పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు.!

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న బీ ఆర్ఎస్ నాయకులు, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ హజ్ యాత్రకు వెళుతున్న శుభసందర్భంగా పూలమాల శాలవాతో సత్కరించి, హజ్ యాత్ర ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని మాజీ మంత్రివర్యులు హరీష్ రావు,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పవిత్ర స్థలంలో దేవునితో ప్రార్థించాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.రాష్ట్ర దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు ఐష్టెశ్వర్యాలతో జీవించాలని మనసారా ప్రార్ధనలు చేయాలని తెలిపారు.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కమాన్ ఆర్చి ప్రారంభోత్సవం జరిగింది. సందర్భంగా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ ఇందుకుగాను దాతలు సాయం కమాన్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ఎందుకు సహకరించిన దాతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇట్టి విమానానికి సహకరించిన దాతలకు కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపిక అందజేసి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఇందుకుగానుముఖ్య అతిథులుగా గౌరవధాతలు. తుమ్మ రామస్వామి . రిటైర్డ్ సెక్రటేరియట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ. గొట్టే.పద్మారావు రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ కరీంనగర్. గొట్టే.జయశ్రీ స్పెషల్ డిస్టిక్ డిప్యూటీ కలెక్టర్ భువనగిరి జిల్లా. గొట్టే.అశోక్. రిటైర్డ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్. గొట్టే సంజీవయ్య ఎస్సార్ మేనేజర్ ఎన్టిపిసి మరియు తుమ్మ శ్రీనివాస్ . టి జి పి డి సి ఎల్ జూనియర్ అసిస్టెంట్.గొట్టే పద్మ. టిఆర్ఎస్ జిహెచ్ఎంసి జనరల్ సెక్రెటరీ హైదరాబాద్ కమిటీ సభ్యులు గట్టేపల్లి రమేష్ .క్యారo పెంటయ్య. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి లింగాల జలంధర్ . గొట్టే కరుణాకర్. నాయకులు గ్రామ మహిళలు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

హైడ్రాపై నేటిధాత్రి అందించిన కథనం బాగుంది: హైడ్రా కమీషనర్ రంగనాధ్.

హైడ్రాపై ప్రజల్లో వస్తున్న చైతన్యంపై నేటిధాత్రి కథనానికి కమీషనర్ ప్రశంస.

ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కథనాలు ఎంతో అవసరం.

హైడ్రా వల్ల జరగనున్న మంచి పరిణామాలపై మరింత లోతైన విశ్లేషణలు అందించాలని కోరిన రంగనాధ్.

రంగనాధ్ ను కలిసిన నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం.

శివ సుబ్రహ్మణ్యంతో అనేక విషయాలు చర్చించిన రంగనాధ్.

హైడ్రాపై మీడియా పరంగా నేటిధాత్రి ఇచ్చిన సపోర్ట్‌కు అభినందనలు చెప్పిన రంగనాధ్.

హైడ్రాపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించే విధంగా నేటిధాత్రి దిన పత్రిక, నేటిధాత్రి డిజిటల్ మీడియాలో వచ్చిన కథనం చాలా బాగుందని కమీషనర్ రంగనాధ్ ప్రశంసించారు. హైడ్రా కమీషనర్ రంగనాధ్‌తో నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం శని వారం బుద్ద భవన్‌లో వున్న కార్యాలయంలో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివ సుబ్రహ్మణ్యంతో కమీషనర్ మాట్లాడుతూ ప్రజలను సామాజికంగా చైతన్యం చేయడంలో నేటిధాత్రి విశేషంగా కృషి చేస్తోందని అభినందించారు. తాను నిత్యం నేటిధాత్రి దిన పత్రిక‌ను తప్పకుండా చూస్తుంటానని చెప్పారు. హైడ్రా పని తీరు, ప్రజల నుంచి ఇటీవల వస్తున్న స్పందనలను ఎంతో విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగిందన్నారు. అంతే కాకుండా హైడ్రా వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ ఎలా వుండబోతోంది, పర్యావరణ పరిరక్షణలో హైడ్రా ఎలాంటి పాత్ర పోషించబోతోందనే విషయాలు ఎంతో స్పష్టత చెప్పారని రంగనాధ్ తెలిపారు. హైడ్రా లాంటి గొప్ప కార్యక్రమం విజయవంతం కావాలంటే నేటిధాత్రి లాంటి మీడియా సపోర్ట్ ఎంతో అవసరమని గుర్తు చేశారు. హైడ్రాపై ఇంకా చైతన్యం తీసుకొచ్చే బాధ్యతను మీడియా పరంగా నేటిధాత్రి తీసుకోవాలని రంగనాధ్ కోరారు. హైడ్రా విషయంలో ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా వుంటామన్నారు. హైడ్రా కార్యాలయం ప్రారంభమైన రోజు నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తమ, తమ కాలనీలలో దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న సమస్యలను వివరిస్తూ విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారని రంగనాధ్ తెలియజేశారు. హైడ్రాతో తాము కొన్ని దశాబ్దాలగా అనుభవిస్తున్న సమస్యలు తీరుతుండడంతో ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని రంగనాధ్ గుర్తు చేశారు. అలాంటి అంశాలతో కూడిన నేటిధాత్రి కథనం కూడా అద్భుతంగా వుందని కమీషనర్ చెప్పారు.

సింధు, సట్లెజ్‌ ప్రవాహాలను చైనా అడ్డుకుంటుందా?

గతంలో నీటిని ఆయుధంగా వాడుకున్న చరిత్ర చైనాది

నీటి వాడకంపై అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయని చైనా

నీటి వాడకంపై దానికి పూర్తిస్వేచ్ఛ

దౌత్యం తప్ప మరో పరిష్కారం లేదు

కొన్ని పరిమితుల్లో ఈ నదుల నీటిని ఆపగలదు

అయితే భౌగోళిక స్వరూపం చైనాకు పెద్దగా అనుకూలించదు

డెస్క్‌,నేటిధాత్రి: 

