కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన.!

కోహిర్ మండల్లో భారీ వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా మామిడి పంటకు భారీ నష్టం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కోహిర్ మండల్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని గ్రామాలను భారీ వర్షం మరియు వడగళ్ల వాన ముంచెత్తింది, దీనితో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందారు. మరోవైపు, చెరకు, టమటా, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో రైతులు, మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మరియు గురువారం సాయంత్రం, అకస్మాత్తుగా భారీ వర్షం మరియు బలమైన గాలులతో కూడిన వడగళ్ళు పడ్డాయి, దీని ఫలితంగా పీడ్ కమల్, బిలాల్ పూర్, మన్యార్ పల్లి మరియు బేడంపేట్ గ్రామాలలో భారీ వడగళ్ళు పడటంతో నేలపై మంచు పలక కనిపించింది మరియు మామిడి తోటలలోని మామిడి చెట్ల కింద అనేక టన్నుల మామిడి కాయలు పడి ఉన్నాయి. మరియు మామిడి వ్యాపారులతో మాట్లాడినప్పుడు, వారు మిలియన్ల నష్టాలను నివేదించారు మరియు వర్షం మరియు వడగళ్ల వాన కారణంగా సంభవించిన నష్టాన్ని మరమ్మతు చేయడానికి లేదా భర్తీ చేయడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం సిఫార్సు చేయాలని వ్యవసాయం మరియు ఉద్యానవన శాఖ, కోహిర్ మండల్ అధికారులు మరియు సీనియర్ అధికారులను కోరారు.

శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం.

ఘనంగా శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాల వార్షికోత్సవం

 

వరంగల్ నేటిధాత్రి

 

వరంగల్ హెడ్ పోస్టాఫీసు వద్ద ఉన్న శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ సానబోయిన సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నవల నాటక సినిమా కథ రచయిత డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జిగిలి గోస, అనగనగా ఒక కోడి పెట్ట, వీటిపై అనర్గళంగా మాట్లాడారు.

College

తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలుగు భాష యొక్క ప్రాచుర్యం పెంచుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని, మనమందరం తెలుగు భాషను ప్రోత్సహించాలని మన పిల్లలకు తెలుగు భాష మాట్లాడించాలని, మనమందరం మానవ విలువలను పెంపొందించే విధంగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్మెంట్ బిఓఎస్ డాక్టర్ మంతిని శంకరయ్య, కళాశాల అధ్యాపకులు పరశురాం జయకృష్ణ, మేకల లింగమూర్తి, శ్రీధర్ల కుమారస్వామి, శెట్టి దేవరాజు, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

శ్రీప్రగతిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ ప్రగతి హై స్కూల్ లో యుకేజి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అంబాటి వేణుకుమార్ హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈకార్యక్రమంలో నూట ముప్పై ఎనిమిది మంది యుకేజి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్లలో తమ తల్లిదండ్రుల సమక్షంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల చైర్మన్ అన్నదానం రాధాకృష్ణ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో వారి అనుభవాలను పంచుకున్నారు.

Graduation Day

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముచ్చర్ల మునీందర్ రెడ్డి, డైరెక్టర్ బేతి భూమయ్య, అట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల ఇన్చార్జులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత..

నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత

కీరాణం దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం.

మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు.

వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్..

నేటిధాత్రి నర్సంపేట:

 

 

నర్సంపేట పట్టణంలో భారీ ఎత్తున నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,59,000 విలువగల అంబర్ గుట్కాలుగా అంచనా వేశారు. నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డుకు గల మణికంఠ కిరాణం దుకాణంపై పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిషేధిత అక్రమ అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకొని కిరాణం షాపు యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఏసీబీ మధుసూదన్, సీఐ శ్రీధర్ తెలిపారు.

పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి.

పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామ శివారులో గురువారము సాయంత్రం 3:30 పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి. కుప్పా నగర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప.తనకున్న మేకలను మేత కోసం గ్రామ పంట పొలాల్లోకి తోలుకు వెళ్లాడు. ఉరుములు మెరుపులు మొదలు కావడంతో ఓ చెట్టు కిందికి వాటిని నిలిపి.ఒక్కసారిగా పిడుగుపడడంతో.మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు… పిడుగుపాటుకు మేకలు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప కు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్థులు కోరారు.
మేకలు మృతి చెందిన వార్త విన్న వెంటనే కుప్పా నగర్ గ్రామ సెక్రెటరీ స్వప్న ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు ఝరాసంగం మండల ఎంఆర్ఓ తిరుపతి రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు ఝరాసంగం సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ రైతులు పాల్గొన్నారు

ఉమ్మడి పౌరచట్టంతో అందరికీ సమన్యాయం

`ఓటు బ్యాంకు రాజకీయాల్లో చిక్కుకున్న చట్టం

`రెండు రాష్ట్రాల్లో యూసీసీ అమలు

`యూసీసీ అమలయితే మహిళలకు న్యాయం

`పురుషాధిక్య సమాజం చెరలో యూసీసీ చట్టం

`ఓట్లకోసం వ్యతిరేకిస్తున్న విపక్షాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేశంలోని పౌరులందరికి మతంతో సంబంధం లేకుండా ఉమ్మడి పౌరచట్టం తీసుకు రావాలన్న ప్రస్తుత ఎన్‌.డి.ఎ. ప్రభుత్వ యత్నాలు ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. ఇందుకు విభిన్న కారణాలున్నాయి. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతాపార్టీ 1998 మరియు 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. 2019లో నవంబర్‌లో నారాయణ్‌ లాల్‌ పంచారియా అనే సభ్యుడు ప్రైవేటు బిల్లుకింద దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు విపక్ష సభ్యులనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఇందులో కొన్ని సవరణలకోసం బిల్లును ఉపసం హరించక తప్పలేదు. 2020 మార్చిలో కిరోడి లాల్‌ మీనా రెండోసారి ఈ బిల్లును తీసుకు వచ్చినా, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదు. ఇదేసమయంలో ఉమ్మడి పౌర చట్టం (యూసీసీ)కి ఒక ఉన్నతస్థాయి కమిటీని లేదా జ్యుడిషియల్‌ కమిషన్‌ను నియమించి, మూడు నెలల్లోగా ముసాయిదారూపొందించేలా, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఢల్లీి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 2021ఏప్రిల్‌లో ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు బదిలీచేయాలన్న అభ్యర్థన మళ్లీ ఇదే కోర్టులో దాఖ లైంది. అయితే అటువంటి కమిటీ రూపొందించిన ముసాయిదాను వెబ్‌సైట్‌లో వుంచి దీనిపై విస్తృత చర్చ జరిగేందుకు వీలుగా 60రోజుల సమయం ఇచ్చేలా చూడాలని కూడా ఈ పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఇదిలావుండగా 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా బీజేపీ ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని చేర్చింది. ఈ ఎన్నికల్లో 2/3వ వంతు మెజారిటీ రాకపోవడంతో దీ న్ని అమలు చేయలేకపోయింది. ఇదే సమయంలో విపక్షాలు యూసీసీని అమల్లోకి తేవడానికి ఎంతమాత్రం అంగీకరించడంలేదు. వీటితోపాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా దీన్ని వ్యతిరేకి స్తున్నాయి. ది నాగాలాండ్‌ ట్రాన్ప్‌పరెన్సీ, పబ్లిక్‌ రైట్స్‌ అడ్వకెసీ అండ్‌ డైరెక్ట్‌ యాక్షన్‌ సంస్థ కూడా యూసీసీ అమలును వ్యతిరేకించింది. ముఖ్యంగా స్థానిక గిరిజన తెగల సంప్రదాయాలకు ఇది విఘాతం కలిగిస్తుంది కనుక అమలు చేయకపోవడమే మంచిదని పేర్కొంది. మేఘాలయ కు చెందిన హైన్యూట్రెప్‌ యూత్‌ కౌన్సిల్‌ కూడా ఈ చట్టం అమలు చేయకూడదని లా కమిషన్‌ కు విజ్ఞప్తి చేస్తామని ప్రకటించింది. 

