ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి.

మహానీయుల ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

దేశ వ్యాప్తంగా దళితులపై మహిళలపై జరుగుతున్న సంఘటనలు అరికట్టుటలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలువిఫలమైనాయని వాటిని ఎదుర్కోవడానికి మరియు*అంబేద్కర్ పాటు మహానీయుల ఆశయాలను భావజాలాన్ని* ముందుకు తీసుకెళ్లడానికి అంబేద్కర్ యువజన సంఘాలను బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు.
గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళ పెళ్లి శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడారు .భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజల చీకటి బ్రతుకులో వెలుగులు నింపిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంటరాని తనం ను ఎదుర్కోని పట్టుదలతో భవిష్యత్తు తరాల ప్రజల కోసం సమాన హక్కులను కల్పిస్తూ అందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం రిజర్వేషన్లు ఓటు హక్కును కల్పించారన్నారు. పల్లెల్లో ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను ఆలోచనలు ప్రజలకు తెలియ పరువాలని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 31 వరకు గ్రామ గ్రామాన అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల కోశాధికారి కనకం తిరుపతి జిల్లా నాయకులు బండార్ రాజు, దొమ్మటి ఓదెలు, బొచ్చు నరసయ్య, సంపత్, సదానందం, భూమి రెడ్డి, సుమంత్, తదితరులు పాల్గొన్నారు

నూతన తాహసిల్దార్ ను కలిసిన రేషన్ డీలర్లు.

నూతన తాహసిల్దార్ ను కలిసిన రేషన్ డీలర్లు

నడికూడ నేటిధాత్రి:

మండలం తహసీల్దార్ కార్యాలయం లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డి ని మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరుపున మర్యాద పూర్వకంగా డూప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు గడ్డం సర్వేశం,ప్రధానకార్యదర్శి మాదాసు శ్రీనివాస్,రేషన్ డీలర్లు దుప్పటి కిష్టయ్య, సుమన్,చిదిరిక సుమలత, రమేష్,అరుణ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

స్త్రీ పురుషుల సమానత్వం కొసం ఉద్యమించాలి.

స్త్రీ పురుషుల సమానత్వం కొసం ఉద్యమించాలి

మహిళ హక్కుల సామాజిక కార్యకర్త అశాలత

నిజాంపేట్ నేటి ధాత్రి:

 

భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రంగాలలో స్త్రీ పురుషల సమానత్వం కోసం ఉద్యమించాలని మహిళ రైతుల హక్కుల వేదిక రాష్ట్ర నాయకురాలు ,సామాజిక కార్యకర్త అశాలత పిలుపునిచ్చారు. గత రెండు రోజులు గా మెదక్ జల్లా నిజాంపేట్ మండల కేంద్రం లో దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో భారత రాజ్యాంగం హక్కులు చట్టాలు నాయకత్వ లక్షణాల పై శిక్షణ తరగతులు జరిగాయి.శుక్రవారంనాడు జరిగిన శిక్షణ శిబిరంలో అశాలత సామాజిక, ఆర్ధిక,రాజకీయ పరిస్థితులు జెండర్ సమ దృక్పథం పై ప్రసంగిస్తూ ఆర్ధిక,శారీరక దోపిడిని ప్రశ్నిస్తూ మహిళ పై హింసలేని సమాజ నిర్మాణం కొసం పని చెయాలన్నారు.నేటికి 65 శాతం దళిత మహిళలు భూమి లేని కూలీలుగా సామాజిక భద్రత కరువైనదనదన్నారు.
ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం పై డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపంలో మానవ హక్కులు అమలవుతున్న అంటరానితనం ,వివక్ష ,దాడులు దళితులకు నిత్యకృత్యంగా మారాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని అయుధంగా మలుచుకొని దాడులకు పాల్పడే వారిని జైలు లకు పంపించాలన్నారు.భూ సేకరణ చట్టం – 2013 పై కాళ్ళకల్ నిర్వాసితుల సంఘం నేత మైలారం నర్సింహ్మ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ల నుండే భూములను బలవంతంగా స్వాధీనం చేసుకొని కూలీలుగా ప్రభుత్వం మారుస్తున్నారన్నారు. చట్టం ప్రకారం న్యాయమైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భూములను సేకరించాలన్నారు.డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి భారత రాజ్యాంగం-డిబిఎఫ్ లక్ష్యం పై మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అమలు చెసుకొవడమడమే డిబిఎఫ్ లక్ష్యమన్నారు.భారత రాజ్యాంగాన్ని పరిరక్షణ కు సంఘటితం కావాలన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హమి పధకం అమలు పై డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి మాట్లాడుతూ భూమి లేని,నైపుణ్యం లేని కూలీలకు సంవత్సరానికి వంద రోజుల పని దినాలు కల్పించాలన్నారు.పని వద్ద కనీస వసతులు నీరు,నీడ,వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు.భూ బారతి చట్టం పై డిబిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్ మాట్లాడుతూ భూ బారతి చట్టం పై అవగహన పెంపొందించుకొవాలన్నారు. భూసంస్కరణల అమలు కొసం పొరాడాలన్నారు.దళిత ఉద్యమం మిడియా పాత్ర పై సీనియర్ జర్నలిస్టు ఆస శ్రీ రాముల మాట్లాడుతూ అంబేద్కర్ మూక్ నాయక్,మహాత్మ జ్యోతి రావు పూలే సత్యశోధక్ పత్రికలను నడిపి జాతి ని చైతన్యం చెశారన్నారు.ఈ శిక్షణ తరగతులో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్,రాయిన్ పల్లి నర్సింహ్మ,చుంచు రాజేందర్,భీమ్ శేఖర్,వేణు,కల్వకుంట్ల చంద్రం కర్ణాకర్,నరెష్,రవిందర్,వాణి శారద,పల్లవి తిరుపతి,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్.

సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్, రిమాండ్ కి తరలింపు.

వివరాలు వెల్లడించిన సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ.

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ బోయినిపల్లి మండలము జగ్గారావు పల్లి గ్రామానికి చెందిన కొమురయ్య అనే వ్యక్తి తేదీ:12-05-2025 నరోజున తన భార్య తో కలసి సిద్దిపేటలో ఉన్న తన బందువుల పెళ్ళికి వెళ్తుండగా సిరిసిల్ల బస్ స్టాండ్ లో తన భార్య యొక్క హాండ్ బ్యాగ్ లో నుండి 1) బంగారు నల్ల పూసల తాడు, 2) ఒక జత బంగారు చెవుల కమ్మలు 3) బంగారు వంక ఉంగరము 4) బంగారు చైన్ గల బంగారు ఆభరణాలు:48.47 గ్రాములు డబ్బను గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా బస్ స్టాండ్ లో ఉన్న CC కేమేరాల ఆధారంగా నిందితుని గుర్తించి వేల్పుల రాజేశ్వర్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని దర్యాప్తు చేసి తెలుసుకొని.ఈరోజు సిరిసిల్లలోని పెద్దబజారులోని శివాలయం వద్ద అదుపులోకి తీసుకొని దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించడం జరగిందన్నారు.

Inspector Krishna.

 

పోలీస్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు విజ్ఞప్తి

1.బస్టాండ్ లాంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు బంగారముతో వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండవలెను.
2. మహిళలు బంగారు ఆభరణాలతో ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా ఇంటి నుండి బయటకు
వెళ్లినప్పుడు కానీ ఎవరినైనా తోడుగా తీసుకువెల్లవలెను .
3. రద్దీ ప్రదేశాలలో, ఇంటి దగ్గరి ప్రదేశాలలో ఎవరైనా కొత్తగా గాని అనుమానముగా కానీ కనపడితే వెంటనే పోలీస్ వారికి సమాచారము అందించాలి.
4.ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును బ్యాంక్ లాకర్లో భద్రపర్చుకోవడం క్షేమాం.

సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న మంచిర్యాల జిల్లా.

