విత్తన దుకాణాలలో తనిఖీలు.

విత్తన దుకాణాలలో తనిఖీలు

ఎం ఏ ఓ సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

మండల కేంద్రంలో గల విత్తన దుకాణాలను వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఇన్చార్జ్ ఎస్సై సృజన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు విత్తన చట్టం ప్రకారం వ్యాపారం నిర్వహించాలన్నారు. రైతులకు అమ్మిన విత్తనాలను బిల్లు రూపంలో అందించాలన్నారు.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చిన్న బోనాల మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డు మాజీ కౌన్సిలర్ బొల్గాం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, మరియు జిల్లా కలెక్టర్ కి , సంబంధిత జిల్లా పశు వైద్యాధికారులకు విన్నవించడం ఏమనగా, నిన్నటి రోజున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న బోనాల లో నిన్న మమిండ్ల నాగరాజు అనే రైతు యొక్క ఆవు పిడుగుపాటు గురై మరణించడం జరిగినది తెలిపారు. ఆ రైతు యొక్క జీవన ఉపాధి పశువులపైనే ఆధారపడి ఉన్నందున, సుమారు 50 వేల నుండి 80 వేల విలువగల ఆవు మరణించినందునకు, ఆ రైతు రోధిస్తున్నాడు తెలిపారు.కావున వెంటనే ప్రభుత్వం తరఫున రైతుకు నష్ట పరిహారాన్ని చెల్లించి, జీవన ఉపాధిని కల్పించాలని స్థానిక మాజీ కౌన్సిలర్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను తెలిపారు.

50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు.

చనిపోయిన కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన పార్టీ కాంగ్రెస్ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి.మండలం కస్పే కట్కూరు గ్రామానికి చెందిన శనిగరం దిలీప్ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా. వారి. తల్లిదండ్రులను . కుటుంబ సభ్యులను. పరామర్శించి. మనోధైర్యం ఇచ్చి. వారి కుటుంబానికి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ. సత్తు శ్రీనివాస్ రెడ్డి తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేసిన సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఈ oదుకుగాను బాధిత కుటుంబ సభ్యులు బియ్యం అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించి. వారి కుటుంబానికి. పార్టీ పరంగా కాను ప్రభుత్వపరంగా కాను. అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి. బాధిత కుటుంబానికి సహాయం అందించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టం చేశారు. ఇట్టి కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్. కే రాజేశ్వరరావు. కిషన్ కుటుంబ సభ్యులు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

పరకాల నేటిధాత్రి:

 

ఈ నెల 26,27 న హసన్ పర్తిలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హనుమకొండ జిల్లా మహాసభలలో భాగంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావుకి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్ర బిక్షపతికి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ,పరకాల కార్మికులకు పక్షాన నియోజకవర్గంలో ఉన్న చర్లపల్లి,పోచారం తదితరుల గ్రామాలలో కార్మికులు సంఘాలకు నాయకత్వం వహించి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మున్సిపాలిటీ భవన నిర్మాణం,హమాలీ బజార్,అమాలి ఐకెపిఆర్ లకోసం నా వంతు పనిచేస్తానని నాపై నమ్మకంతో ఈ పదవిని నాకు అప్పగించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.

పార్టీ పదవులు కొలిక్కి..మంత్రి పదవులు వెనక్కి!!

`మంత్రి పదవుల కోసం మరింత సమయం!

`పార్టీ పదవులు మాత్రం సిద్దం!

`దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం!

`పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం.

`రోహిన్‌ రెడ్డి కి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

`సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం.

`నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం.

`పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం.

`అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం.

`స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యం.

`ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు తక్కువ రాకుండా నాయకత్వం పటిష్టం.

`ప్రతి పక్షాల కన్నా ముందే ప్రజల్లోకి నాయకులు వెళ్లాలని ఆదేశం.

`ప్రభుత్వ పథకాలపై, నిర్ణయాలపై పకడ్బందీగా ప్రచారం.

`సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ యువ వికాసం, రేషన్‌ కార్డులపై ప్రజల్లో అవగాహన పెంచడం.

`మంత్రి వర్గ విస్తరణపై ఎటూ తేల్చలేకపోతున్న అధిష్టానం!

`ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర యంత్రాంగం.

`కావాలనే వాయిదా పడుతున్నట్లు సంకేతం.

`తప్పని పరిస్థితుల్లోనే దూరం జరుపుతున్నట్లు సందేశం.