ఎందుకింత వ్యతిరేకత?

ప్రస్తుతం దేశంలో వివిధ వర్గాలకు వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. వీటిల్లో ఒకదానికొకటి ఎంతమాత్రం సంబంధం లేదు. ఒకవేళ యూసీసీ అమల్లోకి వస్తే హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, ఇండియన్‌ క్రిస్టియన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌, ఇండియన్‌ డైవోర్స్‌ యాక్ట్‌, పార్సీ మ్యారేజ్‌ అండ్‌ డైవోర్స్‌ యాక్ట్‌లతో పాటు, కేవలం మతగ్రంథాల ఆధారంగా అమలు చేసే షరియా చట్టాలు (ఇస్లామిక్‌ చట్టాలు) రద్దవుతాయి. యుసీసీలో ప్రధానంగా బహుభార్యాత్వం రద్దు, కొడుకు, కుమార్తెకు వంశపారంపర్య ఆస్తులపై సమానహక్కు, లింగవివక్షకు తావులేకుండా, మతంతో సంబంధంలేకుండా ఈ చట్టంలో నిబంధనలను పొందుపరచారు. దాతృత్వం, దైవత్వం, సంరక్షణ, పిల్లల బాధ్యతను పంచుకోవడం వంటి అనేక వర్తమానకాలానికి అనుగుణమైన నిబంధనలను ఈ చట్టంలో చేర్చారు. అయితే దేశంలో 21వ శతాబ్దంలో ఈ చట్టం అత్యంత వివాదాస్పదంగా మారడానికి ప్రధాన కారణం, ‘సెక్యులరిజం’కు సంబంధించినంతవరకు భిన్నాభిప్రా యాలు వ్యక్తం కావడమే. దేశంలోని వివిధ మతాలు, కులాలకు, వర్గాలు అనుసరించే సంప్రదాయాలు, కట్టుబాట్లలోని వైవిధ్యతే ఈ చట్టం అమలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. 

సెక్యులర్‌ మరియు రాజ్యం

భారత్‌ ఒక సెక్యులర్‌ దేశం. ఇక్కడ సెక్యులర్‌ అంటే, మతం, రాజ్యం వేర్వేరు అని అర్థం. దేశంలోని అన్ని మతాలు చట్టముందు సమానమేనన్నది మనదేశ ‘సెక్యులరిజం’ నిర్వచనం. కోర్టులుమతాలను అనుసరించి ఆయా పౌరుల కేసులను విచారిస్తున్నాయి. హిందూ మహిళలకు అనువర్తించే చట్టాలు లింగ సమానత్వం మరియు సెక్యులర్‌పరంగా షరియా చట్టం కింద ముస్లిం వ హిళలకంటే ఆధునిక రీతిలో వుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మహిళా హక్కుల సంఘాలు ఉమ్మడి పౌరసత్వం చట్టం మహిళల భద్రత, హక్కులపై ఆధారపడి వుండాలని కోరుతున్నా యి. రాజ్యాంగంలోని 44వ అధికరణం దేశ సమైక్యత, సార్వ భౌమత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి వివిధ వర్గాల్లో అమల్లో ఉన్న చట్టాలను తొలగించి, మహిళలకు సమానత్వం కలిగించేవిగా వుండాలని పేర్కొంటున్నది. ఇందుకోసం ముస్లింల వ్యక్తిగత చట్టాల్లో సంస్కరణలు తీసు కొని రావాలని కోరుతున్న మానవహక్కుల సంఘాలు, ఈ 44వ అధికరణాన్ని ఉదాహరణగా చూపుతున్నాయి. అయితే షరియా చట్టాన్ని ఆమోదిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. తమనుతాము సెక్యులర్‌గా చెప్పుకునే పార్టీలు, కొన్ని మతవర్గాలు కేవలం తమ ఉనికి కోసం మాత్రమే యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. 

రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర చట్టం

ప్రస్తుతం మనదేశంలో గోవా రాష్ట్రంలో ఉమ్మడి సివిల్‌కోడ్‌ అమల్లో వుంది. ఈ కోడ్‌, పోర్చుగీసుపౌరచట్టాలకు అనుగుణంగా వుండటం గమనార్హం. 2024లో ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌర చట్టా న్ని ఆమోదించింది. ఆవిధంగా ఉమ్మడి సివిల్‌కోడ్‌ను అమలుచేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచింది. మనదేశంలో ప్రస్తుతం గోవా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని అమ లు చేస్తున్నాయి. నిజానికి 2015లోనే సుప్రీకోర్టు ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం వున్నదని స్పష్టం చేసింది. విచిత్రమేమంటే 2018లో లా కమిషన్‌, ఉమ్మడి పౌర చట్టాన్ని ఇప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం లేదని తన 185 పేజీల కన్సల్టెన్సీ పేపర్‌లో స్పష్టంచేసింది. ఇదే సమయంలో దేశంలో కొనసాగుతున్న బహుళత్వాన్ని సెక్యులరిజం నిరాకరించజాలదని కూడా స్పష్టం చేసింది. 

ఏది పురోగమనం…ఏది తిరోగమనం?

ఇక యూసీసీని వ్యతిరేకించేవారు,మతం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని వాదిస్తున్నారు. పురోగతి పేరుతో బీజేపీ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నదనేదివారి ప్రధాన ఆరోపణ. అయితే సర్వమత సమానత్వం, మహిళలకు సమానహక్కుల కల్పన ఉమ్మడి పౌర చట్టంద్వారా సాధ్యమవుతుందని బీజేపీ వాదిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి పౌరచట్టం కంటే, లింగవివక్షకు సంబంధించిన చట్టాలను సవరిస్తే సరిపోతుందనేది న్యాయనిపుణులు చెబుతున్న మాట. గృహహింస చట్టం`2005 అన్ని వర్గాల మహిళలకు వర్తిస్తుంది కదా అంటూ ఉదాహరణగా చూపుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కృష్ణమురారి ఉమ్మడి పౌర చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని అమల్లోకి తెచ్చేముందు విస్తృత ప్రాతిపదికన చర్చలు జరగాలని స్పష్టం చేశారు. ఇదిలావుండగా 2024, ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ‘‘ యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ ఆఫ్‌ ఉత్తరాఖండ్‌ యాక్ట్‌`2024’’ పేరుతో బిల్లును ఆమోదించింది. ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదొక చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. అయితే ఈ చట్టం నుంచి గిరిజనులకు మినహాయింపునివ్వడం గమనార్హం.

