వరణుడి సంకేతం..రాబోయే కాలం సుభిక్షం!

-రేవంత్‌ పాలనకు మేఘ సందేశం!

-కాంగ్రెస్‌ పాలన అంటేనే వానా కాలం కలిసి రావడం.

-ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం వున్నంత కాలం కరువే.

-తర్వాత పదేళ్లు కాంగ్రెస్‌ పాలనంతా జలమే జలం.

-తెలంగాణ వచ్చిన తర్వాత జూన్‌ లో విస్తారమైన వానలెప్పుడూ లేవు.

-అవసరానికి రాని వానలు తిరోగమన రుతుపవనాలు కురిసేవి.

-నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసేవి.

-మళ్ళీ కాంగ్రెస్‌ వచ్చింది కరువు తెలంగాణలో మాయమైంది.

-గతంలో ఎప్పుడూ లేని విధంగా మేలోనే వాన పలకరింపు.

-తొలకరి సమయానికి పూర్తి వానలు.

-ఖరీఫ్‌ సాగుబాటుకు ముందే వాన ముహూర్తం.

-వాన కోసం ఎదురుచూడకుండానే వరణుడి కనికరం.

-గత యాభై ఏళ్లలో ఇలాంటి పరిస్థితి కనబడలేదు.

-ఈసారి పెద్దగా చెడగొట్టు వానలు లేవు.

-పంటలు చేతికొచ్చే సమయంలో రైతులు ఇబ్బందులు పడలేదు.

-ఈసారి రైతుకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.

-కాంగ్రెస్‌ అంటేనే రైతుకు కలిసొచ్చేకాలం.

                                    హైదరాబాద్‌,నేటిధాత్రి:  

 రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవడం అనేది పాలకుడి జాతకం మీద ఆదారపడి వుంటుందని లెక్కలేయడం పరిపాటి. అందుకు ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో కూడా ఈ విషయాలు వెల్లడిస్తుంటారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సమృద్దికరమైన వర్షాలు పడుతున్నాయి. గత ఏడాది మెండైన వానలే కురిశాయి. అందుకే గత పదేళ్ల కన్నా ఎక్కువగా రాష్ట్రంలో పంటలు పండినట్లు కూడా లెక్కలున్నాయి. పాలకుడి జాతకాలు కూడా వాతావరణ పరిస్దితుల మీద ప్రభావం చూపుతాయని అనేక సందర్భాలు కూడా రుజువు చేశాయి. గత యాభై ఏళ్ల కాలంలో మే నెల నుంచే వానలు కురవడం అన్నది ఎప్పుడూ లేదు. సహజంగా జూన్‌ మొదటి , రెండవ వారంలో మాత్రమే తొలకరి పలరింపులు జరుగుతుంటాయి. పైగా నైరుతి రుతుపవణాలు బలంగా వుంటే తప్ప ఆ తొలకరి కూడా పలకరించే అవకాశం వుండేది కాదు. కాని ఇంకా రుతుపవణాలు అండమాన్‌ నికోబార్‌ల్‌లను తాకమందు నుంచే వానలు కువడం అనేది చాలా అరుదు. మండు వేసవిలో ఇలా చల్లటి వాతావరణం కూడా చాలా అరుదు. సహజంగా మార్చి, ఎప్రిల్‌ నెలల్లో వడగండ్ల వానలు కురుస్తుంటాయి. ఇప్పుడు కొంత తక్కువైనా, గత ముప్పై, నలభైఏళ్ల కాలంలో ఎప్రిల్‌ నెలల్లో వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయిన సందార్భలు అనేకం వున్నాయి. వరి పంట పొట్టకొచ్చే సమయంలోనో, లేక పంట కోతల ముందో విపరీతమైన రాళ్ల వానలు పడుతుండేవి. దాంతో వరి కంకులు రాలిపోయేవి. పొలమంతా నీళ్లలో నానిపోయేది. రాళ్ల వానకు మొత్తం వరిగింజలన్నీ రాలిపోయేవి. ఇక ఇతర పంటలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతూ వుండేవి. మామిడి వంటి తోటలకు తీవ్రమైన నష్టం జరుగుతుండేది. మార్చి, ఎప్రిల్‌ నెలల్లో పిందె దశలో వుండే మామిడికాయలు రాలిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోతుండేవారు. ఒక వేళ మామిడి చేతికొచ్చే దశలోనైనా కూడా ఖచ్చితంగా చెడగొట్టు వానలైన వడగండ్లు కురుస్తూ వుండేది. గాలి దుమారం పెద్దఎత్తున మామిడి తోటను నష్టపరుస్తూ వుండేది. అప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయి, ఏడాదికొక పంట చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలు రైతును కోలుకోకుండా చేసేవి. అదేంటో గాని ఈ నలభై సంవత్సరాల కాలంలో మొదటి సారిగా గత ఏడాది కూడా పెద్దగా చెడగొట్టు వానలు లేవు. అక్కడక్కడ తప్ప, పెద్దగా వడగండ్ల వానలు కురిసింది లేదు. రైతులు నష్టపోయింది లేదు. మామిడి రైతులు ఇబ్బందులు పడిన సందర్భం లేదు. ఈ ఏడాది కూడ అలాంటి వడగండ్ల వానలు పెద్దగా లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో ఒకటి రెండు చోట్ల చిన్నగా కురిశాయే గాని, రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు. సరిగ్గా ఈ ఏడాది ఉగాదికి ఒక రోజు ముందు గాలి దుమారం పెట్టింది. ఆ రాలిన కాయలు పండుగకు రైతులు తెచ్చి అమ్ముకున్నారు. లాభం పొందారు. ఇది అతిశయోక్తి కాదు. నూరు పైసల నిజం. ఉగాదికి ముందు రోజు గాలి దుమారం వల్ల రాలిపోయిన పండ్లుకూడా రైతులు అమ్ముకునే పరిస్థితి కూడా కలిసి రావడం అన్నది కూడా వింతైన అనుభవమనే చెప్పాలి. ఇక అప్పటినుంచి పెద్దగా చెడగొట్టు వానలులేవు. వడగండ్ల వానలు అసలే లేవు. గాలి దుమారం పెట్టినట్లు వార్తలు లేవు. రైతులు ఇబ్బందిపడే పరస్ధితి ఎదరుకాలేదు. కాకపోతే పంట చేతికొచ్చిన గత పదిహేను రోజుల మందు ఒకటి రెండు చెడగొట్టు వానలు కురిశాయి. కాని అవి తెలంగాణ అంతటా కురవలేదు. కొన్ని జిల్లాలకే పరిమితం కావడం వల్ల మిగతా ప్రాంతాల రైతులు ఎంతో సాఫీగా వరి కోతలు పూర్తి చేసుకున్నారు. వడ్లను ఐకేపి సెంటర్లకు తరలించుకున్నారు. అమ్ముకున్నారు. అయితే పంట ఒక నెల లేటుగా వేసుకున్న రైతులకు పంట చేతికి రావడానికి కొంత ఆలస్యమైంది. అలాంటి రైతుల వడ్లు ఇప్పుడు కళ్లాలలోనే వున్నాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వెంట వెంటనే కొనుగోలు చేస్తూనే వుంది. సహజంగా కొన్ని సందర్బాలలో రైతులు ఇబ్బందులు పడడం అన్నది సర్వ సాదారణం. అంటే తెలంగాణ సిఎం.రేవంత్‌రెడ్డి జాతకం కూడా ప్రజలకు ఎంతో కలిసి వస్తుంది. మేలు చేస్తుందని పండితులు కూడా అంటున్నారు. గత ఏడాది బిఆర్‌ఎస్‌ నాయకులు పంటలు ఎండిపోతున్నట్లు కొంత హడావుడిచేసే ప్రయత్నం చేశారు. ఏకంగా కేసిఆరే రైతుల వద్దకు వెళ్లి ఓదార్చే ప్రయత్నాలు చేశారు. కాని రైతులు నమ్మలేదు. ప్రజలు కూడా నమ్మలేదు. అదంతా బిఆర్‌ఎస్‌ ఆడుతున్న డ్రామా అని అందరూ తేల్చి చెప్పేశారు. కొంత మంది రైతులు అక్కడక్కడా నీటి సౌలత్‌కు మించి, వరి సాగు చేసుకున్నారు. వారికి వున్న వున్న బోర్ల మూలంగా నీరు సమృద్దిగా అందలేదు. అలాంటి కొంత మంది రైతుల వరి కొద్ది దశలో ఎండిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే అది రైతు తప్పు. వరి పంట పొట్టకొచ్చిన సమయంలోనో, గింజ వేవే సమయంలోనో, గింజ మరో పది రోజులైతే గట్టిపడుతుందనే సమయంలోనో నీళ్లు అందకపోతే అది నష్టంగా భావించొచ్చు. కాని అసలు వరి ఎదగకుండా ఎండిపోయే పరిస్దితి వచ్చిందంటే అది రైతు పొరపాటుగానే పరిగణించాల్సి వస్తుంది. అలాంటి ఒకరిద్దరు రైతులను గుర్తించి బిఆర్‌ఎస్‌ రాజకీయం చేయాలనుకున్నది. కాని కుదరలేదు. సరిగ్గా ఎన్నికల ముందు కేసిఆర్‌ నల్లగొండ సభతో ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నిందిదాద్దమనుకున్నాడు. బిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా చెబుతున్నదే నిజమని జనంలోకి వచ్చారు. ఒకరిద్దరు రైతుల పొలాలు సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. అక్కడే కేసిఆర్‌ మోసపోయాడు. లేని పరిస్దితులను సృష్టించి రాజకీయం చేయాలనుకొని కేసిఆర్‌ మొదటిసారి మోసపోయాడని కూడా చెప్పొచ్చు. సరిగ్గా అదే సమయంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ప్రజలు కనీసం ఆదరించలేదు. ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కనీసం కేసిఆర్‌ వెళ్లిన నియోజకవర్గంలో కూడా బిఆర్‌ఎస్‌ ప్రభావం చూపలేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొదటిసారి తెలంగాణలో అన్ని నియోజక వర్గాలలో మూడో స్దానానికి పడిపోయింది. పంటలు ఎండిపోయానని గగ్గోలు పెట్టిన సమయంలోనే రికార్డు స్దాయిలో తెలంగాణలో వరి పంట పండిరది. అంటే బిఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం ఒట్టిదే అని తేలిపోయింది. ఓ పక్క చెరువులు నింపామని, మరో పక్క కాళేశ్వరం నీళ్లు నిరంతరం ఇచ్చామని చెప్పుకున్న బిఆర్‌ఎస్‌ హాయం కన్నా, ఎక్కువగా వరి సాగైంది. అంతకు మించి నలభై శాతం అధికంగా పంటలు పండాయి. కాంగ్రెస్‌ వస్తే కరువని,కరంటు వుండదని బిఆర్‌ఎస్‌ ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదు. అంతెందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇంత వరకు రోడ్డెక్కిన సందర్భం లేదు. బిఆర్‌ఎస్‌ నాయకులు చేసే హడావుడి తప్ప ఎక్కడా రైతులు ఆందోళన చేసింది లేదు. ప్రజలు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు రాజ్యం తెచ్చిందని అని కూడా అనుకుంటున్నారు. అందుకే రికార్డు స్దాయిలో పంటలు పండిస్తున్నారు. అంతే కాదు తెలంగాణలో 92 శాతం మంది రైతులు సన్నాలు పండిస్తున్నారు. నిజానికి సన్నాలకు నీరు కూడా ఎక్కువ కావాలి. ఎరువులు,పురుగుల మందుల ఖర్చు కూడా ఎక్కువౌతుంది. అయినా రైతులు సన్న వరి పండిస్తున్నారంటే పంట చేతికి వస్తుందని, లాభం వస్తున్న నమ్మకంతోనే వేస్తున్నారు. పండిస్తున్నారు. కాళేశ్వరం నిర్మాణం చేశాం…ఇక భవిష్యత్తులో మూడు సంవత్సరాల పాటు కరువు వచ్చినా సరే, పంటలకు ఢోకా వుండదని, నీటి కొరత అసలే రాదని కేసిఆర్‌ పదే పదే చెప్పేవారు. ఇది కాళేశ్వరం పూర్తికాముందు అనేక సార్లు కేసిఆర్‌ చెప్పిన మాట. కాళేశ్వం పూర్తి చేసి, ప్రారంభించిన మరుసటి సంవత్సరమే వరి వేస్తే ఉరే అన్నారు. రైతులు వరి వేయొద్దని ప్రకటించారు. అసలు తెలంగాణలో కరువు అంటూ కనించదని చెప్పిన కేసిఆర్‌ నీళ్లు సరిపోవని వరి వేయొద్దని రైతులను హెచ్చరించాడు. పైగా రైతులు సన్నాలు పండిరచాలని ఓ ప్రయోగం చేశాడు. తర్వాత పంటకే సన్నాలు వద్దని వారించాడు. ఇలా రైతులను పదే పదే మోసం చేసిన సందర్భం వుంది. కాని రేవంత్‌ సర్కారు సూచనతో తెలంగాణ వ్యాప్తంగా రైతులను సన్నాలు పండిరచేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ పంటతో వచ్చిన బియ్యాన్ని దేశంలోనే తొలిసారిగా రేషన్‌ దుకాణాల ద్వారా పేద ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. అంటే వాన దేవుని కరుణ రేవంత్‌ రెడ్డి మీద ఎంత వుందో చెప్పడానికి ఈ ఒక్క ముక్క చాలు.

దేశంలో సంపూర్ణ అక్షర్యాత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరం!

`అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు

`మితిమీరిన ప్రైవేటీకరణతో విద్యావ్యస్థకు పెనుముప్పు

`ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కరువు

`జవాబుదారీతనం కరువు కావడమే కారణం

`డ్రాపౌట్ల భయంతో డిటైనింగ్‌ను తొలగించడతో పడిపోతున్న ప్రమాణాలు

`ర్యాంకులకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి

`వైఫల్యాలనుంచి ఎవరికివారు తప్పించుకునే మార్గాల అన్వేషణ

డెస్క్‌ ,నేటిధాత్రి: 

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మొత్తం అక్షరాస్యతా శాతం కేవలం 14% మాత్రమే. తర్వాతి సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన వివిధ ప్రభుత్వాలు సంపూర్ణ అక్షరాస్యతా సాధనకో సం చేపట్టిన వివిధ కార్యక్రమాల కారణగా దేశంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. ఆవి ధంగా 2022 నాటికి మనదేశంలో అక్షరాస్యత 76.32శాతానికి పెరిగింది. అయితే అన్ని రాష్ట్రాలు అక్షరాస్యతలో సాధించిన ప్రగతి ఒకే మాదిరిగా లేదు. రాష్ట్రాల మధ్య తేడాలుండటంతో అందుతున్న సమాచారం ఇప్పటికీ సమగ్రంగా లేదనే చెప్పాలి. ఇదిలావుండగా మే 21న మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక ప్రకటన చేశారు. రాష్ట్రం పూర్తిస్థాయి అక్షరాస్యత సాధించిందన్నది ఈ ప్రకటన సారాంశం. అయితే విద్యామంత్రిత్వశాఖ నిర్దేశించిన 95% అక్షరాస్యత లక్ష్యాన్ని అధిగమించి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరం నిలవడం విశేషం. 2011 జనగణనలో మిజోరం అక్షరాస్యత లో దేశంలో మూడోస్థానంలో వుంది. నాటి అక్షరాస్యత 91.33%. ప్రస్తుతం 98.2% అక్షరాస్యతతో దేశంలోనే అత్యధిక అక్షరాస్యులు కలిగిన రాష్ట్రంగా గుర్తింపు సంపాదించుకుంది. ఇందుకుపూర్తి విరుద్ధంగా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లు 72.6%, 74.3%తో దేశం లోనే అట్టడుగున ఉన్నాయి. 

దేశవ్యాప్తంగా పరిశీలించినప్పుడు 2023ా24 సంవత్సరం నాటికి ఏడేళ్ల వయసు పైబడిన స్త్రీ,పురుషుల్లో అక్షరాస్యత 80.9%. నిజంచెప్పాలంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధికి అక్షరాస్యతనే కొలమానంగా తీసుకుంటారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం ఏడేళ్ల వయసు పైబడినవారు ఏదైనా ఒక భాషను రాయడం, చదవడం, మాట్లాడటం చేయగలిగితే అటువంటివారిని అక్షరా స్యులుగా పరిగణిస్తారు. 2024 నాటికి మనదేశంలో అక్షరాస్యత విషయంలో తొలి పది స్థానాలుసాధించిన రాష్ట్రాలు వరుసగా మిజోరం(98.2%), లక్షద్వీప్‌ (97.3%), నాగాలాండ్‌ (95.7%), కేరళ (95.3%), మేఘాలయ (94.2%), త్రిపుర (93.7%), చండీగఢ్‌ (93.7%),గోవా (93.6%), పురుచ్చేరి (93.7%), మణిపూర్‌ 992%). 

ఇక అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న పది రాష్ట్రాలు వరుసగా ఆంధ్రప్రదేశ్‌ (72.6%), బిహార్‌ (74.3%), మధ్యప్రదేశ్‌ (75.2%), రాజస్థాన్‌ (75.8%), రaార్ఖండ్‌ (76.7%), తెలంగాణ (76.9%), ఉత్తరప్రదేశ్‌ (78.2%), ఛత్తీస్‌గఢ్‌ (78.5%), లద్దాఖ్‌ (81%), జమ్ముÊ కశ్మీర్‌ (82%). 

2011 జనగణలో అక్షరాస్యతలో మూడో స్థానంలో వున్న మిజోరం నేటికి దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం కేంద్రం ప్రవేశపెట్టిన సమగ్ర శిక్ష మరియు న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమేనని చెప్పాలి. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర శిక్ష మిజోరం కార్యక్రమం కూడా ఈ లక్ష్యసాధనలో గొప్ప చోదకశక్తిగా పనిచేసింది. మిజోరం ముఖ్యమంత్రి, రాష్ట్రం సాధించిన సంపూర్ణ అక్షరాస్యత గురించి ప్రకటించిన ప్పుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వన్‌లాల్‌థలానా, కేంద్ర విద్యాశాఖసహాయమంత్రి జయంత్‌ చౌదరి కూడా వుండటం విశేషం. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘‘లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (యూఎల్‌ఎల్‌ఏఎస్‌)’’ కింద మిజోరంను సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటించారు. 

 క్లస్టర్‌ రోసోర్స్‌ సెంటర్‌ కోఆర్డినేటర్లు (సీఆర్‌సీసీ) ఆధ్వర్యంలో 2023 ఆగస్టుాసెప్టెంబర్‌ నెలల్లోమిజోరంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 15కంటే ఎక్కువ వయసున్నవారిలో 3026 మంది నిరక్షరాస్యులుగా వున్నట్టు గుర్తించారు. వీరిలో 1692మంది తర్వాత వివిధ అభ్యసన కార్యక్రమాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఆక్షరాస్యతా శా తం 98.2%కు చేరుకుంది. ఇదిలావుండగా రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు మిజోరం ప్రభుత్వం స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ లిటరసీ (ఎస్సీఎల్‌)ను ఏర్పాటు చేసింది. ఇది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎ డ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఈ సంస్థ మిజో భాషను నేర్చుకోవడానికి వీలుగా ‘వర్టియన్‌’ పేరుతో మరియు ఇంగ్లీషు భాషకోసం కార్యక్రమాలను అభివృద్ధి చేసి లాంగ్ట్‌లాయ్‌ జిల్లాలో అమలు చేశారు. వీటికి అనుబంధంగా ‘రోమై’ కార్యక్ర మాన్ని, నేర్చుకునేవారి కోసం, వాలంటీర్‌ టీచర్ల కోసం ‘మార్గదర్శిక’ పేరుతో మరో కార్యక్రమా న్ని అభివృద్ధి చేసి అమలు చేశారు. ఆవిధంగా మొత్తం 292 మంది వలంటీర్‌ టీచర్లను నియ మించి పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, వైఎంఏ లైబ్రరీల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమాలకు ‘‘లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (యూఎల్‌ఎల్‌ఏఎస్‌)’’ కింద సంపూర్ణ మద్దతు కల్పించారు. యూఎల్‌ఎల్‌ఏఎస్‌ కార్యక్రమాన్ని 2022 నుంచి 2027 వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. ముఖ్యంగా సంప్రదాయ విద్యను అభ్య సించలేకపోయిన 15ఏళ్ల వయసు పైబడినవారిని అక్షరాస్యులుగా చేయడం లక్ష్యంగా కార్యక్ర మం పనిచేస్తుంది. 

