చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

90 శాతం మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి:

 

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు ఇస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసంగి సీజన్ లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ముందస్తుగానే ప్రణాళిక చేసి సాగు నీటిని విడుదల చేసి గుంట భూమి కూడా ఎండిపోకుండా సాగునీరు అందించాము. తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్న వడ్లకు రూ.500 చెల్లిస్తున్నాము.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేసంగి సీజన్లో భూమికి బరువైనన్ని వడ్లు వచ్చాయి.
ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెలువెత్తుందని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావొద్దు, కొనుగోలు కేంద్రాలకు రైతును తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,రామిడి రాజిరెడ్డి,సత్తు కనుకయ్య ,గుజ్జుల బాపురెడ్డి, గడ్డం అంజయ్య, రోమల రమేష్, దోమకొండ మహేష్, దోర్నాల శ్రీనివాసరెడ్డి,రాజ గోపాల్ రెడ్డి ,కర్ర బాపు రెడ్డి, తోట సంధ్య ,రెండ్ల శ్రీనివాస్, తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

వడగళ్ళ వాన తో దెబ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ని జీలకుంట పోత్కపల్లి శానగొండ బయమ్మపల్లి ఇందుర్తి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ళ వాన ప్రభావం తో నష్ట పోయిన వరి మొక్కజన్న పంటలను సమీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి మాట్లాడుతూ
రైతులు ఆరుకాలం కష్టపడి పoడించిన పంట అకాల వర్షం తో నేలపాలు కావడం జరిగింది పంట చేతికి వచ్చే దశలో ఈవిదంగా వర్షం పడి రైతుల పొట్టకొట్టిననట్టు కావడం దురదృష్టకారం అన్నారు తక్షణమే నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలనివారు డిమాండ్ చేసారు మండలం లోని AO మరియు AEO తో మాట్లాడిన సంజీవ రెడ్డి దాదాపు 500 వందల ఎకరాల్లో పంట నష్ట జరిగిందని ఈ యొక్క వడగళ్ళ వానతో సీడ్ పంటలు వేసినటువంటి రైతులకు ఆదిలాబాద్ జిల్లా లో సీడ్ ఆర్గనైజర్స్ ఎకరానికి యాభై వెల రూపాయలు ఇస్తున్న విదంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం తోపాటు అన్నీ మండలాల్లో ఇవ్వాలని కోరడమైనది. లోకల్ వరిపంటలు ఇంకా చాలా రకాల పంటలు దెబ్బతినడం జరిగిందని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల వివరాలు సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపి వారికీ నష్ట పరిహారం వచ్చే విదంగా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది రైతుల పంటలు కోసి కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూస్తున్నారని ఇంకా ఐకేపీ సెంటర్ లు ప్రారంభం చేయలేదని కాబట్టి వెంటనే ఐకేపీ సెంటర్ లో ఓపెన్ చేసి వడ్ల కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు.
ఈకార్యక్రమంలో లో బీజేపీ నాయకులు దాత రాకేష్ పటేల్ ఎర్రవెల్లి అనిల్ రావు, పుల్లూరి పృథ్వి రాజ్,చర్లపల్లి రాజు,తజ్ ఉద్దీన్,పుల్ల సదయ్య,భూషణవేణి సత్యం, రవీందర్, బిక్షపతి, రమేష్,నరసింహ చారి, భాస్కర్ రెడ్డి,అగ్గి శ్రీనివాస్,కుక్కల మహేందర్,మధునయ్య,ఐలయ్య,పులి కొమురయ్య,మీడుదూల రాజు,రాజా మనోహర్,సతీష్,వినయ్,సాయి కృష్ణ, అనిల్,తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రంలోపోషణ జాతర.

