బహిరంగ సభకు భారీగా తరలిరండి…

బహిరంగ సభకు భారీగా తరలిరండి…

నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా పదవి ఇవ్వాలని ప్రతిపాదన

కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన

తిరుపతి(నేటి ధాత్రి) మే 26:

 

 

 

ఎన్టీఆర్ జన్మదిన పురస్కరించుకుని టిడిపి మహానాడు 27, 28,29 న భారీ బహిరంగ సభ కు భారీగా తరలిరావాలని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పిలుపు నిచ్చారు,
స్థానిక తిరుపతి
ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో సోమవారం తిరుపతి టిడిపి నాయకుల తో కలిసి ఆయన మాట్లాడుతూ నందమూరి తారకరామారావు జన్మదిన పురస్కరించుకొని 27 28 29 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని తలపెట్టారని తిరుపతి నుంచి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నాలని, నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా (టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ) పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన తిరుపతి నుంచి టిడిపి నాయకులు కార్యకర్తలు పలువురి అభిప్రాయలతో ఈ ప్రతిపాదనను పెడుతున్నామని ఇందుకు అందరూ అంగీకరించాలని కోరుతున్నామన్నారు.
కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన
వైసీపీ పార్టీలోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనింగ్ కేసులో పై చర్చించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలను మహానాడులో చర్చించాలని
ఆయన అన్నారు,
ఈ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర పరిపాలనపై అంశాలపై అలాగే పలు అంశాలపై చర్చించుకుని ఇటు పార్టీని అటు రాష్ట్ర పరిపాలనను పరిపాలించేందుకు పొలంసాలపై చర్చించి అలాగే తిరుపతి నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు, అన్నిటిని అందరూ ఆమోదించి ఆదర్శవంతమైన పాలనను ప్రజలకు అందించాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు మంత్రులు కూడా
హాజరు కానున్నారని ఆయన తెలిపారు,
ముఖ్యంగా 29వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తో పాటు డిప్యూటీ మేయర్ ఆర్ సి, మునికృష్ణ,
కట్టా జయరామ్ యాదవ్, బుల్లెట్ రమణ, రామారావు,జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.

ప్రతి విత్తన అమ్మకంపై రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి.

అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ తప్పదు.

పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ సహాయ సంచాలక అధికారి శ్రీనివాస్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి సంబంధిత డీలర్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయబడుతుందని టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేపట్టి. పలు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించి కంపెనీకి సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఆమోదిత పత్రాలు పరిశీలించారు అదేవిధంగా విత్తన షాపులలో స్టాక్ రిజిస్టర్ లను, స్టాక్ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆమోదిత పొందిన విత్తన ప్యాకెట్లను మాత్రమే రైతులకు అంది ఇవ్వాలని అందించే క్రమంలో తప్పనిసరిగా ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలని. ప్రతిరోజు విక్రయించిన విత్తనాలను ప్రత్యేకంగా రిజిస్టర్ లో రైతుల పేర్లతో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని. విడిగా విత్తనాలు అమ్మకూడదని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తన ప్యాకెట్లను రైతులకు విక్రయించాలి అధిక ధరలకు విత్తన ప్యాకెట్లను విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పలువురు విత్తన డీలర్లను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు రంజిత్ రెడ్డి, పి.ఎస్.ఐ జి రామ్మోహన్ , మండల వ్యవసాయ అధికారి బన్న రజిత, పోలీస్ సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు డీలర్లు తదితరులు ఉన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత.

మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత.

#కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

#మహిళలు తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధికి ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలి.

#రూ,10 కోట్ల బ్యాంకు రుణాల చెక్కును మహిళా సంఘాల బాధ్యులకు అందజేత.

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి:

నల్లబెల్లి నేటి ధాత్రి:

మహిళలు ఆర్థికంగా పురోగతి చెందినప్పుడే కుటుంబాలు, రాష్ట్రాల తో పాటు దేశాలు ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య భవనంలో అధ్యక్షురాలు ఊట్కూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాజన సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అందుకు అనుగుణంగానే ఎలాంటి వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు అందజేయడం జరుగుతుందని దానిని ప్రతి ఒక్క మహిళ తీసుకున్న రుణాన్ని స్వయం ఉపాధికి ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదిగి సంఘాలను బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని.

