ప్రజలకు తప్పని ఇబ్బం దులు

ప్రజలకు తప్పని ఇబ్బం దులు

కొత్త రోడ్డును సకాలంలో వెయ్యండి

నేటిధాత్రి:

 

కొప్పుల గ్రామం నుండి గంగిరేణిగూడెం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర కంకర పోసి అలాగే వదిలేయ డంతో నడవాలంటే ప్రయాణం ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు.

People have problems.

రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు గుండా ప్రయాణించాలంటే నరకం చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే రోడ్డుపన్నులు పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

రజతోత్సవసభకు మనమంతా ఒక్కటై కదం.!

రజతోత్సవసభకు మనమంతా ఒక్కటై కదం తొక్కి కదులుదాం

మాజీ ఆలయ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

 

 

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల ఏప్రిల్ 27 వరంగల్ లో ఎల్కతుర్తి లో ఏర్పాటు చేసిన రజితోత్సవ సభ కు తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలంతా ఒక్కటై కదం తొక్కుతూ కదిలి రావాలని పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలంతా భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరై
బి ఆర్ ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు కోరారు.ఈ సందర్భంగా గందెవెంకటేశ్వర్లు మాట్లాడుతూ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలను ఆగమయ్యే రోజులు వచ్చాయని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు.ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతాంగం ఆగమైందని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలంతా మేల్కొని కాంగ్రెస్ పాలన నుండి విముక్తి పొందాలంటే బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకొని కెసిఆర్ ని ముఖ్యమంత్రి ని చెయ్యాలి. భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పురస్కరించుకున్నందున ఈనెల 27న జరిగే జరగబోయే టిఆర్ఎస్ రజితోత్సవ సభకు పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల నుండి గ్రామాల నుండి గులాబీ దండై ప్రజలంతా తరలిరావాలని బి ఆర్ ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే తరలి వెళ్దాం-భూక్య తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామశాఖ అధ్యక్షులు పైడిపాల సతీష్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి హాజరైన కొత్తపెళ్లి మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ మాట్లాడుతూ ప్రపంచంలోనే కనీవిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి పన్నెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఈసభ చరిత్రలో నిలిచిపోతుందని ఈసభకు చింతకుంట గ్రామం నుండి చీమల దండులా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్‌. ఆయన నాయకత్వమే శ్రీరామరక్ష. ఇది ప్రజల్లో ఉన్న భావన. తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలనేది కేసీఆర్‌ సంకల్పం. ఈదిశగా వరంగల్‌ సభా వేదిక నుంచి ప్రజలకు విశ్వాసం కల్పిస్తారు కెసిఆర్. ఇరవై ఐదువ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న గులాబీ జెండా మరో యాభై ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. వచ్చే రెండు, మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి. మన గళం, బలం, దళం, గులాబీ దండు. ఈదండులో చింతకుంట గ్రామం నుండి చీమల దండులా కదలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగo అధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, బిఆర్ఎస్ నాయకులు కర్ణకంటి స్వప్న, గుబిరె సుజాత, వరలక్ష్మి, బిఆర్ఎస్ నాయకులు చిట్టిపల్లి నరేందర్, బెజ్జంకి సంపత్, భానతూ శ్రీకాంత్, మహేష్ గౌడ్, కమల్ గౌడ్, మణిదీప్, మల్లేశం, రవి, భాస్కర్ నాయక్, అమృత్, శంకర్, శశిధర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు.!