పహల్గామ్‌ దాడుల తర్వాత మనదేశం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడం, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేవరకు ఈ ఒప్పందంపై మాట్లాడే ప్రసక్తే లేదని భారత్‌ తెగేసి చెప్పింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్‌, సింధ్‌ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిరది. సింధ్‌లో నీటికోసం ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఏకంగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఇంటిపై దాడిచేశారు. తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసుల్ని చితకబాదారు. సింధ్‌ రాష్ట్రానికి నీరు రాకుండా, పంజాబ్‌ అడ్డుకుంటుండటం సింధ్‌ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి ప్రధాన కారణం. ఇదిలావుండగా ‘మాకు సింధూజలాలను ఆపితే భారత్‌ ప్రజల ఊపిరి ఆపేస్తామంటూ’ పాకిస్తాన్‌ సైనిక ప్రతినిధి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు వారిలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. గతంలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ కూడా సరిగ్గా ఇవే వ్యాఖ్య లు చేయడం గమనార్హం. ఇటువంటి దుస్థితికి ప్రధాన కారణం పాకిస్తాన్‌ పాలకుల వైఖరే! పహల్గామ్‌లో ఉగ్ర దాడులకు పాల్పడి వుండకపోతే ఈ దుస్థితి ఏర్పడివుండేది కాదు. పాక్‌ను శిక్షించడానికి భారత్‌సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత కూడా మనదేశాన్ని బెదిరిస్తున్నది తప్ప, ఉగ్రవాదులను శిక్షిస్తామని కాని లేదా ఉగ్రవాదం నుంచి వైదొలగుతామని గాని చెప్ప డంలేదు. ఎందుకంటే అదొక ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రం. అటువంటి ధూర్త దేశానికి ఈ శిక్ష సరైందే! ఇక మరో దౌర్భాగ్యదేశం చైనా. ఎంతసేపూ ఎప్పుడో శతాబ్దాలనాటి లెక్కలు చెబుతూ, ఇతర దేశాల భూభాగాలన్నీ తమవేనని వాదించే ఒక మూర్ఖ దేశం! నిరంతర కాలగమనంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వీటికి అనుగుణంగా మనల్ని మనం మలచుకొని జీవించడమే ఉత్తమ మార్గం! దీన్ని వదిలేసి ఇతరదేశాల భూభాగాలను తమవేనంటూ కాలగతిలో కలిసిపోయిన చరిత్రను చూపుతూ వర్తమానాన్ని అశాంతిమయం చేసుకుంటున్న దేశం ఒక్క చైనా మాత్రమే! దాని పాలకుల సిద్ధాంతాలు అటువంటివి!!

అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సింధూనది ఒప్పందాన్ని మనదేశం నిలిపేయడం వల్ల, పాకి స్తాన్‌లోకి సింధూనది దాని ఉపనదుల ప్రవాహం నిలిచిపోయింది. నిజానికి ఈ సింధూ, సట్లెజ్‌ నదుల పుట్టుక స్థానాలు చైనా ఆధీనంలోని టిబెట్‌లో వుండటంతో ఈ సమస్య ఒక సంక్లిష్ట కో ణంలోకి మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింధూనదీ జలాల ఒప్పందం ప్రకారం తూర్పున ప్రవహించే సట్లెజ్‌, బీయాస్‌, రావి నదుల నీటిని మనం వాడుకోవచ్చు. అదే పశ్చిమాన ప్రవహించే సింధూ, జీలం, చీనాబ్‌ నదుల నీటిని పాక్‌ వినియోగించుకోవాలి. పహల్గామ్‌ దాడితో ఈ ఒప్పందాన్ని మనదేశం నిలిపేసింది. ఈ చర్యవల్ల పాకిస్తాన్‌కు చుక్కనీరు పోవడంలేదు. ఇందుకు ప్రతీకారంగా టిబెట్‌లో జన్మించిన సింధూ, సట్లెజ్‌ నదీ ప్రవాహాలను మనదేశంలోకి రాకుండా చైనా అడ్డుకునే అవకాశముందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు ధూర్త దేశాల మధ్య స్నేహం ‘తేనెకంటే తియ్యనైనది’ కాబట్టి!

ఈ నదుల పుట్టుక స్థానాలు

మానససరోవరం సరస్సుకు సమీపంలోని సెంగ్‌ ఖబాబ్‌ హిమానీనదం సింధూనదికి జన్మస్థానం.ఇది కైలాస పర్వతానికి కూడా దగ్గరిగానే వుంటుంది. ఐదువేల మీటర్ల ఎత్తులో జన్మించిన ఈ నది టిబెట్‌ గుండా ప్రవహించి మనదేశంలోని లద్దాఖ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ జన్‌స్కర్‌, సయోక్‌ఉపనదులు ఇందులో కలుస్తాయి. ఆ తర్వాత మనదేశంగుండా ప్రవహించి, పాక్‌లోకి ప్రవేశి స్తుంది. ఆవిధంగా సుమారు 3180 కిలోమీటర్ల దూరం ప్రవహించిన సింధూనది చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. ప్రాచీన సింధూ నాగరికత ఈ నదీ పరీవాహక ప్రాంతంలోనే పరిఢవిల్లింది. ప్రస్తుతం ఈ నది భారత్‌, పాకిస్తాన్‌లకు జీవనాడి వంటిది. ఎన్నో జలవిద్యుత్‌ కేంద్రాలు దీనిపై నిర్మించారు. కొన్ని లక్షల ఎకరాల సాగుకు ఈ నది నీరే ఆధారం. 

ఇక సట్లెజ్‌ నది, రాక్షస్‌తాల్‌కు సమీపంలోని లంగ్‌ఛన్‌ ఖబాబ్‌ హిమానీనదంలో పుడుతుంది. 4600 నుంచి 5వేల మీటర్ల ఎత్తున వుండే ఈ గ్లేసియర్‌ నుంచి టిబెట్‌ గుండా ప్రవహిస్తుంది. భారత్‌లోని హిమాచల్‌ ప్రదేశ్‌లోని షిప్కిలా పాస్‌ గుండా ప్రవేశించడానికి ముందు ఈ నదిలో స్పిటీ ఉపనది ఇందులో కలుస్తుంది. తర్వాత ఇది కిన్నర్‌ కైలాష్‌ ప్రాంతం గుండా ప్రవహించి పంజాబ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ రాష్ట్రంలోనే భక్రా ప్రాజెక్టును మనదేశం నిర్మించింది. ఈ ప్రాజ ెక్టుకు ప్రదాన నీటివనరు సట్లెజ్‌! చివరకు పాక్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇది సింధూనదిలో కలుస్తుంది. మొత్తం 1450 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది పంజాబ్‌కు గుండె వంటిదని చెప్పడంలో సందేహం లేదు. 

ఈ నదుల ప్రవాహాన్ని చైనా ఆపగలదా?