దేశ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు ఆర్థిక పురోగతి చెందినప్పుడే దేశం అన్ని విధాలుగా ముందుకు వెళుతుందని స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆనాడే ఆలోచించి మహిళా సంఘాల ఏర్పాటుకు పునాది వేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళా సంఘానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రతి మహిళా సంఘానికి పావలా వడ్డీ తో 2 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.

Congress

మహిళా సంఘాల ద్వారా వచ్చే రుణాలను ఎక్కువ మొత్తంలో వ్యవసాయంపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థికంగా లాభాపేక్షం లేకపోవడం తద్వారా సంఘాలు ఆర్థికంగా ఎదగకపోవడం జరుగుతుందని వ్యవసాయానికి ఎలాగో బ్యాంకు రుణాలు తీసుకొని వ్యవసాయంపై పెట్టుబడి పెట్టి మహిళా సంఘాల ద్వారా వచ్చే రుణాన్ని చిన్నచిన్న వ్యాపారంపై ఖర్చు చేస్తే నెలకు కనీసం 10 వేల రూపాయల ఆదాయం వస్తే వెనకబడి కుటుంబ ఆర్థిక పరిస్థితి తో పాటు సంఘ అభివృద్ధి కొరకై పాటుపడడం జరుగుతుందని.

మండలంలో 996 సంఘాలు ఉండగా కనీసం 100 సంఘాలు సంఘానికి 50 నుండి 70 లక్షల వరకు రుణాలు కావాలని అడిగితే బ్యాంకర్స్ తో మాట్లాడి వారికి ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

వచ్చిన రుణాన్ని ఏదో ఒక వారికి నచ్చిన వ్యాపారంపై పెట్టుబడి పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని.

నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నత కోసమై ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగినప్పుడు ఎమ్మెల్యేగా నాకు అంతకంటే సంతోషం ఉండదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, కమిటీ మెంబర్ జ్యోతి, అడిషనల్ డి ఆర్ డి ఓ రేణుక దేవి, డి పి ఎం అనిత, ఎమ్మార్వో ముప్పు కృష్ణ, ఎంపీడీవో నరసింహమూర్తి, ఏపిఎం సునీత, మండల సమైక్య కార్యదర్శి అనూష, కోశాధికారి రమ, సిఏలు, గ్రామ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి.

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి

సివిల్ సప్లై హామాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్

కేసముద్రం నేటి ధాత్రి:

ఏఐటియూసి అనుబంధ సివిల్ సప్లై హామాలి వర్కర్స్ యూనియన్ మహబూబాబాద్ జిల్లా మహాసభ వడ్డెబోయిన లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా స్టేట్ సివిల్ సప్లై హమాలీ రాష్ట్ర అధ్యక్షులు గుంపల్లి మునిశ్వర్, ఏఐటీయూసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను కుదించి, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పిన ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యల వారధిగా ఉంటూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని వారు అన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు లేవనీ, హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రేషపల్లి నవీన్, మంద భాస్కర్, చొప్పరి శేఖర్,కాసు సాయి చరణ్,పెరుగు కుమార్,వీరవెల్లి రవి, వంకాయలపాటి జకరయ్య,రాజబోయిన శ్రీను, భానోత్ రాజు, ఎల్లుట్ల నారాయణ, అల్లరి నారాయణ, కొనుకటి మల్లారెడ్డి వెలిశాల ప్రభాకర్, సరిత తదితరులు పాల్గొన్నారు.

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు.

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు అమ్మేతే

కేసులు నమోదు చేయండి కలెక్టర్ అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిధాత్రి :