`ఆరు పదవులు అందరికీ పంచలేక తల పట్టుకుంటున్న అధిష్టానం

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:
ఒక రకంగా కాంగ్రెస్‌ పార్టీలో వున్న కొంత మంది నాయకులకు సంతోషకమైన వార్త. మరో రకంగా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులకు కొంత చేదు గుళిక. ఎందుకంటే మంత్రి పదవుల పంపకం మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఎంత వడబోసినా, ఎక్కడో సరైన సమ ప్రాధాన్యత అందరికీ కలిగించాలన్న ఆలోచనతోనే కాస్త ఆ ముహూర్తం దూరం జరుగుతోంది. కాకపోతే ఎంత ఆలస్యమైనా, సరే బెస్ట్‌ అనిపించుకునేలా విస్తరణ వుండాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కోరుకుంటోంది. సహజంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రులు కావాలని కోరిక వుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యేదాకా అదో తంటా. ఏళ్లకేళ్లు ఎదురుచూసి, చూసి, అవకాశం వచ్చినా రాజకీయ పరిస్ధితులు అనుకూలించక ఎమ్మెలు కాని వాళ్లు చాల మంది వుంటారు. వాళ్లలో అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, ఓడిపోయి, గెలిచిన వాళ్లుంటారు. మరికొంత మంది ఎమ్మెల్యే కావడానికి పెద్దగా ఇబ్బందులు పడే పరిస్ధితి రాదు. అలాంటి వారు మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలు అవుతుంటారు. రాజకీయ పరిస్దితులు రాష్ట్రంలో ఎలా వున్నా, ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వుంటారు. అటు ఓడిపోయిన వారైనా, ఇటు ఎప్పుడూ గెలుస్తుండేవారైనా పార్టీకి సేవ చేస్తూనే వుంటారు. అలా అవకాశాలు వచ్చి, ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రులు కావాలనుకోవడం తప్పు కాదు. మంత్రులు కావాలన్న వారి కోరిక మొదటిసారే తీరే వారు కొందరుంటారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యేలు అయినా మంత్రులు కాని వారు కూడా చాలా మంది వుంటారు. అయినా ఎక్కడో ఆశ వారిలో సజీవంగా వుంటంది. ఒక్కసారైనా మంత్రి కావాలని బలంగా కోరుకుంటారు. కాని ఇక్కడ మరో మతలబు వుంటుంది. ఒక్కసారి మంత్రి అయిన నాయకుడు సీనియర్‌ మంత్రిగా పదే పదే పార్టీ అధికారంలో వున్నంత కాలం మంత్రులుగా పనిచేయాలని కోరుకుంటారు. అలా అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడున్న కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అందరికన్నా ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా చిరిత్ర సృష్టించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా వున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అంతే..ఆయన ఏ పార్టీలో వున్నా మంత్రిగా వుంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి, తర్వాత బిఆర్‌ఎస్‌ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి మంత్రి పదవి అందుకున్నారు. ఇలాంటి అవకాశం అందిరికీ రాదు. చాలా అరుదుగా వస్తుంది. గతంలో మంత్రిగా పనిచేసిన మంధని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇప్పుడు మరోసారి మంత్రి అయ్యారు. ఇలా కొంత మందిని పదవులు వాటంతటవే వరిస్తుంటాయి. చాలా మందికి మంత్రి పదవి దక్కినట్లే దక్కి చేజారిపోతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో మంత్రి కావాల్సిన కమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. నల్లగొండ నుంచి మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా అలా అవకాశాలు కలిసివచ్చి ఇప్పుడు కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో పలుసార్లు మంత్రిగాపనిచేసిన నిజాబామాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన మైనార్టీ నాయకుడు షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో వున్నా అదృష్టవంతుడు అనే పేరు వుంది. కాని ఈసారి ఆయన మంత్రి కాలేకపోతున్నారు. కాని ఆయన పేరు కూడా వినిపిస్తూనే వుంది. కాని ఆయనకు దక్కకపోవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తే, తాను గెలిస్తే మంత్రి కావాలనుకున్న మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన గతంలో విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలి బిజేపిలో చేరారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడు అనే పేరు వుంది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండేది. కాని దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే కాలేకపోయారు. నిజంగా ఆయన గత ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్‌ రాజకీయమే వేరేలావుండేదని ఆయన సన్నిహితులు అంటుంటారు. అలా అదృష్టం ఖాతలో మొదటిసారి ఎమ్మెల్యే అయినా బిసి నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ మంత్రి అయ్యారు. అంటే రాజకీయ పదవులు కూడా అదృష్టంతో ముడిపడి వుంటాయని చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలనే అని చెప్పాలి. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడూ కూడా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆందోల్‌ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ ఈసారి మంత్రి అయ్యారు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు మంత్రులౌతారన్న వాటికి కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలు దాటితేనే మరి కొంత మందికి అవకాశం వస్తుంది. మంత్రులయ్యే ఛాన్సు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆరు మంత్రి పదువులు ఖాళీగా వున్నాయి. వాటిలో ఓ నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ఎందుకంటే మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, పిపిసి. అధ్యక్షుడుగా పనిచేసిన వి. హనుమంతరావు మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాని ఆయన పలుసార్లు టికెట్‌ ఇచ్చినా గెలవలేదు. ఆయనకు చాలా కాలంగా కాలం కలిసి రావడం లేదు. ఆయన ఆశ తీరే పరిస్దితి ఇక కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో నిజామాబాద్‌ జిల్లాకు ప్రాదాన్యత లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి పేరులో ఎలాంటి మార్పు లేకుండా వినిపిస్తోంది. అయితే షబ్బీర్‌ అలీ పేరును ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయన ఆశ తీరుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ఇటీవల పార్టీ అధిష్టానం భుజ్జగించిందని, ఆయన అందుకు ఒప్పుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంత వరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. ఆయనను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి తీసుకొమ్మని చెప్పినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కాకపోతే చాల మందికి తెలియని విషయం ఏమిటంటే జాతీయపార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు సహజంగానే పార్టీ ఉపాధ్యక్షులు అని చెప్పుకుంటారు. ఎంత మంది ఎమ్మెల్యేలున్నారో వాళ్లంతా ఉపాధ్యక్షులే అవుతారు. అలాంటి వారికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు ఇచ్చినంత మాత్రాన బాద్యతలు ఎక్కువగా వుండకపోవచ్చు. కాని గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా వున్న జగ్గారెడ్డికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చారు. దాంతో ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చి బుజ్జగించే అవకాశాలున్నాయి. కాకపోతే వర్కింగ్‌ ప్రెసిడెంటు అనేది ఆరో వేలు లాంటిదే..అలాంటి పదవిని రాజగోపాల్‌రెడ్డి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. ఇక మరో జిల్లా ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యే గడ్డం సోదరులు ఇద్దరూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వివేక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పేర్లు మాత్రంపదే పదే వినిపిస్తున్నాయి. కాని పదవులు పంపకాలు ఆలస్యమౌతున్నాయి. ఇదే సమయంలో పార్టీ పదవుల పంపకాలకు మాత్రం ముహూర్తం ఫిక్స్‌ అయిందనే అంటున్నారు. నిజానికి మంగళవారం పార్టీ పదవుల జాబితా విడుదలౌతుందన్న ప్రచారం విసృతంగా జరిగింది. అందులో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు వున్నట్లు తెలుస్తోంది. పూర్తి జాబితాను ఈ నెల 30లోగా ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం వుందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఏది ఏమైనా మంత్రి పదవులు ఇంకా ఆలస్యమైనా సరే, పార్టీ పదవులు తొందరగా పంపకాలు జరుగుతాయని తెలుస్తున్నందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

