాదేవపూర్ పుసుపుపల్లి ఒకటవ నంబర్ క్వారీలో, హద్దు అదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్న క్రమంలో, తాజాగా ఈరోజు పలుగుల 6, పూసుకుపల్లి ఒకటి ఇసుక రిచుల్లో ఒక్క లారీకి 1100, నుండి 900 వరకు రెండు క్వారీల్లో, వసూలు చేయడమే కాక, 150 నుండి 200 కిలోల ఇసుక, పాసింగ్ కు అదనంగా తరలిస్తున్నారు. ఇలా ప్రతిరోజు సుమారు ఈ రెండు ఇసుక క్వారీలు పుసుపల్లి ఒకటవ నంబర్ భారీ మొత్తంలో ప్రతిరోజు 150 కి పైచిలుకు ఇసుక లారీల్లో ఇసుక రవాణా చేస్తుంది.ఈ క్వారీ అత్యధికంగా లారీల లోడింగ్ 240 వరకు చేసింది. వసూళ్లు కూడా ఈ క్వారీ లారికి 1100 రూపాయలు, తీసుకోవడంతోపాటు అదనపు ఇసుకను రవాణా చేస్తుంది.

 

మరోవైపు పుసుక్ పల్లి పలుగుల ఒకటవ నంబర్. ఇసుక రీచ్ లో మాత్రం టీఎస్ఎండిసి సిబ్బంది స్వయంగా కూర్చొని, అదనపు ఇసుక వేయడం తప్పేమీ కాదని, పాసింగ్ కు 150 నుండి 200 కిలోల ఇసుక వేయడం మామూలే అని చెప్పుకొచ్చాడు, ఈ క్వారీలో 700 రూపాలు లోడింగ్ సిరియల్ తో పాటు, లోడింగ్ వద్ద మరో 200, మెయింటినెన్స్ కింద వసూలు చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ ఇసుక రవాణా జరగడంలేదని, గొప్పలు చెప్పుకుంటున్న టీఎస్ ఎండిసీ, పలుకుల సిక్స్,పూసుకుపల్లి, వన్క్వారీ లో , టి ఎస్ ఎమ్ డి సి, సిబ్బంది కూర్చుని దర్జాగా అదనపు వసూళ్లు చేసి పాసింగ్ కన్నా 200 కిలోల ,ఇసుక ఎక్కువ వేయడం తప్పేమీ కాదు, అని చెప్తున్నారంటే, టీఎస్ టి ఎస్ ఎం డి సి అధికారుల కలుసైగల్లోనే, ఇసుక రీచుల్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇంకేమీ కావాలో మరి, ఇప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా ఇసుక రిచుల్లో జరుగుతున్న అక్రమాలపై, విచారణ చేయించకపోవడం, సాక్షాలు చూపెట్టినప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా ,నేటికీ ఇసుక క్వారీలు మరింత రెట్టింపు ఉత్సాహంతో అక్రమ వసూళ్లు, అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారంటే, టి ఎస్ ఎం డి సి, మైనింగ్ శాఖ, అధికారుల ప్రోత్సాహం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

సదస్సుల ఆర్భాటం కాంగ్రెస్‌ను గట్టెక్కించదు

గుజరాత్‌ నమూనాకు దీటైన కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అందిస్తుందా?

బలమైన నాయకులను పార్టీలో వుండనివ్వరు

బలంలేని అనామక నాయకులతో ప్రయోజనం శూన్యం

యువతరం రావాలంటే వృద్ధ నాయకుల సంతానమే దిక్కు

ఓటమి శిథిలాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్‌

ప్రాంతీయ పార్టీలకు తోకగా మారిన దైన్యం

అంపశయ్య నుంచి అధికారం పీఠానికి ఎదగడమంటే భగీరథ యత్నమే

నిజమైన సెక్యులర్‌గా మారకపోతే పార్టీ మనుగడ కష్టం

కేవలం ఒక్క వర్గం ఓట్లు అధికారాన్ని కట్టబెట్టవు

మైనారిటీ భజన మారకపోతే పార్టీ పతనం తప్ప ఉత్థానం వుండదు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

1961లో గుజరాత్‌లో భావ్‌నగర్‌లో కాంగ్రెస్‌ జాతీయ సదస్సు జరిగింది. మళ్లీ 64 సంవత్సరాల తర్వాత రెండోసారి అహమ్మదాబాద్‌లో ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహిం చింది. 1961 సదస్సు తర్వాత గుజరాత్‌ సహా ఇతర రాష్ట్రాల్లో, అటు కేంద్రంలో అధికారంలో చాలా సంవత్సరాలపాటు కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగింది. ఇన్నేళ్ల తర్వాత నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన గుజరాత్‌ మోడల్‌ను సవాలు చేయడమే ఇప్పుడు అహ్మదాబాద్‌లో జాతీయ సదస్సు నినిర్వహణ ప్రధాన లక్ష్యం. మరిప్పుడు జాతీయ సదస్సును నిర్వహించేందుకు గుజరాత్‌నే ఎందు కు ఎంచుకుంది? ఇది పార్టీకి ఏమేరకు ప్రయోజనం? అనేవి ప్రధానంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలు. తొలిరోజు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మెమోరియల్‌ హాలులో, పార్టీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగింది. రెండోరోజు మాత్రం సబర్మతి ఆశ్రమం వద్ద జరిగిన సదస్సుకు ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గన్నారు.

