ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం.

ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 


గుండాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సుదీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేసి గుండాల కూడలిలో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దోమల నివారణకు సహకరించి దోమల భారిన పడకుండా ఉండి వాటి ద్వారా వచ్చే వ్యాదులభారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. దీనికి గాను ఫ్రైడే ఫ్రైడే నిర్వహిస్తూ ఇంటిలోగాని ఇంటి ఆరుబయట నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించి వివిధ శాఖల సమన్వయంతో పునరంకీతులై ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నిర్మూలించాలని ఆశించారు. భారతదేశంలో 2030 సంవత్సరం కల్లా మలేరియాను పూర్తిగా నిర్మూలించాలనె లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి భూలక్ష్మి, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం, ఎల్ టీ రమేష్, ఎఎన్ఎంలు భువనేశ్వరి,అరుణ, మంగవేణి,కమల, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఏమ్ ఎల్ హేచ్ పీ సంగీత, ఆశాకర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామిపనులకు హాజరవ్వాలి.

జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామిపనులకు హాజరవ్వాలి

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శీను

ప్రతికూలి కి రోజూ 307 రూపాయలు వచ్చేలా పని చేపించాలని సూచన

పరకాల నేటిధాత్రి

 

ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరకాల,నడికుడ,కమలాపూర్ మండలాల ఎంపీడీఓల,ఏపిఓ,ఈసీ, పంచాయతీ కార్యదర్శిలకు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు,కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శీను హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయినందున జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనికి వచ్చే విధంగా చూడాలని వారికి ప్రతి రోజూ 307 రూపాయలు వచ్చేలా పని చేపించాలని అధికారులను ఆదేశించారు.పని ప్రదేశంలో మస్టర్ ప్రకారం ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేస్తన్నారా లేదా అని వారంలో ఒకరోజు తప్పనిసరిగా పరిశీలించాలని,

Job card

 

పని ప్రారంభం రోజు వెళ్లి కొలతలు చూపించి చివరి రోజు జరిగిన మొత్తం పనికి సంబంధించిన కొలతలు తీసుకుని అదే రోజు రికార్డు చేసి మండల్ కంప్యూటర్ సెంటర్ లో అప్పగించాలని,ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కొలతలు చేసిన పనకి తగ్గట్టుగా చేశారా లేదా స్క్రూటినీ చేయాలని ఏపీఓ కూడా ప్రతి రోజూ ఏదో ఒక పని ప్రదేశాన్ని తనఖీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్ రావు,ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి,కమలాపూర్ నడికూడ ఎంపీడీఓలు గుండె బాబు,గజ్జెల విమల,ఏపీఓలు ఇందిర,విద్యాపతి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పహల్గాంలో ముష్కరుల దాడిని ఖండించిన ముస్లిం

పహల్గాంలో ముష్కరుల దాడిని ఖండించిన ముస్లిం మైనార్టీలు
జమ్మికుంట మండల ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణంలో ముస్లిం మైనారిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ అన్నం తిన్నావా లోని వైశారణ్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పైశాచిక మరణకాణం ఖండిస్తూ నిరసన ర్యాలీ కార్యక్రమం చేశారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతోన్మాదమే తప్ప మతాలతో సంబంధం ఉండదని అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్క భారతీయుడు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంటూ విభిన్న మత సంస్కృతులకు నిలయం మన దేశానికే గర్వకారణమైన జమ్ము కాశ్మీర్లో గతంలో ఉన్న విపత్కర పరిస్థితులను ఎదురుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు పరుస్తూ జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఉగ్రవాద మూలాలు లేని జమ్మూ కాశ్మీర్లో ప్రజలు పర్యటన పర్యటన సురక్షితంగా ఉన్నారు అని యావత్ దేశం సంతోషించే ఈ తరుణంలో గతంలో పుల్వామా ఘటన కంటే దారుణమైన రీతిలో పహాల్గాం ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండలం ముస్లిం ఐక్యవేదిక నాయకులు మౌలానా నజీర్, జాకీర్, షేక్ సాబీర్ అలీ, డాక్టర్ ఫిరోజ్, సర్వర్ పాషా ఫయాజ్,ఖాదర్ సుఫియాన్,సల్మాన్, సబ్జాద్,సాదిక్, అమీర్ షేక్, అప్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్.

విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్

నేటి ధాత్రి కథలాపూర్

 

 

 

మన కథలాపూర్ పద్మశాలి ముద్దుబిడ్డ జోగ మహాలక్ష్మి ద్వితీయ సంవత్సరం CEC విభాగం లో 984/1000 మార్కులు వచ్చినందుకు మాస్ట్రో కాలేజీ ప్రిన్సిపల్ ఆకుల రాజేష్  అభినందించారు.

ప్రపంచ మలేరియా దినోత్సవం.!

ప్రపంచ మలేరియా దినోత్సవం…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 


ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కోహిర్ మండల్ బిలాల్ పూర్ గ్రామ ప్రాథమిక వైద్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించి డాక్టర్ బి నరేందర్ మాట్లాడుతూ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి ఒక ప్రయత్నం.ప్రతి సంవత్సరం 25 న ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.ఈ ప్రపంచ ఆరోగ్య సవాలును పరిష్కరించడంలో, నిర్మూలించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా అనేది నివారించదగిన వ్యాధి.ఇది చికిత్సతో నిర్ములించుకోవచ్చు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, జీవితాలను ప్రభావితంప్రకారం  చేసే సమస్య. కనుక దీనిని నివారించడానికి సరైన దిశలో చర్యలు తీసుకోవాలన్నారు.ఇటి కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ సోనీ, ల్యాబ్ టెక్నీషియన్ జె వాసంత్రావు యమ్ పి హెచ్ ఏ నిరంజన్, సూపర్ వైసర్ శోభారాణి ఆశ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

రోడ్డు పై ప్రమాదకరంగ ఉన్న దిమ్మే తొలగించాలి

రోడ్డు పై ప్రమాదకరంగ ఉన్న
దిమ్మే తొలగించాలి
వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రంలోని 33 వ వార్డులో రిలయన్స్ మార్ట్ పక్కన నూతనంగా సిసి రోడ్డు మురుగు కాలువ నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న రిలయన్స్ స్మార్ట్ పక్కన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మురుగు కాల్వ పైన మరియు రోడ్డుపై ఉన్నటువంటి దిమ్మెను తొలగించి మోడల్ గా పిల్లర్ వేసి రోడ్డుపైన ప్రమాదంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను నూతనంగా నిర్మించాలని వార్డు ప్రజలకు రోడ్డుపైన వెళ్లే ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వుంగుళం తిరుమల్ విద్యుత్ ఏఈ రాజయ్య గౌడ్ కు సమాచారం ఇవ్వగా అక్కడి కి వచ్చి పరిశీలించి వెంటనే వీటిని మురుగు కాలువపై రోడ్డుపై ఉండకుండా పక్కనే నిర్మాణం చేసే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తిరుమల్ తెలిపారు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగే రాజు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా సారంపల్లి గ్రామానికి చెందిన కోల అనిత లక్ష్మణ్ కి 14,500 రూపాయల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలు అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉంచుకొని ఎన్నో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి చెక్కులు.రావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు కోల అనిత లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్ సుంచుల కిషన్ గడ్డమీద శ్రీనివాస్ సిరిసిల్ల దేవదాస్ కున వేణి వినోద్ కోల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

శ్రీద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి,శివ మార్కండేయ, సుబ్రహ్మణ్య స్వామి,పంచముఖ ఆంజనే యస్వామి,ఆదిత్యాది నవగ్రహ దేవాలయం సముదాయము సుందరముగా నిర్మాణము చెయ్యడం జరిగింది. స్వామి వారిని దర్శింప వచ్చిన భక్తుల పట్ల కోరిన కోర్కెలు కొంగు బంగారం అగుచూ ప్రముఖ క్షేత్రం నందు ఒకటిగా ఈ దేవాలయము పరిగణించ బడుతున్నది ప్రత్యేక తెలంగా ణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుట ద్వారా తెలంగాణ రాష్ట్రం నందు హనుమకొండ జిల్లాలోని శాయంపేట గ్రామం యొక్క విశిష్టతను చాటు తుంది. ప్రతిష్ట జరిగే ద్వాదశ సంవత్సరములు అగుచున్న సందర్భంలో స్వస్తిశ్రీ విశ్వవసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ బుధవారం తేదీ 30- 04- 2025 నుండి 3-05-2025 షష్టి శనివారం వరకు ద్వాదశ వార్షికోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడుచున్నవి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని ప్రజలను కోరారు