షాబానో కేసు

నిజానికి హిందూ కోడ్‌ బిల్లు ఆమోదం తర్వాత దేశంలో చట్టాలు రెండు విధాలుగా అమలువు తూ వస్తున్నాయి. మొదటిది భారత పౌరులకు కాగా రెండవది సంస్కరణలకు నోచుకోని ముస్లించట్టాలు. దీని తర్వాత 1985వరకు సెక్యులర్‌ వాదులు, మతపెద్దల మధ్య తరచుగా వచ్చే విభే దాలు, సంఘర్షణలు తగ్గిపోయాయనే చెప్పాలి. 1985లో షాబాను అనే 73ఏళ్ల మహిళ తన భర్త నుంచి భరణం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 40ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఆమె భర్త మహమ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆమెకు మూడుసార్లు తలాఖ్‌ చెప్పి విడాకులివ్వడమే కాదు ఆమెకు భరణం ఇవ్వడానికి నిరాకరించాడు. ముస్లిం షరియా చట్టం ప్రకారం ఇది సమ్మతమేనని స్వయంగా లాయర్‌ ఆయిన ఆయన వాదించారు. 1980లో స్థానిక కోర్టు ఆమెకు భరణం ఇవ్వాలని తీర్పు చెప్పడంతో, ఖాన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు అఖిల భారత నేరన్యాయ చట్టం ప్రకారం మతాలకు అతీతంగా ఆమె భర ణం పొందడానికి అర్హు రాలేనని స్పష్టం చేసింది. అప్పుడే ఉమ్మడి పౌర చట్టాన్ని అమల్లోకి తేవాలని కోర్టు పేర్కొంది. ఇదే క్రిమినల్‌ చట్టం కింద 1979, 1980ల్లో మరో ఇద్దరు ముస్లిం మహిళలు భరణం పొందడం గమనార్హం. 1995లో సరళా ముద్గల్‌ మరియు ఇతరులు వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు వ్యక్తిగత చట్టాలను దుర్వినియోగం చేయరాదని తీర్పు చెప్పింది. 2000లో లిల్లీ థామస్‌ కేసులో కూడా కోర్టు ఇదేమాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2017లో సైరాబాను వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో తలాక్‌`ఇ`బిద్దత్‌ ఒక నిరంకుశ విధానమంటూ స్పష్టం చేసింది. ఇదిలా వుండగా షాబానో కేసు మాత్రందేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత అఖిల భారత ముస్లిం బోర్డు తమ చట్టాలను సమర్థించడమే కాకుండా, ఛాందసవాదులకు మద్దతుగా నిలిచింది. మైనారిటీలపై హిందువుల ఆధిపత్యం కోసమే ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. అంతేకాదు క్రిమినల్‌ లాను ముస్లిం మత పెద్దలు తమ సాంస్కృతిక గుర్తింపును దెబ్బతీసేదిగా పరిగణించడం మొదలుపెట్టారు. ఉమ్మడి పౌర సత్వ చట్టం తీసుకురావాలని న్యాయవ్యవస్థ కోరుతున్నదంటే కేవలం హిందువుల చట్టాలను అందరిపై రుద్దే ఉద్దేశమేనంటూ వారు ఆరోపించారు. ఇక అప్పటినుంచి ముస్లిం బోర్డు తమ చట్టాలకు స్వేచ్ఛను ఇవ్వాలంటూ ఆందోళన మొదలుపెట్టింది. ఈ సమస్య ను అప్పట్లో మీడియా కూడా అతిగా ఫోకస్‌ చేసింది. 

మడమ తిప్పిన కాంగ్రెస్‌

ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌లో ఒక ముస్లిం స్వతంత్ర సభ్యుడు ముస్లిం చట్టాల పరిరక్షణ బిల్లును ప్రవేశపెట్టగా, కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. అయితే లెఫ్ట్‌ పార్టీలు, ముస్లింలలో ఉదారవాదు లు దీన్ని వ్యతిరేకించారు.తర్వాత 1986లో ‘ముస్లిం ఉమెన్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ అండ్‌ డైవోర్స్‌)చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. ఆవిధంగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని 125వ సెక్షన్‌ ముస్లిం మహిళలకు కూడా వర్తింపజేశారు. ఆ తర్వాత మనదేశంలో రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయాయి. కాంగ్రెస్‌, ముస్లిం చాందసవాదులు ఒకవైపు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మరోవైపుగా చీలిపోయారు. ముస్లిం మహిళల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా స్త్రీవాద ఉద్యమాలు దెబ్బతినడం ఓ విచిత్ర పరిణామం!

నిరంకుశత్వం లేదా ప్రజాస్వామ్యం ఒక పరిమితి దాటి వుండకూడదు. ప్రస్తుతం మితిమీరిన ప్రజాస్వామ్యం కారణంగా ప్రజాహిత చట్టాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు కాకుండా పోతు న్నాయి. విశాలహితం కోసం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ప్రజాస్వామ్యం కల్పించాలి. ఉమ్మడి పౌర చట్టానికి ఇన్ని అడ్డంకులు కలిగించడం ద్వారా దేశ జనాభాలో సగం వున్న మహిళలు ఇంకా తీవ్ర వివక్షకు గురికావలసి వస్తోంది. ముఖ్యంగా మతం, సంప్రదాయాల చ ట్రంలో ఇరుక్కుపోయిన వర్గాల మహిళల జీవితాల్లో ఉషోదయ వెలుగులు ఎప్పుడు ప్రసరిస్తా యనేది ప్రశ్నార్థకమే!

రజితోత్సవ సభను విజయవంతం చేయండి..

రజితోత్సవ సభను విజయవంతం చేయండి
– పోస్టర్ ఆవిష్కరణ
– టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి

సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి సిరిసిల్ల తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించంకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా హాజరుకావాలని కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ,మ్యాన రవి, ఎండి సత్తార్, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

ఎటు చూసినా ఆ రోజుల్లో చీకట్లే!

`ఈ రోజు తెలంగాణ అంతటా వెలుగులే!!

`అది కేసీఆర్‌ ఘనత…కేసీఆర్‌ దార్శనికత.

`తెలంగాణ తల రాత మార్చిన దేవుడు కేసీఆర్‌.

`చీకటి నుంచి తెలంగాణను వెలుగులోకి తెచ్చిన సూర్యుడు కేసీఆర్‌.

`తెలంగాణ వచ్చిన కొద్ది రోజుల్లోనే మా కళ్లతో చూసిన ప్రగతిని నమ్మలేనంతగా పరుగులు పెట్టించిన పాలకుడు కేసీఆర్‌ అంటున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు , నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ఆనాటి ఆసక్తికరమైన అంశాలు..దయన్న మాటల్లోనే..

`సభల నిర్వహణలో చరిత్రలు సృష్టించాలన్నా, ఆ చరిత్రలు తిరగ రాయాలన్నా బిఆర్‌ఎస్‌ కే సాధ్యం.

`సభలు విజయవంతం కావడానికి కేసీఆర్‌ ఒక్క పిలుపు చాలు.

`తెలంగాణ మొత్తం కదులుతుంది.

`బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నాడు తెలంగాణ మొత్తం వరంగల్‌ లోనే వుంటుంది.

`తెలంగాణ ప్రజలంతా కలిసి బీఆర్‌ఎస్‌ రజతోత్సవ పండగ జరుపుకుంటుంది.

`తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కేసీఆర్‌ అద్భుతాలు సృష్టించారు.

`ఆరు నెలల్లోనే పల్లె, పట్నం అని తేడా లేకుండా కరెంటు నిరంతరం సరఫరా చేశారు.

`తెలంగాణలో అందరూ ఆశ్చర్యపోయారు.

`అంత కాలం ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కానిది ఎలా సాధ్యమైందో ఊహించలేకపోరు.

`అదే ఏడాదిలో తెలంగాణలోని చెరువులకు నీళ్లొచ్చాయి.

`దశాబ్దాల తరబడి చుక్క నీరు లేక ఎండిపోయిన చెరువులు నిండాయి.

`ఎప్పుడో ఎండిపోయిన వాగులు, వంకల్లో ఎండాకాలంలో నీళ్లు పారాయి.

`మిషన్‌ భగీరథ పేరుతో చెరువులన్నీ కూడికలు తీయడం జరిగింది.

`ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతుంటే రైతులు సంబురపడ్డారు.

`తెలంగాణ ప్రజల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

`ఇలా చెప్పుకుంటూ పోతే పదేళ్లలో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి.

`తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసిఆర్‌ పాలకుడై మట్టిని కూడా బంగారం చేశారు.

`తెలంగాణను అన్నపూర్ణ చేసి దేశానికే అన్నం పెట్టే దశకు తెచ్చాడు.

`అందుకే కేసీఆర్‌ చరిత్రకే కొత్త బాష్యం చెప్పిన పాలకుడయ్యారు.

`60 ఏళ్లు తెలంగాణను పట్టిన శనిని వదిలించాడు.

`ఈ తరం యువతకు కేసీఆర్‌ చేసిన త్యాగం తెలియాలి.

`కేసీఆర్‌ చేసి చూపిన అభివృద్ధి బిఆర్‌ఎస్‌ ప్రతి కార్యకర్త యువతకు చెప్పాలి.

`ఇంతటి అభివృద్ధి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూ చేయలేదు.

`ఇంకా వెయ్యేళ్లయినా కేసీఆర్‌ చరిత్ర చెరిగిపోదు.

`తెలంగాణ వున్నంత వరకు బీఆర్‌ఎస్‌ ఎదురుండదు.