సాంకేతికంగా చెప్పాలంటే ఈ రెండు నదుల నీటిని చైనా ఆపగలదు. సెంగే త్సాంగ్‌పో, నగరి షికాన్వే జలవిద్యుత్‌ కేంద్రాలను, సింధూనది జన్మస్థానం వద్ద నిర్మించింది. ఇక సట్లెజ్‌ నదిపై జడా గోర్జ్‌ బ్యారేజ్‌ను కూడా నిర్మించింది. ఈ నిర్మాణాల ద్వారా చైనా మనదేశంలోకి ఈ రెండు నదుల నీటి ప్రవాహాన్ని నియంత్రించగలదు. ఇప్పటికే చైనా తమదేశంలోని నదులపై ఎన్నో ప్రాజెక్టులు నిర్మించింది. ముఖ్యంగా ‘సౌత్‌`నార్త్‌ వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టు’ ద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది, ఇంకా చేపడుతోంది. ఈ ప్రాజెక్టుకింద నదీ జాలాలను తమదేశంలోని నీటి ఎద్దడి ప్రాంతాలకు తరలిస్తోంది. అయితే ఇప్పటివరకు సింధు, సట్లెజ్‌ నదులపై ఇటువంటి నీటి తరలింపు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదు. 2017లో బ్రహ్మపుత్రానదికి సంబంధించిన వరద సమాచారాన్ని భారత్‌ అందించని రీతిలో, ఈ నదుల ప్రవాహ సమాచారాన్ని మనదేశంతో పం చుకోకపోవచ్చు. ఈ రెండు నదుల విషయంలో ఇప్పటివరకు ఆటువంటి చర్యకు పూను కోలేదు. నీటిని భౌగోళిక రాజకీయ ఉపకరణంగా గతంలో చైనా కొన్నిసార్లు మనదేశంపై ప్రయోగించింది. 2016లో బ్రహ్మపుత్ర ఉపనది షియాకు ప్రవాహాన్ని నిలిపేసి, మనదేశానికి ఒక హెచ్చరికను పంపింది. 2020లో గల్వాన్‌ సంఘటన తర్వాత ఈ నదినీటి ప్రవాహాన్ని నిలిపేసింది. పలితంగా ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడిరది. గల్వాన్‌ నది సింధూనదికి ఉపనది. 2004లో పరెచునదిపై ఒక కృత్రిమ సరస్సును సృష్టించింది. పరెచు నది సట్లెజ్‌కు ఉపనది. ఈ కృత్రిమసరస్సు ను ‘నీటిబాంబు’గా చైనా ఉపయోగించవచ్చునని భయాందోళనలు వ్యక్తమయ్యాయి కూడా. అ యితే ఇక్కడి నీటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత్‌కు అందిస్తూ పరిస్థితి చేజారిపోకుండా చైనా జాగ్రత్తపడటం విశేషం!

ప్రస్తుతం భారత్‌ సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసిన నేపథ్యంలో, ఇందుకు ప్రతీకారంగా టిబెట్‌లోని సింధు, సట్లెజ్‌ ప్రవాహాలను చైనా నియంత్రించే అవకాశముందని కొందరు నిపుణుల అభిప్రాయం. ఇదే సమయంలో తమదేశంలో పెరుగుతున్న నీరు, విద్యుత్‌ డిమాండ్‌ నేపథ్యంలో ఈ నదీ జలాలను ఆయా ప్రాంతాలకు తరలించకూడదనేంలేదని కూడా ఈ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కొన్ని పరిమితుల్లో మాత్రమే చేయగలదు

ఈ నదుల నీటిని భౌగోళిక రాజకీయ ఆయుధంగా ఉపయోగించాలంటే చైనాకు కొన్ని పరిమితులున్నాయి. సింధు, సట్లెజ్‌ నదుల నీటిలో వరుసగా 10%`15% మరియు 20% మాత్రమే టిబెట్‌లో ప్రవహిస్తాయి. ఈ ప్రాంతం భూకంపాలకు ఆలవాలం కనుక, పెద్దఎత్తున డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం, పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుంది. అంతేకాకుండా నీటిని ఆవిధంగా నిలిపేయడం ‘హిల్సింకి’ వంటి అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం. చైనా తీవ్ర విమర్శలకు గురికాకతప్పదు. అయితే యునైటెడ్‌ నేషన్స్‌ వాటర్‌కోర్సెస్‌ కన్వెన్షన్‌ను ఇప్పటివరకు చైనా అంగీక రించలేదు. చైనా తన నీటివనరులపై సార్వభౌమాధికారం విషయంలో ఎంతమాత్రం పట్టు సడ లించడంలేదు. దీన్ని ఆమోదించనంతవరకు నీటి ప్రవాహానికి దిగువన ఉండే దేశాలకు చట్టబ ద్ధంగా అడిగే హక్కు వుండదు. అప్పుడు దౌత్యం, ప్రపంచదేశాలు కలుగజేసుకోవడం వంటి ప్రక్రియల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతానికి భారత్‌ చైనాల మధ్య 2002 మరియు 2018 సంవత్సరాల్లో బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదీ ప్రవాహాలకు సంబంధించిన స మాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై ఒప్పందాలు కుదిరాయి. అయితే ఈ ఒప్పందాల కాలపరిమితి 2023తో ముగిసినా, చైనా సమాచారాన్ని పంచుకోవడాన్ని మాత్రం ఇప్పటివరకు ఆపలేదు. అదీకాకుండా రెండు దేశాల మధ్య ప్రత్యేకించి నదీజలాల ఒప్పందాలేవీ లేనందువల్ల, తమదేశంలో ప్రవహించే నదుల విషయంలో చైనా తనకు అనుకూలంగా పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించే అవ కాశాలే నూటికి నూరుశాతం వున్నాయి.