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఆరుగాసాల కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తుందని దయచేసి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం మే మాసంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని గత ప్రభుత్వ పాలకులు ఏం చేశారు ప్రజలందరికీ తెలుసునని ఇప్పుడు కూడా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తద్వారా కొద్దిగా గన్నిసంచులు లారీల కొరత ఉన్నది వాస్తవమే అని రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ ద్వారా విక్రయించాలని అలాగే రైతులకు బ్యాంకు అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని విషయం పై అధికారులదృష్టికి వచ్చిన పై అధికారులు తగు చర్యలు తీసుకుంటారని అలాగే రేపు జరగబోయే రైతు అవగాహన సదస్సు పై ప్రభుత్వ వీప్ఆది శ్రీనివాస్. సిరిసిల్లనియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులు రైతులతో అవగాహన సదస్సు నిర్వహించి రైతుల అమూల్యమైన సలహాలు తీసుకుంటారని దీనిపై భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలియజేస్తూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు మీ మండలంలో పనిచేసే ఒక అధికారి పని ఒత్తిడి భారమో. మీ నాయకులు చేస్తున్న ఒత్తిడి వల్ల కానీ సమస్యలు వస్తున్నాయని దృష్టికి వచ్చిందని దీనిపై వివరణ . కోరగా జరిగిన మాట వాస్తవమే కానీ. అసలు ఏం జరిగింది అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరక లేక ఆమె వ్యక్తిగత అవసరాల గురించా తెలియదు కానీ దీనిపై సంబంధిత అధికారులు తగు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని దీనిపై మండల కాంగ్రెస్ పార్టీ లో పనిచేసే నాయకులు కార్యకర్తలు ఉన్నారని ఆరోపిస్తుండడం కరెక్టే కానీ దీనిపై విచారణకు సిద్ధమై. అధికార పార్టీ నాయకులైన కార్యకర్తలైన ఏ నాయకులైన చట్టానికి చుట్టం కాదని దీనిపై తగు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో యూత్ నియోజకవర్గ ఇన్చార్జి. చుక్క శేఖర్. మునిగల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి. పొన్నాల లక్ష్మణ్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. భాస్కర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు.

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు

రోడ్డు వెయ్యండి బాబు… ప్రజలకు తప్పని ఇబ్బందు లు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామం నుండి గంగిరేణిగూ డానికి రైతులు పంట పొలా లకు గంగిరేణి గూడెం గ్రామం వరకు నూతన బిటి రోడ్డు మంజూరు చేశారు సదరు గుత్తేదారు రోడ్డును తవ్వి కంకర పోసి వదిలేశారు. సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నట్లు స్థానికులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు రాకపోకలకు వేరే మార్గం లేక తీవ ఇబ్బందులు ఎదుర్కొ న్నట్లు ఆగ్రహం చేస్తున్నారు. నెలలు గడుస్తున్న రోడ్డును తీసి కంకర పోసి వదిలిపెట్టారు దీన్ని ఎవరు పట్టించుకోక పోవడం వల్ల రాకపోకలను ఇబ్బందులు గురవుతున్నారు అధికారులు కానీ, ప్రజాప్రతిని ధులు గాని స్పందించి సకాలం లో రోడ్డు పూర్తయ్యాలో చూడా లని ప్రజలు కోరుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు సరిగ్గా కని పించక స్లిప్పు అయి చాలా మంది ప్రమాదాలు గురవుతు న్నారు రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో పాటు కంకర రాళ్ల వల్ల ఇప్పటికి చాలామంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోటగుళ్ల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి.

కోటగుళ్ల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి

రాబోయే రోజుల్లో ఆలయం మరింత అభివృద్ధి

దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ నందనం కవిత

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో కోటగుళ్ల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ నందనం కవిత అన్నారు. గురువారం ఆమె సిబ్బందితో కలిసి కోట గుళ్ళ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ విషయమై కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 43 సెక్షన్ కింద కోట గుళ్ళు దేవాలయం పేరున రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఆలయ
నిర్వహణ పూర్తిగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని ఇందులో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడిఎన్ అర్చక సంఘం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కార్యదర్శి కర్నే సాంబయ్య, డిడిఎన్ అర్చక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహదేవ్,జిల్లా కోశాధికారి సాంబశివుడు, అర్చకులు గురు మూర్తి, చంద్రశేఖర్, రాజు, కోటగుళ్లు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు, మామిండ్ల మల్లికార్జున గౌడ్, సభ్యులు నాగపురి శ్రీనివాస్ గౌడ్, రౌతు కిషోర్, గొర్రె ఎల్లయ్య యాదవ్ చిలువేరు ఉదయాకర్, కొయ్యల గౌతమ్ గౌడ్, సామర్ల నాగరాజు, కొయ్యల రమేష్, , తోట నవీన్, బాలాజీ నవీన్, పెద్ది ప్రశాంత్,ఆరెల్లి ఓంకార్, శంకర్ అంజి, పుప్పాల దీపక్, ఆనంద వర్ధన్, నల్లగొండ రాజు , గణేష్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

#ఆర్టీసీ సంస్థ మనందరిదీ దానిని కాపాడుకునే బాధ్యత ప్రయాణికులదే.