`అప్పుడప్పుడు ఒడిదొడుకులు వచ్చినా మళ్ళీ కెరటంలా ముందుకొచ్చేది బిఆర్‌ఎస్‌ పార్టీయే.

`తెలంగాణను కాపాడుకునేది బీఆర్‌ఎస్‌ పార్టీనే

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన పాలకుడు కేసిఆర్‌. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్‌ తెలంగాణ దేవుడు. ఎందుకంటే కేసిఆర్‌ లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు. కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణకోసం ఎన్ని రకాల ఉద్యమాలు సాగినా, గతంలో రాలేదు. ఉద్యమం ఎంతో కొంత సజీవంగా వుండేదేమో? కాని డిల్లీ పాలకులు తెలంగాణ ఇచ్చేందుకు ఇష్టపడకపోదురు. అడుగడుగునా అటు కాంగ్రెస్‌ పార్టీ, ఇటు బిజేపి రెండూ తెలంగాణ ఇవ్వడానికి సుముఖంగా వుండేవి కాదు. కేసిఆర్‌ లేకుండా అంత బలమైన ఉద్యమం చేసేవారు వుండేవారు కాదు. కేసిఆర్‌ నాయకత్వంలో బలమైన తెలంగాణ ఉద్యమం సాగుతున్న తరుణంలో దేశంలో బిజేపి మూడు రాష్ట్రాలను ప్రకటించింది. కాని తెలంగాణ ఇవ్వలేదు. 1998 కాకినాడ సభలో ఒక ఓటు, రెండు రాష్ట్రాలు తీర్మాణం చేసిందే గాని, తెలంగాణ ఇవ్వడానికి చేతులు రాలేదు. ఒక దశలో అప్పటి ఉప ప్రధాని అద్వానీ హైదరాబాద్‌ తెలంగాణ నడిబొడ్డులో వుంది. ప్రత్యేక రాష్ట్ర ఎందుకు? అని ఎదరు ప్రశ్నించారు. ఏపి నాయకుల మాటలే కేంద్రంలో చెల్లుబాటయ్యేవి. తెలంగాణ నాయకులు ఎంత బలమైన వాళ్లైయినా వారికి ప్రాదాన్యత వుండేది కాదు. పైగా తెలంగాణ ఇవ్వమని అడిగేంతే శక్తి అప్పటి రెండు పార్టీల నాయకులకు లేదు. తొలి తరం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంత పెద్ద పోరాటం జరిగినా ఇందిరా గాందీ ఒప్పుకోలేదు. తెలంగాణ ప్రజా సమితి 11 సీట్లు సాధించినా తెలంగాణ ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఉద్యమం సాగినా అవి డిల్లీ దాకా తెలంగాణ వాణి వినిపించేంత గట్టిగా సాగలేదు. కాని ఒక్క కేసిఆర్‌ మొదలు పెట్టిన ఉద్యమమే డీల్లీని తాకింది. డిల్లీని వణికించింది. అంతగా డిల్లీ మెడలు వంచిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరు. అందుకే తెలంగాణ వచ్చింది. పట్టిన పట్టు విడవకుండా, ఎన్ని అవరోదాలు ఎదరైనా ఉడుం పట్టు పట్టినట్లు ఉద్యమం చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ ఆమరణ నిరసన దీక్ష సమయంలో కేసిఆర్‌ చెప్పిన మాటలనే అప్పటి హోం మంత్రి చిదంబరం చదివారంటే కేసిఆర్‌ బలం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. ఆసుపత్రిలో ఆమరణ నిరసనలో వున్న నాయకుడు ఏది చెబితే అది చదువుతాం..తెలంగాణ ఇస్తామని కేంద్రం దిగి రాకతప్పలేదు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేయకతప్పలేదు. అలా డిల్లీని శాసించి తెచ్చిన కేసిఆర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందంటున్న మాజీ మంత్రి వర్యులు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నేటి దాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్ధితులు, అభివృద్ది గురించి చెప్పిన ఆసక్తికరమైన అంశాలు..ఆయన మాటల్లోనే..
తెలంగాణ ప్రకటన వచ్చిన రోజే రాత్రికి రాత్రి ఏపికి చెందిన ఉమ్మడి పాలకులు లేని కృత్రిమ ఉద్యమాన్ని కొన్ని గంటల్లోనే రేపినా, తెలంగాణను అడ్డుకున్నా, తెలంగాణ సాధించే వరకు విశ్రమించని నాయకుడు కేసిఆర్‌. తొలుత కేసిఆర్‌ చెప్పిన మాటల మీద ఇతర పార్టీలకు కూడా కొంత నమ్మకం కలగలేదు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలంగాణ రావాలని వున్న అప్పటి పరిస్టితుల దృష్ట్యా పార్టీల సిద్దాంతాలకు కట్టుబడి రాజకీయం చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేశారో అప్పుడు అన్ని పార్టీలలోనే కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి ఒక నమ్మకం ఏర్పడిరది. అప్పటి నుంచి బిఆర్‌ఎస్‌ నాయకత్వంలో కేసిఆర్‌ నేతృత్వంలో ఐదేళ్లపాటు సాగిన ఆ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. సకల జనులు పాలుపంచుకున్న ఉద్యమం ఏదైనా వుందంటే అది తెలంగాణ ఉద్యమమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అప్పటి రాజులుకొంత మంది వ్యతిరేకించారు. కాని తెలంగాణ ఉద్యమం మాత్రం ఏ ఒక్క వర్గం వద్దనలేదు. జై తెలంగాణ అని అనకుండా వుండలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు తెలంగాణలో ఎక్కడ చూసినా జై తెలంగాణ నినాదామే..వినిపించేది. పెళ్లిల్లయినా, పేరంటాలైనా, ఏ ఇతర శుభకార్యాలైనా, సభలైనా, సమావేశాలైనా సరే తెలంగాణ పాటలు తప్ప మరో పాట వినిపించేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా సాగిన దూంధాంలు, నిరసనలు, సకల జనులసమ్మెలు, ఉద్యోగుల పెన్‌ వంటి అనేక రకాల ఉద్యమాలకు, పోరాటాలకు కేసిఆర్‌ చేసిన రూపకల్పన అంతిమంగా విజయం సాదించింది. తెలంగాణ తెచ్చింది. మరి వచ్చిన తెలంగాణ ఎలా అభివృద్ది అన్నదానిపై అందరికీ సందేహాలుండేవి. ఎందుకంటే అప్పటికే ఉమ్మడి పాలకులు కొన్ని అపోహలు సృష్టించారు. తెలంగాణ వస్తే కరంటు కోతులు, చీకటి రాత్రేలే కాదు, పగలు కూడా కరంటు చూడలేరంటూ చెప్పే వారు. ఆ మాటలు నిజమే కావొచ్చన్న అనుమానాలు సగటు తెలంగాణ ప్రజలకు కూడా వుండేది. ఏ చీకటి రాత్రుల గురించైతే అప్పటి పాలకులు చెప్పారో ముందు ఆ చీకటే లేకుండా చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కింది. తెలంగాణ రాకముందు తెలంగాణ అంతటా చిమ్మ చీకట్లే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మరింత ఉదృతమైన సందర్భంలో సుమారు ఐదారేళ్లపాటు కరంటు కోతలు ఎక్కువ, సరఫరా తక్కువ జరిగేది. ఇక పల్లెల్లో అయితే రోజుకు కనీసం గంట కూడా కరంటు వుండేది కాదు. ఆ గంటలో కూడా కోతలుండేవి. అంటే ఆ రోజులు ఎంత భయంకరంగా వుండేవో అర్ధం చేసుకోవచ్చు. కాని తెలంగాణ వచ్చిన మూడు నుంచి ఆరు నెలల్లో తెలంగాణలో నిరంతరం కరంటు సరఫరా చూసి ప్రజలు ఆశ్యర్యపోయారు. తెలంగాణ ప్రజలు అబ్బురపడ్డారు. సంతోషంతో కేసిఆర్‌ను వేనోళ్ల పొగిడారు. తెలంగాణ వస్తే చీకట్లే అన్న వారికి కూడా వెలుగులు చూపించారు. ఇదెలా సాద్యమైందో అని ఏపి ప్రజలు కూడా ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు. ఆ పాత చీకటి రోజులు చూసిన తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నిండాయి. దానికి తోడు తెలంగాణలో రైతులందరికీ 24గంటల ఉచిత విద్యుత్‌ కేసిఆర్‌ ఇచ్చారు. రైతులు 24 గంటల కరంటు వద్దని చెప్పే పరిస్దితి వచ్చింది. అంతగా రైతాంగాన్ని ఆదుకున్న ఏకైన రైతుబాంధవుడు కేసిఆర్‌. ఇక తెలంగాణ కరువును ఏడాదిలో కంటకి కనిపించకుండా చేసిన నాయకుడు కేసిఆర్‌. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ పాలకుడు కాకుంటే ఇవన్నీసాద్యమయ్యేవి కాదు. అసలు ఆయన ఆలోచనలు, ఆచరణలు ఎవరికీ అంతు పట్టలేదు. తెలంగాణ వచ్చిన వెంటనే సాగునీటి కోసం ఆయన చేసిన గొప్ప ప్రయత్నం మిషన్‌ కాకతీయ. అసలు తెలంగాణను ఒక్క ఏడాదిలో సస్యశ్యామలం చేయొచ్చని ఎవరూ ఊహించలేదు. 60 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకున్నా, కనీసం చుక్క నీటిని ఇచ్చేందుకు కూడా ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. తెలంగాణలో చెరువులు బాగుచేస్తే, కరువు ఛాయలు కొంతైనా తగ్గుతాయని ఆలోచించలేదు. ఎందుకంటే తెలంగాణకు నీళ్లిస్తే, ఏపికి నీరు తగ్గుతుందన్న భయంతో ఉమ్మడి పాలకులు తెలంగాణను నిర్లక్ష్యంచేశారు. చెరువులను చెదరగొట్టారు. అటు కరువు చాయలు, ఇటు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యాల మూలంగా తెలంగాణ ఆగమైంది. తెలంగాణ ఎడారిలా మారిపోయింది. కాని కేసిఆర్‌ ఏడాది కాలంలో తెలంగాణలో వున్న చెరువుల రక్షణ, పరిరక్షణ, పునరుద్దరణ పేరుతో చెరువులన్నీ బాగు చేశారు. మూడేళ్లలో 46వేల చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. ఎండాకాలంలో కూడా తెలంగాణ చెరువులు మత్తళ్లు దుంకేలా నీరందించారు. నిరంతరం గొలుసు కట్టు చెరువుల్లో నీరుండేలా..ఆ చెరువుల నుంచి ఇతర చెరువులకు నిరంతరం నీరు పారేలా చూశారు. దాంతో వాగులు వంకల్లో కూడా నీరు నిరంతరం ప్రవహిస్తూ వచ్చింది. తెలంగాణలో భూగర్భ జలాలు అప్పటికే గణనీయంగా పెరిగాయి. రైతుకష్టం పూర్తిగా తీరింది. ఒకప్పుడు కరంటు లేక, బోర్లు ఎండిపోయి, పంటలు చేతికి రాకుండా చితికిపోయిన రైతులకు ఒక్కసారిగా పండుగ తెచ్చిన దేవుడు కేసిఆర్‌. అలా చెరువులతోపాటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం దానికి అనుసంధానంగా పెద్దఎత్తున రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టి, తెలంగాణకు నీటి కొరత లేకుండా చేశారు. తెలంగాణలో గుంట భూమి కూడా సాగుకాకుండా రైతులు వ్యవసాయం చేశారు. పల్లెలను పచ్చని వనాలే కాదు, దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారాలు చేశారు. నేను పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా ఐదేళ్ల కాలంలో తెలంగాణకు ఏటా పదుల సంఖ్యలో అవార్డులు అందుకోవడం నా జన్మ చరితార్ధకమైంది. అసలు ఎలా వుండే తెలంగాణ ఎలా తెలివికొచ్చింది. ఎంత అభివృద్ది చెందింది. కలలో కూడా ఎవరూ ఊహించనంత ప్రగతి సాదించింది. అందుకే కేసిఆర్‌లో ఒక కారణజన్ముడు. ఆయన స్ధాపించి బిఆర్‌ఎస్‌ తెలంగాణకు ఒక రక్షణ కవచం. బిఆర్‌ఎస్‌ రజతోత్సవాలు అంటే అది ప్రజల పండుగ. తెలంగాణ ప్రజల గుండెలందరి నిండుగా!