మండల కేంద్రంలోపోషణ జాతర

ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలోని సంఘం భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టాలి. పౌష్టిక ఆహారం వైవిద్యం. పరిశుభ్రత,, తల్లిపాలు బిడ్డకు సురక్షత అని ఆమె అన్నారు, అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి మాట్లాడుతూ కిషోర్ బాలికలకు ఐరన్ ఒక్క ప్రాముఖ్యత, మిల్లెట్స్ మరియు గిరిజన సంప్రదాయ ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతులు, చిరుధాన్యాలు కొర్రలు, సామలు, హారికలు, ఊదలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు రోజువారి తినే ఆహారంలో తీసుకోవాలి అని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎమ్ లు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు, బాలింతలు, గర్భిణీలు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

 

*వనపర్తి పట్టణములో పాత బజార్ 4వ వార్డ్ లో దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్టలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు
దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి అమ్మవారికి వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలతో రైతులు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు
అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు అడిగిన వెంటనే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆర్థిక సహాయం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు
తిరుమల మహేష్ విగ్రహ ప్రతిష్ట కు ఆర్థిక ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ తిరుమల మహేష్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ నాయకులు ఓ బీ సీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ మాజీ మున్సిపల్ వై
స్ చైర్మన్ బి కృష్ణ కృష్ణ నందిమల్ల శ్యామ్ పాషానాయక్ పరుశురాం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య టీ పీ సీ సీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు

గురుకుల పాఠశాల విద్యార్థులను.!

గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన కూన గోవర్ధన్
మెట్ పల్లి ఏప్రిల్ 16

నేటి ధాత్రి

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల విద్యార్థులను పారమర్శించిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్
కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన విద్యార్ధులను వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలని సూచించారు. అనంతరం హాస్పిటల్ ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ,కోరుట్ల పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు షైక్ అమీర్,కోరుట్ల పట్టణ మైనర్టీ ప్రధాన కార్యదర్శి యండి ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.

3వరోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు.

3వరోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు

ఆసుపత్రిలలో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలి

పరకాల ఫైర్ అధికారి వక్కల భద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని లలితా నర్సింగ్ హోంలో బుధవారం రోజున ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో 3వరోజు వారోత్సవాలు నిర్వహించారు.హాస్పటల్ సిబ్బంది,డాక్టర్లు,చిత్స నిమిత్తం వచ్చిన వారికి అగ్ని ప్రమాదాల నివారణకు తగుచర్యల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా అధికారి భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని హాస్పిటల్ యాజమాన్యం అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలుకువలు సిబ్బందికి తెలిపారు.కరపత్రాలను హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేశారు.ప్రమాదాలను నివారించెందుకు హాస్పటల్ లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో చారి,డ్రైవర్ సురేష్ ,శ్రీకాంత్,అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.

గాలి వాన బీభత్సం నేల వాలిన పంటలు.

గాలి వాన బీభత్సం.. నేల వాలిన పంటలు

అకాల వర్షం రైతన్నల పాలిట శాపం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్రనష్టం వాటిళ్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల పరిధిలో రాత్రి సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించే లాగా విపరీతమైన ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.

Farmers

 

 

దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుము లు మెరుపులతో ఎడతెగని గాలి,వాన కురిసింది. పలు గ్రామాల్లో ఈదురుగాలుల కారణంగా రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మొక్కజొన్న, వరి పంటలు తడిచి ముద్దయిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావిం చిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశ లు చేసింది. ఏదై ఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు.

ప్రభుత్వమే ఆదుకోవాలి రైతన్నల ఆవేదన

మూసికె అశోక్ శాయంపేట రైతు

 

శాంపేట మండలంలో మంగళవారం రాత్రిపూట వర్షానికి రైతులు చాలు చేసిన మొక్కజొన్న పంట అరటి చెట్లు పూర్తిగా నేలకొరిగింది. మండలంలోని ముష్క అశోక్ మూడు ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేశారు మంగళవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి పంట అంతా నేలకొరిగింది దీంతో రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవన పంటలలలో అరటి చెట్లు గాలివాన బీభత్సానికి నెలకు వాలింది. కూతురు రాజు, కోల మల్లయ్య, కోల చక్రపాణి, గాదె చిరంజీవి, కురాకుల ప్రశాంత్ 10 ఎకరాల నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్ష పాలవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Farmers

వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

శాయంపేట మండల వ్యవసాయ అధికారి గంగా జమున ఆదేశాల మేరకు మండల పరిధిలోని మైలారం, పెద్దకోడేపాక, కొప్పుల, పత్తిపాక, హుస్సేన్ పల్లి, శాయంపేట, గట్లకానిపర్తి, తహరాపూర్, కొత్తగట్టు సింగారం గ్రామాలలో మంగళ వారం రాత్రి గాలివానకు దెబ్బతిన్న పంటలను అర్చన, అన్వేషు, రాకేష్ ఏ ఈ ఓ లు ఉబ్ సందర్శించడం జరిగింది. అందులో మొత్తం 245మంది రైతుల వరి చేను 347ఎకరా లు,38మంది రైతుల 57ఎ కరాల మొక్కజొన్న,15మంది రైతుల 30ఎకరాలు అరటి తోట దెబ్బతిన్నాయి.

నీళ్ల కోసం రోడ్డెక్కిన కార్మికుల కుటుంబాలు.

నీళ్ల కోసం రోడ్డెక్కిన కార్మికుల కుటుంబాలు

రోడ్డు దిగ్బంధం,రోడ్డుపై బైఠాయించి ధర్నా

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లో గత కొన్ని రోజుల నుండి నీటి సమస్యతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పట్టించుకోకపోవడం వల్ల బుధవారం గోలేటి నాలుగు స్తంభాల చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.మూడు రోజులలో నీటి సమస్య పరిష్కారం చేయకపోతే జిఎం కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్మిక కుటుంబాలు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఓటు జిఎం రాయమల్లు,సివిల్ డివై జిఎం భాష సింగరేణి అధికారులు రెండు రోజులలో నీటి సమస్య పరిష్కరిస్తామని కార్మిక కుటుంబాలకు హామీ ఇచ్చారు.

తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన.!

తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన ఏఎంసి చైర్మన్ రాజిరెడ్డి

 

పరకాల నేటిధాత్రి

పట్టణంలో నిన్న అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని బుధవారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా రైతులతో మాట్లాడుతూ ధాన్యాన్ని పరిశీలించి మీరు అధైర్యపడకూడదని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని రైతులకు దైర్యం చెప్పి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వంచే కొనుగోలు చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ సహాయం అందేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

దేశవ్యాప్తంగా బిసి కుల గణన చేపట్టాలి.