వనపర్తి జిల్లాలో వనపర్తి లో రైతులకు ప్రభుత్వ లై సేన్స్ లేకుండా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా స్థాయి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభవుతున్నందున రైతులు విత్తనాలు నాటేందుకు సమాయత్తం అవుతుంటారని, పొరపాటున నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. వనపర్తి జిల్లాలో షాపుల.వారు ఎక్కడ నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ చేయని, లేబుల్ లేని విత్తనాలు అమ్మడానికి వీలు లేదని హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలోని అన్ని విత్తనాలు అమ్మే షాపులు, డీలర్ షాపులను తనిఖీ చేసి ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉంటే కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు చాలా ఖరీదైనవి ఉండటం వల్ల నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ లో గాని రైతులకు బ్రోకర్ల ద్వారా అమ్మే ప్రమాదం ఉందన్నారు.
హ్యాషన్ హౌస్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు డీలర్ గింజల షాపులను తనిఖీ చేసి సీడ్ ప్యాకెట్ లను తనిఖీ చేయాలని, ప్యాకెట్ పై జి.ఈ.ఎ.సి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని జి. ఈ. ఎ.సి నెంబర్ లేకున్నా, లూజ్ విత్తనాలు అమ్మకానికి పెట్టిన వెంటనే షాపు వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.లైసెన్స్ కలిగిన డీలర్లు మాత్రమే విత్తనాలు అమ్మాలని ఇతరులు విత్తనాలు అమ్మడానికి వీలు లేదన్నారు. లైసెన్స్ లేని వారు విత్తనాలు అమ్మినా, నకిలీ విత్తనాలు అమ్మినా సీడ్ యాక్టు 1966, సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983, ఈ. పి యాక్టు 1986 ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో రైతులు వరి పంట మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటల సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వరి సాగు చేసే రైతులు దొడ్డు రకం కాకుండా సన్న రకం మాత్రమే సాగు చెస్ విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు నకిలీ విత్తనాల పై అవగాహన కల్పించడమే కాకుండా పంట రైతులకు పంట మార్పిడి పై అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఏ.డి. ఎ చంద్ర శేఖర్, మున్నా, సి. ఐ లు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు.

ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్( నేటి ధాత్రి ):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలు పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.మొత్తం 182 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 75, హౌసింగ్ శాఖకు 36, ఎస్డీసీకి 12, డీఆర్డీఓ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు తొమ్మిది చొప్పున, ఎస్పీ కార్యాలయానికి 6, జిల్లా ఉపాధి కల్పన అధికారి, నీటి పారుదల శాఖ కు 5 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారికి 4, వ్యవసాయ శాఖ,  జిల్లా విద్యాశాఖ అధికారి, ఏడీ టెక్స్టైల్స్, సబ్ రిజిస్టర్, ఏడీ ఎస్ఎల్ఏ కు రెండు చొప్పున తదితర శాఖలకు దరఖాస్తులు వచ్చాయి. అలాగే వైద్యానికిి రూ. రెండు లక్షల ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన బొల్లె శ్రీనివాస్ పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాడు. సాయం అందించాలని శ్రీనివాస్ భార్య శంకరవ్వ కలెక్టర్ కు విన్నవించారు. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి, శ్రీనివాస్ వైద్యానికి రూ. రెండు లక్షల చెక్కును అందజేశారు. వైద్యానికి సహాయం అందించిన కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి:

 

ఈనెల 25న ములుగు జిల్లా వెంకటాపూర్ లో ముదిరాజ్ ల సింహగర్జన సభ చైతన్య ర్యాలీకి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటూ,అందరం ఒక తాటిపై వచ్చి సభను సక్సెస్ చేశామని సభకు అహర్నిశలు కష్టపడి విజయతీరాలకు చేర్చిన మెపా ఫౌండర్స్ మెంబర్స్,మెపా కోర్ కమిటీ సభ్యులకు,పిలవగానే సభకు వచ్చిన గౌరవ,ముఖ్య అతిథులకు,ముదిరాజ్ బందు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,వివిధ జిల్లా,మండల,గ్రామాల ముదిరాజ్ కుల బాంధవులకు,మిత్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ
ముదిరాజ్ ల బలగం,బలాన్ని,గలాన్ని చాటి చెప్పమని,మన హక్కుల పిల్లల బంగారు భవిష్యత్తు కోసంవిద్య,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా ముందుకు వెళ్దామని తెలిపారు.

అటవీ అధికారుల పై అట్రాసిటీ కేసు నమోదుకు కలెక్టర్.

అటవీ అధికారుల పై అట్రాసిటీ కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశం.

రైతులపై అక్రమ కేసుల నమోదుకు నిరసనగా ధర్నా

పోలీస్ అధికారులకు వెంటనే ఫోన్లో ఆదేశం

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి.