సివిల్ సప్లై గోదాములలో గోల్ మాల్…

సివిల్ సప్లై గోదాములలో గోల్ మాల్…?

జవాబుదారితనం లేని నిర్వాకులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలోని సివిల్ సప్లై గోదాములలో కొందరు ఉద్యోగలు అవకతవకలకు పాల్పడుతున్నారని కేసముద్రం సహకార బ్యాంకు విశ్రాంత ఉద్యోగి సీఈఓ వెంకటచలం ఆరోపించారు. గురువారం కేసముద్రంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఇనుగుర్తి ధాన్యం కొనుగోలు కేంద్ర మిగిలిన గన్ని బ్యాగుల విషయం సివిల్ సప్లై ఉద్యోగులు అవకతవకలకు పాడుపడుతున్నారని అన్నారు. గన్ని బ్యాగుల 83 కట్టల లో ఉన్న 4,150 ఖాళీగా అన్ని బ్యాగులను కేసముద్రంలోని సివిల్ సప్లై గోదాంలో సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. అట్టి 83 కట్టలకు గాను రూపాయలు 40 చొప్పున 3420 దిగుమతి చార్జీలు కూడా చెల్లించామని అన్నారు కేంద్రం ఇన్చార్జి అయిన సురేందర్ ను 83 కట్టల కాళీ బ్యాగులు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వాలని రసీదు అధికారులను అడగగా రేపు ఇస్తాం మాకు ఇస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా తాను కూడా సివిల్ సప్లై గోదాముకు వెళ్లి అడగగా 42 కట్టలు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వడం జరిగిందని, తక్కువ గన్ని బ్యాగుల కట్టలు రాసి ఇవ్వడమేంటి అని అడగగా 52 కట్టలు దిగుమతి మాత్రమే దిగుమతి అయ్యాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇట్టి విషయంపై అనేకమార్లు అడిగినా కూడా పెడచెవిన పెడుతూ అధికారులు బాధ్యతారహిత్యంగా ఒక విశ్రాంత ఉద్యోగి పైనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేశారు.సివిల్ సప్లై గోదాంలో జరుగుతున్న అవకతకులపై విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులను ఈ సందర్భంగా వారు కోరారు.

వ్యభిచారం గృహంపై పోలీస్,.!

వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.

పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు..

హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు.ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు గల నూతన ఏర్పాటు చేసిన ఒక కమ్యూనిస్టు పార్టీకి చెందిన గుడిసెల ఎదురుగా కిన్నెరపు ఉమా అనే మహిళ తన ఇంట్లో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నది.ఇతర ప్రాంతాల నుండి మహిళలను వ్యభిచార రొంపులో దింపి తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది.నర్సంపేట పట్టణానికి చెందిన కిన్నెరపు ఉమా నర్సంపేట మండలంలోని బానోజీపేట గ్రామానికి చెందిన కొయ్యల రమేష్,అదే బానోజీపేట గ్రామానికి చెందిన విద్యార్థి కొయ్యల నితిన్ అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన కేసనపల్లి విక్రమ్ అనే యువకుడు ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కలిసి వ్యభిచార నిర్వహిస్తున్నది. పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, నర్సంపేట ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందన్నారు.ఇందులో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళాతో పాటు ఒక విద్యార్థి,మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.కాగా ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కాపడినట్లు సీఐ తెలిపారు.వ్యభిచారం గృహంలో తనిఖీలు చేపట్టగా 29 హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,5 సెల్ ఫోన్లు,1 ద్విచక్ర వాహనం,రూ. 2750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపి నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడిలో టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతి అమలు

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

రాష్ట్రంలో ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపటమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. భూభారతి పోర్టల్ అమలులో భాగంగా గుండాల మండలం,ఆళ్లపల్లి మండలల్లో రైతు వేదికలో భూభారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారు అని నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ (ఏ )ను ఏర్పాటు చేసి భూమి విలువ ఐదు లక్షలు లోపు ఉన్న పక్షంలో ఆర్డీవో స్థాయి, ఐదు లక్షల పై గా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించాలని తెలిపారు.
భూమి విషయంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ రోజు నుండి సంవత్సరకాలంలోపు సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ స్థాయిలో సమస్యను పరిష్కారం కానిపక్షంలో సి సి ఎల్ ఏ కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం మండల తాసిల్దార్లు, సబ్ రిజిస్టర్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని, ఇకనుండి చేసే రిజిస్ట్రేషన్ లను అన్ని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభు త్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరి చేసిందన్నారు. భూ భారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా మె యింటెన్‌ చేస్తారని, ప్రతి సంవత్సరం భూముల రికార్డుల ను తీసి ఆ ఫైళ్లను తహసీల్దార్‌ కార్యాలయంలో భద్రపరు స్తామన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో సై తం ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్‌ దృష్టికి తీసుకువెళ్లవచ్చని అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని అ క్కడ కూడా న్యాయం జరక్కపోతే కలెక్టర్‌కు అప్పీలు చేసు కునే అవకాశం భూభారతిలో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు భూభారతి పోర్టల్ లో ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ అవగాహన సదస్సులో కొత్తగూడెం ఆర్డీవో మధు, గుండాల తాసిల్దార్ ఇమాన్యుల్ , ఎంపీడీవో సత్యనారాయణ, రైతులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’.

‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’. 

ధరణి వల్ల రెవెన్యూ శాఖలో చిక్కులు

పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి నాంది.

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జడ్చర్ల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే దానికి భూభారతి ముఖ్య ఉదాహరణ అని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ శాఖలో అనేక చిక్కులు ఏర్పడ్డాయని విమర్శించారు. అధికారులు భూ సమస్యలను పరిష్కరించడంలో ధరణి పోర్టల్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి రెవెన్యూ శాఖకు ప్రజలకు మధ్య సంబంధాలు లేకుండా చేశారని తెలిపారు.

Bhu Bharati

ప్రతిరోజు హైదరాబాద్ లోని నా.. నివాసానికి ఎంతోమంది భూ సమస్యలపై వస్తుంటారని అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన భూ ఫిర్యాదులన్నిటిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు పంపించి వాటిని పరిశీలన చేయాలని కోరానని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న మా యొక్క భూ సమస్యలే పరిష్కారం కావడం లేదనీ.. పేద ప్రజల భూ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని వివరించారు. నేను కూడా భూభారతిలో నా యొక్క భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. భూ భారతిపై నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అధికారులతో కలిసి వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంఘం గ్రామ రేషన్ డీలర్ కంటానం మల్లయ్య స్వామి కుమార్తె సంధ్య – ప్రణవ్ ల వివాహ వేడుక బుధవారం రోజున ఝరాసంఘం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకీ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సిద్దం. ఉజ్వల్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పార్టీ ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్, కేతకీ ఆలయం చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, నర్సింహారెడ్డి., ఎస్సి సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి. నాగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, అశ్విన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ న్యాల్కల్, ఝరాసంఘం మండలాల అధ్యక్షుడు జి. కిరణ్ కుమార్ గౌడ్, రాఘవేందర్, మాజీ యం.పి.టి.సి హఫీజ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, నథానేయల్, నర్సింహా యాదవ్, ఇమామ్ పటేల్, రాజు మరియు ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాసుల కొరకే కోటి విద్యలు.

కాసుల కొరకే కోటి విద్యలు.

రోజుకు 4.8 నుండి 6. 60 లక్షల అక్రమ వసూళ్లు

అక్రమ వసూళ్లలో సత్తా చాటుతున్న క్వారీలు.

వసూళ్ల కె కాంటాల వద్ద టీఎస్ఎండిసి “పోసుడు” తీసుడు”.

అక్రమ ఇసుక రవాణా ఎక్కడ ఆగింది,క్వారీల్లో కూడా ఝాట్కా బకెట్.

దర్జాగా సొమ్ము తీసుకొని, అదుపు ఇసుక రవాణా.

మరో 6 కొత్త క్వారీలు ప్రారంభం, 20 తేదీ నుండి లోడింగ్ కు గ్రీన్ సిగ్నల్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

అదనపు ఇసుక అక్రమ అక్రమ రవాణా అదనపు బకెట్ల వ్యవహారం పై ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేయడంతో, తిన్న పానం ఎలా ఆగుతుంది, ఏదో ఒక ఉపాయం చేయాల్సిందే కదా దానికి పరిష్కారం ఎవరిస్తారు అంటే కేరాఫ్ టీఎస్ఎండిసి అధికారులే, పొట్టకూటి కొరకు కోటి విద్యలు అన్న సామెత ఉంది, కానీ అక్రమ సొమ్ము దూచుకొనుటకు “ఇసుక క్వారీల్లో కాసుల కొరకు కోటి విద్యలు” అనే కొత్త సామెత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మహాదేవపూర్ పుసుపల్లి వన్ తో పాటు కాలేశ్వరం పరిధిలోని, పలుగుల ఎనిమిది, పలుగుల తొమ్మిది, పుసుపల్లి పలువుల ఆరు, పుసుపల్లి ఒకటో నెంబర్ ఇసుక క్వారీల కాంట్రాక్టర్ టిఎస్ఎండిసి అధికారులు కలిసి “కాసుల కొరకు కోటి విద్యలు” అన్న సామెతను నిజం చేస్తున్నారు. టిఎస్ఎండిసి అధికారులు సిబ్బంది బాధ్యత రహితంగా చేయాల్సిన పనులను, కాంట్రాక్టర్ లకు కీలుబొమ్మలుగా మారి, సీరియల్ నంబర్, లోడింగ్, ఫోక్ లైన్ డీజిల్, కాంటాల వద్ద పోస్టులు తీసుడు, పాసింగ్ పై మరో 300 కిలోలు అదనపు ఇసుక పేర్లతో వసూళ్లు చేస్తూ,ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ సిబ్బంది, టీఎస్ఎండిసి బాధ్యులు, అక్రమంగా దోచుకొని పంచుకుంటున్నారు.

కాసుల కొరకే కోటి విద్యలు.

మండలంలోని మహాదేవపూర్ పుసుపల్లి 1, పలుగుల 8 ,9, పుసుపల్లి పలుగుల ఆరు, పుసుపల్లి 1, ఈ ఇసుక క్వారీల్లో, అదనపు బకెట్ల వ్యవహారం కొనసాగకపోవడంతో, కాసుల కొరకు కోటి విద్యలు అనే విధంగా, లోడింగ్ చార్జి పేరుతో 900 నుండి 1200 వరకు, వీటిలో సీరియల్ నంబర్ పేరుతో మరో నాలుగు వందలు, లోడింగ్ వద్ద 100 నుండి 200, మరోవైపు కాంత వద్ద పోసుడు తీసుడు వ్యవహారం, టీఎస్ ఎంబీసీ సిబ్బంది కూర్చుని, 600 కిలోలకు తక్కువగా 300 కిలోల వరకు పాసింగ్ పై అదునపు ఇసుక వేయడం, అలాగే ఎక్కువ గా వచ్చిన ఇసుకను తీసి 300 కిలోల వరకు లారీలో ఉంచడం కొరకు మరో 200 రూపాలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఎక్ స్త్ర బకెట్ వ్యవహారం ఆగిన పర్వలేదు, 300 కిలోల ఇసుక జట్కాబకెట్ పేరుతో కొనసాగడం, మిగతా సీరియల్ ,లోడింగ్ ,డిజిల్, లాంటి పేర్ల ట్ అక్రమ వసూళ్ల విధానాలు పకడ్బందీగా అమలు చేస్తూ దర్జాగా దోచుకోవడం జరుగుతుంది.