కాల్పుల హోరు నుంచి ప్రగతి కాంతులవైపు

అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఛత్తీస్‌గఢ్‌
హైదరాబాద్‌,నేటిధాత్రి:
వామపక్ష తీవ్రవాద పీడిత రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ కూడా ఒకటి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పుల సంఘటనలతో ఎప్పటికప్పుడు పతాకశీర్షికల్లో నిలిచే రాష్ట్రంగా పేరుపడిరది. అందువల్ల చత్తీస్‌గఢ్‌ అంటేనే నక్సల్స్‌ మరియు ఎన్‌కౌంటర్‌ వార్తలు తప్ప మరే యితర సమాచారం మనలకు పెద్దగా లభ్యమయ్యేది కాదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదనేది కాదు ప్రశ్న, అభివృద్ధి పథంలో ఏవిధంగా ముందుకెళుతున్నదనేది ప్రధానం! వామపక్ష తీవ్ర వాదం వల్ల చోటుచేసుకున్న హింసాకాండ నేపథ్యంలో అభివృద్ధి మసకబారినట్టు కనిపించిన నేపథ్యంలో ఇక్కడి ప్రగతి ఉషోదయ కాంతులు, ఇతర రాష్ట్రాలకు తెలియకపోవడం సహజమే. ఈ నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌ అభివృద్ధి కోణాన్ని స్పృజిస్తే మనకు తెలియని ఎన్నో విషయాలు అవగాహనకు వస్తాయనేది మాత్రం సుస్పష్టం. ఒక్కసారి ఈ కోణంలో చత్తీస్‌గఢ్‌ను పరిశీలిద్దాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల నేపథ్యంలో క్రమంగా మావోయిస్టుల ప్రభావం తగ్గుతున్న క్రమంలో, మరోవైపు రాష్ట్రంలో తయారీ, సేవా రంగాలు క్రమంగా ఊపందుకోవడం వర్తమాన పరిణామం. రాష్ట్రంలో రూ.4.5లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు రంగం సిద్ధమైంది. మేనెల మొదట్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డే టా పార్క్‌కు శంకుస్థాపన చేయడంతో, దేశంలోనే మొట్టమొదటి ఏఐ సెంట్రల్‌ పార్క్‌ ఏర్పాటు చేసిన రాష్ట్రంగా నిలిచింది. అంతకు ముందు అంటే గత ఏప్రిల్‌ నెలలో సెమికండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ యూనిట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గాలియం నైట్రైడ్‌ ఆధారిత చిప్‌ల తయారీకేంద్రం. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించి ఆ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ముమ్మరమైంది. కేంద్రం ఒకపక్క రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చర్యలు చేపడుతుండటం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం 2024 నవంబర్‌ 1నుంచి అమల్లో వుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన కేవలం ఆర్నెల్ల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.4.5లక్షల కోట్ల వి లువైన పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5.09లక్షల కోట్లుగా నమోదైంది. ఈ అవగాహనా ఒప్పందాల మొత్తం జీఎస్‌డీపీలో సింహభాగమనదగ్గ స్థాయిలో వుండటం విశేషం. నిజానికి ఈ అవగాహనా ఒప్పందాలన్నీ వాస్తవరూపం దాలిస్తే రాష్ట్ర జీఎస్‌డీపీ దాదాపు రెట్టింపు అవుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. కానీ అవగాహనా ఒప్పందాలు కుదరడం మొదటిదశ అయితే, వీటి అమలు రెండోదశగా భావించాల్సి వుంటుంది.
గత ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడంపై దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం అప్పటివరకు అమల్లో వున్న పారిశ్రామిక విధానంలో ఏఏ మార్పులు తీసుకురావాలో నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏ ర్పాటు చేసి మేధోమధనం జరిపారు. అంతేకాదు నూతన పారిశ్రామిక విధానానికి తుదిరూపం ఇవ్వడానికి ముందు, దీనికి సంబంధించిన భాగస్వాములు, పారిశ్రామికవేత్తల సలహాలను, సూ చనలను పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ముసాయిదాను రూపొందించే స మయంలో రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక మరియు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. రాష్ట్రం లో బాక్సైట్‌, బగ్గు నిక్షేపాలు అపరిమితంగా వున్న నేపథ్యంలో, ఈ రెండిరటిని కీలక పరిశ్రమ లుగా అభివృద్ధి చేయాలన్న దృష్టితో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. ఇదే సమయంలో కేవలం బాక్సైట్‌, బగ్గు నిక్షేపాలే రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌గా స్థిరపడకుండా, ఇతర రంగాలు ముఖ్యంగా సేవారంగానికి ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాదు ఔషధాలు, వస్త్రపరిశ్రమ, వ్యవసాయ ఆధారిత ఆహార పరిశ్రమలు, విద్యుత్‌ మరియు ఎలక్ట్రానిక్‌ రంగాలపై కూడా ఈ విధాన రూపకల్పనలో దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం నవ రాయ్‌పూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా రూపొందిన నేపథ్యంలో దీన్ని ఐ.టి. హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలోని బస్తర్‌, సర్గూజా జిల్లాల్లో ఒక్క పరిశ్రమ స్థాపన ఇప్పటివరకు జరగలేదు. ఈ ప్రాంతా ల్లో కూడా పారిశ్రామికాభివృద్ధికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకపోవడానికి ప్రధాన కారణం రెడ్‌టేపిజం. అనుమతులు రావాలంటే ఒక ప్రభుత్వ శాఖనుంచి మరో శాఖకు తిరగడం తప్ప ఫలితం వుండని పరిస్థితి నెలకొంది. అంతేకాదు అనేక శాఖల అనుమతులు తీసుకోవాల్సి రావడం ప్రధాన అడ్డంకిగా మారింది. రాష్ట్రం లో భూమి కొనుగోలు చేయాలన్నా, లీజుకు తీసుకోవాలన్నా కఠిన నిబంధనలు అమల్లో వున్నా యి. పరిశ్రమలు రాకపోవడానికి ఇదికూడా ఒక కారణం. ఇదేసమయంలో ఎవరైనా పరిశ్రమ లు పెట్టాలనుకున్నా, ప్రభుత్వం తరపున ఎటువంటి ప్రోత్సాహకాలు అందవు! రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇండస్ట్రియల్‌ పార్క్‌లు లేవు. అసలు కొత్త తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు అనుగుణమైన నిబంధనలే లేవు. ఈ ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి 2024, అక్టోబర్‌ నెలలో మంత్రివర్గ ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్ల కాలానికి అనుగుణంగా ఈ ముసాయిదా రూపకల్పన చేసింది. అంటే 2030 మార్చి 31 వరకు ఈ విధానం అమల్లో వుంటుంది.
ఈ నూతన పారిశ్రామిక విధానం అమలుకోసం ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపును అనేకరెట్టు పెంచింది. పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు కేటాయింపులను మూడురెట్లు పెంచింది. ఈ నేపథ్యంలోనే 2025`26 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక`వాణిజ్య శాఖకు ఏకంగా రూ.709.87 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 34 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసివున్నందున, వీటిల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన మద్దతు ఇవ్వనుంది. అనుమతుల సమస్యను అధిగమించేందుకు ‘సింగిల్‌ విండో’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ఇ ప్పుటికు అమల్లో వున్న నిబంధనల్లో 350 మార్పులు చేశారు. కొత్తతరం పరిశ్రమలకు అనుకూ లంగా కొత్త నిబంధనలను చేర్చారు.