మిజోరం దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గుర్తింపు పొందగా, ఆంధ్రప్రదేశ్‌ అత్యల్ప అక్షరాస్యతారేటులో అట్టడుగున నిలిచింది. తెలంగాణ పరిస్థితి కూడా దారుణంగా వుంది. అట్టడుగు అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో ఆరోస్థానం ఆక్రమించింది! మిగిలిన కర్నాటక, తమిళనాడుల పరిస్థితి కూడా అక్షరాస్యతలో మెరుగ్గా ఏమీ లేదు. ఎందుకని ఈవిధంగా జరుగుతున్నదని ప్రశ్నిస్తే, విద్య కార్పొరేటీకరణ జరగడం. పలితంగా డబ్బున్న వారికి మాత్రమే విద్య అందుబాటులోకి రావడంతో నిరుపేదలకు విద్య అందని ద్రాక్షగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం,ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ విద్యాకార్యక్రమాలు, అమలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడంలేదన్నది ఒక అభియోగం. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్‌ టీచర్లుఅత్యధిక వేతనాలు తీసుకుంటూ పనిచేస్తున్నా, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న టీచర్లు కలిగిన ప్రైవేటు పాఠశాలలు అత్యధిక ర్యాంకులు సాధించడానికి కారణం ఏమిటన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రైవేటు విద్య అందుబాటులోకి రాకముందు, అన్ని వర్గాలవారు ప్ర భుత్వ పాఠశాలల్లోనే చదువుకునేవారు. ఉపాధ్యాయుల్లో కూడా నిబద్ధత కనిపించేది. కానీ రాను రాను విద్య ప్రైవేటీకరణ జరగడంతో, పాఠశాలల్లో విద్య నాణ్యత పడిపోవడం మొదలైంది. నిర్ల క్ష్యం, బాధ్యతారాహిత్యం, యూనియన్‌ కార్యకలాపాలు, ప్రైవేటు వ్యాపారాలపై మోజు పెరిగిపోవ డంతో ప్రభుత్వ విద్య క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. దీంతోపాటు తల్లిదండ్రుల్లో ర్యాంకులపట్ల మోజు పెరగడం కూడా ప్రైవేటు విద్యపై మక్కువ పెరగడానికి ప్రధాన కారణం. చివరకు పరిస్థితి ఏదశకు చేరకుందంటే ప్రభుత్వ పాఠశాలలతో, ప్రైవేటు పాఠశాలలు పోటీపడాల్సింది పోయి సీన్‌ మొత్తం రివర్సయింది. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలనే ప్రభుత్వ పాఠశాలలు అనుసరిస్తున్నాయి. ఇదిలావుండగా ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల, తరగతికి తగిన విద్యాప్రమాణాలు సాధించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తు న్నారు. ఫలితంగా విద్యార్థులు పేరుకే పైతరగతులకు వెళ్లడం తప్ప, వారికి ప్రాథమిక స్థాయి పరిజ్ఞానం కూడా లేకపోవడం చాలా సందర్భాల్లో రుజువైంది. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు బలమైన పునాదివేయకుండా పైతరగతులకు పంపడం కొనసాగినంతకాలం ప్రభుత్వ విద్య ఎప్పటికప్పుడు కునారిల్లుకుపోతూనే వుంటుంది. పదోతరగతి ఉపాధ్యాయులు, ఆ తరగతి ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన చేయలేని స్థితి. ఎందుకంటే విద్యార్థుల్లో ఆయా పాఠ్యాంశాలను అవగాహన చేసుకునే గ్రహణ సామర్థ్యం కొరవడటమే. ఐదారు దశాబ్దాల క్రితం డిటైనింగ్‌ పద్ధతి వుండేది కనుక, తగిన ప్రమాణాలు సాధించిన విద్యార్థులే పై తరగతులకు వెళ్లేవారు. ఫలితంగా ఉన్నత తరగతులకు చేరిన విద్యార్థులు ఆస్థాయి ప్రామాణిక విద్యను అర్థం చేసుకునేవారు. ఇప్పుడది పూర్తిగా కనుమరుగైపోయింది. డ్రాపౌట్ల భయంతో తగిన అర్హత సాధించని విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయడంతో అక్కడి ఉపాధ్యాయులపై పెను భారం పడుతోంది. చివరకు వైఫల్యాలలనుంచి తప్పించుకోవడానికి ఎవరికి వారు కారణాలు వెతుక్కుంటున్న దుస్థితి ఇప్పుడు నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ప్రభుత్వ ఉపాధ్యాయులకు కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లిస్తున్నా, వారు తమ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో చూపలేకపోవడానికి పైన చర్చించిన అంశాలు ప్రధాన కారణం. వీటిపై దృష్టి పెట్టకుండా, చేతిపై పుండుకు కాలికి వైద్యం చేసిన చందంగా చేపట్టే కార్యక్రమాలు విద్యాభివృద్ధికి ఎంతమాత్రం దోహదకారి కానేరవు.

రఫీ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్టిఐ నేత చర్లపల్లి.

రఫీ,కుటుంబాన్ని పరామర్శించిన ఆర్టిఐ నేత,చర్లపల్లి చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా శుక్రవారం మొగుళ్లపల్లి మండలం గుడి పహాడ్ గ్రామానికి చెందిన మమ్మద్ రఫీ ఇటీవల అనారోగ్య కారణాల వలన మరణించాడు మృతుని,ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని రఫీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను పరామర్శించిన ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, మృతుని సోదరులు మహ్మద్ రాజ్ మహమ్మద్ ,అక్బర్ ,పాషా ఈ కార్యక్రమంలో, బుర్ర సమ్మయ్య కాంగ్రెస్ నాయకుడు రాజు, లింగంపల్లి,రాజేశ్వరరావు గిరబోయిన ఐలయ్య మేకల దేవేందర్ ,సాంబయ్య తదితరులు నివాళులర్పించారు

నూతన వదువరులను ఆశీర్వదించిన సోద రామకృష్ణ.

నూతన వదువరులను ఆశీర్వదించిన సోద రామకృష్ణ

పరకాల నేటిధాత్రి:

 

మండలంలోని అలియాబాద్ గ్రామానికి చెందిన జంగిలి జయపాల్ రావు నీరజ దంపతుల కూతురు సుస్మిత వెంకట సాయి తేజ్ ల వివాహ మహోత్సవం పట్టణంలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది.ఈ వేడుకలోపరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఏకు రాజు,నాయకులు బొచ్చు జెమిని తదితరులు పాల్గొన్నారు.

పేదల కోసం.. రూ.1 భోజనం ప్రారంభం.

పేదల కోసం.. రూ.1 భోజనం ప్రారంభం

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రీమ్ 100 ఆధ్వర్యంలో.. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, సినిమా హీరో, డ్రీమ్ 100 ఫౌండర్ మాలినేని కృష్ణ ఆధ్వర్యంలో రూ.1 భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలు ఆసుపత్రికి వచ్చి ఆకలితో బాధపడకుండా.. ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ‘అన్నదానం మహా దానం’ అన్నారు. కోటి విద్యలు కూటి కోసమే అన్నారు. నిరుపేదలను ఆకలితో బాధపడకుండా ప్రతి ఒక్కరూ అన్నదానం చేయుటకు పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయలక్ష్మి తిరుపతి, హరి సింగ్, గుమ్మల్ల రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పొట్లపల్లి యాదయ్య, రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ రామాంజనేయ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక.