# నర్సంపేట డిఎం ప్రసన్న లక్ష్మి

నల్లబెల్లి , నేటి ధాత్రి:

 

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజిఎస్ ఆర్టిసి ) ఆర్టీసీ బస్సు లో ప్రయాణం అన్ని రకాల భద్రతతో పాటు సురక్షితమని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి పేర్కొన్నరు
శుక్రవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు పరిసరాలను ఆమె పరిశీలించారు. బస్టాండ్ లో గల సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఇటీవల డైల్ యువర్ డిఎం కార్యక్రమా ద్వారా ప్రయాణికుల సూచనలను సలహాలను స్వీకరించి వారి కోరిక మేరకు అదనపు బస్సు ట్రిప్పులను ఆయా ప్రాంతాలకు ప్రయాణికుల సౌకర్యార్థం నిమిత్తం పెంచడం జరిగిందన్నారు.
ఆర్టీసీ మన సంస్థ దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ప్రైవేట్ వాహనాల ప్రయాణం వద్దు మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం ముద్దు అని ప్రయాణికులకు తెలియజేశారు.
సమయపాల పాటించి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రయాణికులు. స్థానికులు. తదితరులు పాల్గొన్నారు..

డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి

డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి
మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి
*కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
* జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే*

*సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి. గీతే తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ముఖ్య ప్రణాళిక అధికారి ప్రస్తుతం క్రాప్ కటింగ్ పరిశోధనలు జరుపుతున్నారని, వీరితో సమయం చేసుకుంటూ ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలో ముగుస్తున్నందున పరిసరాల్లో ఉన్న పాన్ షాప్ వంటి వాటి పై నిఘా పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చూడాలని అన్నారు. ప్రతి మండలంలో తహసిల్దార్, ఎం.పి.డి.ఓ, పోలీస్, మండల వ్యవసాయ అధికారి వైద్య అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ ప్రణాళిక రూపోందించాలని అన్నారు.జిల్లాలో ఉన్న బార్లు, వైన్ షాప్ ప్రభుత్వ నిర్దేశిత సమయపాలన పాటించేలా చూడాలని అన్నారు. బార్ నిర్వాహకులతో వాట్స్ అప్ గ్రూప్ తయారు చేయాలని ప్రతి రోజూ ఎప్పుడు మూసి వేస్తున్నారో సమాచారం అందించాలని అన్నారు.
డ్రగ్స్ నియంత్రణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అవగాహన కార్యక్రమాల్లో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలు వివరించే వీడియోలను, పోస్టర్లను ప్రదర్శించాలని అన్నారు. డ్రగ్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన యూరిన్ కిట్లను పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారుల వద్ద అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని వైద్యారోగశాఖ అధికారికి సూచించారు. కళాశాలలో సడన్గా వింతగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించాలని, ఎవరైనా డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందజేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు, ఇటుక బట్టీల వద్ద అసిస్టెంట్ లేబర్ అధికారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనిఅన్నారు.
ఎస్పీ మహేష్ బి.గీతే మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ మాదకద్రవ్యాల నియంత్రణకు పక్కా నిఘా ఏర్పాటు చేశామని, డ్రగ్స్ చిన్న సంఖ్య లో ఉన్నా కూడా తప్పనిసరిగా సీజ్ చేయాలని, జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ బంద్ చేయాలని అన్నారు. ఆలయ పరిసరాల ప్రాంతంలో వైన్ షాప్ ఉండకుండా చూడాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి డ్రగ్స్, గంజాయి అలవాటు ఉన్నట్లు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని, మా దగ్గర అవసరమైన మేర డ్రగ్స్ నిర్దారణ కిట్లు, నార్కోటిక్స్ గుర్తించే డాగ్స్ అందుబాటులో ఉన్నాయని వెంటనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన వాల్ పోస్టర్స్, హ్యాండ్ బుక్ లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ రాధా బాయి , అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రాగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష,విద్యా, వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రదాడిని ఖండించిన పోత్కపల్లి ముస్లింలు.

ఉగ్రదాడిని ఖండించిన పోత్కపల్లి ముస్లింలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :

 

 

జమ్ముకాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఓదెల మండలంలోని పోత్కపల్లి ముస్లింలు తెలిపారు.నమాజ్ అనంతరం చనిపోయిన పహిల్గాం టూరిస్టుల కోసం మౌనం పాటించారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రధాన మంత్రి వెంటనే ఉగ్రవాదులపై దాడులు నిర్వహించాలని కోరారు. హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ డౌన్ డౌన్ నినాదాలు చేశారు.

అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు.

అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు

ఎంసీపిఐ( యు )రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి.

ఎర్ర వనంగా మారిన మాదన్నపేట అమరవీరుల సంస్మరణ సభ

ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ కవి గాయకుడు యోచన కళాబృందం ఆటపాటలు

నర్సంపేట,నేటిధాత్రి:


అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయసిద్ధికై దోపిడి వర్గ నిర్మూలన కోసం ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని ఎంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో ఎంసీపిఐ( యు ) అమరవీరుల సంస్మరణ బహిరంగ సభను గ్రామ పార్టీ కార్యదర్శి అనుమల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ముందుగా అమరవీరుల స్మారకార్థం నిర్మించిన స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.ఆనాడు కామ్రేడ్ ఓంకార్ నాయకత్వంలో వరంగల్ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించబడ్డాయని,ప్రజా పోరాటాలను చూసి ఓర్వలేని దోపిడివర్గ పాలకులు ప్రజా ఉద్యమాలపై కక్షకట్టి ఆణిముత్యాలాంటి నాయకులను హత్యచేశారని ఆరోపించారు.వారు భౌతికంగా దూరమైనా వారి ఆశయాలు త్యాగాలు వృధా కాకుండా

Public struggles

చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీవ్రంగా పెరిగిపోయాయని ఎన్నో ఆశలు,ఆకాంక్షలతో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు .అమరవీరులు చూపిన బాటలో ప్రజా సమస్యలపై సమర శీల పోరాటాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.సభలో ప్రముఖ కవి,గాయకులు యోచన కళాబృందం,ఐక్య ప్రజానాట్యమండలి కళాబృందం నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.కాగా మాదన్నపేట గ్రామం మొత్తం జెండాలతో ఎర్రవంగా మారింది.ఈ సభలో పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పెద్దారపు రమేష్ , ప్రముఖ కవి గాయకులు ,యో చన , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి ,ఎన్ రెడ్డి హంస రెడ్డి ,మంద రవి ,కన్న వెంకన్న ,మాస్ సావిత్రి , గడ్డం నాగార్జున , ఎండి రాజా సాహెబ్ , కొత్తకొండ రాజమౌళి ,కనకం సంధ్య ,కేశెట్టి సదానందం ,ఎండి మా షూక్ ,ఎల్లబోయిన రాజు ,కల కోట్ల యాదగిరి ,మార్త నాగరాజు ,సుధా , కర్నె సాంబయ్య ,గుర్రం రవి , ఆకుల రాజేందర్ ,వక్కల రాజమౌళి ,కొప్పుల సమ్మక్క ,వైనాల పద్మ ,కేశెట్టి శ్రీను , అల్లం నరసయ్య ,అమరవీరుల కుటుంబ సభ్యులు ,ప్రముఖ కళాకారులు తాళ్ల సునీల్ , గాదెపాక బాబు ,బరిగల రవీందర్ ,రావుల శంకర్ ,అనిల్ కర్ణ ,నరసింహ ,సింగన బోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రభు ను.

జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రభు ను
ఘనంఘ సన్మానించిన
జాతీయ క్రీడాకారులు రఘు
జమ్మికుంట: నేటిధాత్రి

 

 

జమ్మికుంట ప్రెస్ క్లబ్
(డబ్ల్యూ జే ఐ) అధ్యక్షులుగా నూతనంగా ఎంపికైన అంబాల ప్రభాకర్ (ప్రభు) ను శుక్రవారం జమ్మికుంట అభి శ్రీ ఫౌండేషన్ కార్యాలయంలో జాతీయ క్రీడాకారులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుగుల రఘు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆర్టిస్ట్ గా, అంతర్జాతీయ క్రీడాకారులుగా, సామాజిక కార్యకర్తగా, అనేక రంగాలలోని కాకుండా రెండున్నర దశాబ్దాలుగా జర్నలిస్టు గా వివిధ పత్రికలలో, వివిధ టి.వి ఛానళ్ల లో పని చేయడమే కాకుండా జర్నలిస్టు సంఘంలో విశేష సేవలు అందించి ఎంతో మంది గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడి సాధించిన ఘనత అని అన్నారు.
భవిష్యత్తు లో జర్నలిస్ట్ సమస్యలపై పోరాడి వాళ్లకు అండగా ఉంటూ గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కలాల ముత్యం రెడ్డి, శనిగరపు రాజు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం.!