ఈ నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామిక రంగాన్ని రెండు కీలక సెక్టార్లుగా విభజించింది. మొదటిది ‘చోదక రంగం’ కాగా రెండవది ‘ముఖ్యమైనవి లేదా కీలకమైనవి’. ఔషధాలు, వస్త్రపరి శ్రమ, వ్యవసాయం మరియు ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌, ఏఐ, రోబోటిక్స్‌, కంప్యూటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డేటా సెంటర్లను ‘చోదక’ విభాగంలో చేర్చారు. ఈ విభాగం కింద పెట్టు బడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి పెద్దమొత్తంలో ప్రోత్సాహకాలను అందిస్తారు. అంతేకాదు ఈ విభాగంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే మొదటి ఐదు పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సా హకాలు అందిస్తారు. ఇక సంప్రదాయిక పరిశ్రమలైన స్టీల్‌, సిమెంట్‌, అల్యూమినియం, థర్మల్‌, సోలార్‌ ప్లాంట్లను ప్రభుత్వం విస్మరించలేదు. ఈరంగంలో ఫిక్స్‌డ్‌ కేపిట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో నూటికి నూరుశాతం జీఎస్టీ ని మినహాయించారు. దీంతో పాటు ఇతర మినహాయింపులు కూడా ప్ర భుత్వం కల్పిస్తుంది.
రాష్ట్రంలో సమానంగా పారిశ్రామికాభివృద్ధి సాధనకు, జిల్లాలను మూడు గ్రూపులుగా ప్రభుత్వం విడగొట్టింది. వెనుకబడిన జిల్లాల్లో నెలకొల్పే పరిశ్రమలకు మరింత ఎక్కువ రాయితీలు మరియు ప్రోత్సాహకాలు లభిసాయి. ఇందుకోసం 2006లో కేంద్రం తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ చట్టం లో కేంద్రం 2020లో తీసుకొచ్చిన సవరణలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ముఖ్యంగా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలకు ఇచ్చిన నిర్వచనాల్లో కేంద్రం తీసుకొన్ని సవరణలనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ప్రమాణంగా తీసుకోవడం గమనార్హం. ఇందులో భాగంగా రూ.వెయ్యికోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా వెయ్యిమంది స్థానికులు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఆకర్షణీయ ప్రోత్సాహాకాలను ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో రూ.1లక్ష కోట్లు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపనకు సంబంధించినవి. ఇందులో రూ.40వేల కోట్లు ప్రభుత్వ రంగ పరిశ్రమలుకాగా, ఆదానీ వంటి ప్రైవేటు రంగ పరిశ్రమలు రూ.48వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఇక జిందాల్‌ పవర్‌ రాష్ట్రంలో థర్మల్‌, సౌర విద్యుత్‌ పరిశ్రమలను స్థాపించడానికి ముందుకొచ్చింది. వీటిల్లో రాయగఢ్‌లో 1600 మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్‌ ప్లాంట్‌కు రూ.12,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. అదేవిధంగా ఎన్టీపీసీ భాగస్వామ్యంతో 2500 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్‌ ప్లాంట్‌పై రూ.10వేలు పెట్టుబడి పెట్టనుంది. గత మార్చిలో రాయపూర్‌లో జరిగిన ‘చత్తీస్‌గడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌`2025’లో ఈ పెట్టుబడులకు హామీ లభించింది. గత ఏడాది డి సెంబర్‌ నెలలో రెన్యూ పవర్‌ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు కింద రూ.11500 కోట్లు పె ట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇక ఉక్కుపరిశ్రమ విషయానికి వస్తే నవీన్‌ జిందాల్‌ నేతృత్వంలోని ‘జిందాల్‌ స్టీల్‌’ రాయ్‌పూర్‌ బ్రాంచ్‌లో ఏటా 3.6మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నది. ఈ సంస్థ విస్తరణ కార్యక్రమం 2027 నాటికి పూర్తికాగలదు. ఇదే ఉక్కురం గంలో చిన్నతరహా పరిశ్రమల విషయానికి వస్తే గ్రీన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.1245 కోట్లమేర పెట్టుబడులు పెట్టనుండగా, 500 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 46వేల మిలియన్‌ టన్నుల ఉక్కుఉత్పత్తి అవుతుండగా 2030 నాటికి దీన్ని 65వేల మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఢల్లీి, ముంబయి, బెంగళూరుల్లో ఎనర్జీ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లు నిర్వహించింది. వీటిల్లో ఢల్లీి సదస్సులో రూ.15వేలకోట్లు, ముంబయి సదస్సులో రూ.6వేల కోట్లు, బెంగళూరు సదస్సులో రూ.3700 కోట్ల మేర పెట్టుబడులకు హామీలు లభించాయి.
వచ్చిన పెట్టుబడుల హామీలు ఇప్పుడిప్పుడే వాస్తవరూపం దాలుస్తున్నాయి. నవ రాయ్‌పూర్‌లో సెమికండక్టర్‌ ప్యాబ్రికేషన్‌ యూనిట్‌కు శంకుస్థాపన జరగడం ఇందుకు ఉదాహరణ. చెన్నైకు చెందిన ఒక కంపెనీ చిప్‌ తయారీకి సంబంధించి రూ.1143 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 5జి, 6జి టెలికమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాలకు అవసరమైన హై ఫ్రీక్వెన్సీ చిప్‌లను ఈ కంపెనీ తయారుచేయనుంది. ఇందుకోసం ఈ కంపెనీ అదనంగా రూ.10వేల కోట్లు పెట్టుబడి పెట్టను న్నట్టు ప్రకటించింది. సెమికండక్టర్‌ ప్యాబ్రికేషన్‌ యూనిట్‌తో పాటు రానున్న నెలల్లో కృత్రిమ మేధ ఆదారిత డేటా పార్క్‌కు వచ్చే నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్ట్‌ మొత్తం 5.5 హెక్టార్ల విస్తీర్ణంలో వుండగా, 500 ప్రత్యక్ష, 1500 పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. తొలిదశలో ఈ యూనిట్‌ను రాక్‌ బ్యాంక్‌ డేటా సెంటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 5మెగావాట్ల సామర్థ్యంతో ని ర్వహించనుంది. దీన్ని మరో రూ.2వేల కోట్ల పెట్టుబడితో 150 మెగావాట్ల సామర్థ్యానికి పెంచ నుంది.
ఇక రక్షణరంగానికి సంబందించిన భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌) జాంజ్‌గిర్‌` చంపా జిల్లాలో తయారీ యూనిట్‌కోసం వంద ఎకరాల భూమిని సేకరించింది. ఇదిలావుండగా నవ రాయ్‌పూర్‌లో ప్లాంట్‌ నెలకొల్పేందుకు యాష్‌ ఫాన్‌ అప్లయెన్సెస్‌కు, ముంగెలీలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఆదిత్య బిర్లా రినీవబుల్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీకి సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు కు ప్రభుత్వం భూమిని కేటాయించింది. నవ రాయ్‌పూర్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ ఏర్పాటుకు మంత్రి మండలి గత నెలలో ఆమోదం తెలిపింది. పరిశీలిస్తే 2000 సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఇంత ధైర్యంగా ముందుకు వెళుతుండటం ఇదే మొదటిసారని చెప్పక తప్పదు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండల కేంద్రంలోని వెంకట లక్ష్మీ గార్డెన్ లో ప్రవళిక – శివ కుమార్ వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి
విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి

మొగులపల్లి నేటి ధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యా ప్రమాణాలు పెంపొందించాలని మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి అన్నారు.

శనివారం మండలంలోని మొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహించబడుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ శిక్షణలో నూతనంగా పరిసరాల విజ్ఞానాన్ని చేర్చడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత మరింతగా పెరుగుతుందన్నారు.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు నమోదు పెంచుటకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు.

గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అంగన్వాడి సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచడానికి భాగస్వాములను చేయాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్దిష్టమైన చదువు హామీ ఇచ్చి నెరవేర్చేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

Students Education Officer

 

ఉపాధ్యాయులు శిక్షణలో పొందిన విధంగా విద్యార్థులను ఆకట్టుకునేలా, ఆసక్తిని పెంచేలా బోధన ప్రక్రియ కొనసాగాలన్నారు.

అనంతరం బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు పొందిన ఉపాధ్యాయులు కోటేశ్వర్లు, సునీతా దేవినీ ఎమ్మార్పీలు వ్యవహరించిన వేణుమాధవ్, నాగరాజు, రామకృష్ణ, రాజ్ కుమార్, స్వామి, రాము, చంద్రయ్యలకు పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.

అగ్రికల్చర్ అధికారి శ్రీనివాస్ రెడ్డి.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున మండల అగ్రికల్చర్ అధికారి మాట్లాడుతూ మండలంలోని రైతులు పంట సీజన్ కాలం ప్రారంభమైనందున నాణ్యమైన విత్తనాలను సంబంధిత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట పద్ధతులు పాటించాలని, మండల కేంద్రంలోని కొన్ని షాపుల వారు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని వారు నకిలీ విత్తనాలను ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు రైతుల ముఖ్యంగా విత్తనాలను మరియు పురుగుల మందులు కొనేటప్పుడు షాపు యొక్క బిల్లును తప్పకుండా తీసుకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు కార్డు కోసం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు తమ ఆధార్ కార్డు ను పట్టా పాస్ బుక్కులు తీసుకొని సంబంధిత ఫోన్ నెంబర్ ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

గ్రామీణ సడక్ యోజన నిధులు ఎటుపాయను.

గ్రామీణ సడక్ యోజన నిధులు ఎటుపాయను

కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరియు అధికారుల ఇళ్లపై ఏసీబీ విచారణ చేపట్టాలి

సీనియర్ జర్నలిస్ట్ నరసింహ

చర్ల నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చర్ల మండలంలోని దండుపేట ప్రధాన రహదారి నుండి కొత్తపల్లి లింగాపురం గొంపల్లి మొగలపల్లి సి కత్తి గూడెం మరియు కత్తిగూడెం మీదుగా వేసిన గ్రామీణ సడక్ యోజన నిధులు సుమారు 54 కోట్ల రూపాయల నుంచి 58 కోట్ల వరకు సగం రోడ్లు వేసి పూర్తిగా కాకుండానే అధికారులు కాంట్రాక్టర్లు పూర్తిగా స్వాహా చేశారు సుమారు నాలుగు సంవత్సరాలు గడిచిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం లేదు కేంద్రం నిధులు అంటే అంతా చులకన అని సీనియర్ జర్నలిస్టు నరసింహా అన్నారు ప్రధాన రహదారి నుండి గోదావరి పరివాహక గ్రామపంచాయతీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించుట కొరకు కేంద్రం ఎంతో దూర దృష్టితో ఆ నిధులను సమీకరిస్తే సదరు కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వలన రహదారి పూర్తికాలేదు గోదావరి వరదలు సమీపిస్తున్నందున ఇకనైనా జిల్లా విజిలెన్స్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో రాష్ట్ర ఆర్ అండ్ బి అధికారులు పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యుల దగ్గర నుండి నగదును రికవరీ చేపించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన నూతన రహదారి నిర్మాణం చేపట్టాలి చర్ల మండల కేంద్రంలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ రహదారిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని త్వరలో ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండలం పోతారం గ్రామం లో శ్రీ విరాజ్ హస్పిటల్ పేద్దపల్లి అద్వర్యం లో ఉచ్చిత వైద్య శిబిరం నిర్వయించారు
ఈ వైద్య శిబిరం లో డాక్టర్ రాజ్ కుమార్ దంత వైద్యులు ( మేనేజింగ్ డైరేక్టర్ ) డాక్టర్ చంద్రకుమార్ జనరల్ పిజిషన్
సదానందం మేనేజ్ మేంట్
రాజు మేనేజ్ మేంట్ మరియు మార్కేటింగ్ పాల్గోని గ్రామస్తులకు వైద్య పరిక్షలు నిర్వయించి ఉచితంగా మందులు పంపిణి చేసారు వైద్యులను మాజీ సర్పంచ్ నేత్తేట్ల మహేందర్ మరియు గ్రామస్తులు షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బందీ గ్రామస్తులు యూత్ సబ్యులు పాల్గోన్నారు

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్.

నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టులో మంజూరు చేయకపోతే ఉద్యమం తప్పదు

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్

నేటి ధాత్రి చర్ల

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చర్ల మండల కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నియామకం లో గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టు అన్యాయమని అన్నారు చర్ల మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు మూడో దఫాలో కేటాయించవలసిన వ్యక్తులను మొదటి దశలోనే కేటాయించడం సరైంది కాదని అన్నారు రాజకీయ కుట్రలో భాగంగా పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గుర్తించాలని కోరారు తక్షణమే రాజకీయాలకతీతంగా నిరుపేదలను గుర్తించి న్యాయం చేయాలని తెలియజేశారు లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో అర్హులైన వారిని గుర్తించి ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు సామల ప్రవీణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నం మోహన్ పార్టీ కోశాధికారి పంబి కుమారి పార్టీ మండల ఈసీ మెంబర్ ఏకుల వెంకటేశ్వర్లు పార్టీ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ ఉప్పరిగుడం సెక్టార్ అధ్యక్షులు రాజు కుదునూరు సెక్టార్ అధ్యక్షులు వర్షిక త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు

ప్రేమ పేరుతో మోసం….

ప్రేమ పేరుతో మోసం….మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం.

పెళ్లిచేసుకుంటానని కులం నెపంతో మోసం చేసిన ప్రేమికుడు..

మనస్థాపంతో ప్రేయసి ఆత్మహత్య యత్నం.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దళిత యువతి.

పోలీసులను ఆశ్రయించిన యువతి తల్లిదండ్రులు..

వరంగల్/నర్సంపేట/దుగ్గొండి నేటిధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

 

ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని, కులాలు వేరైనా ఒకే గ్రామస్థులం అంటూ ప్రేమ పేరుతో నమ్మించి ఒక నర్సింగ్ దళిత యువతిని మోసం చేశాడు ఒక కారు డ్రైవర్ కాగా..