శ్రీ రామాంజనేయ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక.

-అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్.

-ప్రధాన కార్యదర్శిగా మారం నారాయణ.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ రామాంజనేయ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక శుక్రవారం జరిగింది.అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్,ఉపాధ్యక్షుడిగా శేరు రాజేశం,ప్రధాన కార్యదర్శిగా మారం నారాయణ,సహాయ కార్యదర్శిగా సోమిడి ప్రభాకర్,కోశాధికారిగా తోడేటి రవి లను ఏకిగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యవర్గ సభ్యులుగా మర్రి శ్రీకాంత్,సందెల శ్రీనివాస్,పునగుర్తి గట్టయ్య,బుడిమే కుమార్ ను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ట్రాక్టర్ యూనియన్ బలోపేతం కోసం కృషి చేస్తామని యూనియన్ అభివృద్దే లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ ఓనర్లు,డ్రైవర్లు,రైతులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు ముగింపు.

ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు ముగింపు

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ డివిజన్ లోని ( ఏకలవ్య గురుకుల మోడల్ రెసిడెన్సీయల్ స్కూల్ )కొత్తగూడ నందు ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు నేటితో ముగీయనున్నదని కొత్తగూడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ అజయ్ సింగ్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో బైపీసీ ఎంపీసీ సీఈసీ ల ప్రవేశాల కొరకు అర్హత గల విద్యార్థులు మే 24 న నేటితో దరఖాస్తు ముగుస్తున్నందున విద్యార్థులు గమనించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ పాత్రికేయులతో.మాట్లాడుతూ నిన్న జరిగిన సీఎం జహీరాబాద్ పర్యటనలో కొత్తగా ఏమీ ఆశించేది లేదని .బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ కి భారీగా నిధులు మంజూరు చేస్తే బాగుండేది అని నాలుగు నియోజక వర్గాల రైతులు. సంతోషం వ్యక్తం చేసేవారన్నారు .జిల్లా లోని పలు నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు గాను నిధులు కేటాయిస్తే అన్ని వర్గాల వారు హర్షించేవారని ఇసంధరభంగా తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ దయ బట్టరు.కొత్తగా ఇచ్చిందేమి లేకపోగా గత కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వాటికే రిబ్బన్ కటింగ్ లు చేసి చేతులు దులుపుకున్నారు అని అన్నారు .రానున్న రోజుల్లో ప్రజలు కూడా చేతి వాటం తప్పకుండా చూపెడతారు అని గుర్తు పెట్టుకోవాలని .ఈ సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు .

జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటం.

జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటం

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి

శాయంపేట మండల సిపిఐ పార్టీ 2వ మహాసభ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం మాం దారి పేట వాసుల సమగ్రాభి వృద్ధికై సిపిఐ రాజీలేని పోరా టాలు నిర్వహిస్తుందని, గుడిసె వాసులకు పట్టాలిచ్చి ఇందిర మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి అన్నారు.

మండ లం.లోని పెద్ద కొడేపాక శివారు లో సిపిఐ శాయంపేట మండల 2వ మహాసభ ఘనంగా జరిగింది మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి జెండా ఆవిష్క రించారు.

అనంతరం ఎండీ అంకుషావలి అధ్యక్షతన జరిగిన మహాసభలో తోట భిక్షపతి మాట్లాడుతూ ఎన్ని కల సందర్భంగా హామీలను అమలు చేయడంలో పాలక పార్టీలు విఫలం అయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమయిందని, దేశాన్ని కార్పొరేట్ లకు తాకట్టు పెట్టి దివాళా తీయించిందని అన్నారు.

మోడీ నమ్మిన బం టు ఆదానీకి ప్రభుత్వ రంగ సంస్థలను దోచి పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు.

విపక్ష పార్టీల నాయకు లపై సిబిఐ, ఈడిలను ప్రయోగి స్తున్న మోడీ ప్రభుత్వం ఆదానీ పై ఎందుకు ప్రయోగించడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంపై మోడీ ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ అని, విభజన హామీలను అమలు చేయ కుండా రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని అన్యాయం చేసారని అన్నారు.

రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తిగా ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా అర్హులైనపేదలకు అందించా లని, జిల్లాలో అసంపూర్తిగా ఉన్నా దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

మండలం లో ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు గుడిసె వాసులకు పట్టాలిచ్చి ఇందిర మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

జిల్లాలోని రైతాంగా నికి సాగునీరందించే ఎస్.ఆర్. ఎస్.పి, దేవాదుల కాలువ సమస్యలపై ఈ మధ్యకాలంలో సిపిఐ పోరాటం చేసిన ఫలితం గా రెండవ పంటకు కూడా నీళ్ళు ఇవ్వటానికి అధికార యంత్రాంగం ముందుకు వచ్చిందని తెలిపారు.

ఖాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ కోసం జరిగిన పోరాటంలో సిపిఐ దే ఉమ్మడి జిల్లాలో అగ్రగామి పాత్ర అని, గ్రామాల్లో ఉపాధి హామీ, పట్టణoల్లో మున్సిపల్ వర్కర్స్, సంఘటిత, అసంఘ టిత కార్మికుల సమస్యలపై, నిలువనీడలేని పేదలకు ఇండ్ల స్థలాల కోసం గుడిసెల పోరా టాలు నడిపింది సిపిఐ అని, జిల్లా సమగ్ర అభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటాలు నిర్వహి స్తుందని వారు అన్నారు.

Secretary Thota Bhikshapati.

 

ఈ మహాసభలో సిపిఐ మండల కార్యదర్శి బత్తిని సదానందం, మండల సహాయ కార్యదర్శి అనుకారి అశోక్, సీనియర్ నాయకులు ఇల్లందుల సాంబయ్య, నాయకులు వల్లాల రమేష్, ఎండీ అంకుషావలి, సముద్రాల రవి, ముండది రమేష్, ఎండీ మైనొద్దిన్, సాంబయ్య, బోగి రమాదేవి, ఎండీ గౌసియా, రమాదేవి, బొంకురి కోమల, జోడు లక్ష్మీ మరియు తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ మండల సమితి ఎన్నిక

సిపిఐ మండల కార్యదర్శిగా బత్తిని సదానందం, మండల సహాయ కార్యదర్శులుగా అనుకారి అశోక్, సముద్రాల రవి, 9 మంది కార్యవర్గం, 18 మందితో మండల కౌన్సిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఎన్నికలప్పుడే రాజకీయాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధే.!