’’నేటిధాత్రి’’ కథనానికి స్పందించిన మంత్రి ‘‘కొండ సురేఖ.’’

`మంచినీటిని కాలుష్యం చేస్తున్న మిల్లులపై చర్యలు: మంత్రి ‘‘కొండా సురేఖ.’’

`’’కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ కథనానికి మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందన.

`‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన ‘‘కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ అనే వార్తకు రాష్ట్ర అటవీ, పొల్యూషన్‌ శాఖ మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందించారు. 

`ఈ మేరకు ‘‘నేటిధాత్రి’’ తో మంత్రి మాట్లాడుతూ మంచినీటిలో బాయిల్డ్‌ మిల్లుల కెమికల్‌ నీటికి కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన వార్తపై వివరాలు సేకరించమని అధికారులను ఆదేశించారు.

`నగరంలో ఇలాంటి మిల్లులు ఎన్ని వున్నాయి, వారి వివరాలు కూడా అందించమని మంత్రి ‘‘కొండా సురేఖ’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు కూడా సూచించారు. తాను ప్రస్తుతం డిల్లీ వెలుతున్నట్లు, వచ్చిన వెంటనే పూర్తి సమాచారం ఆధారాలు అందించమని వాటి ఆధారంగా తగు చర్యలకు ఆదేశిస్తామని ఎడిటర్‌ ‘‘కట్టరాఘవేంద్రరావు’’కు మంత్రి చెప్పారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వ్యాపారంలో మానవత్వం పూర్తిగా మర్చిపోతున్నారు. మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా? అనే విచక్షణ పూర్తిగా కోల్పోతున్నారు. వ్యాపారంలో అడ్డ దారులు తొక్కడం చాలా మంది చేస్తారు. కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే అడ్డ దారులు వెతుక్కుంటున్న వాళ్లు కూడా వుంటున్నారు. ప్రజల ప్రాణాలతో, జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పైకి చూస్తే మాత్రం అవి బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మాత్రమే. ఆ మిల్లులకు అవసరమైన నీటిని వాడుకొని, వదిలేసే సమయంలో మానవత్వం మర్చిపోతున్నారు. ఎవరి ప్రాణాలు ఏమైతే మా కేమిటి అనే ధోరణి అవలంభిస్తున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన రాంపూర్‌ లో వున్న బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యజమానులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థపు నీటిని ఏకంగా మంచి నీటి కాలువలోకి వదిలేస్తున్నారు. హన్మకొండ, వరంగల్‌ నగరాలకు మంచి నీటిని సరఫరా చేసే కాలువలలో మిల్లు కెమికల్‌ నీటి వ్యర్థాలు యదేచ్చగా వదిలేస్తున్నారు. రాంపూర్‌లో వున్న మిల్లులన్నీ ఇలాంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నాయి. మంచి నీటి కాల్వలోకి మిల్లుల కెమికల్‌ వాటర్‌ వదిలి నీటిని కాలుష్య కాసారం చేస్తున్నారు. ఇందుకు అధికారులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. మిల్లుల నిర్వాకం నిర్వకానికి సహకరిస్తూ అమ్యామ్యాలకు అలవాటు పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే సహజంగా రైస్‌ మిల్లుల నుంచి వ్యర్థాలు అంటే గాలిలో కలిసే ఊక మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ భయంకరమైన కెమికల్‌ వ్యర్థాలు ..అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట మారిపోయింది. అయినా మురుగునీటిని మంచి నీటిలో కలుపుతున్నామన్న సోయి కొంచెం కూడా లేకపోతోంది. సొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు మిల్లర్లు యదేచ్చగా సాగిస్తున్న దుర్మార్గాన్ని వెనకేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి బాయిల్డ్‌ మిల్లులో వెలువడిన మురుగునీటిని శుద్ధి చేసే యంత్రాంగం వుంటుంది. అందుకు ప్రత్యేకమైన ప్లాంటు ఏర్పాటు జరుగుతుంది. కానీ అది తూతూ మంత్రంగానే వినియోగిస్తున్నారు. ఆ నీటి శుద్ధి ప్లాంట్‌ను వినియోగించడమే కొన్ని సంవత్సరాలుగా మానేశారు. ఆ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వాటిని వినియోగించడమే మానేశారు. దాంతో మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాల మూలంగా మంచి నీటి కాలువలు మొత్తం కలుషితమైపోతున్నాయి. మిల్లులు సాగిస్తున్న