గుజరాత్‌ను ఎంచుకోవడానికి కారణాలు

మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించి వందో ఏడు కావడం ఒక కారణం కాగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి రెండో కారణం. ముఖ్యంగా ఈ రెండూ గుజరాత్‌కు సంబంధించినవి. ఇప్పటివరకు బీజేపీ సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌కే తన విధానాల్లో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుడైన పటేల్‌ వారసత్వాన్ని తాము అనుసరిస్తున్నామని తెలియజెప్పడమే సబర్మతి ఆశ్రమం, సర్దార్‌ పటేల్‌ మెమోరియల్‌ను ఎంచుకోవడంలోని ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సు ద్వారా 2027 నాటికి గుజరాత్‌లో అనుసరించబోతున్న వ్యూహాన్నికాంగ్రెస్‌ స్పష్టం చేసింది. గుజరాత్‌నుంచి ఒక కొత్త రాజకీయ సంస్కృతి ప్రారంభమైతే దాని ప్రభావం దేశవ్యాప్తంగా తప్పనిసరిగా వుండితీరుతుందనేనది కాంగ్రెస్‌ నిశ్చితాభిప్రాయం. ఇప్పటివరకు రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన బీజేపీ నమూనాను పెకలించి వేయగలిగితే అప్పుడు గుజరాత్‌ పై కాంగ్రెస్‌ అధిష్టానం ఆసక్తితో వున్నదని, ఇక్కడ పార్టీ ఎంతో చురుగ్గా పనిచేస్తున్నదన్న సందేశం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులకు వెళుతుందని పార్టీ అధినాయత్వం భావిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా అప్రతిహతంగా గుజరాత్‌ను భాజపా ఏలుతున్న నేపథ్యంలో, ఇక్కడ కాంగ్రెస్‌ ఉనికిని ఒక ‘జోక్‌’గా తీసుకునేవారి మైడ్‌సెట్‌ను మార్చాలన్నది కూడా కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశం. ఇక్కడ మరో అంశాన్ని కూడా గుర్తించాలి. సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన 2002 సంవత్సరం నుంచి కాంగ్రెస్‌ సదస్సులు ఢల్లీికే పరిమితమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏటావివిధ రాష్ట్రాల్లో పార్టీ సదస్సులు జరిగేవి. ప్రస్తుతం ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అత్యంత బలంగా వున్న గుజరాత్‌ రాష్ట్రం నుంచే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుంది. 

గుజరాత్‌ మోడల్‌ ప్రాధాన్యత ఏమిటి?

ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ తాను గుజరాత్‌ ముఖ్యమంత్రి వున్నప్పుడు అభివృద్ధి విషయంలో ‘గుజరాత్‌ నమూనా’ను ప్రవేశపెట్టారు. గుజరాత్‌ నమూనాను ఒక రాజకీయ అస్త్రంగా మలచుకొని 2014లో ఆయన ప్రధాని అయ్యారు. ఇప్పుడు కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు ఆధారం గుజరాత్‌ నమూనా మాత్రమే! ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ రాజకీయాలు గుజరాత్‌ నమూనా చుట్టూనే తిరుగుతుండటం గమనార్హం. నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి వున్నప్పుడు వై బ్రెంట్‌ గుజరాత్‌ పేరుతో, పెట్టుబడుల ఆకర్షణ, రవాణారంగ అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. ‘అచ్ఛేదిన్‌ ఆనేవాలే హై’ అనే ని నాదంతో 2014లో బీజేపీ ఎన్నికల బరిలో దూసుకెళ్లడానికి ఈ వైబ్రెంట్‌ గుజరాత్‌ గొప్ప ఆధా రంగా నిలిచింది. ముఖ్యంగా నరేంద్రమోదీ కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలమన్న ఇమేజ్‌ను సృ ష్టించుకోవడంతోపాటు, చేపట్టిన అభివృద్ధి పనుల్లో విజయం సాధించడం 2014, 2019 మరి యు 2024 ఎన్నికల్లో కేంద్రంలో భాజపా అధికారానికి రావడానికి గొప్ప నిచ్చెనగా ఉపయోగ పడిరది. గుజరాత్‌లో ‘సెజ్‌’లను ప్రోత్సహించడం, పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అందరికీ తెలిసేలా చేయడం మోదీ సాధించిన విజయాలు. ఇవే తర్వాతి కాలంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ మరియు ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ కార్యక్రమాల రూపంలో కేంద్ర స్థాయిలో అమలు చేయడానికి దోహదం చేశాయి. గుజరాత్‌ అభివృద్ధి నమూనాను విజయవంతంగా అమలు చేయ డం ద్వారా, కాంగ్రెస్‌కు అభివృద్ధి విజన్‌ లేదంటూ బీజేపీ డిఫెన్స్‌లో పడేసింది. 2002 తర్వాత గుజరాత్‌లో ఇప్పటివరకు ఏవిధమైన అల్లర్లు జరగలేదు. ఇందుకోసం రాష్ట్రంలో అనుసరించిన పద్ధతినే జాతీయ స్థాయిలో కూడా అమలుచేస్తున్నారు. ఈవిధంగా గుజరాత్‌ నమూనా దేశ ప్రజలను సమ్మోహితులను చేసిందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. మరి తానుకూడా అంతటి స్థాయి లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో పనిచేస్తానని దేశ ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏర్పడిరది. దీన్ని మరే ఇతర రాష్ట్రం నుంచైనా చేపట్టవచ్చు. కాకపోతే బీజేపీ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి కనుక వాటిని దెబ్బతీయాలంటే తన ప్రయత్నాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలి. ఇప్పుడు కాంగ్రెస్‌ సదస్సు రూపంలో చేసింది ఇదే.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ పరిస్థితేంటి?

గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 182. 1985లో కాంగ్రెస్‌ 149 సీట్లలో గెలిచి రాష్ట్రాన్ని పాలించింది. అదే 2022 నాటికి ఇక్కడ బీజేపీ ఏకంగా 156 సీట్లు గెలిస్తే, కాంగ్రెస్‌ కేవలం17 స్థానాలకే పరిమితమైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ మొట్టమొదటిసారి గుజరాత్‌లో పోటీచేసి 13% కాంగ్రెస్‌ ఓట్లకు గండికొట్టింది. ఇక 2022 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌నుంచి వలసలు మొదల య్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ బలం 12కు కుంచించుకుపోయింది. ఇదే స మయంలో బీజేపీ సీట్లు 161కి పెరిగాయి. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే రా ష్ట్రంలోని మొత్తం 26 లోక్‌సభ సీట్లలో బీజేపీ 25 గెలుచుకోగా, 61.86% ఓట్లు నమోదయ్యా యి. ఇక అసెంబ్లీ ఎన్నికల గుణపాఠం నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో చేతులు కలిపి పోటీచేసి నా ఈ రెండిరటికి కలిసి వచ్చిన ఓట్లశాతం 31.24%. గెలుచుకుంది కేవలం ఒక్క సీటు మాత్రమే. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక అనుకూలాంశాన్ని గుర్తించాలి. 2022 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, 2024లోక్‌సభ ఎన్నికల్లో 20 అసెంబ్లీ సెగ్మంట్లలో ఓట్లశాతాన్ని గణనీయంగా పెంచుకోవడం విశేషం. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో తన ఆధీనంలో వున్న 13 మున్సిపాలిటీల్లో కేవలం ఒక్కదాన్ని మాత్రమే నిలబెట్టుకోగలిగింది. అదే బీజేపీ 68 మున్సిపాలిటీల్లో 60 గెలుచుకొని తన సత్తా చాటింది. 

బీజేపీ హవాను కాంగ్రెస్‌ అడ్డుకోగలదా?

మార్చి 7వ తేదీన పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ ఒక కీలక ప్రకటన చేశారు. ‘‘గుజరాత్‌లో రెండు రకాల నాయకులున్నారు. కాంగ్రెస్‌ను తమ హృదయాల్లో ఇప్పటికీ ప్రతిష్టించుకొన్న ప్రజలతో మమేకమయ్యే నాయకులు ఒకరకం కాగా, పార్టీలోనే వుంటూ, బీజేపీతో అంటకాగే రకం నాయకులు మరికొందరు. ఇటువంటివారిని తొలగించి మనం ఒక ఉదాహరణగా నిలవాలి’’. బాగానేవుంది కానీ ఈ ప్రక్షాళన సాధ్యమయ్యే పనేనా? ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి ఆక్సిజన్‌ మాదిరిగా వున్నది ముస్లింలు, గిరిజనులు. మిగిలిన గుజరాతీలను ఆకర్షించాలంటే అభివృద్ధి పేరుతో మాత్రమే సాధ్యం. ఇప్పటికే గుజరాత్‌ ఒక నమూనా రాష్ట్రంగా నిలిచింది కాబట్టి, చిన్న సమస్యలేమైనా వుంటే వాటిని పట్టుకొని ముందుకెళ్లాల్సి వుంటుంది. గత మూడు దశాబ్దాలుగా భాజపా గుజరాత్‌లో అధికారంలో కొనసాగుతోంది. అందువల్ల ప్రస్తుత తరానికి కాంగ్రెస్‌ గురించి తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఈ కొత్తతరం యువతను, మహిళలను తనవైపు తిప్పుకుంటే తప్ప ఫలితం వుండదు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయినిస్తోంది కనుక, అంతకుమించిన అద్భుతం తాను సృష్టించగలనని కాంగ్రెస్‌ ప్రజల్లో నమ్మ కం కలిగించగలగాలి. గుజరాత్‌ అసెంబ్లీకి మరో రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపల కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థాయిల్లోని నాయకత్వంలో ఉత్తేజం నింపి ఎంతో శ్రమిస్తే తప్ప ఫలితం వుండబోదు. మరి ఇది సాధ్యం కావాలంటే పార్టీకి సుశిక్షతమైన కార్యకర్తలతో కూడిన సైన్యం, మంచి కమాండర్‌ అవసరం. దురదృష్టవశాత్తు ఈ ఇద్దరూ పార్టీకి లేరు. అన్నింటికీ మించి పార్టీకి ఆర్థిక వనరుల కొరత పెద్ద స మస్యగా మారింది.