ఎన్నికలప్పుడే రాజకీయాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఒక్క సారి కాదు 50 సార్లు కలుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.494.67 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తాను జడ్పీటీసీ స్థాయి నుంచి వివిధ పదవులు అలంకరించానని, అధికారంలో లేకపోయినా నిత్యం జనంలో ఉండి పనిచేశానని, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మాత్రం అధికారంలో పోగానే ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారని విమర్శించారు. తాను రాజకీయ విమర్శలు చేయదలచుకోలేదని, కేసీఆర్ తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమించిన 1200 మంది అమరులయ్యారని, 10 ఏండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, లక్ష వరకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవే కాకుండా 3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామని, పరిశ్రమల రాకతో ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. నిమ్ లో హుండాయ్ సంస్థకు 450 ఎకరాలు కేటాయించామని, త్వరలోనే సంస్థ కార్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నదాని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీగా జహీరాబాద్ మారనున్నదన్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తున్నామని, గతంలో కేసీఆర్ లాగా కేంద్రంతో సఖ్యత プ ఉండేవారు కాదని, చెరువు మీద కడుక్కోకపోతే…మనకే వాసన వస్తుందని విమర్శించారు.

నిమ్స్ భూ నిర్వాసితుకుల పరిహారం పెంచాం.

12500 ఎకరాల్లో ఏర్పాటైన నిమ్ లో చాలా మంది భూములు కోల్పోయారని వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తరువాత నిమ్డ్ అభివృద్ధి కుంటుపడిందని స్థానిక నాయకులు తనవద్దకు వచ్చి చెబుతే భూ సేకరణలో వేగం పెంచామని చెప్పారు. గత ప్రభుత్వం భూములు కోల్పోయిన ఎస్సీలకు రూ.2.50 లక్షలు, ఇతరుల సీలింగ్ భూమికి రూ.5 లక్షలు మాత్రం చెల్లించిందని తాను అధికారులను పిలిచి పేదలకు న్యాయం చేయాలని ఆదేశించిన సందర్భాన్ని సీఎం గుర్తు చేశారు. అంతే కాకుండా నిన్జ్ లో మొత్తం 5612 కుటుంబాలు భూములు కోల్పోయాయని, ఆ కుటుంబాలకు వారు కోరుకున్న చోట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ మొత్తం కుటుంబాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించి అందరికీ ఇండ్ల పట్టాలు అందించే బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. అందుకోసం తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఇతర అధికారులను ఆదేశించారు.

Politics

చరిత్ర మెదక్ ను మరచిపోదు…

మెదక్ నుంచే ఎంపీగా స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించి దేశ ప్రధానిగా సేవలు అందించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడే 1984 లో ఆమె ఆకరి రక్తం బొట్టు భూమిలో వదిలి పెట్టారన్నారు. మెదక్ ప్రజలు నాటి ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కు అండగా నిలబడుతూ వస్తున్నారన్నారు. ఇందిరమ్మ హయాంలోనే మెదక్ కు ఇక్రిశాట్, ఓడీఎప్, బీడీల్, బీహెచ్ఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయన్నారు. ఇందిరాగాంధీ తో పాటు బాగారెడ్డి, ఈశ్వరీబాయి, గీతారెడ్డి ఇలా ఎందరో మెదక్ గుర్తుండిపోయే నాయకులున్నారన్నారు. నిన్జ్ ను జహీరాబాద్ కు గీతారెడ్డి తీసుకువచ్చారని, ఈ ప్రాంతం అభివృద్ధిలో వారి పాత్ర గొప్పదని సీఎం గుర్తు చేశారు.

బసవేశ్వరుడు బాటలో కాంగ్రెస్ పాలన.

విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో తెలంగాణ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో భాగంగా బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని రాహుల్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ కులగణన చేపట్టిందన్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి అన్నారు.

అన్నదాతకు అండగా ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉన్నదని సీఎం చెప్పారు. రూ.26 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, ఎకరాకు రూ.5 వేలుగా ఉన్న రైతు భరోసాను రూ.6వేలకు పెంచామని, భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే రూ.12 వేలు అందిస్తున్నాం, వరి వేస్తే ఉరే అని గత ప్రభుత్వ పెద్దలు చెబితే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోసన్ ఇస్తుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఆడబిడ్డల కోసం గత 18 నెలల కాలంలో ఉచిత బస్సు ప్రయాణానికి రూ.5500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత ఏడాదిలో స్వయం సహాయక సంఘాలకు రూ.20వేల కోట్ల బ్యాంకు లింకేజీలు ఉంటే ఈ ఏడాది రూ.21 వేల కోట్ల లింకేజికి పెంచామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రానున్న నాలుగేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సులను, పెట్రోల్ బంకులను అమ్మా ఆదర్శ పాఠశాలల నిర్వహణ, నిత్యావసరాల సరుకుల పంపిణీ వంటి వాటిలో మహిళల బాధ్యతలు పెంచి వారిచే నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.

Politics

నిండుమనుసుతో దీవించండి…

రాష్ట్ర ప్రభుత్వ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్నదని, ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. యువత, నిరుద్యోగులకు సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఎప్పుడూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎవరు ఏమనుకున్నా సోనియాగాంధీ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని ఇతర స్థానాలను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలు తీసుకువచ్చి, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని, వన్ ట్రిలియన్ ఎకనామీ రాష్ట్రంగా, తెలంగాణ ను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. టోక్యో, న్యూయార్క్ సిటీలకు సరసనా భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ కానున్నదని అంతవరకు నిద్రపోనున్నారు. ఇదెలా ఉండగా జహీరాబాద్ చెక్కల పరిశ్రమ ఏర్పాటు కోసం నిఱ్ఱ లో 100 ఎకరాల కేటాయిస్తామని, నిధులు కూడా అందిస్తామని, సింగూరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సంజీవరెడ్డి, నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

-చదువు అన్నారెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి

 

కాలేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కుట్రలకు తెరలేపిందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశాడని, రైతుల సాగునీటి ఘోష తీర్చేందుకు భగీరథుడిలా కంకణం కట్టుకున్నారన్నారు. తెలంగాణను ధాన్యకారంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. కేసీఆర్ తెలంగాణకు ఏం అన్యాయం చేశాడని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. వీటిని ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు నోటీసులుగానే పరిగణిస్తామని తెలిపారు. విచారణ పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే..తెలంగాణ మరోసారి మర్ల పడుతుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా..ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను ఇబ్బందులు పెడితే..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

ఫలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయత్నం.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే మాధవరెడ్డి వినతి..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందనతో..వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన సివిల్ సప్లై కమిషనర్..

6350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జీఓ జారీ..

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు.

రైతుల అభివృద్దే నా లక్ష్యం.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

అకాల వర్షాలతో నోటికాడికచ్చిన పంటలు నీటిపాలయ్యాయి.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద,వ్యయసాయ మార్కెట్ వద్ద, వరి కళ్ళాల వద్ద రైతులు ఆరబోసిన,అమ్మకాలకు సిద్ధంగా ఉంచిన వరిదాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయ్యాయి.రైతుల కష్టాలను చూసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెంటనే స్పందించారు.రాష్ట్ర మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదారాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని, తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయాలని ఈ నెల 22 న వినతిపత్రం సమర్పించి వేడుకొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభ్యర్థన మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కాగా రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు.నిజామాబాద్ జిల్లాకు 7500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఉత్తర్వులు ఇవ్వగా వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల తడిసిన వరిధాన్యాన్ని బాయిల్డ్ వరిధాన్యంగా పరిగణించి వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన కాఫీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో వాటిని చూసిన రైతులు,సమాచారం పలువురు నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

రైతుల అభివృద్దే నా లక్ష్యం…. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

Narsampet MLA Donthi Madhav Reddy..