ఈ దుర్మార్గం మూలంగా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతోంది. ఆ వ్యర్థాలు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. అధికారులకు పట్టిన అవినీతి రోగం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. మిల్లుల మూలంగా ఆ నీరు కొన్ని సంవత్సరాలుగా కాలువలో చేరడం వల్ల కాలువలు కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. ఎక్కడిక్కడ కాలువలకు చెందిన రిటైనింగ్‌ వాల్స్‌ దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల పొడవునా మంచి శుద్దమైన మంచి నీరు పారాల్సిన చోట మురుగునీటి మూలంగా అడ్డంకులు ఏర్పడడంతో పాటు, కలుషితమైపోతున్నాయి. కాలుష్య కాసారంగా మారిపోతున్నాయి. మురుగునీటి నుంచి వచ్ఛే వ్యర్థాలు కాలువల మధ్యలో గుట్టలుగా చేరిపోతున్నాయి. దాంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతోంది. మొత్తంగా అక్కడ పేరుకుపోయిన కెమికల్‌ ప్రతి నీటి చుక్క కాలుష్యాన్ని మొసుకుపోతోంది. ఇక ఆ పక్కనే వున్న చెరువులోకి కూడా కొన్ని మిల్లుల నుంచి కెమికల్‌ నీరు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. ప్రభుత్వం ఏటా చెరువులో చేపలు పెంచే లక్ష్యం నిర్వీర్యమౌతోంది. ఏటా చేపల లక్ష్యం కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఈ కెమికల్‌ వాటర్‌ చెరువులోకి చేరడం మూలంగా చేప పిల్లలు చనిపోతున్నాయి. ఈ విషయం మత్య్స శాఖ దృష్టికి వచ్చినా ఆ అధికారులు కూడా కళ్లు మూసుకుంటున్నారు. వాటర్‌ బోర్డు అధికారులు ఆ కాలువల వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కదలకపోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. నేటిధాత్రి కథనంలో దానికి సంబంధించిన ఫోటోలు ప్రచురించడం జరిగింది. మిల్లుల కెమికల్‌ నీరు కాలువలో కలవడమే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. రాంపూర్‌ మిల్లులు వదిలిన రసాయన నీరు..మంచి నీటి కాలువలో చేరుతూ వుండడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. పాపానికి సంకేతం. పర్యావరణం మీద చిన్న పాటి నిర్లక్ష్యం కూడా వహించకూడని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారుల జాడెక్కడ? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నీ తెలిసినా అధికారులు చోద్యం చూడడం అంటే ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం తప్ప మరేం లేదు. హనుమాన్‌ ఇండస్ట్రీస్‌ ,కామదేను ట్రేడర్స్‌ ,వినాయక ఇండస్ట్రీస్‌ ,మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్‌ ,శ్రీ ధనలక్ష్మి ఇండస్ట్రీస్‌ ,శ్రీ లక్ష్మీ ఇండస్ట్రీస్‌ ,శ్రీ శ్రీనివాస ఇండస్ట్రీస్‌ ,సూర్య ఇండస్ట్రీస్‌ ,సూర్య తేజ ఇండస్ట్రీస్‌లు సాగిస్తున్న అరాచకం సొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు తెలుసు. అందువల్ల పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు కళ్లు మూసుకొని మొద్దు నిద్రపోతున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ముక్కుపుటాలు అధిరేలా వాసన వస్తున్నా అధికారులు తొంగి చూడొద్దనుకుంటున్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కెమికల్‌ కలిసిన మిల్లుల క్రిటికల్‌ వాటర్‌ మంచినీటి కాలువను కలుషితం చేస్తున్నా కనిపించడం లేదా? నిలదీస్తున్నా స్పందన కరువౌతోంది. అవే నీటిని మున్సిపల్‌ వాటర్‌ బోర్డు ప్రజలకు పంపిస్తున్నారన్న సంగతి కనిపించడం లేదా?ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం అనుకునేలా మిల్లర్లకు వరంగా మారి ప్రజలకు శాపమౌతోంది. కలుషిత నీటిని తాగుతున్నారన్న సోయి కూడా అధికారులకు లేకపోవడం వారి బాధ్యతారిత్యానికి నిదర్శనమనే చెప్పాలి. వరంగల్‌ ప్రజలకు శాపంగా మారుతున్నా మిల్లులకు సహకరిస్తూ, ఉదాసీనత చూపిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌, ఇరిగేషన్‌ డిపార్ట్మెంట్‌, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌. అధికారులను గత కొన్ని సంవత్సరాలుగా మామూళ్లతో మెయింటైన్‌ చేస్తున్న కిలాడి మిల్లర్‌ ఎర్రబెల్లి..

కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

కేతకిలో ప్రత్యేక పూజలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండలం కేంద్రంలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ కేతక సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవ్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించారు.

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు.!

గుట్ట పై షెడ్డును కూల్చారు…మరి ఆశ్రమ కబ్జా కట్టడం పై చర్యలేవి..??

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు??

రెవెన్యూ అధికారుల కబ్జా నివేదిక పైన చర్యలేవి??

అధికారుల అత్యుత్సాహం కేవలం గుట్ట పైనేనా??

ఆశ్రమ భూ కబ్జా లో ముడుపులేమైన ముట్టాయా అని ప్రజల మాట ముచ్చట…

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:

ఎల్లారెడ్డిపేట మండలం లో రెండు వేరు వేరు ప్రదేశాలలో భూకబ్జా సమస్య. వెంకటాపూర్ గ్రామంలో ఒక ఆశ్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేశారని ఆ విషయంలో రెవెన్యూ అధికారులు నివేదిక ఉన్నతాధికారులకు పంపిన , హై కోర్ట్ సంగెం బాలయ్య భూమి కబ్జా గురి అయిందని అక్కడ ఉన్న అక్రమ కట్టడం కూల్చి వేయాలని ఆర్డర్ ఉన్న కూడా అధికారులు మౌనం వహిస్తున్నారు.ఆ మౌనానికి ముడుపులేమైన ముట్టాయా అని మండల ప్రజలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ నెల 14,15 వ తేదీలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని సింగారం గ్రామం లో కుల,మతాలకు అతీతంగా దర్శావళి గుట్ట పైన ప్రతి సంవత్సరం లాగే గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న దర్గా లకు ఉర్సు పండుగ అంగరంగ వైభవంగా జరిపారు.ఈ క్రమంలో విశిష్ట అతిధుల ఆహ్వానం ఉండడం వలన అక్కడ ఉన్న గుట్టను చదును చేసి షెడ్ ని నిర్మాణం చేశారు. అది ప్రభుత్వ భూమిలో ఉందని కొద్దిరోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఒక పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

poor farmers

ప్రభుత్వ భూమిలో షెడ్ నిర్మాణం జరిగింది అని మే 27 న ఉదయం అధికారులు, పోలీసుల సమక్షంలో జెసిబి తో ఆ నిర్మాణాన్ని కూల్చారు.ఈ రెండు సమస్యలో కబ్జా అనేది కనిపిస్తున్న అధికారులకు,ఆ పార్టీ నాయకులకు కేవలం దర్శావళి గుట్ట ను రాజకీయం చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ భూమి, పేద రైతు భూమి కబ్జాకు గురై అధికారుల నివేదిక,హై కోర్ట్ ఆర్డర్ లు ఉన్న కూడా పట్టించుకొని అధికారులకు దర్శావళి గుట్ట పైన షెడ్ నిర్మాణం కబ్జా భూమి లో జరిగిందని అధికారుల అత్యుత్సాహాన్ని చూస్తే ఓ మౌజయ ఆశ్రమానికి సంబంధించి ముడుపులు ఏమైనా ముట్టాయ అని ప్రజలు నుండి సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. అధికారుల తీరు ప్రజల సందేహాలకు తగ్గట్టుగానే ఉండడం, ఒక పార్టీ నాయకులు కుల,మతాధిపత్యం పరంగా ఫిర్యాదులు చేస్తూ మతాల మధ్య చిచ్చులు రేపే విధంగా గొడవలు సృష్టించాలని రాజకీయం చేస్తున్నారని సింగారం గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

కాంగ్రెస్ సినియర్ నాయకున్ని పరామర్శించిన.