కాంగ్రెస్‌కు తక్షణం కావలసినవి

బీజేపీ మాదిరిగా సంస్థాగతంగా బలోపేతం కావడం. ‘ఎన్నికల మిషన్‌’ మాదిరిగా పనిచేస్తున్న బీజేపీ స్థాయిలో పనిచేయాలి. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలను ఏర్పరచుకొని, తన సిద్ధాంతా లను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేయగలగాలి. ఇందుకోసం విశ్వసనీయమైన నాయకులు, కార్యకర్తలు అవసరం. ప్రస్తుతం పార్టీకి ఈ రెండిరటి కొరత తీవ్రంగా వుంది. బీజేపీతో యుద్ధా నికి ఇంతటి బలీయమైన ఆధారం కావాలి. ఈ హంగు లేదన్న సంగతి రాహుల్‌గాంధీకి తెలి యంది కాదు. అందువల్ల కేవలం సదస్సుల నిర్వహణ ద్వారా బలమైన మోదీని కాంగ్రెస్‌ ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేదు. బీజేపీ తాను అనుకున్నవాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయగలుగుతోంది. కాంగ్రెస్‌కు ఇప్పుడు ఇంతటి బలమైన క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు. అయితే సదస్సువల్ల అస లు ప్రయోజనం వుండదా? అంటే ఎంతోకొంత వుండితీరుతుంది. కానీ అది ఎంతమాత్రం సరిపోదు. 

రాహుల్‌ శపథం

బీజేపీ అహంకారాన్ని తప్పకుండా దెబ్బకొడతామని రాహుల్‌ గాంధీ అన్నారు. కానీ ప్రస్తుతం వున్న కంగాళీ నాయకులతో ఇది సాధ్యమా? ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది రాహుల అభిమతం. కాంగ్రెస్‌లో పాతుకుపోయిన వృద్ధ నాయకులు ఈ ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డుకొట్టక మానరు. ఎందుకంటే ఇది కాంగ్రెస్‌ సంస్కృతి కదా! ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వున్న మల్లికార్జున ఖర్గే 2022, అక్టోబర్‌ 26న పార్టీ అధ్యక్షుడయ్యారు. ఇప్పటికే ఆయన వృద్ధుడైపోయారు. అందరినీ ముందుకు పొమ్మనగలరు కానీ, తాను కదలలేరు. బీజేపీలో మాదిరిగా పార్టీ అధ్యక్షుడు ఇంత కాలం మాత్రమే పదవిలో కొనసాగాలన్న నియమం లేదు. నెహ్రూ కుటుంబం అభీష్టం మేరకే ఎవరైనా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఈ వ్యవహారశైలి బాగా తెలిసినవాడు కనుకనే ఖర్గే, తన తర్వాత కాంగ్రెస్‌ పగ్గాలు రాహుల్‌ చేపట్టాలని కోరుతున్నారు. నిజం చెప్పాలంటే ఆయన పేరుకే అధ్యక్షుడు. నెహ్రూ కుటుంబానిదే అంతా అధికారం! ఆయన నిర్ణయాలు తీసుకునేదేం లేదు! సోనియా చెప్పింది చేయాలంతే. రాహుల్‌ పేరు చెబితేనే పదవిలో ఉన్నంతకాలం కొంతమేర ప్రశాంతంగా వుండగలరు! ఇదిలావుండగా ప్రియాంకా వాద్రాకు కూడా కీలక బాధ్యతలు అప్పగించాలన్న ఉద్దేశం వుందంటున్నారు. కానీ ఈ సదస్సు సమయానికి ఆమె అమెరికా వెళ్లిపోయారు. ముఖ్య సమయాల్లో రాహుల్‌ లేదా ప్రి యాంక లేదా ఇద్దరూ వుండరు. కాంగ్రెస్‌ పార్టీ ‘మొదటి కుటుంబంలోనే’ మూడు గ్రూపులలున్నాయన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఒకటి సోనియా, రెండు రాహుల్‌, మూడు ప్రియాంక. ఇ టువంటి అసంబద్ధ నాయకత్వాన్ని నమ్ముకొని విశ్వసనీయంగా కేడర్‌ పనిచేయడం కష్టమే. అయితే దేశవ్యాప్తంగా జిల్లా, బ్లాక్‌ స్థాయిల్లో పార్టీని బలోపేతం చేయాలన్నది అగ్ర నాయకత్వం ఉద్దే శంగా కనిపిస్తోంది. ఇది నిజం కావాలంటే ముందు అగ్రనాయత్వం వ్యవహారశైలిలో మార్పు రావాలి.

వరుస పరాజయాలు

ఇటీవలి సంవత్సరాల్లో కాంగ్రెస్‌ ఏ ఎన్నికల్లో విజయం సాధించడంలేదు. వచ్చే బిహార్‌ ఎన్నికల్లోమహా ఘట్‌బంధన్‌పై కాంగ్రెస్‌ ఆశపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇందెంత నిప్పచ్చరంగా వుంటుందో చెప్పడం కష్టం. ఎందుకంటే కాంగ్రెస్‌ను దేశంలోని ఏ ప్రాంతీయపార్టీ లెక్కచేయడం లేదు. ఒకప్పుడు వీరిని శాసించిన కాంగ్రెస్‌ ఇప్పుడు వాటికి తోకమాదిరిగా వుండాల్సిన దుస్థితి! విరిగిన కత్తులు, సొట్టపోయిన డాళ్లు, చక్రాలు ఊడిన రధాలతో, అన్ని హంగులూ వున్న శత్రువుతో పోరాడాలి? ఇది సాధ్యమయ్యేదేనా? ‘కురువృద్ధులతో’ నిండిన కాంగ్రెస్‌ పార్టీని యువత ఎంతవర కు విశ్వసిస్తారనేది కూడా ప్రశ్నే! రాహుల్‌ను యువ నాయకుడిగా ముందుకు తెద్దామన్నా ఆయన ఎక్కడ కాలుపెట్టినా కలిసిరావడంలేదు! ఆయన ప్రచారానికి వస్తారంటే, పార్టీలో గెలిచే అవకాశాలున్న నాయకులకు గుండెదడ మొదలైనట్టే! 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ వ రుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందన్న సత్యాన్ని గుర్తించాలి.