 

నర్సంపేట నియోజవర్గంలో రైతుల అభివృద్దే లక్ష్యంగా కృషిచేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.యాసంగి సాగులో అనుకూల పంటలు పండించిన రైతులను వరిధాన్యం అమ్మకాల సమయంలో రైతులకు మేలు జరిగినప్పటికీ కొందరి రైతులకు అకాల వర్షాలతో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నది ఎమ్మెల్యే పేర్కొన్నారు.గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నియోజకవర్గం పరిధిలోని సుమారు 4 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని తెలిపారు.రైతుల కన్నీళ్లను తుడ్చాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర మార్కెటింగ్ , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయాలని విన్నవించుకోగా సానుకూలంగా స్పందించి వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జీవో జారీచేయండం చేయడం నర్సంపేట ప్రాంత రైతులకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రత్యేక చొరవతో నియోజకవర్గ రైతులను ఆదుకున్నందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Farmer Varanganti Praveen Reddy..

 

 

రైతులను ఆపదలు ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను అమ్మకాలు చేపట్టే వద్ద అకాల వర్షాల తీవ్రనష్టం చేశాయని, ఈ నేపథ్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రభుత్వంతో కోట్లాడి
రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక జీ.ఓ తెప్పించారని నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు వరంగంటి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలకు నిల్వ ఉంచిన ధాన్యం గత ఐదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయని దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వాపోయారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయడానికి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ నుండి ఉత్తర్వులు జారీచేయడం రైతుల్లో ఆనందం వెళ్ళబుచ్చితోందని రైతు ప్రవీణ్ రెడ్డి తెలియజేశారు.

సకాలంలో రైతులకు అండగా ప్రభుత్వం ఉండడం అభినందనీయం..

Coffee issued by the government.

 

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్..

గత వారం రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలకు నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని రైతులు అరుగాలం పండించిన వారి ధాన్యం పట్ల నష్టపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణిస్తూ కొనుగోలు చేయాలని జీవో జారీ చేయడం అభినందనీయమని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గం పరిధిలో వరిధాన్యం రైతులకు నష్టం వాటిల్లుతుందనే పిర్యాదులు సమాచారం మేరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి ఈనెల 22న రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కలిసి ప్రత్యేక మెమోరండం అందించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దొంతి సూచనల మేరకు వెంటనే స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారని తెలిపారు. రైతుల కోసం ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రభుత్వంపై చేపట్టిన విజయంగా భావిస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

Palai Srinivas, Chairman of Narsampet Market

 

 

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.

తీవ్రవాదం అంతమొందాలి
ప్రపంచ శాంతి వర్ధిల్లాలి

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాములు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

ప్రపంచ దేశాలను పట్టి పిడిస్తున్న తీవ్రవాదం అంతమొందించాలని. అదేవిధంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుతూ అఖిలభారత హనుమాన్ ప్రచార రాష్ట్ర అధ్యక్షుడు. శ్రీరామ ధర్మ ప్రచారకుడు గాదెపాక రాములు స్వామి మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అఖండ దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిన్న మొన్నటి వరకు మన దేశంపై ఉగ్రవాదులు దాడులు నిర్వహించి అమాయకులైన ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ఎంతటి వారినైనా ఆ భగవంతుడు క్షమించడని వారికి అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రార్థించే చేతుల కన్నా తోటి వారికి సేవ చేసే భాగ్యం మిన్న అనే సూక్తితో ఒకరినొకరు సేవ. స్నేహభావంతో మెలిగినప్పుడే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనే భావన ప్రతి మనిషిలోని ఉన్నప్పుడే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక అభివృద్ధితోపాటు సుఖసంతోషాలతో ఉంటాయని ఆయన తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాధ్యతగా సమాజంలోని గౌరవింపబడే విధంగా ఉన్నత స్థానాల్లో నిలబడాలని ఆయన కోరారు. దీనికోసం స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అఖండ జ్యోతిని వెలిగించానని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి.

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గ ఆదేశం మేరకు కొప్పుల, కాట్ర పల్లి గ్రామాలలో నూతనంగా కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకె ళ్లాల చూడాలన్నారు అనం తరం నూతన గ్రామ కమిటీ లను ఎన్నుకున్నారు కాట్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు వాంకు డోత్ జగన్ ఉపాధ్య క్షుడిగా ఆరే కమలాకర్ ప్రధాన కార్యదర్శి వంటేరు శ్రీకాంత్ కోశాధికారిగా కొప్పుల గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఏరుకొండ శంకర్ ఉపాధ్యక్షుడిగామామిడి రవి ,ప్రధాన కార్యదర్శిగా చాడ రామ్ రెడ్డి, పిట్టల నరేష్ ఎన్నుకున్నారు ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ మండల నాయకులు బాసని చంద్ర ప్రకాష్ ,చల్లా చక్రపాణి, అబు ప్రకాష్ రెడ్డి ,మారేపల్లి రవీందర్ దుబాసి కృష్ణమూర్తి, పోతు కృష్ణమూర్తి, రఘు సింగ్ తదితరులు పాల్గొన్నారు.

కొప్పుల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్.

కొప్పుల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్ ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. శుక్రవారం గ్రామ ఇంచార్జులు చల్లా చక్రపాణి, పోతు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు ఏరుకొండ శంకర్, ప్రధాన కార్యదర్శులు చాడ రాంరెడ్డి, పిట్టల నరేష్, ఉపాధ్యక్షుడు మామిడి రవి, సహాయ కార్యదర్శి గుండా ప్రవీణ్, కోశాధికారి అలువాల భాస్కర్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడు తూ తన ఎన్నికకు సహకరించి న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం కోసం కృషిచేస్తాన న్నారు.అలాగే గ్రామ అను బంధ కమిటీ ఎస్సీ, బీసీ, మైనా ర్టీ, మహిళా విభాగం కమిటీలు వేశారు ఈ కార్యక్ర మంలో కళ్లెపువంశీ, వంగాలతిరుపతి రెడ్డి, వేములపల్లి రవీందర్, సురేష్,కొమురయ్య, శాన బోయిన ఆగయ్య, గండి రాజు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాల రవాణా,ఉత్పత్తి విక్రయాలపై ప్రత్యేక నిఘా.