సరస్వతి పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న మంచిర్యాల జిల్లా పంచాయతీ రాజ్ ఉద్యోగులు

మంచిర్యాల నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద మే 15 నుండి నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలలో పారిశుధ్య కార్యక్రమాలను మంచిర్యాల జిల్లా పంచాయితి రాజ్ ఉద్యోగులు పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పంచాయితీ అధికారి డి.వేంకటేశ్వర రావు మాట్లాడుతూ..పుష్కరాలకు అశేష భక్తులు హాజరు అవుతున్నందువలన అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులతో తడి చెత్త,పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం జరుగుతుందని,ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడంతోపాటు అవసరం ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం జరుగుతుందని,మండల పంచాయితీ అధికారులతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వర రావు,మండల పంచాయతీ అధికారులు సఫ్తర్ అలీ, ఇంచార్జీ డి ఎల్ పి ఓ,శ్రీపతి బాపు రావు ఎంపీఓ జైపూర్,సత్యనారాయణ, ఎంపీఓ మందమర్రి,అజ్మత్ అలీ ఎంపీఓ చెన్నూరు, బి.శ్రీనివాస్ ఎంపీఓ బెల్లంపల్లి, జి.అనిల్ కుమార్ ఎంపీఓ తాండూర్,ప్రసాద్ ఎంపీఓ దండేపల్లి తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు సెంటర్లలో తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్.

వడ్ల కొనుగోలు సెంటర్లలో తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండలంలోని వడ్ల కొనుగోలు సెంటర్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముదిగుంట,శెట్టిపల్లి, కుందారం,వేలాల,కిష్టాపూర్, పౌనూర్ గ్రామాలలో ఏజెన్సీల ప్యాడి సెంటర్లు తనిఖీ చేయడం జరిగినది.వడ్ల సెంటర్లలో ఉన్న వరి ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని తెలిపారు.అలాగే అకాల వర్షం ఉన్నందున వడ్లు తడవకుండా కాపాడుకోవాలని,హమాలీల కొరత ఉంటే బయట నుండి తీసుకొచ్చి మూడు షిఫ్టీలలో వర్క్ చేపించాలని అన్నారు.వడ్ల మైచర్ చూసి కాంట వేసి లారీలలో తరలించి మే 25వ తేదీ వరకు వడ్ల సెంటర్లో పూర్తి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి,ఏపీఎం,సిసిలు పాల్గొన్నారు.

మల్లక్కపేట భక్తాంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు.

మల్లక్కపేట భక్తాంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు

 

పరకాల నేటిధాత్రి

హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలోగల శ్రీభక్తంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం రోజున ఆలయ హుండీలను ఆలయ చైర్మన్ అంబీరు మహేందర్ మరియు ఆలయ ఈఓ వెంకటయ్య,ఇన్స్పెక్టర్ ఆర్.అనిల్ కుమార్ పర్యవేక్షణలో లెక్కించడం జరిగింది.ఆరునెలల వ్యవది గల రెండు హుండీలను లెక్కించగా 82355 రూపాయలు ఆలయ కమిటీ తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి ఆలయ ఆదాయం పెరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో శరత్ అయ్యగారు,ధర్మకర్తలు దొమ్మటి శంకరయ్య,దావు జ్యోతి,చిట్టిరెడ్డి రాజిరెడ్డి,బిళ్ళ రాజిరెడ్డి,నిట్టే బాలరాజు,సిబ్బంది పాల్గొన్నారు.

అట్టహాసంగా లక్ష్మి ఎస్ మార్ట్ ప్రారంభోత్సవం.

అట్టహాసంగా లక్ష్మి ఎస్ మార్ట్ ప్రారంభోత్సవం
సూపర్ మార్కెట్ ని ప్రారంభించిన టీజీ క్యాబ్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు

నేటిధాత్రి అయినవోలు:

ఐనవోలు మండల కేంద్రంలోని బరోడా బ్యాంకు పక్కన మాజీ సర్పంచ్ & మాజీ ఆలయ చైర్మన్ మునిగాల సమ్మయ్య నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మి సూపర్ మార్కెట్ (మార్ట్) నీ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ యజమాని మునిగాల సమ్మయ్య
మాట్లాడుతూ, అయినవోలు మండల చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకి అతి తక్కువ ధరలోని నాణ్యమైన సరుకులు అందించాలన్న ఉద్దేశంతో ఈ సూపర్ మార్కెట్ ని అందుబాటులోకి తేవడం జరిగిందని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సమ్మయ్యకు కి చైర్మన్ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి.

పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి
సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన శంకర్ సిరిసిల్ల టౌన్ ప్రస్తుతం, లక్పతి వేములవాడ రూరల్ మోతీరం,బోయినపల్లి లను ఎస్పీ మహేష్ బి గితే అభినందించినారు.ఈసందర్భంగా ఎస్పి మహేష్ బి గితే మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలనిఅన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయనిఅన్నారు.