దేశవ్యాప్తంగా బిసి కుల గణన చేపట్టాలి

పాదయాత్ర చేపట్టిన జాతీయ బిసి హక్కుల పోరాట సమితి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల పట్టణంలోని ఐ.బి.చౌరస్తా నుండి హాజీపూర్ మండల కేంద్రం వరకు జాతీయ బిసి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం పాదయాత్ర చేపట్టారు.దేశవ్యాప్త బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జన గణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయి.కుల గణన చేరిస్తే అదనంగా ఒక కాలం మాత్రమే చేరుతుంది.దీనికి రూపాయి కూడా ఖర్చు కాదు ఒక కాలం చేర్చడానికి వెనుకాడుతున్న కేంద్రపాలకులు ఈ దేశంలో ఉన్న 85 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తారని అడుగుతున్నాం.జనగణలో కుల గణన భాగం చేస్తే విద్యా ఉద్యోగాలతో పాటు ప్రస్తుతం స్థానిక సంస్థలలో కొనసాగుతున్న రిజర్వేషన్ పెంచాల్సి వస్తదని కేంద్ర పాలకులు భావిస్తున్నారు. అలాగే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నారు. అలాగే బీసీ కుల గణన అనుకూలంగా దేశంలో గుర్తింపు పొందిన 27 రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నాయి.పది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ బీసీ కుల గణన చేపట్టకపోవడం అంటే ఇది బీసీల వివక్షగా భావిస్తున్నాం. పది సంవత్సరాల క్రితమే మేము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని చెప్పిన బిజెపి మోసం చేసింది అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా బిసి కులగణనకు శ్రీకారం చుడతామని చెప్పి మోసం చేసిన ఘనత బిజెపికి దక్కింది.ఇప్పటికైనా బీసీల న్యాయమైన డిమాండ్,బీసీల ఉద్యమ ఆకాంక్ష బీసీలకు రావాల్సినటువంటి ప్రజాస్వామ్యవాట ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో ఈ అంశాన్ని తీసుకెళ్లి బీసీ సమాజం ముందు బిజెపిని దోషిగా నిలబెట్టక తప్పదని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, డాక్టర్ రఘునందన్, నాయకులు శాఖ పురి భీమ్ సేన్,శ్రీపతి రాములు,పెండ్లి రాములు,ఆరెందుల రాజేశం, అంకం సతీష్ ,పంపరి వేణుగోపాల్,బండా సతీష్ అందే సంతోష్,చెలిమెల అంజన్న,భీమ్ రావు,సూర్ల శంకర్,ఎల్లాపుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

మాజీ జెడ్పి చైర్మన్ సీతదయాకర్.!

మాజీ జెడ్పి చైర్మన్ సీతదయాకర్ ను సన్మానము చేసిన ఐక్యవేదిక అధ్యక్షులు
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా
ఆత్మకూరు శ్రీ షిర్డీ సాయిబాబా మందిర రోజుతోత్సవ వేడుకల్లో ఐక్యవేడిక జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు ఆత్మ కూ ర్ షిర్డీసాయి బాబా దేవాలయం
కమిటీ మెంబర్ గా వ్యవహరించిన సతీష్ యాదవ్ అక్కడి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రజతోత్సవ వేడుకల్లో పాల్గొని వనపర్తి జిల్లా ప్రజలు బాగుండాలని శ్రీ షిర్డీ సాయి భగవాన్ ను వేడుకున్నారు ఆనంతరం మాజీ జెడ్పి చైర్మన్, చైర్మన్,సీతా దయాకర్ రెడ్డి ని సతీష్ యాదవ్ సన్మానించారు

నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి ఏ వన్, ఏ టూ గా కేసులు నమోదు చేయడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడిన పిరికిపంద చర్యగా భావిస్తూ ఖండిస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ ఆదేశానుసారం, టీపీసీసీ పిలుపు మేరకు క్యాతనపల్లి మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం చరిష్మా ను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత పదేళ్లుగా ఇదే కేసు విచారణలో ఉన్నప్పటికీ ఇందులో ఎటువంటి అవినీతి, అక్రమంగా సంపాదించిన సంపత్తి ఉందన్న నిబంధనలపై నిర్థారణ లేదని ఇప్పటికే పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని బహిరంగంగా ప్రజల దృష్టికి తీసుకువస్తామనీ చట్టపరంగా, రాజకీయంగా దీనికి గట్టి ఎదురుదెబ్బ ఇస్తామనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్, మాజీ వార్డు సభ్యులు ఉప్పులపు సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్ , గాండ్ల సమ్మయ్య, బుడిగె శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, బంగారు ప్రసాద్, ఎర్రబెల్లి రాజేష్, బింగి శివకిరణ్, రాజేశం, గండి కుమార్ మహిళా నాయకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ మండలానికి చామనపల్లి.!