బెల్లంపల్లి నేటిధాత్రి:

వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా పరిగణించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అటవీశాఖ అధికారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ రోజు న్యాయవాది, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు రైతులకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు. గత యాభై సంవత్సరాల నుండి రైతులు చామనపల్లి శివారులోనీ సర్వే నెంబర్ 65, 67 లో సాగు చేస్తున్నారని అన్నారు. ఆ భూముల్లో విద్యుత్ మోటార్లు, స్తంభాలు, బోర్లు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పట్టా పాసు పుస్తకాలు ఇచ్చిందని, లోన్లు, రుణమాఫీ చేసిందని అన్నారు. 1997లోనే ఫైనల్ పట్టా ఇచ్చిందని తెలిపారు. గత సంవత్సరం నుండి అటవీశాఖ అధికారులు ఈ భూములు అటవీ శాఖ కు చెందినవని రైతులపై దాడులు చేస్తూ, అక్రమంగా కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపించారని తెలిపారు. అటవీశాఖ అధికారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే జైపూర్ ఏసీపికి, నీల్వాయి ఎస్ఐ కి పోన్ చేసి అటవీశాఖ అధికారుల పై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో నీల్వాయి పోలీస్ స్టేషన్ లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు మున్నరాజ సిసోడియా, బిజెపి జిల్లా నాయకులు దుర్గం ఎల్లయ్య, రైతులు బానయ్యా, లింగయ్య, పర్వతాలు, మధుకర్, బాధిత రైతులు పాల్గొన్నారు.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు.

బెల్లంపల్లి నేటిధాత్రి:

బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం ఆద్వర్యంలో కలం యోధుడు ఉద్యమనేత సీనియర్ పాత్రికేయులు దివంగత జర్నలిస్టు మునీర్ అన్నకు బెల్లంపల్లి పాత్రికేయుల నివాళులు అర్పించారు. సోమవారం రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్ర
పటాన్ని ఏర్పాటుచేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సజ్ను ఫఫీ మాట్లాడుతూ మునీర్ భాయ్ పత్రికా రంగానికి విశేష సేవలు అందించడం తోపాటు కార్మిక వర్గానికి చేసిన సేవ లను గుర్తు చేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు మడమతిప్పని పోరాటాలు చేసిన మహనీయుడని, పత్రికా రంగంలో సీనియర్ పాత్రికేయుడుగా రాణిస్తూ విశ్లేషణాత్మకమైన కథనాలతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషిని చేయడం జరిగిందని, నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ పత్రికల్లో
బాధ్యతలు స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలిని ప్రదర్శించి ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన మునీర్ భాయ్ సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్ర
మంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ టేకుల బస్తి ఉపాధ్యక్షుడు ఇరుకుల్ల రమేష్,
ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే,కోశాధికారి కత్తుల నవీన్,కార్య
వర్గ సభ్యులు టి.శ్రావణ్, కె.రమేష్ ,
కె.సాగర్, ఉపాధ్యక్షుడు దండబోయిన భాస్కర్, ప్రధాన కార్యదర్శి సుభాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు.

ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద, ఆరోగ్యం, వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు నేడు పూర్ణాహుతితో ముగిశాయి. సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ మహా పర్వదినంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈఓ మహేష్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ 12 హోమాలు ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణామాలు కలగాలని ఆకాంక్షతో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సందర్భంగా శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని కోరుతూ విశేష పూజలు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

మాతా శిశు కేంద్రం లో ఆర్ ఎస్ఐ భార్య ప్రసవం.

మాతా శిశు కేంద్రం లో ఆర్ ఎస్ఐ భార్య ప్రసవం..

పెద్దపల్లి జిల్లా నేటి ధాత్రి:

వరంగల్ జిల్లాలోని మామునూరు క్యాంప్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఆర్ఎస్ఐ) గా ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఈర్ల కృపావరం భార్య స్నిగ్ధ పెద్దపల్లి జిల్లాలోని మాతా శిశు కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఈ సందర్భంగా ఆర్ ఎస్సై మాట్లాడుతూ తనకు కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఏరియాలోని బొంకూరి కాలనీకి చెందిన ఆర్ఎస్ఐ కృపావరం భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఆ జంట ఇతరులకు ఆదర్శంగా నిలిచారని  కొనియాడారు.