విత్తన ఎరువుల దుకాణాల్లో.

విత్తన ఎరువుల దుకాణాల్లో తనిఖీలు ఎన్ రమేష్ ఏడిఏ
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

మొగుళ్ళపల్లి మండల పరిధిలోని రంగాపూర్, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొర్కిశాల, పిడిసిల్ల గ్రామాలకు చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారుల షాప్లను తానిఖీ చేశారు తానిఖీలో పత్తి విత్తనాల లభ్యత & నిల్వలు, ఎరువుల లభ్యత & నిల్వలు లైసెన్స్ వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది.
డీలర్లు విధిగా పాటించవల్సిన నియమాలు:
డీలర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి మరియు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి.
స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్కులపై వ్యవసాయ అధికారితో సర్టిపై చేయించుకోవాలి.
డీలర్లు తప్పనిసరిగా మరియు విధిగా రైతు కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు/రశీదు ఇవ్వాలి. బిల్లులపై తప్పనిసరిగా డీలర్ యొక్క లైసెన్సు నెంబర్ వేయాలి.
స్టాక్ బోర్డు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి, రోజువారీగా నిల్వల వివరాలు స్టాక్
బోర్డుపై రాయాలిబ్లాక్ మార్కెటింగ్, ఎక్కువ ఏం.ఆర్.పి (MRP) కి అమ్మినచో లైసెన్సు రద్దుపరచబడును. లైసెన్సు లో పేర్కొన్న గోడౌన్లో మాత్రమే సరుకును నిల్వ చేయాలి లేని ఎడల అనధికారికంగా
పేర్కొని స్వాధీనం చేసుకోవడం/సీజ్ చేయడం జరుగుతుంది. సరుకు లెక్కపెట్టే విధముగా నిల్వచేయాలి. డీలర్లు సరుకులను ఫ్యాకెట్ రూపంలో మాత్రమే అమ్మకం చేయాలి, లూసుగా అమ్మకం జరపరాదు.
లైసెన్సులో పేర్కొన్న అడ్రెస్ లో మాత్రమే అమ్మకంగాని, నిల్వలుగాని చేయాలి.
డీలర్లు చట్టంలో పొందపరిచిన విధముగా రికార్ద్లు , రిజిస్టర్లు ,బిల్లులు విధిగా పాటించాలి. ఇట్టి తానిఖీలో స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి ఎస్సీ గురుకుల కాలేజీల కుదింపు.

దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి ఎస్సీ గురుకుల కాలేజీల కుదింపు

నిరుపేద దళిత విద్యార్థులు గురుకుల విద్యకు దూరం

ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని సస్పెండ్ చెయ్యాలి

 

శాయంపేట నేటిధాత్రి:

 

రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలలో వివిధ చోట్ల జూనియర్ కళాశాలలో మూసివేయడానికి కుట్రలు చేస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఎస్సి విద్యా ర్థుల పట్ల వివక్షత చూపుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని తొల గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడు తూ ఎస్సీ విద్యార్థుల కోసం పెద్ద పీఠం వేస్తున్న తరుణంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని జోగు లాంబ,గద్వాల ,కరీంనగర్, చొప్పదండి, ఖమ్మం, మహబూ బాద్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి ,జయశంకర్ భూపాలపల్లి ,జనగాం మేడ్చల్ మల్కాజిగిరి,12 జిల్లాల ఎస్సీ గురుకులాల కళాశాలను సరిపడా విద్యార్థులు లేరని సాకులతో మూసివేయడం సరి కాదు. ఈ విషయం సీఎం రేవం త్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గురుకుల మంత్రి పొన్నం ప్రభాకర్ కు టెట్ ద్వారా చేర్చపరచం 2025 విద్య సంవత్సరంలో నుండి అక్కడ చదువుతున్న విద్యా ర్థులు ఎక్కడికి పోవాలి తెలి యక ఆందోళన చెందుతు న్నారు ఈ నిర్ణయం పట్ల దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపో యే ప్రమాదం ఉందని వాపో యారు ఒకే కాలేజీలో రెండు కోర్సుల చొప్పున ఇంటర్ ప్రాథమిక సంవత్సరంలో 120 ద్వితీయ సంవత్సరంలో 120 మంది మొత్తం 240 సీట్లు ఉంటాయి. 12 గురుకులాల్లో జూనియర్ కళాశాలలు మూసి వేయడం వల్ల 28 సీట్లు రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల నిరు పేద దళిత విద్యార్థులు గురుకుల విద్యను కోల్పోతారు. ఈ విష యాన్ని గమనించి సీఎం స్పందించి ఎస్సి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు.