రోజుకు 4.8 నుండి 6. 60 లక్షల అక్రమ వసూళ్లు

educations

ప్రస్తుతం మండలంలో అక్రమ వసూళ్ల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న మహదేవ్పూర్ కాలేశ్వరం పరిధిలోని ఐదు క్వారీల్లో ప్రతిరోజు 400 నుండి 550 లారీలు ఇసుక రవాణా కొరకు ఆయా క్వారీల కు రావడం జరుగుతుంది. ఈ ఐదు క్వారీలు తమ ఒప్పందం ప్రకారం 900 నుండి 1400 రూపాయల తో సుమారు ఒక్కసారి రోజుకు లక్ష 20,000 నుండి 1,60,000 వరకు, అక్రమ వసూళ్లు చేస్తున్నారు.

 

ప్రతిరోజు ఒక్కొక్క క్వారీకి యావరేజ్ గా 90 నుండి 110 లారీలు ఇసుక రవాణా కోసం రాగా, ఈ ఐదు ఇసుక క్వారీలో మొత్తం ఒక్క రోజుకు, నాలుగు లక్షల 80 వేల నుండి ఆరు లక్షల 60 వేల వరకు, అక్రమ వసూళ్లు చేసి, కాంట్రాక్టర్ మరియు టిఎస్ఎండిసి పంచుకోవడం జరుగుతుంది. దీనికి సాక్ష్యం టిఎస్ఎండిసి సిబ్బంది ఈ ఐదు క్వారీలో లారీల వద్ద అలాగే కాంటాల వద్ద కూర్చొని వసూళ్లు చేయడమే దీనికి సాక్ష్యం. అక్రమ వసూళ్లలో ఈ ఐదు క్వారీలు రారాజులుగా దర్జాగా తమ వసూళ్ల వ్యవహారాలను కాంట్రాక్టర్ మరియు టిఎస్ఎండిసి సిబ్బంది కలిసి దోచుకోవడం జరుగుతుంది.

వసూళ్ల కె కాంటాల వద్ద టీఎస్ఎండిసి “పోస

పుసుడు తీసుడు వ్యవహారం అక్రమ వసూళ్లకు ప్రధాన సూత్రధారి పాత్రధారి కూడా, అని చెప్పడంలో సందేహం లేదు, అనేక సాక్షాలు కాంటాల వద్ద టీఎస్ఎండిసి సిబ్బంది, బోసుడు తీసుడు పేరును అక్రమ వసూళ్లకు మారుపేరుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. లోడింగ్ వద్ద ఉండి, లారీ యొక్క కెపాసిటీ పెద్ద చిన్న బకెట్ల లెక్కలు చూసి లారీలో లోడ్ చేయించి బాధ్యత ఉన్నప్పటికీ, టీఎస్ఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ గుడిసెలకు పరిమితమై, వేబిల్ వద్ద వసూళ్లతో పాటు, కాంట వద్ద ఏసుడు తీసుడు వద్ద తమ విధుల్లో ప్రాధాన్యత మైనటువంటి పాత్రగా భావిస్తూ, 200 నుండి 400 రూపాయలు, 300 కిలోల ఇసుక పాసింగ్ పై అదనంగా వేస్తూ సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.

అక్రమ ఇసుక రవాణా ఎక్కడ ఆగింది,క్వారీల్లో కూడా ఝాట్కా బకెట్.

అక్రమ ఇసుక రవాణా ఎక్కడ ఆగింది, పాసింగ్ పై 300 కిలోలు ఒక్క లారీకి, అలాగే మరికొన్ని లారీలకు 500 కిలోల వరకు అదనపు ఇసుక వేస్తూ, 200 నుండి 500 రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంటే అదనపు ఇసుక రవాణా ఏ విధంగా ఆగినట్లు, ఒక్కసారిలో సుమారు రోజుకు 120 లారీల లోడింగ్ ఇసుకను యావరేజ్ గా లోడ్ అయిన క్రమంలో, 60 లారీల్లో 300 కిలోల చొప్పున 18 వేల కిలోల మరో 60 లారీలకు 500 చొప్పున లెక్కచేస్తే 30 వేల కిలోల ఇసుక అంటే మొత్తం ఒకరోజు ఒక క్వారీలో పాసింగ్కు పై 48 వేల కిలోల ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు కాదా దీన్ని ఏమంటారు, టీఎస్ఎండిసి ఉన్నత అధికారులు ఒక్క ఇసుక క్వారీలో ఒకరోజు 48 వేల కిలోల ఇసుక అంటే ఐదు ఇసుక క్వారీలకు కలుపుకొని రెండు లక్షల 40 వేల కిలోల ఇసుక ప్రతిరోజు అక్రమంగా రవాణా జరుగుతుంది అన్నట్లు కదా దీన్ని ఏమంటారో ఉన్నత అధికారులే సమాధానం చెప్పాలి మరి.

మరో నాలుగు కొత్త క్వారీలు, 20 తేదీ నుండి లోడింగ్ కు గ్రీన్ సిగ్నల్.

ఇక మండలంలో టిఎస్ఎండిసి మైనింగ్ శాఖ వ్యవహారం ఎవరికి అర్థం కాని పరిస్థితిగా మారింది, దర్జాగా అక్రమాలు లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవడం జరుగుతుందని సాక్షాలు తెరపైకి తెచ్చిన, నిద్ర మత్తు వీడని అధికారులు, మరో నాలుగు నూతన క్వారీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తోపాటు 20వ తేదీ ఆదివారం నుండి నాలుగు క్వారీల్లో లారీల లోడింగ్ ప్రారంభమవుతుందని తెలపడం జరిగింది,మహాదేవపూర్,1,4,బోమ్మాపూర్,2,3,4, ,ఎల్కేశ్వరం,1 పేరుతో 6 రీచుల నుండి ఇసుక రవాణా చేయడం జరుగుతుంది టి ఎస్ ఎం డి సి శాఖ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కొత్త ఇసుక క్వారీలు ప్రారంభం ఇసుక రవాణా తో ప్రభుత్వం తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కొరకు మేలు జరుగుతుంది అనే ఇది వాస్తవమే కానీ, అక్రమ వసూళ్లు అక్రమ ఇసుక రవాణా అరికట్టడం టిఎస్ఎండిసి బాధ్యత కాదా, కొత్త క్వారీలు ప్రారంభించక ముందు అక్రమాలు చేపడుతున్న క్వారీలపై చర్యలు తీసుకుంటే నూతనంగా ప్రారంభం కాబడుతున్న క్వారీలు కూడా అక్రమ వ్యవహారాలకు దూరంగా ఉండి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టకుండా ఉండడం జరుగుతుంది. శాఖ ఉన్నత అధికారులు అక్రమాలు చేస్తున్న క్వారీల పై గత 15 రోజులుగా వరుస కథనాలు సాక్షాలు వస్తున్న, చర్యలు తీసుకోకుండా కొత్త క్వారీల నుండి ఇసుక రవాణా కొరకు గ్రీన్ సీక్రెట్ ఇవ్వడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇసుక రవాణా తో ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుంది అన్నది వాస్తవమే, కానీ అక్రమ ఇసుక క్వారీలపై చర్యలు మరింత ప్రాధాన్యం అని కూడా ఉన్నత అధికారులు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాధిత కుటుంబానికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్.!

బాధిత కుటుంబానికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ పరామర్శ

వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి 1 క్వింటా బియ్యం అందచేత

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ స్టేషన్ కు చెందిన సామల వీరభద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ గోపా డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి 1 క్వింటా బియ్యాన్ని అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు వీరభద్రం తమ్ముడు సూరయ్య,వీరభద్రం భార్య ఉపేంద్ర, కుమార్తెలు జమున,ఉమా,కళ్యాణి, మమత,సమత లను పరామర్శించి,ఓదార్చి వారికి మా నుండి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి ఎవరి ఇంటిలోనైనా సరే విషాదం నెలకొన్న,అట్టి విషయాన్ని తనకు తెలిపిన వెంటనే స్పందించి తను అందజేస్తున్న సహాయ సహకారాలు మృతుల కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని పలువురు గ్రామస్తులు చెప్పుకొచ్చారు..