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి
దోమతెరలు వాడాలి

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించూకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి శ్రీరాంపూర్ చౌరస్తా మీదుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు మలేరియా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీలో మలేరియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు
అనంతరం వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ మంగళవారాలను మరియు శుక్రవారం అన్నివేళలా పరిసర శుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడి పాటించాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలని దోమతెరలు వాడాలని మరియు ముఖ్యంగా దోమలు అభివృద్ధి చెందకుండా వారంలో రెండుసార్లు పాత నీరు అంతా పడబోసి మళ్లీ మీరు పట్టుకోవాలని దోమలు మరియు ఈగల అభివృద్ధిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇంకా అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిచారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గ్రేసీమని ఫార్మసిస్ట్ జగదీష్ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
జమ్మికుంట: నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ గాంధీ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల రాణి నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు డాక్టర్లు ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు ఈ దాడితో భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిందన్నారు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు

అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి

* అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

 

ఈనెల 30న గట్టుప్పల మండల కేంద్రంలోని ఎస్విఎల్ ఫంక్షన్ హాల్ లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలకులు మారిన ప్రజా సమస్యలు మాత్రం “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే “అన్న చందంగా మారిందని పాలక ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు. జిల్లాలో పలుచోట్ల భూ సమస్యలు ఉన్నాయని గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు అని, ఇంటి స్థలాల కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వ మాత్రం ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దున్నే వాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండాలను ఎత్తుకొని వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలర్పించారని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మునుగోడు ప్రాంత సిపిఎం నాయకులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రజా ఉద్యమాలలో అగ్ర బాగాన ఉండి అమరులైనారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని ప్రజలకు నష్టం కలిగించే విధానాలను ఎండగడుతూ అమరవీరుల ఆశయాల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. మే 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని, రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. .సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం మాట్లాడుతూ, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, మండల నాయకులు బొట్టు శివకుమార్, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములు, టేకుమెట్ల కృష్ణ, రావుల నరసింహ, అచ్చిన శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, పెదగానినరసింహ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు.!

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చూసి పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల మామిడిగి గ్రామానికి చెందిన బక్క రెడ్డి పెంట రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి నాయకత్వములో పనిచేయడానికి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో చంద్రన్న,తుక్క రెడ్డి,మాణిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా రెడ్ క్రాస్ సేవలు.

గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా రెడ్ క్రాస్ సేవలు ……
చిన్న శంకరంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపు విజయవంతం..
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సందర్శన… క్యాంపు పట్ల హర్షం…

రామయంపేట ఏప్రిల్ 25 నేటి ధాత్రి (మెదక్)

 

 

గ్రామీణ ప్రాంతాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు తెలిపారు.
శుక్రవారం నాడు చిన్న శంకరంపేట మండల కేంద్రంలో తుప్రాన్ వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరoలో పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.. చిన్న శంకరంపేట గ్రామంలో మెగా వైద్య క్యాంపును నిర్వహించడం శుభ పరిణామం అన్నారు.
అనంతరం రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు deme యాదగిరి మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెగా వైద్య క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాగా చిన్న శంకరంపేట గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య మెగా క్యాంపుకు అక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మేడ్చల్ మెడిసిటీ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ప్రవళిక, సంజన, నీరజ, దీక్షిత, సుప్రియ, సౌజన్య, హర్ష, తేజస్విని, hamsika
శిబిరములో పాల్గొని పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా పి హెచ్ సి కి చెందిన డాక్టర్లు B.Hruday, మెడికల్ staff కుమారి,నందిని,బుజ్జి,Mala , మాధవి,లలిత,రేణుకా పాల్గొన్నారు.