ఉద్యమం తప్పదు

బిఎస్ యు ఉమ్మడి వరం గల్ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్

గురుకుల కాలేజీ కుదుంపు కోర్సుల నిర్వహణపై పరిమి తులు విధించాలని సొసైటీ ఉన్నతాధికారుల నిర్ణయంపై ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రు లు మరోవైపు గురుకుల ఉద్యో గ ఉపాధ్యాయ యూనియన్ అనాలోచితంగా అసంబద్ధ మైన నిర్ణయాలు తీసుకుంటు న్నారని తప్పుడు పడుతు న్నారు గురుకుల సొసైటీ పూర్తిగా నిర్ణయం చేస్తే ఉద్యమాలు చేయడానికి ముందు ఉంటామని హెచ్చరించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని బీఎస్ యు డిమాండ్ చేశారు లేదంటే భారీ ఉద్యమం చేపడతామని  హెచ్చరించారు

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ప్రవీణ్.ఆధ్వర్యంలో పాత్రికేయుల.సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చిందా. ప్రజల మధ్యలో ఉంటున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని. తోట ఆగయ్య. కొండూరి రవీందర్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేస్తే. 2002. 2003. వ. సంవత్సరంలో 36. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే . ఇప్పుడు. ఇప్పుడు అలాగే 2024. 2025. సంవత్సరానికి. 68 . లక్షల మెట్రిక్. తన్నుల. ధాన్యాన్ని కొనుగోలు చేసిన.ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని. చివరికి గింజ.వరకు కొంటామని చెప్పాము మీరు అధికారంలో ఉన్నప్పుడు. ప్రోటోకాల్ పాటించారా. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ ఫోటోకాల్ ప్రకారం అధికార కార్యక్రమంలో పాల్గొని కూర్చున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడే ఉంటానని చెప్పి కేటీఆర్.ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఏ ఒక్కరోజు ప్రజల పక్షాన పోరాడని. ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు. పదవి లేకున్నా ఉన్న ప్రజల్లో ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని ప్రజలను దోపి ది. చేసి.దోచుకున్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం సిగ్గుచేటు. మీరు చేసిన తప్పులను అక్రమాలను దాచిపెట్టి వేదాలు వల్లిస్తామంటే ఎవరు నమ్మరు. రైతు రుణమాఫీ రైతు భరోసా ఇచ్చాం మీలాగా గుట్టలకు బూట్టలకు ప్రజాధనాన్ని దోచుకోలేదు. ప్రజా ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారుల కు.పథకాలను. అందిస్తున్నామని. ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ ధాన్యం. కొనడం లేదని చెప్పడం సిగ్గుచేటు అని. మీరు ఎన్ని చేసినా ప్రజలే వారు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు అని. తెలియజేస్తూ. ప్రజలేతన ప్రోటోకాల్ గా. ప్రజల మధ్యలో ఉంటున్న ఏకైక వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అని. అధికారం పోయాక . మతిభ్రమించి. మాట్లాడుతున్నారని. దయచేసి ఇప్పటికైనా. ప్రజలకు మేలు చేయాలి తప్ప. తప్పుడు సంకేతాలు పంపకుండా. ప్రజల గురించి పోరాడాలని. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఉపాధ్యక్షులు. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. జిల్లాప్రధాన కార్యదర్శి. లింగాల భూపతి. విద్యార్థి జిల్లా అధ్యక్షులు. వెలుపుల సాయి ప్రసాద్.. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. కటకం రాజశేఖర్. శ్రీకాంత్ గౌడ్. సత్తు శ్రీనివాస్ రెడ్డి. కొత్త రవి గౌడ్. ఇటికల మహేందర్. బండి పరశురాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

నడికూడ,నేటిధాత్రి:

 

మండల రైతు వేదిక నందు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.మధు డా. హరి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి 6 అంశాల పైన ముఖ్యంగా మాట్లడటం జరిగింది.వాటిలో
తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చును తగ్గించండి.
అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడండి.