కాంగ్రెస్ సినియర్ నాయకున్ని పరామర్శించిన

మున్నూరుకాపు సంఘము మండల అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో గుడివాడలో కాంగ్రెస్ సినియర్ నాయకుడు సిరంగి బిక్షపతి పటేల్ తల్లి సిరంగి రాధమ్మ స్వర్గస్తులయ్యారు కావున వారి కుటుంబ సభ్యులను పారమర్శించి ఓదార్చి మనోధైర్యం చెప్పిన గణపురం మండల మున్నూరుకాపు సంఘము అధ్యక్షులు పుప్పాల దీపక్ పటేల్ వారి వెంట తో దేవేందర్ పటేల్ సిరంగి రామకృష్ణపటేల్ రిటైడ్ ఈఈ,ప్రభాకర్ పటేల్, రాజేశ్వర్ రావుపటేల్, అన్నం అనిల్ పటేల్,పటేల్,సురేష్ పటేల్,సుధాకర్ పటేల్,విడిదినేని రవి పటేల్ విద్యుత్ ఏ ఈ, శంకర్ పటేల్ పుప్పాల రామారావు పటేల్ నర్సింగం పటేల్ రామదాసు బాబు రాముణయ్య రవీందర్ రెడ్డి ల్యాదేళ్ల సమ్మయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహీరాబాద్ పురపాలక కమిషనర్ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రత్యేక బృందాలతో దాడులు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు, కమిషనర్ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తూ పట్టుబడిన వారికి వెయ్యి రూపాయల నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని కమిషనర్ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మండల ఇన్చార్జి రాజిరెడ్డిని స్కాల్కల్ మండలము న్యాల్ కల్ తహసిల్దార్ నియమిస్తూ జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.ఇది వరకు మండల తహసిల్దార్ గా విధులు నిర్వహించిన భూపాల్ మేడ్చల్ కు బదిలీ అవ్వడంతో మండల ఉప తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని అదనపు బాధ్యతలు అప్పగించడంతో మండల ఇన్చార్జి తహసిల్దారుగా విధుల్లో చేరారు. విధి నిర్వహణలో రెవెన్యూ చట్టానికి లోబడి, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు విధులు నిర్వహించనున్నట్లు ఇన్చార్జి తహసిల్దార్ రాజిరెడ్డి స్పష్టం చేశారు.

వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ.

నేడు వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థులు నేడు వనపర్తి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు నామినేషన్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు 5000 రూపాయలు డిపాజిట్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహా సభ ఆదేశాలు నియమ నిబంధనలు పాటిస్తామని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు వనపర్తి లో ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు ఆర్యవైశ్య యువకులు న్యాయవాదులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని పూరి బాలరాజ్ పేర్కొన్నారు

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లిమండలం బస్వాపూర్ గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు. సత్తు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు.కార్యక్రమాలు తీసుకొచ్చి. రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం కార్యక్రమాన్ని అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ. ప్రభుత్వం ఇచ్చినటువంటి . ఆరు గ్యారంటీలే కాకుండా. ఎన్నో సంక్షేమ.పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధిలో ఉంచాలని. ప్రజలకు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని. అలాంటిది దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దువ్వాసి దేవరాజు. సెక్రెటరీ వేణు. బలసాని శ్రీనివాస్ గౌడ్. అల్లూరి తిరుపతిరెడ్డి. బద్రి. లింబాద్రులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం.

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి

◆ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ విధేయులకు ప్రాధాన్యత ఇవ్వలి

◆ అన్ని వర్గాలను కలుపుకొని పోయే నాయకుడిని పెద్దపీట వెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్,అల్ ఇండియా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ పరిది ఝారసంగం మండలంలోని మచ్నూర్ గ్రామంలో సోమవారం ఝారసంగం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండలంలో బలమైన కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ చేపట్టబోయే నూతన గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను అందరూ ఏకతాటిపై నిలిచి నూతన అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసి జహీరాబాద్ నియోజకవర్గంలోనే ఝారసంగం మండల కాంగ్రెస్ పార్టీని పటిష్టం చెయ్యాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ..

నూతన నాయకత్వాన్ని అందరి అభిప్రాయంతో ఎంచుకోవలని తెలిపారు.

పార్టీ నూతన మండల ఎంపిక కోసం సంస్థాగత ఎన్నికల ఇంచార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పార్టీ అధిష్టానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,ఓసి జనరల్ వారి నుంచి అనగా 2017 కంటే ముందు పార్టీలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉదాహరణకు ఝారసంగం మండల అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి మూడు దశబ్దాలకుపై, న్యాల్కల్ మండల అధ్యక్షుడు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి 2009 లో నియోజకవర్గల పునర్విభజనలో జహీరాబాద్ లో విలీనం అయిన నాటి నుంచి ఇప్పటివరకు అన్నగా రెండు దశాబ్దాలకు పైగా ఉండగా, 2009 నుండి
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం, మిగిలిన మండలాల వారు 2018 సంవత్సరం నుంచి ఉండటంపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.

మూడు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇచ్చిన పాసులను ఇష్టానుసారంగా ఇచ్చుకొని జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులకు,మాజీ జడ్పిటిసిలు,మాజీ ఎంపిపిలు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లకు ఇవ్వకపోవడంతో కార్యకర్యాల ఆగ్రహానికి కారణం అయింది.

ఏది ఏమైనప్పటికి పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడిని మార్చి పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వారిని అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానంతో కోరారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ ఓటమి చెందడానికి పలు కారణాల్లో అధ్యక్షులను మార్చకపోవడం కూడా ఒకటని సమావేశంలో చెప్పుకోవడం విశేషం..

ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలంటే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో నూతన అధ్యక్షుల నియామకం చేపట్టి వారికి అవకాశం కల్పిస్తే వారు ఐకమత్యంగా ఉంటూ పార్టీ విజయం కోసం కష్టపడే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కార్యదర్శి మహేందర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎండి.