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డులో భాస్కర్ సతీమణి శ్రీమతి శారద ఇటీవల మృతి చెందారు .ఈ విషయం తెలియడంతో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మృతురాల కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు బండారు కృష్ణ వెంట మున్నూరు సురేందర్ అభిషేక్ డాక్టర్ దానియల్ వినయ్ కుమార్ మహేష్ భరత్ కుమార్ ఇంతియాజ్ మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు

వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం.

బైక్ మెకానిక్ వైద్యానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మిత్ర బైక్ మెకానిక్ షాప్ లో మెకానిక్ గా పని చేసే సాగర్ కి ఆదివారం యాక్సిడెంట్ అయ్యి త్రీవ గాయాలు అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.గాయపడిన సాగర్ ని చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రవేట్ హాస్పిటల్ చేర్పించారు.హాస్పటల్ వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో,ఆర్థిక స్తోమత లేని కుటుంబం కావడంతో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు సాగర్ కుటుంబ సభ్యులు తెలిపారు.ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆత్మీయ చారిటబుల్ ట్రస్టును సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు సట్ల మహేందర్, అధ్యక్షుడు కాయం తిరుపతి, కోశాధికారి తూముల సురేష్, సభ్యులు బి.సంపత్,జె.సతీష్, కే.మోహన్,బి.లక్ష్మణరావు,ఈ. వెంకటేష్,జై.నాగరాజు మిగతా సభ్యులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి “భూ భారతి…

భూ సమస్యల పరిష్కారానికి “భూ భారతి…

నూతన ఆర్ఓఆర్ చట్టం – 2025″, గొప్ప వేదిక

సామాన్య ప్రజలకు అందుబాటులో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

రెవెన్యూ సదస్సు వేదికగా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళి

చారిత్రాత్మకమైన గొప్ప చట్టం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం

క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం

నారాయణపురం, బెరువాడ గ్రామాల భూ సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తాం

మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్

కేసముద్రం/ నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి – చట్టం 25, అవగాహన సదస్సు శుక్రవారం మహబూబాబాద్ , కేసముద్రం మండలల రైతు వేదికలలో , జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) కె.వీరబ్రహ్మంచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి, పిపిటి, చదివి రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అంశాలపై అవహన కల్పించారు,

ఈ సందర్భంగా మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా చారిత్రాత్మకమైన నూతన భూభారతి చట్టం అని, సామాన్య ప్రజలకు క్షేత్రస్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం, నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా
పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని,
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు.

 

Collector

భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్ల పై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్  చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం పై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని గుర్తు చేశారు.
అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్ళవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.  ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు.
గ్రామాలలో సర్వే చేసి, హద్దులు, నక్ష సిద్ధం జరుగుతుందన్నారు,
నారాయణపురం, పెరువాడ గ్రామాల భూ సమస్యల పరిష్కారం కోసం నూతన చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, అవసరమైతే ముఖ్యమంత్రి తో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు,
గత ధరణి వ్యవస్థ నిర్లక్ష్యం వలన అనేక మంది రైతులు ఇబ్బందుల పాలు అయ్యారని, ప్రస్తుత చట్టం ద్వారా క్షేత్రస్థాయిలోనే భూ సమస్యను పరిశీలించి పరిష్కరించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని మే జూన్ నెలలో పూర్తిస్థాయిలో భూభారతి చట్టం అమలులోకి రానుందని తెలిపారు,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారని గుర్తుకు చేశారు, తన వద్దకు వచ్చే సమస్యలు 80% భూ సమస్యలు మాత్రమే ఉండేవని తెలిపారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వం మంత్రివర్గం తీసుకున్న గొప్ప చారిత్రాత్మకమైన నూతన భూభారతి చట్టం అని అన్ని సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందని అన్నారు,