రసీదులను భద్రపరచండి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందండి
సాగు నీటిని ఆదా చేయండి భావితరాలకు అందించండి
పంట మార్పిడి పాటించండి సుస్థిర ఆదాయాన్ని పొందండి.
చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి.
యూరియాను అధిక మోతాదులో వాడటం వల్ల నేల యొక్క ఆమ్లత్వం పెరిగి నేలలోని సూక్ష్మ జీవులు నశించడమే కాకుండా ఇతర పోషకాలను పంట తీసు కోకుండా చేసి దిగుబడులను తగ్గిస్తాయి.కాబట్టి యూరియా సిఫారసు చేసిన మేరకు నుండి దఫాలుగా ఇతర పోషకాలతో కలిపి వేసుకోవాలి.

వాతావరణ మార్పులకు అనుగుణంగా పంట మార్పిడి విధానం ద్వారా నేలసారాన్ని సహజ సిద్ధంగా పెంచే పప్పు ధాన్యపు పంటలు, నూనెగింజ పంటలను మరియు నీటిని తక్కువగా వినియోగించుకునే చిరు ధాన్య పంటలను వరి తర్వాత యాసంగిలో వేసుకున్నట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చు.

నీటిని ఆదా చేసే యాజమాన్య పద్ధతులైన సూక్ష్మ బింధు సేద్యం మరియు మల్చింగ్ ద్వారా 50-60% నీటిని సంరక్షించుకోవడమే కాక అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.వరి సాగుచేసే నేలల్లో నీరు ఇంకే గుణం కోల్పోయి,భూగర్భ జలాల మట్టం తగ్గిపోతుంది.

ఒక ఎకరం వరి సాగు చేసే నీళ్ళతో 3 ఎకరాల జొన్న, మొక్కజొన్న మరియు వేరుశనగ పంటలను సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు రైతుల కు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్ర మానికి హాజరైన మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ మాట్లడుతూ తొలకరి వర్షాలకు జీలుగ, మరియు పెసర్లు,వరి నాట్లకు ముందు వేసుకొని భూమిలోనే 45 రోజుల తర్వాత కలియ దున్నడo వలన నేలలోని కర్బన పదార్థం పెరుగుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మాదారపు,రామకృష్ణ,జోరు ప్రశాంత్,కిన్నెర చికిత, వ్యవసాయ కళాశాల విద్యార్థినులు మరియు రైతు సోదర సోదరీమణులు పాల్గొనడం జరింగింది.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జరుపుల యాదమ్మ వీరన్న నాయక్ దంపతుల కూతురు ఊర్మిళ అమీర్ లాల్ వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పెద్ది శ్రీనివాస్ రెడ్డి, సుంకరి సంతోష్ రెడ్డి, వాంకుడోతు రాజన్న,రాచర్ల నాగరాజు,మామిడి ఐలయ్య, భాషబోయిన రాజు,మాజీ సర్పంచ్ అజ్మీర పాపయ్య,జితేందర్,నవీన్,క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి.

ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట నీళ్ల పాలైతే పట్టించుకోని ప్రభుత్వం

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ నాయకులుఈ సందర్బంగా భూపాలపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ
అకాల వర్షాలకు అన్నదాత ఆగమైతుంటే, ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీళ్ల పాలైతే, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు. మండలం గాంధీనగర్ గ్రామ రైతుల పరిస్థితి మాత్రమే కాదు దాదాపు రాష్ట్రమంతా ఇదే దుస్థితి. ములుగే నక్కపై తాటి పండు పడ్డట్టు రైతు పరిస్థితి ఉంది.
ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది.
సొంత మండలం అని గొప్పలు చెప్పుకునే స్థానిక శాసనసభ్యులు కొనుగోల కేంద్రాల్లో కాంటాలు అయి 4,5 రోజుల నుండి ధాన్య బస్తాలు కల్లాలో ఉన్న వాటిని మిల్లు లకు తరలించంచడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ లారీలను కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.గత 4,5 రోజుల నుండి వర్షాలు పడుతు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిచి రైతులు బాధ పడుతుంటే స్థానిక శాసనసభ్యులు కనీసం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల యొక్క వడ్లను కటింగ్ లేకుంటే కొంటామని ధైర్యాన్ని ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు.కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, రైతుల బతుకులు కాపాడాలని మంత్ర ఉత్తంకుమార్ సివిల్ సప్లయిస్ కమిషనర్ , భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నాం బి ఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు తోడుగా ఉంటామని తెలియజేశారు 2, 3 రోజుల్లో వడ్లను పూర్తిగా మిల్లులకు తరలించకపోతే బిఆర్ఎస్ పార్టీ తరపున భారీ ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భైరగాని కుమారస్వామి గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు మామడి రమేష్, ఉపాధ్యక్షుడు రాము , నాయకులు బోట్ల స్వామి, రవి, వాజిత్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు

ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుండెకారి రంగారావు.

ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుండెకారి రంగారావు

నర్సంపేట,నేటిధాత్రి:*

 

 

ఆరె కుల సంక్షేమ సంఘం ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన గుండెకారి రంగారావును ఎంపికయ్యారు.ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా ఆరెకుల ముఖ్య నాయకుల సలహా సూచన మేరకు కృషి చేస్తానని అన్నారు. తన మీద ఎంతో నమ్మకంతో బాధ్యతను కట్టబెట్టి, కుల సంఘ నిర్మాణంలో, కార్యక్రమాలలో నా వంతు సహాయ, సహకారాలతో పాటు,తనకు గ్రామ,మండల,జిల్లా, రాష్ట్ర కమిటీ నాయకులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.తన నియామకానికి సహకరించిన ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు,
రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ, రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్,స్టీరింగ్ కమిటీ చైర్మన్ దిగంబర రావు,రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తాల చందర్ రావు,క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మారుజోడు రాంబాబు, రాష్ట్ర, జిల్లా కమిటీ ముఖ్య నాయకులకు రంగారావు కృతజ్ఞతలు తెలిపారు.

చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

చనిపోయిన ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

దామెర కుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఇటీవల మరణం చెందిన గౌడ సంతోష్ పిఆర్టియు టీఎస్ క్రియాశీల సభ్యునికి వారి గృహంలో శాసనమండలి సభ్యులు శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఒక లక్ష 70 వేల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు . ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పి ఆర్ టి యు టి ఎస్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి సంఘం రక్షణ కవచంగా ఉంటుందని , అలాగే సంతోష్ కుటుంబానికి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు ,ఉద్యోగ కల్పన ఇప్పించే బాధ్యత తనదేనని , రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత చికిత్స అందించే హెల్త్ పాలసీని రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ,ఉపాధ్యాయులకు కాంట్రాక్టు సిబ్బందికి అందరికీ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఉత్తర్వులు ఇప్పిస్తానని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ ఉద్యోగులకు డెత్ గ్రాట్యూయిటి మరియు ఫ్యామిలీ పెన్షన్ పి ఆర్ టి యు ఇప్పిచ్చిందని , రాబోయే కాలంలో ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించేలా ప్రభుత్వాన్నీ ఒప్పిస్తానని తెలియజేశారు . గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కారుణ్య నియామకం ఉద్యోగి మరణించిన నెలలోపు వారి కుటుంబ సభ్యులకు వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేగూరి సుభాకర్ రెడ్డి , కుసునపు కిరణ్ కుమార్ హనుమకొండ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి , కాటారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంగోత్ రవీందర్ ,అనపర్తి తిరుపతి భూపాలపల్లి మండల అధ్యక్షులు హరిప్రసాద్ , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాబురావు  పాల్గొన్నారు

వెయ్యి కొట్టు కొత్త రేషన్ కార్డు పట్టు.

వెయ్యి కొట్టు కొత్త రేషన్ కార్డు పట్టు

– దందా గిరి లేపుతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు.

– డోర్నకల్ నియోజకవర్గం లో పలు మండలాలలో ఇదే దంద

– కొత్త రేషన్ కార్డు ఆశ హవుల నుంచి డబ్బులు వసూలు

– పలు మండలాలలో బహిరంగంగానే చర్చించుకుంటున్న ప్రజలు

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఏ స్కీంకు అప్లై చేసుకోవాలన్న కానీ కావలసింది రేషన్ కార్డు.

అయితే ప్రతి కుటుంబంలో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు అనేది అవసరం.