కొత్త ఇన్‌చార్జ్‌లు

 కొద్ది నెలల క్రితం కాంగ్రెస్‌ రెండు రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శులను మరో తొమ్మిది రాష్ట్రాల కు ఇన్‌చార్జ్‌లను నియమించింది. మరో ఆరుగురు నాయకులకు ఉద్వాసన పలికింది. ఛత్తీస్‌గఢ్‌మాజీ ముఖ్యమం త్రి భూపేష్‌ భాగల్‌కు ఏ.ఐ.సి.సి. సెక్రటేరియట్‌లో స్థానం కల్పించి, పంజాబ్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించారు. రాజ్యసభ ఎం.పి. సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ను ప్రధానకార్యదర్శి గా చేసి, జమ్ము`కశ్మీర్‌, లద్దాఖ్‌లకు ఇన్‌చార్జ్‌గా నియమించారు. 

రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లుగా నియమితులైనవారిలో రాజ్యసభ ఎం.పి. రజనీపాటిల్‌ (హిమాచల్‌ ప్రదే శ్‌, చండీగఢ్‌), బి.కె. హరిప్రసాద్‌ (హర్యానా), హరీష్‌ చౌదరి (మధ్యప్రదేశ్‌), గిరీష్‌ చోడంక్‌ (తమిళనాడు, పుదుచ్చేరి), అజయ్‌కుమార్‌ లల్లూ (ఒడిషా), కె.రాజు (రaార్ఖండ్‌), మీనాక్షి నటరాజన్‌ (తెలంగాణ), లోక్‌సభ ఎం.పి. సప్తగిరి శంకర్‌ ఉలక (మణిపూర్‌, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌), కృష్ణ అల్లవారు (బిహార్‌) వున్నారు. కొత్తగా నియమితులైనవారు రాహుల్‌ గాంధీ, ప్రియాం కా వాద్రాలకు సన్నిహితులు కావడం గమనార్హం. 

ఎంతగా చెప్పుకున్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఇప్పుడు పార్టీకి చాలా అవసరం. కార్యకర్తల్లో విశ్వాసం పాదుగొల్పే నాయకులు కాంగ్రెస్‌లో కరవయ్యారు. కాస్త గట్టి నాయకుడని అనుకున్న వారిన పొగబెట్టి బైటికి పంపించే సంస్కృతి జీర్ణించుకున్న కాంగ్రెస్‌కు అనామక నాయకులే విశ్వాసంగా పడివుంటారు. బలమైన నాయకుడెవరూ కాంగ్రెస్‌లో ఇమడలేరు. ఇప్పుడు శశిధరూర్‌, కర్నాటకలో డి.కె. శివకుమార్‌ల పరిస్థితి ఇదే! ఇటువంటి సంస్కృతి వున్న పార్టీ ఏవిధంగా బ లోపేతం కాగలదు?

తెగ ముదిరిపోతున్న ర్యాంకుల పిచ్చి

విద్యార్థులపై విపరీత ఒత్తిడి

క్రీడలు, ఇతర కృత్యాలకు ప్రాధాన్యం శూన్యం

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌….ఈ రెండే కోర్సులా?

ఐదు దశాబ్దాల క్రితం విద్యాప్రమాణాలు ఇప్పుడేవీ?

విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం శూన్యం

మార్కులు, ర్యాంకులే విద్యార్థుల లక్ష్యాలు

ఆడుకునే వయసులో ఏసీ రూమ్‌లలో చదివించినా వృధా

భావి తరాన్ని నిర్వీర్యం చేస్తున్న ‘ర్యాంకుల’ విద్య

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలో విద్యావ్యవస్థ పనితీరు ఆశించినంత గొప్పగా యేమీ లేదనే చెప్పాలి. గ్రామాలు, పట్టణాల్లో తల్లిదండ్రులు ఎంత కష్టాన్నైనా భరించి తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్పించడానికే ఉత్సాహం చూపుతున్నారు తప్ప, ప్రభుత్వ పాఠశాలలవైపు మొగ్గు చూపడంలేదు. ప్రాథమిక వి ద్య, పాఠశాల విద్య, కళాశాల విద్యకోసం ప్రభుత్వం కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నా పిల్లల చదువు నిప్పచ్చరంగా కొనసాగడానికి ప్రధాన కారణం విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణమైనలోపాలు. క్వాలిఫికేషన్లున్నా చాలామంది టీచర్లకు వర్తమాన కాలానికి అనుగుణమైన నైపుణ్యాలు లేక పోవడం, కొన్ని స్కూళ్లలో విద్యార్థులే లేకపోవడం, సమయపాలన విషయంలో నిర్లక్ష్యం, అన్నింటికీ మించి మౌలిక సదుపాయాలు ఎక్కువ స్కూళ్లలో మృగ్యం కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పాలి. ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్లను పోల్చుకొని పనిచేసేవి. ఇప్పుడు పరిస్థితి తల్లక్రిందులై, ప్రభుత్వ స్కూళ్లే ప్రైవేటు పాఠశాలలతో పోల్చుకోవాల్సిన దుస్థితి! ఫలితంగా ప్రవేశాలకోసం పోరాటం, ర్యాంకుల ఆరాటం పిచ్చి ముదిరి వెర్రి స్థాయికి చేరింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతే లేకుండా పోయింది. ఎంతసేపూ చదువు, ర్యాంకులు త ప్ప ఎవరూ దేన్నీ పట్టించుకోవడంలేదు! ఇది చిన్న పిల్లల మెదళ్లపై అపరిమితమైన ఒత్తిడికి కారణమవుతోంది. వారి వయసుకు తగిన ఆటలు, పాటలు వంటి రిక్రియేషన్‌ గురించి పట్టించుకునే నాధుడే లేడు. ఎంతసేపూ ఇంజినీరింగ్‌, డాక్టర్‌ టార్గెట్లు తప్ప వేరేవాటికి పిల్లల మెదళ్లలో చో టు లేదు. ఆవిధంగా నూరిపోస్తున్నారు మరి! ఆరేడు దశాబ్దాల క్రితం అన్ని సబ్జెక్టుల్లో 40% మార్కులు సాధించిన విద్యార్థి ఆయా సబ్జెక్టుల్లో తనకు తెలిసినంతవరకు స్పష్టమైన జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు. ఇక 60% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో క్రీడలకు సముచిత ప్రాధాన్యత వుండేది. ఇంటర్‌ స్కూల్‌, తాలూకా స్థాయి, జిల్లా స్థాయి కబడ్డీ, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కోకో వంటి పోటీలు నిర్వహించేవారు. కానీ నేడు ఇవన్నీ కనుమరుగైపోయాయి. 95% మార్కులు సాధించిన విద్యార్థి నాటి 40% విద్యార్థి జ్ఞానంతో సమానస్థాయి కలిగివుండటంలేదు. ఈవిధంగా విద్యార్థులను గదుల్లో బంధించి స్పెషల్‌ క్లా సులు, చదువు తప్ప మరే ఇతర వ్యాపకం లేకుండా చేస్తుండటంతో వారిలో జీవనశైలి, క్రీడలు, కళలు వంటి రంగాల్లో నైపుణ్యం దాదాపు సున్నాగా వుంటోంది. ఇది చాలా ప్రమాదకరం. 144 కోట్లమంది ప్రజల్లో క్రీడల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యం ప్రదర్శించేవారు లేకపోవడానికి ప్రస్తుత విద్యావ్యవస్థే కారణం. సదుపాయాలు తక్కువ వున్నా ప్రైవేటు విద్యకే తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం, ప్రభుత్వ విద్యావ్యవస్థ దారుణ వైఫల్యం. ఫలితంగా విద్యకోసం కొన్ని వందలు, వేలకోట్లు ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్నా అది బూడిదలో పోసిన పన్నీరు చందంగా వుంటోంది తప్ప ఫలితం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేనివే అధికం. ఫర్నీచర్‌, తదితర సదుపాయాలు అందుబాటులో వుండవు. దీనికి తోడు చాలామంది టీచర్లు ఎంతసేపూ యూనియన్‌ కార్యకలాపాలు, తమ సొంత వ్యాపకాలు చూసుకోవడంలోనే తల మునకలుగా వుండటం తప్ప, విద్యపై దృష్టిపెట్టడంలేదు. అదీకాకుండా టీచర్లను ప్రభుత్వం వివిధ కా ర్యకలాపాలకు వినియోగించుకోవడం కూడా మరో కారణం. పాఠశాల విద్యలో ప్రధాన లోపం డిటైన్‌ సిస్టమ్‌ లేకపోవడం. దీనివల్ల స్థాయికి తగిన విద్యానైపుణ్యాలు సాధించకుండానే విద్యార్థులు పదోతరగతి వరకు చేరుకుంటున్నారు. ఆ స్థితిలో వీరిని ర్యాంకులకోసం రాచిరంపాన పెట్టి నా ఫలితం వుండదు. డ్రాపౌట్లు పెరగడం తప్ప! ఏదీ సులభంగా రాదు, కష్టపడి సాధించాలన్న సత్యాన్ని పిల్లలకు చిన్నతనంలోనే మనసులో నాటడం వల్ల, ఆ స్థాయినుంచే వారు కష్టపడటం నేర్చుకుంటారు. క్రీడల్లో ఉత్సాహం చూపేవారిని ఆ రంగంలో తగిన శిక్షణ ఇస్తే వారు రాణింపుకు వస్తారు. అందరూ ఒకే రంగంలో రాణించడం సాధ్యంకాదు. నేటి విద్య కేవలం ఇంజినీర్లు, డాక్టర్లను తప్ప మరెవరికీ ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఆవిధంగా నిర్లక్ష్యానికి గురైంది క్రీడా రంగం. దీనిపై ప్రభుత్వం సత్వరం దృష్టి పెట్టాలి. అసలు ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోతుండటానికి కారణమేంటని అర్థం చేసుకోవడానికి ఈ క్రింది గణాంకాల పరిశీలన అవసరం. 