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మాట్లాడుతూ
భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయమైన సేవలు, అందుతాయని,
ఈ చట్టం ముఖ్యంగా విప్లవంతత్వం మైంది.
గత ధరణిలో రెవిన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు లేవని అన్నారు,
ప్రస్తుతం చట్టంలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని, తద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన విస్తృత స్థాయిలో సహాయం అందుతుందన్నారు,
క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం వెసులుబాటుకల్పించింది.
గ్రామ, మండల, డివిజనల్ స్థాయి, జిల్లాస్థాయి లలో దరఖాస్తులను పరిశీలించి ఎవరి పరిధిలో ఉంటే వారే పరిష్కరించడానికి కోసం నూతన చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అందుకు ప్రభుత్వం గ్రామ పాలన అధికారి, సర్వేయర్లను నియమించుకోవడం జరుగుతుందని అన్నారు,
ఎవరికి కేటాయించిన సమయాలలో వారు పక్కాగా సమస్య పరిష్కరించాలన్నారు,
విప్లవాత్మకమైన ఈ పథకం ద్వారా సామాన్య రైతు ప్రతి ఒక్కరు న్యాయమైన ఉచిత సేవలను త్వరితగతిన పొందుతారని సూచించారు,
రానున్న రోజుల్లో ప్రభుత్వ సూచనల మేరకు గ్రామసభలు నిర్వహించి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు,

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, మాట్లాడుతూ నూతన చట్టంపై రైతులకు సవివరంగా తెలియజేశారు,

మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, రైతులు వెంకన్న, యాకూబ్ రెడ్డి, తదితరులు భూ సమస్యల పరిష్కారం కోసం అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ సమాధానం ఇచ్చారు,

ఈ రెవెన్యూ సదస్సులో
జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, ఏడి సర్వే ల్యాండ్ ఏ.నరసింహమూర్తి, స్థానిక తహసిల్దార్ రాగం ఎర్రయ్య, ఎంపిడిఓ క్రాంతి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాస్, ఏ ఓ వెంకన్న, పిఎసిఎస్ వైస్ ప్రెసిడెంట్ అంబటి మహేందర్ రెడ్డి, ధనసరి పిఎసిఎస్ వైస్ ప్రెసిడెంట్ అల్లం నాగేశ్వరరావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారి వెంకన్న, సంబంధిత అధికారులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

కారులో వార్… ఉద్యమకారులను పట్టించు కోని

కారులో వార్… ఉద్యమకారులను పట్టించు కోని గండ్రరమణారెడ్డి వర్గం

జెండా ఎజెండా కింద పని చేస్తాం

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ప్రచన్నయుద్ధం జరుగుతుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఇద్దరు పెద్ద నాయకుల కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రమణారెడ్డి వర్గం టిఆర్ఎస్ పార్టీ మండలంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మధుసూదనాచారి వర్గాన్ని పిలువక పోవడంతో చారి కార్యకర్తలకు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యమనేత చారి గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య వాగ్దిత్వానికి దిగడం ఇందుకు నిదర్శనం. మొదటగా మేము కెసిఆర్, మధుసూదనా చారి టిఆర్ఎస్ జెండా పట్టుకుని ఉద్యమంలో తిరగడం జరిగింది. మేము బతికున్నంత కాలం కేసీఆర్ , మధుసూదనా చారి ఎజెండా కిందనే పనిచేస్తా మని అన్నారు.మా పార్టీలోకి వలసగా వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు మా ఉద్యమ కారులను పట్టించుకోకపోవడం దీనిపై అధిష్టానాన్ని తెలియ పరచడం కోసం సిద్ధంగా ఉన్నామని అన్నారు. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక నానా అవస్థలు పడుతుండడం జరుగుతుంది. ముఖ్యంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి కమిటీలు, యూత్ కమిటీలు నిర్వహించి న కూడా ప్రాధాన్యత కల్పించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

 

BRS

ఈనెల 27 బీఆర్ఎస్ రజ తోత్సవ సభను విజయవంతం చేద్దామని అన్నారు. ప్రతి గ్రామం నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు,ప్రజలు లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం కోసం మండల ఉద్యమ నాయకులు అందరూ కంకణం కట్టుకున్నా రు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ పొడిశెట్టిగణేష్, మండల అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి రవీందర్,సీనియర్ ఉద్యమ కారుల నాయకులు బలిజే నరసింహారావులు,వికలాం గుల రాష్ట్ర నాయకులు గజ్జి శంకర్ ,మాజీ యూత్ మండల అధ్యక్షులు నాగరాజు, బెరుగు తరుణ్ గోపి, కొత్తగట్టు సాయి, ముంజలా నాగరాజు,గాదె రాజేందర్,రాజు మహ్మద్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా.!

టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు తెలియజేశారు.టీఎన్జీవో ఉద్యోగులు మంచిర్యాల జిల్లా చైర్మన్ గా గడియారం శ్రీహరిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జైపూర్ తహసిల్దార్ వనజ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం,వారి అభివృద్ధికి ఎల్లప్పుడు తోడుగా ఉంటూ తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. శుక్రవారం తహసిల్దార్ వనజా రెడ్డిని కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రానికి చెందిన అనుమ రాజు ఇటీవల కాలంలో అనారోగ్యంతో అకాల మరణం చెందారు.  విషయం తెలుసుకున్న 2005-06 పదవ తరగతి  బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.40,000 లను సేకరించిన నగదును మృతుని పిల్లల పేరు మీదుగా పోస్ట్ ఆఫీస్ లో జమ చేసి  జమ చేసిన ధ్రువపత్రాలను శుక్రవారం మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ.. ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని, భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు రాజు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
     ఈ కార్యక్రమంలో చింతల మహేందర్, మురహరి భానుచందర్, ఉయ్యాల  రమేష్, కల్వచర్ల రాము, పాసిగంటి మహేందర్, ఏకు అశోక్, రాయిని శ్రీకాంత్, ఎండి సాజిత్, కమ్మగాని బాలకృష్ణ, శ్రీపతి రమేష్, నాగబాబు, తిరుపతి, క్రాంతి, రామచందర్, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

15వ విడత ఉపాధిహామి సామజిక తనికి ప్రజావేదిక.!

15వ విడత ఉపాధిహామి సామజిక తనికి ప్రజావేదిక కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి:

 

 

01ఎప్రిల్2024 నుండి 31మార్చో2025 వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలములోని ఎంజిఎన్ఆర్ఈజిఎస్ లో జరిగిన పనులపై 14ఎప్రిల్2025 నుండి 24ఎప్రిల్2025 వరకు మండలములోని అన్ని గ్రామాలలో తనికి నిర్వహించి గ్రామ సభలు పూర్తి చేసుకొని గ్రామ సభలలో గుర్తించిన అంశాలపై శుక్రవారం రోజున మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమము నిర్వహించి గుర్తించిన అంశాలను చదివి వినిపించడం జరిగింది. ఈకార్యక్రమములో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వేణు మాధవ్, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాశ్ కిరణ్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి, సింగల్ విండో చైర్మన్ ఒంటెల మురళి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. క్రిష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి యస్. రాజేశ్వరి, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్, అసిస్టెంట్ విసిలెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, సహాయక ఇంజనీర్ (పి.ఆర్) సుమన్, ఏపివో రాధ, యస్టియం సాయి, యస్.ఆర్.పి.రమేష్, ముత్తయ్య, పంచాయితి కార్యదర్శిలు, ఈ.సిలు, డి.ఆర్.పిలు, టి.ఎలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, మండలంలోని గ్రామాలకు సంబందించిన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు.

ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులో జరుగుతున్న 100 రోజుల పని తీరులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం ప్రతి ఒక్కరు వారి పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్
గురించి తెలపాలని,మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు.అలాగే సైబర్ నేరాల గురించి వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని అన్నారు. ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫిల్డ్ ఆఫీసర్ గుమాస మల్లేష్, షీ టీం సభ్యులు జ్యోతి,శ్రీలత, భరోసా సెంటర్ సబ్ ఆర్డినేటర్ పుష్పాలత,గ్రామస్థులు పాల్గొన్నారు.

అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి.!

అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

ఈనెల 30న గట్టుప్పల మండల కేంద్రంలోని ఎస్విఎల్ ఫంక్షన్ హాల్ లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలకులు మారిన ప్రజా సమస్యలు మాత్రం “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే “అన్న చందంగా మారిందని పాలక ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు. జిల్లాలో పలుచోట్ల భూ సమస్యలు ఉన్నాయని గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు అని, ఇంటి స్థలాల కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వ మాత్రం ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దున్నే వాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండాలను ఎత్తుకొని వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలర్పించారని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మునుగోడు ప్రాంత సిపిఎం నాయకులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రజా ఉద్యమాలలో అగ్ర బాగాన ఉండి అమరులైనారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని ప్రజలకు నష్టం కలిగించే విధానాలను ఎండగడుతూ అమరవీరుల ఆశయాల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. మే 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని, రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. .సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం మాట్లాడుతూ, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, మండల నాయకులు బొట్టు శివకుమార్, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములు, టేకుమెట్ల కృష్ణ, రావుల నరసింహ, అచ్చిన శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, పెదగానినరసింహ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version