కరీంనగర్ మండలానికి చామనపల్లి చోక్కారావు పేరును నామకరణం చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎంతోమంది నిరుపేదల ఆరాధ్య దైవం చామనపల్లి గ్రామానికి చెందిన చోక్కరావు పేరును కరీంనగర్ మండలానికి నామకరణం చేసి ఆయన చరిత్రను ప్రజలకు తెలియజేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కోరారు. బుధవారం రోజున సిపిఐ కరీంనగర్ మండల ఎనిమిదవ మహాసభ మండల కార్యదర్శి సాయవేని రాయమల్లు అధ్యక్షతన జరిగింది. మహాసభ సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈసందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ కరీంనగర్ మండలమే కాకుండా జిల్లాలోని ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల కోసం భూమి లేని నిరుపేదల కోసం అనేక ఉద్యమాలు చేసి తన ప్రాణాన్ని పార్టీకి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి చామనపల్లి చోక్కారావు ఈగ్రామంలో పుట్టడం ప్రజల అదృష్టమని ఆయన కొనియాడారు. చోక్కారావు నేటి యువతకు, విద్యార్థులకు ఆదర్శనీయవంతుడని ఆయన లాంటి నేత ఈప్రాంతంలో ప్రాంత ప్రజలను నిజాం రజాకార్ల చెర నుండి రక్షించాడని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందని పేదవారికి కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో ఉద్యమిస్తుందని తెలిపారు. పేద ప్రజల కోసం అనునిత్యం పోరాడే పార్టీ సిపిఐ అని తిండి లేని వారికి అండదండగా ఉంటూ ఇంటి స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం, నీటి సౌకర్యం, భూమికోసం అనేక పోరాటాలు చేసి వందల మంది కార్యకర్తలను జైలు పాలయ్యారని అలాంటి త్యాగం చేసిన పార్టీ దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీయేనని పేర్కొన్నారు. ఇప్పటికీ దేశంలో పేదవాడు పేదవాడి గానే ఉన్నవాడు ఉన్నవాడిగానే మిగిలిపోయారని కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకే ఊడిగం చేస్తుందని, మతం పేరా మారణ హోమం సృష్టించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తెలంగాణ పట్ల వివక్షత చూపుతుందని కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్న తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వo పేద ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమండల మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు నలవాల సదానందం, మాజీ సర్పంచ్ ఐలయ్య, మండల కౌన్సిల్ సభ్యులు మెరుగు కొమరయ్య, ఇరుకుల్ల బాబు, తోట ఆంజనేయులు, బుర్ర రాజయ్య, కాశ వేణి సతీష్, నెల్లి రవీందర్, బుర్ర కుమారస్వామి, రాములు, నాంపల్లి, సత్తయ్య, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన.!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరునికి ఉంది

కొత్తగూడ, నేటిధాత్రి:

 

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు…
ములుగు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు
వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వారి నేతృత్వంలో కొత్తగూడ మండలంలోని బుధవారం రోజు తాటి వారి వేంపల్లి.
మాసంపల్లి తండా.
గోపాలపురం కార్లయి గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు
అహింస శాంతి సిద్ధాంతాలను కాపాడుకోవాల్సిందుకే ఏఐసీసీ ఉద్యమ కార్యచరణ రూపొందించిందని బిజెపి తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల ఇన్చార్జి బానోత్ రూఫ్ సింగ్ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టారు
ప్రతి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండలాల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటికి భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య.
చల్ల నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు.
లావణ్య వెంకన్న జిల్లా నాయకులు.
బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి.
ఇర్ప రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కాడబోయిన జంపయ్య వైస్ఎంపీపీ.
బొల్లు రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
కాయితోజు ఉపేంద్ర చారి బ్లాక్ కమిటీ నాయకులు. నోముల ప్రశాంత్ జిల్లా యూత్ నాయకులు. కే దాసు ప్రసాద్ క్లస్టర్. తాటి వారి వేంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షురాలు తాటి వసంత.
కార్లయి గ్రామ కమిటీ అధ్యక్షులు ఇర్ఫ వెంకన్న.మాసంపల్లి తండా గూగుల్ భీమా. గోపాలపురం అధ్యక్షులు సుధాకర్ శ్రీను. తాటి వారి వేంపల్లి సోలం వెంకన్న కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల పార్టీ అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బిఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి రాజా రమేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా రమేష్ అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలో సభకు సంబంధించి కేసీఆర్ వాల్ రైటింగ్ తో ప్రజలను, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.అనంతరం రాజా రమేష్ మాట్లాడుతూ..