నూతన ఆర్టీసీ బస్ సర్వీస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన.!

నూతన ఆర్టీసీ బస్ సర్వీస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే పాయం కు ఘన స్వాగతం పలికిన కొమరారం గ్రామ ప్రజలు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చిన ఎమ్మెల్యే పాయం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరారం నుండి గుండాల మండల కేంద్రానికి వయా శెట్టిపల్లి, శెంబునిగూడెం గ్రామ పంచాయతీ మీదుగా నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ని సోమవారం రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ప్రయాణికులతో కొమరారం నుండి గుండాల వరకు బస్సులో ప్రయాణించి లింగాపురం పోతురాజు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్సు ప్రయాణికులతో ఆప్యాయతగా మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కొమరారం నుండి శెట్టిపల్లి వరకు బస్ సర్వీసును తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ఈ ప్రాంతానికి బస్ సర్వీసును ఏర్పాటు చేశామని గుండాల మండల ప్రజల సమక్షంలో బస్ సర్వీస్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని తెలియజేశారు. బస్సు ప్రయాణించే రోడ్డు మార్గంలో గ్రామస్తులు ఎమ్మెల్యే ని స్వాగతిస్తూ పూలమాలలతో వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిన పినపాక నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తున్న ప్రజా నాయకుడు ఎమ్మెల్యే పాయం ని గుండాల మండల ప్రజలు అభినందించారు.
ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి ,గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముత్యమాచారి,మాజీ ఎంపీపీ చాట్ల పద్మ ,పిఎస్ఆర్, పీవీఆర్ మండల కోఆర్డినేటర్ ఖదీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RTC

 

35 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే

ఎమ్మెల్యే పాయం కు ఘన స్వాగతం పలికిన గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గుండాల మండల పర్యటనలో భాగంగా గుండాల మండలంలో ని నల్లచేలక, శoభూనిగూడెం,గుండాల ఎస్టీ కలనీ,మటన్ లంక,జామరిగూడెం
పరిధిలో 35 లక్షల అంచన ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి నియోజకవర్గ అభివృద్ధికై కృషి చేస్తున్నామని తెలియజేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
తదితరులు పాల్గొన్నారు.

చినుకు పడితే ప్రజలకు కష్టాలే.

చినుకు పడితే ప్రజలకు కష్టాలే

బాలానగర్  నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వీధుల్లో సీసీ రోడ్డు లేకపోవడంతో మట్టి రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటో స్టాండ్ సమీపంలో వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.

జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో.

జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో
బండి సంజయ్ కి వినూత్న వినతి పత్రం
జమ్మికుంట నేటిధాత్రి:

స్థానిక జమ్మికుంట పట్టణంలో గల పాత అంబేద్కర్ వద్ద కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి చిత్రపటానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా సెక్రెటరీ సజ్జు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ లు మాట్లాడుతూ;
జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ లో కొత్తపల్లి నుండి జమ్మికుంటకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన నిర్మాణం ప్రారంభించాలని, మరియు కరీంనగర్ నుండి తిరుపతికి వారానికి ఒకసారి నడిచే ఎక్స్ ప్రెస్ రైలును రోజు నడిపించాలని అదేవిధంగా పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లను దక్షిణ్ అప్ అండ్ డౌన్, దానాపూర్, నవజీవన్, గ్రాండ్ ట్రంక్ లాంటి ఇతర రైళ్లను జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్లో ఆపవలసిన అవసరం ఎంతగానో ఉందని తెలియజేసారు. జమ్మికుంట – హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి గానీ, ఈ ప్రాంతం అభివృద్ధి గానీ ఎంపీగా గెలిచినప్పటి నుండి నేడు కేంద్ర సహాయక మంత్రిగా ఉన్నప్పటికి కూడా హుజురాబాద్ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి, బర్రెకు సున్నమేసి ఇది ఆవు అనిపించేలా ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఇకనైనా హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోని కేంద్రం నుండి రావలసిన నిధులు అన్నిటిని తీసుకొచ్చి జమ్మికుంట మరియు హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మరియు ఇల్లంతకుంట దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే అపర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి రెండవ దేవస్థానం కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుండి నేటి వరకు కూడా ఈ దేవస్థానానికి నయా పైసా కూడా తీసుకురాని నేటి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు రామభక్తుడిని నేనని ఎప్పుడు చూసినా రామజపం చేస్తూనే ఉంటాడే తప్ప ప్రజల అభివృద్ధి గాని ప్రాంత అభివృద్ధి గాని తనకు అవసరం లేదనట్టుగా ప్రవర్తిస్తూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ, ఇకనైనా ఈ నియోజకవర్గ ప్రజలను ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, హుజరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు రోమాల రాజ్ కుమార్, పాతకాల రమేష్, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, యూత్ నాయకులు పతకాల ప్రవీణ్, పచ్చిమట్ల భాను, ఏరెడ్డి సతీష్, రాగల్ల శివ, బండి పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