ఆ ప్రేమికుడి మాయమాటలకు మోసపోయి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన దుగ్గొండి మండలంలోని ముద్దునూరు గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకున్నది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన బండి లక్ష్మి , నర్సయ్య పెద్ద కుమారుడు బండి నాగరాజు సికింద్రాబాద్ లో కార్ డ్రైవింగ్ పని చేస్తూ బ్యాచిలర్ గా అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

అదే గ్రామానికి చెందిన కన్నం పూలమ్మ ముత్తయ్య పెద్ద కూతురు కన్నం అరుణ సికింద్రాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింగ్ చేస్తుంది.

గత సంవత్సరం నర క్రితం కారు డ్రైవర్ నాగరాజు యువతి
కన్నం అరుణతో మనం ఇద్దరం ఒకే గ్రామానికి చెందిన వారిగా పరిచయం చేసుకున్నాడు.

ఒక సంవత్సరం పాటు ప్రేమ పేరుతో ఆమె వెంట పడ్డాడు.

కులాలు వేరైనప్పటికీ ఒకే గ్రామానికి చెందినవారిమి కనుక పెళ్లి చేసుకుందామని నమ్మ పలికాడు.

నర్సింగ్ చేస్తున్న అరుణతో ప్రేమ వివాహం పెంచుతూ ఆమె వద్ద నుండి ఖర్చుల నిమిత్తం సుమారు రూ. 50 వేలకు పైగా తీసుకున్నాడు.

అనేకసార్లుగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో యువతిని తీసుకెళ్లి శికార్లకు కొట్టాడు.

వారు దిగిన ఫోటోలు గ్రామంలో వైరల్ కావడంతో ముఖం చాటేసి తక్కువ కులానికి చెందిన దళిత యువతిగా నిరాకరిస్తూ మరో అమ్మాయితో వివాహం చేసుకున్నాడు ఆ కిలాడి యువకుడు నాగరాజు.

మనస్థాపానికి గురి చెందిన దళిత నర్సింగ్ యువతి కన్నం అరుణ ఇంట్లో ఎవరు లేని సమయంలో కెమికల్ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కాగా అంతకుముందే పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిగినప్పటికీ వాటిని సైతం లెక్కచేయకుండా మరొక యువతితో పెళ్లి చేసుకోవడంతో నాగరాజుపై పలువురు దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు నర్సంపేట ఏసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా యువతి తల్లిదండ్రులు కన్నం పూలమ్మ ముత్తయ్యలు మాట్లాడుతూ మా ముద్దునూరు గ్రామానికి చెందిన బండి నాగరాజు అనే కార్ డ్రైవర్ హైదరాబాదులో ఉంటూ తమ కూతురు అరుణకు మాయ మాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మరో యువతీతో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు.

వారి ప్రేమ వివాహారంపై నాగరాజు తల్లిదండ్రులు బండి లక్ష్మి నర్సయ్యలను కొందరు పెద్దమనుషుల సమక్షంలో నిలదీయగా ప్రేమించిన విషయం వాస్తవమే మా కుమారుడిని పిలిపించి మాట్లాడతామని నమ్మ పలికి మరొక యువతతో వారి కొడుకుకు వివాహం చేశారని తెలియజేశారు.

హైదరాబాదులో ఉన్నప్పుడు ప్రేమ పేరుతో తన కూతురు వద్ద ఉన్న రూపాయలు 50 వేలకు పైబడి తీసుకొని పలు విధాలుగా వేధింపులకు గురిచేస్తూ ఫలుదపాలుగా విచక్షణ రహితంగా దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

మనస్థాపానికి గురైన తమ కూతురు అరుణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తల్లిదండ్రులు బండి లక్ష్మి నర్సయ్యలు ఆరోపించారు.

ప్రేమ పేరుతో మోసం చేసిన నాగరాజుపై నర్సంపేట ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే దుగ్గొండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి కులం పేరుతో దూషిస్తూ తన కూతుర్ని మానసికంగా వేధించి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు తల్లిదండ్రులు పోలీసుల వేడుకున్నారు.

దుగ్గొండి ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు వివరణ కోరగా నర్సంపేట ఏసిపి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఉందని తెలిపారు.

దుగ్గొండి పోలీస్ స్టేషన్ లో బాదితుల ఫిర్యాదు చేయలేదని ఎస్సై తెలిపారు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాగరాజు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నాగరాజు.

చిట్యాల, నేటిధాత్రి :

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చిట్యాలమండల లోని గుంటూరు పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ముద్దేన నాగరాజు*ఉపాధ్యక్షులుగా*:మన్యం పెద్ద తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శిగా*:-కంకణాల రామ్, కోటేశ్వరరావు ,సహాయ కార్యదర్శిగా*:- మునిమాకుల నాగేశ్వరరావు, కోశాధికారిగా:కోటపాటి సాంబశివరావు ,*కార్యవర్గ సభ్యులు*పాశం శంకర్ ,కంకణాల లక్ష్మీనారాయణ ,పంచమర్తి కృష్ణారావు మన్నెంచిన్న తిరుపతయ్య, గోదే సుబ్బారావు ,కోటపాటి శ్రీనివాస్, కొంక వెంకటప్పయ్య, మన్యం శ్రీనివాసరావు దుగ్గినేని హరిబాబు..

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

నేటిధాత్రి భూపాలపల్లి:

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని, 30 వార్డుల్లో కాంగ్రెస్ నేతలు గెలుపొందించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ అధ్యక్షతన పట్టణంలోని మొత్తం 30 వార్డుల ముఖ్య నేతలతో ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు మాసంపెల్లి లింగాజి తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి నుండి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ అన్నారని గుర్తుచేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

ఘనంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు
ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిశీలకులు మాసంపెల్లి లింగాజితో కలిసి కేకు కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి అభ్యున్నతి కోసం పాటు పడుతున్న గొప్ప నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు సుంకర రామచంద్రయ్య ఇప్పాల రాజేందర్ దాట్ల శ్రీనివాస్ గురుముల శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

నూతన దంపతులను ఆశీర్వధించిన.

*నూతన దంపతులను ఆశీర్వధించిన
. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి దాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండలం, లోని పెద్ద కోమటిపల్లి వంశీ వెడ్స్ నందిని వివాహ రిసెప్షన్ కు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి వారి వెంట రాష్ట్ర సభ్యులు చదువు రామచంద్రారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ మోర్ రవీందర్ రెడ్డి మండల అధ్యక్షులు మోరే వేణుగోపాల్ రెడ్డి జిల్లా నాయకులు చెవ్వ శేషగిరి అన్నం శ్రీనివాస్ ఎర్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్.