BRS Silver Jubilee Celebration

మున్సిపాలిటీలోని 14,15,17,18,20 వార్డు లలో వాల్ పోస్టర్లను అంటించడం అంటించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,ఆలుగుల సత్తయ్య,మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,బోయినపల్లి అనిల్ రావు,రేవెల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపల్లి తిరుపతి,గడ్డం రాజు, చంద్రమౌళి, లక్ష్మారెడ్డి,రంగరాజు,పైతారి ఓదెలు,మేకల రమేష్,వేనంక శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్,ఆశనవేణి సత్యనారాయణ,టైలర్ రాజు,చంద్ర కిరణ్,కుర్మ దినేష్,దేవి సాయి కృష్ణ, శివ,మణి, గోనె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఆర్డీఓ కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించారు.

సీనియర్ సిటిజన్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ జనపాల శంకరయ్య కార్యనిర్వహణలో 2007 తల్లిదండ్రుల మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2011 లోని ముఖ్య అంశములను సెక్షన్ల వారిగా తెలుగు భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అనువదించిన వాల్ పోస్టర్లను జిల్లా ఎస్పీ, మహేష్.బి.గితే ఐ.పి.ఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ చట్టం ప్రకారం సామాన్యులకు కూడా చట్టంలోని అంశములు తెలిసి ఫిర్యాదు చేయుటకు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటుంది అని తెలిపారు. మరియు ఎస్పీ అనుమతితో ఆఫీసు ముందర పోస్టర్ను అతికించడం జరిగినది. అత్యధికంగా ప్రజలు తిరిగే ఆర్డిఓ. కార్యాలయంలో వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది. సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి అనుమతితో అక్కడ కూడా వాల్ పోస్టర్లు అతికించడం జరిగినది తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ సంఘ సభ్యులు, దొంత దేవదాసు, సహాయ కార్యదర్శులు , అంకారపు జ్ఞానోబా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

*ఎమ్మెల్యేకు పలువురి వినతి..

*ఎమ్మెల్యేకు పలువురి వినతి..

పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 16:

 

 

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి విన్నవించారు. తొలుత పలమనేరు ఫుట్ వేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పట్టణం నందు మొత్తం 42 దుకాణాలు ఉన్నాయని అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల వల్ల తమ తీవ్రంగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఫుట్ పాతులపై విక్రయాలు జరుగుతుండడంతో తామ తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికే ఆన్లైన్ బిజినెస్ ద్వారా తమ వ్యాపారాలు 50 శాతానికి పడిపోయాయని ఇతర ప్రాంతాల వారితో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి పట్టణానికి దూరంగా వారు వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ రుణాలను అందించి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జగా, జాకీర్ రాఘవేంద్ర, కాలేషా తదితరులున్నారు.

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి…

వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చొరవ చూపాలని వీఆర్ఏల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల పై నిబంధనలకు విరుద్ధంగా మోపిన నైట్ డ్యూటీలు, ఇసుక,రైస్ మిల్లుల వద్ద డ్యూటీలు వెంటనే నిలిపివేయాలని కోరారు. తెలంగాణలో ఇస్తున్నట్లు వీఆర్ఏలు అందరికీ పేస్ కేల్ జీతాలు చెల్లించాలని, డీఏను జీవితంలో కలపాలన్నారు. గతంలో వైసిపి పాలనలో రికవరీ చేసిన డి ఏ నగదును తిరిగి చెల్లించాలని ఇంటర్మీడియట్ విద్యా అర్హతల ఆధారంగా ప్రమోషన్లు అమలు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీఆర్ఏల సంఘ నాయకులుతో పాటు, కార్మిక సంఘ నాయకులు ఓబుల్ రాజు పాల్గొన్నారు.