నూతన తహసిల్దార్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.

నూతన తహసిల్దార్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

 

నడికూడ నేటిధాత్రి:

నడికూడ మండల కేంద్రం లో స్థానిక మండల రెవెన్యూ ఆఫీస్ లో తాహసిల్దార్ రవీందర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి దొగ్గేల వినయ్,వరికోలు గ్రామ కమిటీ అధ్యక్షులు దేవు రమేష్, తదితరులు పాల్గొన్నారు

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం.

పుష్కరాలకు వెళ్లే భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులకు దాతల సహకారంతో కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వరుసగా పన్నెండు రోజుల పాటు ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరం వద్ద ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి వెళ్లే భక్తులకు పన్నెండు రోజులు అన్నదానం చేయడం అభినందనీయమని, ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన దాతలకు, సేవా కార్యక్రమాలు చేసిన ప్రతీ ఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సోలీస్ ఐకేర్ వారికి ఇతర దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, వచ్చే ఏడాది మేడారం మహా జాతర జరిగినన్ని రోజులు కూడా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణి.

నాగర్ కర్నూల్ నేటి దాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలంలోని అజిలాపురం, కుందారం తండా, లాలు తాండ, గ్రామాలలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీ చేయడం జరిగింది.ఈ పంపిణీ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్ధగొని రమేష్ గౌడ్ , ఆశ వర్కర్ కలమ్మ, సిద్ధగోని పరమేష్, బుడ్డ రాములు, ఆర్కే గౌడ్, కుమార్, ఎండి ఖాజాబీ, కాలే నరసింహ, ఎండి జాఫర్, నిరంజన్, లింగం, కేశముని పరమేష్, కొప్పుల యాదయ్య , మహేష్, రామచంద్రి, దాములా నాయక్, రమేష్ నాయక్ , వెంకటేష్ నాయక్ గ్రామ పెద్దలు మహిళలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలలోనే
నాణ్యమైన విద్య

నిజాంపేట నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో సోమవారం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాల ఆవశ్యకతను విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. విద్యతో పాటు పౌష్టికాహారం కూడా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, దశరథం లు ఉన్నారు.

బీరప్ప కళ్యాణంలో కంట రెడ్డి తిరుపతిరెడ్డి.

బీరప్ప కళ్యాణంలో కంట రెడ్డి తిరుపతిరెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప కామరాతిల కళ్యాణ మహోత్సవం కురుమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం కే. వెంకటాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప కళ్యాణానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంట రెడ్డి తిరుపతిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడిపంటలు సుభిక్షంగా ఉండీ రైతులకు అధిక ధాన్యం దిగుబడి రావాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందన్నారు. బీరప్ప కళ్యాణం లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మావురం రాజు, ఎల్లం యాదవ్, దుర్గయ్య,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కోటగుళ్లలో సరస్వతి పుష్కర భక్తుల సందడి.

కోటగుళ్లలో సరస్వతి పుష్కర భక్తుల సందడి

తిరుగు ప్రయాణం లో స్వామివారి దర్శనం

చివరి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో గత 12 రోజులుగా కొనసాగుతున్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కోటగుళ్లను సందర్శిస్తున్నారు. సోమవారం పుష్కరాలకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతా నికి చెందిన భక్తులే కాకుండా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తులు కూడా కోట గుళ్ళ ను సందర్శించారు. ఆలయాన్ని సందర్శించిన భక్తులకు ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఆలయ విశిష్టతను వివరించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version