 

Medical camp

అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సుమారు 100 మందికి పైగా రోగులు వివిధ రకాల పరీక్షలను చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా కార్యదర్శి టి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి.శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, రేషన్ డీలర్ తోట శ్రీనివాస్ గుప్తా, మద్దెల సత్యనారాయణ, జీడి తిరుపతి, N. మాధవరెడ్డితొ పాటు గ్రామస్తులు పాల్గొన్నారు
……………
రెడ్ క్రాస్ సేవల పట్ల ఎమ్మెల్యే హర్షం..
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. రెడ్ క్రాస్ సంస్థ వారు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు.. చిన్న శంకరంపేట lo వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తుlo చేపట్ట బోయే కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

 

నడికూడ,నేటిధాత్రి:

 

చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభను గ్రామ గ్రామన పండుగ వాతావరణం ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు పట్టణాలు దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డుసృష్టించే అవకాశం ఈ సభను విజయవంతం చేయాలి ఈ నేల 27 న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సుమారు 1300 ఎకరాల సువిశాల ప్రదేశంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయిని బీఆర్ఎస్వి నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్ తెలిపారు. నడికూడ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు,రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ.

మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

వీణవంక, ( కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి :

 

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ మరుమళ్ళ కొమురయ్య గారి తల్లి స్వర్గస్తులైన సమాచారం తెలిసిన వెంటనే వచ్చి భౌతికాయానికి పువ్వుల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి మనోధైర్యం కల్పించి వారికి అండగా ఉంటామని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు లక్ష్మక్క పల్లి మాజీ ఉపసర్పంచ్ మేకల సమ్మి రెడ్డి గారి తండ్రి స్వర్గస్తులైన తెలుసుకున్న వెంటనే వారి కుటుంబాన్ని ఓదార్చారు ఈ కార్యక్రమంలో వారి వెంట బిజెపి నాయకులు మాజీ మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి,మల్లారెడ్డి ,శ్రీనివాస్ యాదవ్, ఉడుత కుమార్,కొండల్ రెడ్డి, అప్పన కొమురయ్య, ఈదునూర్ కుమార్ ,సమ్మిరెడ్డి,శంకర్, మోటం శ్రీనివాస్, పల్లె రాయమల్లు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్.!

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్ మృతులకు సంతాపం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం కాశ్మీర్ పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన 27 మంది హిందూ బంధువులకు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగినది. ఈ ఉగ్రదాడి దారుణమైన దుశ్చర్య గా భావిస్తూ అన్ని కులాలను సమానంగా సోదర భావంగా భావించే ఈ భారత దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఇకముందు హిందువుల పైన ఇలాంటి దాడులు జరిగితే ఊరుకోమని తెలియపరుస్తూ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన హిందూ బంధువులకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు మనమందరము బాసటగా ఉంటూ మనోధైర్యాన్ని నింపాలని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఆ భగవంతున్ని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, మడుపు ప్రమోదరెడ్డి,నరెడ్ల రాఘవరెడ్డి,గుల్లపల్లి నరసింహారెడ్డి,డబ్బు తిరుపతిరెడ్డి, గడ్డమీద ప్రసాద్ రెడ్డి, కూతురు వెంకట్ రెడ్డి లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు, దుండ్రా జలజా రెడ్డి, ముసుకు తిరుపతిరెడ్డి, ఏమి రెడ్డి కనక రెడ్డి, జువ్వెంతుల, లక్ష్మారెడ్డి మంద బాల్ రెడ్డి, కోశాధికారి- ఎడ్మల హనుమంత రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ – భీమ నీలిమారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రాజిరెడ్డి, కంది భాస్కర్ రెడ్డి కరెడ్ల మల్లారెడ్డి, అబ్బాడి తిరుపతి రెడ్డి, గడ్డం సత్యనారాయణ రెడ్డి,బిచ్చల రాజిరెడ్డి, సంతాపం ప్రకటించడం జరిగినది.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి.

మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలి
దోమతెరలు వాడాలి

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించూకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి శ్రీరాంపూర్ చౌరస్తా మీదుగా ఎంపీడీవో ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు మలేరియా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీలో మలేరియా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు
అనంతరం వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ మంగళవారాలను మరియు శుక్రవారం అన్నివేళలా పరిసర శుభ్రంగా ఉంచుకోవాలని డ్రైడి పాటించాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని మురికి నీటిలో ఆయిల్ ఫాల్స్ వేసుకోవాలని దోమతెరలు వాడాలని మరియు ముఖ్యంగా దోమలు అభివృద్ధి చెందకుండా వారంలో రెండుసార్లు పాత నీరు అంతా పడబోసి మళ్లీ మీరు పట్టుకోవాలని దోమలు మరియు ఈగల అభివృద్ధిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇంకా అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిచారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ గ్రేసీమని ఫార్మసిస్ట్ జగదీష్ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ స్టాఫ్ నర్స్ రవళి మరియు ఝాన్సీ హెల్త్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్ మరియు వైద్య సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు

ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ ర్యాలీ.!

ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ ర్యాలీ
మృతుల కుటుంబలకు సంతాపం

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యం లో కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రవాదుల దాడి కి నిరసన గా సిరిసిల్ల లోని అంబేద్కర్ చౌక్ లో నిన్న రాత్రి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ పాకిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న భారత్ లోని సెక్యులర్ పార్టీలను రాజకీయంగా అణిచివేయాలని హిందువులంతా ఒక్కటై పోరాడితేనే హిందువులకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే హిందువులంతా సంఘాటీతంగా ఒక్కటి కావాలని పిలుపునిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న సెక్యులర్ పార్టీలను అంతం చేయాలని తెలియజేస్తూ నిన్న ఈ మరణకాండలో మృతి చెందిన కుటుంబలకు వారికి కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా జననివాళి అర్పిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని దేవుని ప్రార్థించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అల్లం అన్నపూర్ణ,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పత్తిపాక సురేష్, ఉరవకొండ రాజు,జ్ఞాన రాంప్రసాద్,దూడం శివప్రసాద్ ,దుమాల శ్రీకాంత్,కోడం రవి,మోర రవి,పండగ మాధవి,వైశాలి హరీష బండారి వెంకటేశ్వర్లు సురేష్ దూడం సురేష్ ఇంజాపూర్ మురళి, రాజేందర్ మరియు పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా.!

లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా.

బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

మంచిర్యాలలోనీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆ విద్యార్థినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది. మృతురాలు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆమె తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. ఆమె మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ అన్నారు. విద్యార్థిని ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఒక్క అధికారి కూడా రాకపోవడం దురదృష్టం అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వేంకటేశ్వర గౌడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కృష్ణ, నవీన్, నర్సింగ్, శీతల్, సంగీత, స్రవంతి, కమల, దుర్గం ఎల్లయ, వాణి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

గోర్ మాటీ సదస్సును విజయవంతం చేయండి.!

గోర్ మాటీ సదస్సును విజయవంతం చేయండి

ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యం లో భవ సంగ్ మహారాజ్ మరియు దండి మ్యారాయా యాడీ మాకుల క్షేత్రం లో జరిగే గోర్ మాటీ ఆత్మ గౌరవ సదస్సు కు యొక్క పోస్టర్ ను ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ ను ఐక్య వేదిక బృందం కలిసి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ సమావేశానికి అందరూ హాజరు అయి విజయవంత చేయాలి అని పిలుపు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భముగా లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యం లో జరిగే సప్త భవాని మాతలు , 6 గురు జాతి గురువులు, బాలాజీ మహారాజ్, భవసంగ్ మహారాజ్, బుడియ బాపు, లింగ మసంద్, లోక మసంద్ ల భోగ్ భండార్ కార్య క్రమానికి జాతి గురువులు, సాధువులు, సంతువులు, బావాలు, భగత్ ల చేతుల మీదుగా మాత్రమే జరిగే భోగ్ కార్య క్రమానికి హాజరు అయ్యి శనివారం ఏప్రిల్ 26 న జరిగే మాకుల భవసంగ్ మహారాజ్ వెంకటేశ్వర స్వామి వారి బండ్లు తిరిగే కార్య క్రమానికి అందరూ హాజరు అవ్వాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్య క్రమం లో జాదవ్ రమేష్ నాయక్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త అలాగే పూజారుల సంఘం నాయకులు బానోత్ సీతారాం నాయక్,రవి నాయక్ గూగులోత్ ,మరిపెడ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి, యుగంధర్ రెడ్డి,భట్టు నాయక్, మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు బోడ రవి నాయక్ జిల్లా విద్యార్థి విభాగం సమన్వయ కర్త బాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version