స్థానిక సమస్యలపై పర్యటించిన కార్పొరేటర్.

స్థానిక సమస్యలపై పర్యటించిన కార్పొరేటర్.

వాటర్ సరఫరా విషయంలో సమస్యలు తెలియచేయాలి.

స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్

నేటిధాత్రి, కాశిబుగ్గ

 

 

వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ కాలనీకు సంబంధించిన శానిటేషన్ మరియు వాటర్ సరఫరా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ కీర్తి నగర్ లో పర్యటించడం జరిగింది.మున్సిపల్ వాటర్ మెన్ మరియు మున్సిపల్ శానిటరీ జవాన్ లకు పలు సూచనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని వాటర్ సప్లయ్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ముందస్తుగా తెలియజేయాలని కోరారు. ముందస్తు సమాచారం ఇవ్వడం వల్ల సమస్య తొందరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.అనంతరం కాలనీ లో ఏపుగా పెరిగిన తుమ్మ చెట్లు మరియు పిచ్చి చెట్లను జెసిబి సహాయంతో తొలగించే పనులను పరిశీలించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

DR.BR Ambedkar

మల్లాపూర్ ఏప్రిల్ 16 నేటి ధాత్రి.

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన వాటిని బేకాతరు చేస్తూ మండల మరియు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అధికారికంగా చేయవలసిన అప్పటి కూడా కనీసం గ్రామాలలో కూడా రాలేదు జయంతి ఉత్సవాలను చేయలేదు.

 

Jayanti Celebrations

దాదాపు 14 గ్రామాలలో కార్యదర్శులు కార్యక్రమాలు నిర్వహించలేదు అని ఉన్న సమాచారం. మరియు మండల అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఎందుకు వివక్షత, దళితులు అంటే ఎందుకు చిన్న చూపు ఈ ఆదేశాలలో దళిత ఆర్గనైజేషన్లను కలుపుకొని కార్యక్రమాలు చేయాలని కలెక్టర్ మెన్షన్ చేసి ఉన్నప్పటి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి 14 గ్రామాలలో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించని కార్యదర్శిలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

 

Jayanti Celebrations

లేనిచో మండల కేంద్రంలో నిరసనలు చేపడుతాం రాష్ట్ర ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేస్తాం. మన మండలంలో 23 గ్రామాలు ఉంటే దాదాపు 14 గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు జయంతి రోజు కనీసం గ్రామాలకు కూడా రాలేదు. మండల ఆఫీసులో చేసిన కార్యక్రమంలో ఎంపీడీవో కూడా పాల్గొనలేదు. ఎప్పుడో ఈ విషయంపై కంప్లైంట్ చేయడానికి వెళితే అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని చెత్తబుట్టల పక్కన పెట్టడం జరిగింది. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయం కలెక్టర్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

22న పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ప్రారంభం

22న పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ప్రారంభం

 

పరకాల నేటిధాత్రి

పట్టణంలో ఏప్రిల్ 22 న పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ను ప్రారంభిస్తున్నట్టు టోర్నమెంట్ ఆర్గనైజర్ లు చిన్ను,లడ్డు,సిద్దు లు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మొదటి బహుమతి 20116,రెండవ బహుమతి 10,116లు అందిస్తున్నట్లు ఆటలో టీం పేర్లను నమోదు చేసుకోవడానికి ఎంట్రీ ఫీజ్ 1200 చెల్లించి నమోదు చేసుకోవాలని ఎంపెయిర్లదే తుదినిర్ణయమని మ్యాచ్ కి 10 ఓవర్లు నిర్ణయించామని,స్థానికంగా ఉన్న ప్రేయర్ లు మాత్రమే జట్టులో ఆదించడానికి అవకాశం ఉన్నదని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version