విద్యార్థుల కొరత

2011 జనగణన ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత 66.46%. జాతీయ సగటు 74% శాతం తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి రాష్ట్రంలోని 1213 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేదు. ఈ స్కూళ్లలో దాదాపు 1300 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఏకోపాధ్యాయ స్కూళ్లు, ఇద్దరు టీచర్లు పనిచేసే పాఠశాలలు కూడా వున్నాయి. ప్రవేశాలు లేకపోవడంతో ఈ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులను సమీప పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపాల్సి వచ్చింది. అంతేకాదు మొత్తం 30,023 ప్రభుత్వ స్కూళ్లలో 13,364 పాఠశాలల్లో 50% కంటే తక్కువే ప్రవేశాలు జరగడం ప్రభుత్వ విద్య దయనీయ స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో 5821 స్కూళ్లలో సింగిల్‌ టీచర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వ అధికా ర్లు సమగ్ర శిక్షా ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు 2024`25కు సమర్పించిన నివేదికలో వెల్లడిరచారు. అంతేకాదు రాష్ట్రంలో 9.44% బాలుర టాయిలెట్లు, 5.86% బాలికల టాయ్‌లెట్లు, 15.45 సీడబ్ల్యుఎస్‌ఎన్‌ టాయ్‌లెట్ల నిర్మాణం పెండిరగ్‌లో వున్నాయి. 18.19% పాఠశాలలకు సమగ్ర ప్రయోగశాలల సదుపాయం లేదు. 11.7% స్కూళ్ల ఐ.సి.టి. ల్యాబ్‌లు లేవు, 71% స్కూళ్లకు స్కిల్‌ఎడ్యుకేషన్‌ ల్యాబ్‌లు లేకుండానే పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024`25 విద్యాసంవత్సరానికి సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద రూ.1907 కోట్లను ఖర్చు చేసేందుకు ఆమోదం తెలుపగా, ఇందులో కేంద్రం వాటా రూ.1148 కోట్లు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వుంటుంది.

మౌలిక సదుపాయాల లేమి

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఘోరమైన నిర్లక్ష్యానికి గురయ్యాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (యుడిస్‌) తన నివేదికలో వెల్లడిరచింది. రాష్ట్రంలోని 30,014 ప్రభుత్వ పాఠశాలల్లో 25,217 స్కూళ్లకు తాగునీటి సదుపాయం, 15,986 స్కూళ్లలో బాలికల టాయ్‌లెట్లు, 8,888 స్కూళ్లలో తగినంత ఫర్నీంచర్‌ వున్నదని నివేదిక పేర్కొంది. దీని ప్రకారం 5వేల పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. అదేవిధంగా 22వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్‌ సౌకర్యం లేదు. 26,095 స్కూళ్లకు విద్యుత్‌ సదుపాయం వుండగా, 20,574 పాఠశాలలు (అంటే రెండిరట మూడువంతులు) క్రీడా మైదానాలను కలిగివున్నాయి. మొత్తం 30,014 స్కూళ్లలో 8,284 స్కూళ్లకు కంప్యూటర్‌ సదుపాయం వుండగా, 2,760 పాఠశాలలకు మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించారు. ఇక వైద్య పరీక్షల విషయానికి వ స్తే కేవలం 9,726 స్కూళ్లు మాత్రమే విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించాయి. నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే`2021(ఎన్‌ఎస్‌ఎ`2) ప్రకారం జాతీయ స్థాయిలో పాఠశాలల సగటు పనితీరుతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి వుండటం గమనార్హం. ఈవిషయంలో జాతీయ సగటు 37.8% కాగా, రాష్ట్ర సగటు 36.7% నమోదైంది. 

గణితం, సైన్స్‌ల్లో పూర్‌

తెలంగాణ విద్యార్థులు లాంగ్వేజెస్‌లో 100 మార్కులకు సగటున 48 మార్కులు స్కోర్‌ చేయగా,గణితంలో (32), సైన్స్‌లో (35) సాంఘికశాస్త్రంలో (34) సాధించడం ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎంత అధ్వాన్నంగా వున్నదీ వెల్లడిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, పనితీరు అధ్వాన్నంగా వున్న నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా తల్లిదండ్రులు త మ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడానికే మొగ్గు చూపుతుండటం గమనార్హం. విచిత్రమే మంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే, ప్రైవేటు పాఠశాలల సంఖ్య తక్కువైనప్పటికీ వీటిల్లో చేర్పించడానికే ప్రాధాన్యతనిచ్చేవారు 51.3% వుండటం ప్రభుత్వ పాఠశాలలు తమన పనితీరును ఎంతగానో మెరుగుపరచుకోవాలన్న సత్యాన్ని వెల్లడిస్తోంది.

ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న ప్రవేశాలు

2021ా22 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 43,083 పాఠశాలలుండగా వీటిల్లో 59,60,913 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిల్లోని 30,014 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 29,73,684 కాగా, కేవలం 13,069 ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులు 29,87,229. విచిత్రమేమంటే ప్రభుత్వ పాఠశాలల సంఖ్యలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య సగంకూడా లేకపోయినప్పటికీ వీటిల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య మాత్రం ప్రభుత్వ స్కూళ్ల కంటే ఎక్కువ! 2022ా23 ఆర్థిక సంవత్సరంలో ‘యుడిస్‌’ ఇచ్చిన నివేదిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందన్న సంగతిని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 30,307 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 28,95,456 కాగా, 10,634 ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30,49,766. ఈవిధంగా ప్రైవేటు పాఠశాలలపట్ల పట్టణ ప్రాంతాల తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపడం కనిపించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే మేడ్చెల్‌ామల్కాజ్‌గిరి జిల్లాలో అత్యధికశాతం తల్లి దండ్రులు ప్రైవేటు స్కూళ్లకు ప్రాధాన్యనిచ్చారు. ఈ జిల్లాలో 1478 ప్రైవేటు పాఠశాలలు, 558 ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తుండగా 81.6% విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారు.హైదరాబాద్‌ నగరంలో మొత్తం 2,867 స్కూళ్లుండగా 7,85,054 మంది విద్యార్థులు వీటిల్లో చదువుకుంటున్నారు. మళ్లీ ఇక్కడ కూడా 71.1% ప్రవేశాలతో ప్రైవేటు పాఠశాలలదే ఆధిపత్యంకొనసాగుతోంది. నగరంలోని మొత్తం 1863 ప్రైవేటు పాఠశాలల్లో 6,05,190 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా, అదే 1004 ప్రభుత్వ స్కూళ్లలో 1,79,864 మంది పిల్లలు మాత్రమే చదువుకుంటున్నారు.

జయశంకర్‌ాభూపాలపల్లి జిల్లాలో మెరుగు

జయశంకర్‌ాభూపాలపల్లి జిల్లాల్లో మాత్రం పై గణాంకాలకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్కూళ్ల సంఖ్య చాలా తక్కువ. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లకు తల్లిదండ్రులు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడదు. భూపాలపల్లిలో మొత్తం 337 పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు 33.1% మాత్రమే ఇక్కడ నమోదయ్యాయి. అదేవిధంగా ములుగులో 553 స్కూళ్లుం డగా కేవలం 20.8% విద్యార్థులు మాత్రమే ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటున్నారు. 

నలిగిపోతున్న విద్యార్థులు

విషయమేంటంటే ప్రవేశాలే కుంచించుకు పోతున్నప్పుడు, క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేది ఎక్కడ? ప్రవేశాలు దండిగా వున్న ప్రైవేటు స్కూళ్లకు క్రీడలు పట్టవు. వాటికి ర్యాంకులు ముఖ్యం. ర్యాంకులు వస్తేనే వాటికి మనుగడ! విద్యా వ్యాపారంలో లాభానికి మొదటి మెట్టు ‘ర్యాంకు’. అంతేకాని క్రీడలు, కళలు ఇతర కార్యకలాపాలు కావు. ఫలితంగా విద్యార్థులు యాత్రికంగా తయారవుతు న్నారు. వీరి మెదళ్లలో ర్యాంకులు తప్ప మరే ఇతర అంశాలకు స్థానం లేదు. ప్రైవేటు పాఠశాల ల పోటీకి తట్టుకోలేక, ప్రభుత్వ పాఠశాలలు కూడా ర్యాంకుల బాటనే పడుతున్నాయి. కానీ ఈ ర్యాంకుల ‘పిచ్చి’కి ఒక దిశ, దశ వుండటంలేదు. విద్యార్థి మానసిక సామర్థ్యం, అతనిలోని నైపు ణ్యాలు, ఆసక్తుల గురించి పట్టించుకునే నాధుడే లేదు. ఒక్కటే లక్ష్యం! ఇంజినీర్‌ లేదా డాక్టర్‌!! మరి దీనికి అంతం ఎక్కడ? పరిష్కారం లభించేనా?

మున్సిపాలిటీ ఉద్యోగస్తులను ప్రశంసించిన కమిషనర్.

జమ్మికుంట మున్సిపాలిటీ ఉద్యోగస్తులను ప్రశంసించిన కమిషనర్ ఎండి ఆయాజ్
జమ్మికుంట: నేటిధాత్రి

 

జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రాపర్టీ టాక్స్ 100% వసూల్ చేశారని రాష్ట్రస్థాయిలో 139 మున్సిపాలిటీల కంటే ముందంజలో జమ్మికుంట మున్సిపాలిటీ ఉందని కమిషనర్ ఎండి ఆజాద్ కూ ప్రశంస పత్రాన్ని అందజేశారు ఇట్టి ప్రశంసా పత్రం నాకు రావడానికిఇట్టి నా తోటి ఉద్యోగస్తులే కారణమని ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా సిద్దూరి సంపత్ రావు,కడెం ఉపేందర్, మొగిలి అలియాస్ (గోవిందా) ప్రవీణ్ రెడ్డి ఈ నలుగురు నాలుగు పిల్లర్లు లాగా నిలబడి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి సపోర్ట్ గా నిలబడి ఈ వసూల్ కార్యక్రమంలో వారి వంతు వారు కృషి చేశారని ప్రశంసించి అందులో భాగంగా సిద్దూరి సంపత్ రావును బెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద ప్రశంస పత్రాన్ని అందజేస్తూ శాలువాతో సన్మానించారు తోటి ఉద్యోగస్తులు అందరికీ కూడా అభినందనలు  తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version