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారులు సామల నరసయ్య, మాజీ వార్డు సభ్యురాలు వనపర్తి లలిత, రాజా నాయక్, వెంకటమ్మ, సౌజన్య,సంగీత, సదానందం,మదన్,ధనమ్మ, ప్రవీణ్,మహేష్,మల్లేష్, పుష్ప,ప్రతిభ,నితిన్, కృష్ణ,రాము తదితరులు పాల్గొన్నారు.

క్రీస్తు సువార్త శాంతి ర్యాలీ.

క్రీస్తు సువార్త శాంతి ర్యాలీ. 

నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమను పంచాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

గురువారం కేసముద్రం మున్సిపల్ పట్టణ కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి శాంతి ర్యాలీ ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జెండా ఊపి ప్రారంభించారు. యేసే నిజమైన రక్షకుడు ఆయన మానవుల రక్షణ కొరకు నరావతారం ఎత్తి మనకోసం తన ప్రాణాన్ని పెట్టాడని కొనియాడారు. అదేవిధంగా దైవ సేవకులు కె ఎం పి ఎఫ్ మండల అధ్యక్షులు మునిగె జోసెఫ్ సురేష్ మాట్లాడుతూ సర్వ మానవాళికి యేసే నిజమైన రక్షకుడని అని కొనియాడుతూ , నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిచాలనే మాటను గుర్తు చేస్తూ అలా జీవించాలి అని సూచించారు.అలాగే కె ఎం సి వై ఎఫ్ అధ్యక్షులు వెంకట్ కన్న మాట్లాడుతూ కేసముద్రం ప్రజల కోసం ప్రార్థనలు చేసి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో దైవసేవకులు మల్లెపాక తిమోతి, పిల్లి కుమార స్వామి, ఆశీర్వాదం, ప్రభుజీవన్, థామస్ రెడ్డి, రూబెన్ పాల్, మహేందర్, సుధాకర్, ఫిలిప్, పేతురు, ఇశ్రాయేలు, కశ్మీనాధ్, రవి కుమార్, జాన్ వెస్లీ, జాన్ మెహబూబ్, శ్రీధర్, పీటర్ సింగ్, లాజరస్ గౌడ్, కర్నాకర్, విల్సన్, పృథ్విరాజ్, బనిషెట్టి వెంకటేష్ మరియు ఎం సి వై ఎఫ్ నాయకులు జన్ను మహేందర్, తిప్పర్తి శ్రీధర్, కర్నాకర్ యువకులు, విశ్వాసులు క్రైస్తవులు అంతా పాల్గొన్నారు.

ఘనంగా పదవి విరమణ మహోత్సవం

ఘనంగా పదవి విరమణ మహోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయు లు వనం వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ సన్మాన సమావేశం కన్నుల పండువగా జరిగింది. ఈ పదవి విరమణ కార్యక్రమానికి పిఆర్ టి యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు మల్యాల తిరుపతి రెడ్డి ,పలిత శ్రీహరి , టిఆర్టిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాసిరి. రాజిబాపు ఎంఈఓ రావు శాయంపేట గడ్డం బిక్షపతి , జి హెచ్ ఎం జిల్లా ప్రధాన కార్య దర్శి రామకృష్ణ వివిధ జిల్లా, మండల అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు మండ లంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, వరంగల్ వాయిస్ చీఫ్ ఎడిటర్ గడ్డం కేశవ మూర్తి పాల్గొని ప్రసంగిం చారు. వెంకటేశ్వరరావు బంధుమి త్రులు, మాజీ ప్రస్తుత ఉపాధ్యా యులు, విద్యార్థులు అనంత రం సన్మానగ్రహీత వనం వెంకటేశ్వరరావు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమా న్ని బాలుర ఉన్నత పాఠశాల శాయంపేట సీనియర్ ఉపాధ్యా యులు కాయిత శ్రీనివాస్ సిబ్బంది, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ మరియు సభ్యుల ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.

*ఆర్ హెచ్ వి ఎస్ జిల్లా అధ్యక్షులుగా సుందర కుమార్..

*ఆర్ హెచ్ వి ఎస్ జిల్లా అధ్యక్షులుగా సుందర కుమార్..

*మే 14 నుంచి 26 వరకు బద్రీనాథ్ లో సరస్వతీ పుష్కరాలు…

*త్వరలో ఆర్ హెచ్ వి ఎస్ ప్రాంతీయ కార్యాలయం తిరుపతిలో ప్రారంభం…

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 17:

 

రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ( ఆర్ హెచ్ వి ఎస్ ) జిల్లా అధ్యక్షులుగా కీర్తిపాటి సుందర్ కుమార్ ను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు తెలిపారు. గురువారం స్థానిక మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య సంరక్షకులు మహంతు వైదేహి వల్లభ శరన్ దాస్ మహారాజ్, జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా), జాతీయ ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్ల లచే నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. హిందూ సామ్రాజ్యం లో రామ రాజ్య స్థాపన కోసం, సనాతన హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను ఈ ఏడాదిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా రామ రాజ్య స్థాపనే ఎజెండాగా ఏర్పాటైన ఆర్ హెచ్ వి ఎస్ వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు. ఈ నెలలో ఆర్ హెచ్ వి ఎస్ ప్రాంతీయ కార్యాలయాన్ని తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్ర ప్రారంభమై అయోధ్య వరకు కొనసాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూపీ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ లతోపాటు శ్రీలంక, మారిషస్ ప్రధానులు, నేపాల్ కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అనిత దేవి సాహూ,తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి,
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉపసభాపతి రఘురామకృష్ణమ రాజు ( ఆర్ ఆర్ ఆర్) ఇతర ప్రముఖులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు సుందర కుమార్ మాట్లాడుతూ హైందవ ధర్మం కోసం, ఆధ్యాత్మిక చింతన కోసం, శ్రీరామ రాజ్య స్థాపన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహా యజ్ఞంలో తమకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తూ తమ వంతు శక్తివంచన లేకుండా ఆర్ హెచ్ వి ఎస్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ హెచ్ వి ఎస్ ఆధ్వర్యంలో సీతా సమేత శ్రీరామ సేవకులను అతి త్వరలో నియమించనున్నట్లు గిరి రాజు తెలిపారు. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ రథయాత్ర విజయవంతా నికి ఇప్పటినుంచి ప్రణాళికాబద్దం గా వ్యవహరించి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారుతమకు ఈ బాధ్యత అప్పగించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా),నవీన్ చంద్ర శుక్ల,దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్,రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు,ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు, టీటీడీ కాంట్రాక్టర్ గిరిరాజు లకు అభినందనలు తెలియజేశారు.

ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా.

* ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా……..
బి ఆర్ ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం
* కేటీఆర్ యువసేనమండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్*

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి మండలంలో గురువారం రోజునవిలేకరుల సమావేశంలో కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణం ధ్యేయంగా 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన టిఆర్ఎస్ (బిఆర్ఎస్ ) ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు తిరుగులేని విజయాలు ఉన్నాయి టిఆర్ఎస్ పురుడు పోసుకుని బి ఆర్ఎస్ గా రూపాంతం చెందిన పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.

గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం.

గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

మండలం లోని కే వెంకటాపూర్ గ్రామంలో అసైన్డ్ రాష్ట్ర భూ సమితి ప్రెసిడెంట్ బైండ్ల నందు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీవో రాజీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఉచిత వైద్య శిబిరం ద్వారా నిరుపేదలకు వైద్య పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామంలో 200 మంది వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ప్రేమలత, మల్లారెడ్డి హాస్పిటల్ సిబ్బంది పూజిత మనిషా దుర్గ స్తుతి లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version