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

సరస్వతి పుష్కరాలకు రానున్న రెండు రోజుల్లో లక్షలల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
సరస్వతి పుష్కరాల కొనసాగుతున్న నేపథ్యంలో 10 వ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏర్పాట్లను పరిశీలించి వాకి టాకీ ద్వారా రానున్న రెండు రోజులు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సరస్వతి ఘాట్ లో భక్తల రద్దీని పరిశీలించి కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, రక్షణ చర్యలు, విఐపిలు పుణ్య స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని, కంటైనర్ ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మెయిన్ ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన మట్టి రోడ్డులో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విఐపిల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ లో క్రమం తప్పక నీటి సరఫరా ఉండే విధంగా చూడాలని సూచించారు. ఘాట్ ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని భక్తుల రద్దీని పరిశీలించి పుష్కరాల సేవలు ఏవిధంగా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్వర త్వరగా దర్శనాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి కాళేశ్వరం లోని పలుగుల జంక్షన్, తాత్కాలిక బస్టాండ్, ఇప్పల బోరు జంక్షన్, పార్కింగ్ స్థలాలను పరిశీలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులతో మాట్లాడారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోలీసులు అప్రత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా సురక్షిత ప్రయాణాలు చర్యలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

గురుకుల కళాశాలలను రద్దు చేసే ఆలోచనను.

గురుకుల కళాశాలలను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలి.

తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత.

చిట్యాల ,నేటి ధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్ కళాశాలలో *12*జూనియర్ కళాశాలలను రద్దు చేసి విద్యార్ధులకు అన్యాయం చేసే
ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్ కు వినతి పత్రం అందజేశామని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* డిమాండ్ చేశారు.

అనంతరం మల్లయూమాట్లాడుతూ నిరుపేదలు, ఫఆర్థికంగా లేని విద్యార్థులు కళాశాలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మూసివేయడం వలన తమ చదువులు కొనసాగించ లేక పోతారని తెలిపారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దని అన్నారు.

ఈ ప్రభుత్వం మూసివేసే గురుకుల జూనియర్ కళాశాలలో 8 బాలికల వి, 4 బాలురవి అని తెలిపారు.

ప్రభుత్వం రద్దు చేసే గురుకుల జూనియర్ కళాశాలలు* జోగులాంబ, గద్వాల జిల్లా ఇటిక్యాల (బాలురు), కరీంనగర్ జిల్లా చొప్పదండి ( బాలికలు), భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ( బాలికలు) ఖమ్మం జిల్లా సత్తుపల్లి ( బాలురు) కూసుమంచి (బాలికలు), మహబుబబాద్ జిల్లా నర్సింహులపేట ( బాలికలు), సిద్దిపేట జిల్లా దుబ్బాక ( బాలురు), సంగారెడ్డి జిల్లా రాయి కోడ్ ( బాలికలు), కామారెడ్డి జిల్లా బిచ్కుంద ( బాలురు) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (బాలికలు), జనగామ జిల్లా చిట్యాల నర్మెట్ట ( బాలికలు), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి (బాలికలు) ఈ కళాశాలను మూసివేసే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు లేని యెడల దళిత సంఘాల ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఇట్టి సమాచారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జెన్నే యుగేందర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల సాంస్కృతిక కార్యదర్శి దాసారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ముద్దసానికి కడసారి వీడ్కోలు.

ముద్దసానికి కడసారి వీడ్కోలు

నివాళులర్పించిన టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి

నెక్కొండ నేటి ధాత్రి:

చెన్నారావు పేట ప్రాథమిక సహకార సంఘం సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి శుక్రవారం గుండె పోటుతో హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విలువగా విషయం తెలుసుకున్న నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో ని సత్యనారాయణ ఇంటికి చేరుకొని మృతదేహం పై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి మృతి చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, ఎస్టి జిల్లా సెల్ ఉపాధ్యక్షుడు తిరుమల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు చల్ల పాపిరెడ్డి, కెవి సుబ్బారెడ్డి, రావుల మైపాల్ రెడ్డి, ఎండి అన్వర్ పాషా, కుసుమ చెన్నకేశవులు, ముదిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుముల శ్రీధర్ రెడ్డి, మట్ట బిక్షపతి, భూమాణి మధు, కోటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Farewell

సత్యనారాయణ మృతి ఎంతో బాధాకరం : మారం రాము, కొమ్ము రమేష్ యాదవ్

చెన్నారావుపేట సొసైటీ మాజీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి మృతి చెందిన ఘటన తెలుసుకున్న నెక్కొండ మాజీ సొసైటీ చైర్మన్ మారం రాము, నర్సంపేట బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్ లు సత్యనారాయణ మృత దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మారం రాము మాట్లాడుతూ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి అందరినీ కలుపుకు పోయి ఆప్యాయంగా పలకరించే వ్యక్తి సత్యనారాయణ రెడ్డి అని సత్యనారాయణ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మనోవేదనకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, ఈదునూరి యాకయ్య, ఖలీల్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు.

వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు

వనపర్తి: నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన దివంగత వనపర్తి
మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయరాములు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ కృషి తో జయరాములు కుటుంబ సభ్యులు.ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో, జయరాములు ప్రజాప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జయరాములు గారి కుటుంబ సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కళాకారుడు రాజారాం ప్రకాష్ బృందం, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టి జి ఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పా
షా, శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, టిడిపి జిల్లా నాయకులు కొత్త గొల్ల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, నాగరాజు, రామస్వామి, శ్రీను, విజేత రాములు, పెద్దమందడి అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీశైలం, శ్రీరంగాపురం మేకల అశోక్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి,నాగరాజు, సాయి యాదవ్, మురళీకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ స్మృతిసభ ద్వారా జయరాములు గారి ప్రజా సేవలు మరింత ముందుకు పోవాలని, ఈ తరం నాయకులకు ఆయన జీవితం స్ఫూర్తిగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.

జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ధర్మకర్త

వీణవంక ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డి 43వ జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘపాల్ రెడ్డి, ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది
అనంతరం మండల అధ్యక్షుడు రఘపాల్ రెడ్డి ఎండి సాహెబ్ హుస్సేన్ లు మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుండి ధర్మ కర్త గా ఎదిగి ముందు ముందు మరెన్నో పదవులను పొందాలని వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్,గంగాడి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు చిన్నాల అయిలయ్య, మార్కెట్ డైరెక్టర్ మాదాసు సునీల్,కర్ర తిరుపతి రెడ్డి, నాయకులు ఈదునూరి పైడి కుమార్,ఒరేం శ్రీనివాస్, ఉయ్యాల నాగరాజు,కర్ర గురు,మర్రి సమ్మయ్య తదితరులు పాలుగోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version