నకిలీ విత్తనాల రవాణా,ఉత్పత్తి విక్రయాలపై ప్రత్యేక నిఘా.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పి.ఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా,రవాణా, ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు,రైతులకు జిల్లా ఎస్పీ సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై జిల్లా పోలీసులు సిద్ధంగా ఉందని నకిలీ విత్తనాల సరఫరా,ఉత్పత్తి,అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ,జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో తరచు తనిఖీలు చెప్పట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్,వ్యవసాయ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారియెక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు.నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా, అమ్మిన,రవాణా చేసే వ్యక్తుల పై క్రిమినల్ కేసులు,పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ, పోలీసు అధికారులు పై ఉంటుందని,
జిల్లా పరిధిలో ఉన్న ఫర్టిలైజర్ షాప్, సీడ్స్ షాప్స్ లపై నిఘా ఉంచి ఆకస్మిక తనికిలు చేస్తూ నకిలీ విత్తనాల విక్రయాలను,రవాణాను అడ్డుకట్ట వేయడం జరుగుతుందని,రైతులు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు.జిల్లా ప్రజలకు, రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు,నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సహ బహుమతులు.

వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సహ బహుమతులు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు..నగదు ప్రోత్సాహక బహుమతి.పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు వాసవి సేవా ట్రస్ట్ కల్వకుర్తి ఆద్వర్యంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు 5 వేలు, ద్వితీయ ర్యాంకు సాధించిన విద్యార్థులకు 3 వేలు నగదు ను వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్ ట్రస్ట్ అధ్యక్షుడు దాచేపల్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి దొంతు శ్రీనివాసులు ప్రతిభ కనబరిచిన ఇంటర్మీడియట్ లో ప్రథమ బహుమతి బిల్లకంటి వర్షిత్ కు 5 వేలు,ద్వితీయ బహుమతి గంధం భరద్వాజ్ 3 వేలు, పదవతరగతి లో ఆకుతోట ప్రశాంత్ 5 వేలు, ద్వితీయ బహుమతి చంధన 3 వేలు నగదు ను విద్యార్థులకు శాలువా కప్పి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దేవాలయం చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక అందించడం అభినందనీయం, ఆదే విధంగా ప్రథమ ద్వితీయ తోపాటు తృతీయ ప్రోత్సాహకం అందించాలని, ఇంటర్మీడియట్, పదవతరగతి తోపాటు డిగ్రీ విద్యార్థులకు నగదు ప్రోత్సాహక అందించాలని, సేవా ట్రస్ట్ సేవాకార్యక్రమాలు నిర్వహించడానికి నిధులు పెంచుకునేందకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, సేవా ట్రస్ట్ అధ్యక్షుడు దాచేపల్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి దొంతు శ్రీనివాసులు, కోశాధికారి గుబ్బ ప్రభాకర్, మహాసభ మండలం సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండూరు కృష్ణయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సంబు ముత్యాలు,సేవా ట్రస్ట్ సభ్యులు,ఆర్యవైశ్య మహాసభ సంఘం సభ్యులు ప్రతిభ కనబరిచి ప్రోత్సాహం అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణ దారులతో సమావేశం.

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణ దారులతో సమావేశం

వీణవంక (కరీంనగర్ జిల్లా ):

నేటి ధాత్రి :వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విత్తనాలు, ఎరువుల దుకాణాదారులతో ట్రైనీ ఎస్సై, ప్రాథమిక వ్యవసాయ శాఖ అధికారి తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జమ్మికుంట రూరల్ సీఐ గారి సూచనల మేరకు, వ్యవసాయ అధికారితో కలిసి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సూచనల మేరకు నకిలీ విత్తనాలు అమ్మకానికి పాల్పడకూడదు.
గుర్తు తెలియని వ్యక్తులకు పురుగుమందులు, క్రిమి కీటకాల మందులు అమ్మకూడదు క్రిమి సహాక మందులు అమ్మేటప్పుడు రైతు ఆధార్, పాస్‌బుక్, జిరాక్స్, ఫోన్ నంబర్ తీసుకొని రిజిస్టర్‌లో నమోదు చేయాలి అని తెలిపారు అంతేకాకుండా
లాట్ నంబర్, పీసీ నంబర్ సరిగా ఉండాలి.
సరైన లైసెన్సు ఉన్నవారే అమ్మకాలు నిర్వహించాలి.
దుకాణదారులు ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు సిబ్బంది హెచ్చరించారు
ఈ సమావేశంలో పలు గ్రామాల ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణదారులు పాల్గొన్నారు.

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన.!

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం విద్యానగర్ కాలనీలోని శ్రీకృష్ణవేణి హైస్కూల్ లో ఉచిత సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవం చేస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు బత్తిని దేవన్న తెలిపారు.15 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థుల కోసం మే 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ఉచిత సమ్మర్ క్యాంపు నిర్వహించబోతున్నమన్నారు.
ఈ సమ్మర్ క్యాంపులో కరాటే, యోగా,పబ్లిక్ స్పీకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్,క్లే పోటరీ వంటి పాఠ్యేతర కార్యకలాపాలు ప్రతిరోజూ ఉదయం 7:00నుండి 9:00 గంటల వరకు శిక్షణ ఇస్తామన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ..ఈ రోజులలో విద్యార్థుల అభివృద్ధి పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా వారిలో స్వీయనమ్మకం,ఏకాగ్రత, ఆత్మనియంత్రణ,వ్యక్తిత్వ వికాసం వంటి లక్షణాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది.కరాటే మరియు యోగా శారీరక ధైర్యం,మానసిక ఓర్పు పెంచుతాయి.ఇవి విద్యార్థులకు బౌద్ధిక స్థితి సమతుల్యతను అందిస్తూ, వారి ఒత్తిడిని అధిగమించేలా చేయగలవు.

క్యాంపు సమన్వయకర్త, సబ్జెక్టు నిపుణులు బత్తిని రాకేష్

సమ్మర్ క్యాంప్ ఏర్పాటుచేసిన సందర్భంగా మాట్లాడుతూ..

Free Summer Camp

 

ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు తమ లోకజ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవచ్చు.అలాగే ఈ తరహా కార్యక్రమాలు వచ్చే విద్యాసంవత్సరంలోనూ శ్రీకృష్ణవేణి హై స్కూల్ తరఫున కొనసాగించబడతాయని వారు తెలిపారు.ఈ ఉచిత సమ్మర్ క్యాంపు కోసం నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని తమ పిల్లల భావి ప్రగతికి బలమైన పునాది వేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి

హౌజింగ్ పిడి రవీందర్

పరకాల నేటిధాత్రి:

 

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హోసింగ్ పీడీ. రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఇట్టి ఇండ్లు నిర్మాణంలో ఎక్కువ ఖర్చు కాకుండా కట్టడి చేయాలని
పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

Labor

ఇంటి నిర్మాణం విషయంలో ప్రభుత్వం నియమ నిబంధనల మేరకే నిర్మించాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు,పంచాయతీ కార్యదర్శులు,హౌసింగ్ డీఈ,యంపీడీఓ జిల్లా కలెక్టర్ వరకు పర్యవేక్షణ చేస్తారని డైరక్టర్ హౌజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేసి ఏలాంటి అవకతవకలు జరిగినా సంబందిత అధికారుల పై చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల లేబర్ అధికారి జి.వినోద్ కుమార్,హౌజింగ్ ఏఈ ఆకాంక్ష,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version