అయితే గత ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు లేక ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది గురి కావడం జరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో మీసేవ సెంటర్ల ఆన్లైన్ చేసుకొని ఎమ్మార్వో ఆఫీస్ లో ఇచ్చినచో వెరిఫికేషన్ చేసి వెంటనే కార్డు మంజూరు చెయ్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే దీనికి భిన్నంగా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు.

రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వచ్చిన ప్రజల నుంచి కార్డుకు వెయ్యి రూపాయల చొప్పున కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులపై ప్రజలు ఆరోపిస్తున్నారు.

డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో రెవెన్యూ అధికారులు చేస్తున్న పని తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని చెప్పడంతో రేషన్ కార్డులు లేని ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత తిరిగి ఎమ్మార్వో ఆఫీస్ లో అప్లై చేసుకొని కార్డు మంజూరు చేసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నారు.

ఇది అదును చేసుకొని రెవెన్యూ అధికారులు మాత్రం సొమ్ము చేసుకోవడం జరుగుతుంది.

రేషన్ కార్డు కావాలని వచ్చిన వాళ్ల నుంచి కొంతమేర డబ్బులు వసూలు చేసుకుని వారికి వెంటనే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కొంతమంది రోజులు గడిచిన గాని రేషన్ కార్డు మంజూరు కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

ఒకే రోజు ఇద్దరు అప్లై చేసుకోగా అందులో ఒకరికి వారంలో కార్డు మంజూరై మరొకరికి రాకపోవడంతో కంగు తింటునారు.

డబ్బులు ఇస్తేనే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తున్నారని రెవెన్యూ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు.

డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు మంజూరు చేసే అధికారుల పైన పై స్థాయి అధికారులు దృష్టి పెట్టి తగిన న్యాయం చేయాలని రేషన్ కార్డు లబ్ధిదారులు కోరుతున్నారు.

హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం.

హుగ్గెల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

◆ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పండితులు
వేదమంత్రాల నడుమ బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో జహీరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐజీ సత్యనారాయణ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎంపీ కాంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు తదితరులు హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు. హుగ్గెల్లిలో బసవేశ్వరుడి విగ్రహం వద్ద వేద పండితులు, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
బసవేశ్వరుడి విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వగురు బసవేశ్వరుని స్పూర్తి, ఆలోచన విధానంతో బసవేశ్వరుని దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం జన గణనలో కుల గణన చేసి చూపెట్టిందని తెలియజేశారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ అడుగడుగున మహాత్మా జ్యోతి రావు పూలే, మహాత్మా గాంధీ, బసవేశ్వరుడు స్ఫూర్తితో
సామాజిక న్యాయాన్ని ప్రజలందరికీ అందజేయాలని ఆయన ఆక్షించారని ఆయన సూచనలతోనే తెలంగాణలో కుల గణన చేసి చూపించామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ , జిల్లా ఇంచార్జీ మంత్రి కొండా సురేఖ, ఎంపీ సురేష్ షట్కర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జిల్లా లింగాయత్ సమాజా నాయకులు గురువులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని సి.పి.ఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముషాం రమేష్ మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం తీవ్రంగా తడిసి మొలకెత్తడం జరిగినది. అని తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. అన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యానికి మొత్తం కొనుగోలు చేయాలని సి.పి.ఎం పార్టీ డిమాండ్ చేస్తుంది
ప్రతి సీజన్లో పంట పండించిన రైతుకు మొత్తం పంట ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా పంటకు ఎప్పుడు ఏమైతదో అని భయం గుప్పిట్లో బతకవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
గతంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న రైతుల రైతుల బతుకులు ఎలాంటి మార్పు జరగడం లేదు.
బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల. జెండాలు వేరైనా మోసాలు ఒకటే. విధానాలు ఒకటే రైతే రాజు అని
రైతులను మోసం చేసి రైతుల ఓట్లతో అధికారం లోకి వస్తున్నాయి. రైతులు పండించిన పంటకు నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళిక చేయకపోవడంతోనే ప్రతి పంట సీజన్ లో వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.ఇప్పటికైనా రైతులకు నష్టాలు జరగకుండా పండిన పంటను వెంట వెంటనే కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు ఈ సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి,కోడం రమణ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version