ముల్తానీ, ఝారసంగం మండల మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు శంకర్ పాటిల్, మాజీ జడ్పిటిసి వినిల నరేష్, మాజీ ఎంపిపి దేవదాస్, మాజీ సర్పంచులు నవాజ్ రెడ్డి, రామిరెడ్డి, ఇస్మాయిల్ సాబ్, రాజుస్వామి, శంషోద్దీన్, నందప్ప పాటిల్, మహరుధ్ రావు, సుధాకర్, మాణిక్యం, మాజీ ఎంపిటిసిలు మొహమ్మద్ హాఫిజ్, రవి, మాజీ ఉప సర్పంచ్ సంగన్న, యువజన కాంగ్రేన్ అధ్యక్షుడు రాఘవేంద్ర, అభిలాశ్ రెడ్డి, యువ నాయకులు, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దేశంలో నమోదవుతున్న కోవిడ్‌`19 కేసులు

భయపడాల్సిన అవసరం లేదు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ

చిన్నచిన్న ఉత్పరివర్తనాలు సహజం భయం వద్దు: డాక్టర్లు

దేశవాసుల్లో రోగనిరోధకశక్తి బాగా పెరిగింది: డాక్టర్లు

రాకపోకలపై ఆంక్షలు లేవు: కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి

ముంబయి ప్రశాంతం

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కోవిడ్‌ భయం లేదు

ద.కొరియా, జపాన్‌ దేశాల్లో పెరిగిన కోవిడ్‌ ఔషధ కంపెనీల షేర్ల ధరలు

సింగపూర్‌లో వేగంగా విస్తరిస్తున్నా మరణాలు లేవు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటకలతో పాటు గుజరాత్‌, ఢల్లీి, మహారాష్ట్రల్లో గత కొద్ది రోజులుగా కోవిడ్‌`19 కేసులు బయటపడుతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన అడ్వయిజరీలో, వ్యాధి తీవ్రత చాలా తక్కువగా వున్నదని, ఎటువంటి భయం అవసరంలేదని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం మే 19 నాటికి దేశ వ్యాప్తంగా 257 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. నమోదైన వాటిల్లో అత్యధిక కేసుల్లో తీవ్రత చాలా తక్కువగా వున్నందువల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రాలేదని పేర్కొంది. ఇంటివద్దనే వీటికి చికిత్స తీసుకుంటే సరిపోతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, ఢల్లీి, మహారాష్ట్రల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు రోజువారీ సమాచారం వెల్లడిస్తోంది. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయా రాష్ట్రాలు అడ్వయిజరీలు జారీచేశాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం మే 19 నాటికి కేరళలో 95G, మహారాష్ట్ర 56G, తమిళనాడు 66G, కర్ణాటక 8G, గుజరాత్‌ 6G, ఢల్లీి 3G కోవిడ్‌ కే సులు నమోదయ్యాయి. కోవిడ్‌కు ఇప్పుడు ఇతర వైరల్‌ వ్యాధుల మాదిరిగానే చికిత్స అందించవచ్చునని భయపడాల్సిన అవసరంలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మాస్క్‌లు ధరించడం, పరిశుభ్రతను పాటించడం, పెద్ద సమూహాలకు దూరంగా వుండటం వంటి ముందు జా గ్రత్త చర్యలు పాటిస్తే, కోవిడ్‌ను నివారించవచ్చునని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీఎస్‌పీ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీ సెర్చ్‌ (ఐసీఎంఆర్‌)లు ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ా19 తీవ్రతపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం కేరళలో అత్యధికంగా కోవిడ్‌ కే సులు నమోదవుతున్నాయి. ఇదిలావుండగా పుదుచ్చేరి, రాజస్థాన్‌, సిక్కిం, హర్యానా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా కోవిడ్‌ కేసులు నమోదు కావడం, దేశంలో వ్యాధి విస్తరిస్తున్న తీరును వెల్లడిస్తోంది. 

రోగుల డిశ్చార్జ్‌

మే 12 నుంచి దేశవ్యాప్తంగా 112 మంది కోవిడ్‌ సోకిన రోగులకు చికిత్స అందించి, తగ్గిన తర్వాత ఇళ్లకు పంపేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. ఇదిలావుండగా మే 29న డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నేతృత్వంలో దేశంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులపై ఒక సమావేశం జరిగింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ రిలీఫ్‌ డివిజన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన నిపుణులు ఈ సమావేశంలో పాల్గన్నారు. ఇదిలావుండగా కోవిడ్‌కు సంబంధించిన లక్షణాలతో ఇద్దరు రోగులు గత జనవరిలో మృతిచెందినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే వీరిద్దరికి ఇతర మెడికల్‌ కాంప్లికేసన్స్‌ వున్నట్టుకూడా స్పష్టం చేసింది. మహారాష్ట్రలో గత జనవరి నెలలో 6,066 స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించగా వీటిల్లో 106 కోవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్టు కూడా ఆ ప్రకటన తెలిపింది. వీటిల్లో 101కేసులు ముంబ యిలో కాగా మిగిలినవి, పూణె, ఠాణె మరియు కొల్హాపూర్‌లో నమోదయ్యాయని వివరించింది.కేవలం మనదేశంలో మాత్రమే కాదు, దక్షిణకొరియా, చైనా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ దేశాల్లో కూడా కోవిడ్‌ వేగంగా విస్తరిస్తోంది. అయితే భయపడాల్సిన అవసరంలేదని, తగిన చికిత్స అందుబాటులో వున్నదని ఆయా దేశాలు హెల్త్‌ అడ్వయిజరీలు జారీచేశాయి. అంతేకాదు వ్యాక్సినేష న్‌ గురించిన తాజా సమాచారాన్ని తమకు తెలపాలని, కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చునని ఆయా దేశాలు ఆరోగ్య మంత్రిత్వశాఖలు అడ్వయిజరీలు జారీచేశా యి. 

బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు మౌనంగా వుండాలని పిలుపునిచ్చింది. ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితి అదుపుతప్పకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అత్యవసర పరస్థితి ఏర్పడితే ఎదుర్కొనేందు కు ఆసుపత్రుల్లో అవసరమైన పడకలు సిద్ధం చేశామని కూడా వివరించింది. ఇదిలావుండగా బెంగళూరులో 84ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌`19 పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత మరణించినట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వైట్‌ఫీల్డ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తూ ఈ వృద్ధుడు మే 17న మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికార్లు ధ్రువీకరించారు. ఆయన మే 13న ఆసుపత్రిలో చేరగా, కోవిడ్‌`19 పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన మరణించిన తర్వాత వచ్చిన రిపోర్ట్‌లో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో కర్ణాటకలో కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికార్లు అప్రమత్తమయ్యారు. వీటిల్లో 32 కేసులు కేవలం బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావు ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తమ రోజువారీ కార్యకలాపాలను నిరభ్యంతరంగా నిర్వహిస్తూనే, కొన్ని సాధారణ ముం దు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రజల రాకపోకల పై ఏవిధమైన ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మూడు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ మం త్రి సత్యకుమార్‌ యాదవ్‌ శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడిరచారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా చాలాకాలం తర్వాత రాష్ట్రం లో తొలికేసు తీరప్రాంతమైన విశాఖపట్టణంలో బయల్పడటం గమనార్హం. రోగి కుటుంబ సభ్యులు, చికిత్స చేసిన డాక్టర్‌కు ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఇదిలావుండగా తెలంగాణలో ఒక కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. ఈ వ్యాధి సోకింది ఒక వైద్యుడికి కాగా, ఆయనకు ప్రయాణ చరిత్ర వున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. అయితే ఐదు రోజులు ప్రొటకాల్‌ పాటించిన తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ కోవిడ్‌ లక్ష ణాలు లేవు. ఇదిలావుండగా కోవిడ్‌ వైరస్‌కు చిన్నచన్న ఉత్పరివర్తనాలు సహజమని, ప్రజల్లో ఇప్పటికే రోగనిరోధకశక్తి బాగా పెరిగిపోవడంతో, భయపడాల్సిన అవసరంలేదని డాక్టర్లు చెబుతున్నారు. 

రెండు మ్యుటేషన్లు కారణం

ఒమిక్రాన్‌ బిఎ.2.86కు సంబంధించిన జెఎన్‌.1 వేరియంట్‌కు చెందిన ఎల్‌.ఎఫ్‌.7, ఎన్‌.బి.1.8మ్యుటేషన్లు తాజాగా బయల్పడుతున్న కోవిడ్‌`19 కేసుల్లో కనిపిస్తున్నాయని అధికార్లు చెబుతు న్నారు. ఆగ్నేయాసియా దేశాలైన సింగపూర్‌, హాంకాంగ్‌ల్లో కోవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడిరచిన సమాచారం ప్రకా రం జె.ఎన్‌.1 వేరియంట్‌కు సంబందించి 30 మ్యుటేషన్లున్నాయి. వీటిల్లో ఎల్‌.ఎఫ్‌.7, ఎన్‌.బి.1.8 వర్షన్లు తాజా కేసుల్లో కనిపిస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఇదిలావుండగా హాంకాంగ్‌లో కోవిడ్‌ా19 పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలలకోమారు కోవిడ్‌ చురుగ్గా కనిపిస్తుండటాన్ని గుర్తించారు. దీన్నొక సైక్లిక్‌ ప్రాసెస్‌గా అక్కడి వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. కాగా దక్షిణ కొరియాలో 65 సంవత్సరాలు దాటినవారికి ఇచ్చే వ్యాక్సినేషన్‌ కాలపరిమితిని జూన్‌ నెలాఖరు వరకు పొడిగించారు. గత మూడేళ్ల కాలాన్ని నిశితంగా పరిశీలిస్తే కోవిడ్‌ ప్రధానంగా చలి, ఎండాకాలాల్లో బాగా వ్యాపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇదిలావుండగా సింగపూర్‌లో ఏప్రిల్‌ 27 నుంచి మే 3 మధ్యకాలంలో అంటే వారంరోజుల్లో 14,200 కోవిడ్‌ కేసులు నమోదయ్యా యి. అంతకు ముందువారం దేశంలో నమోదైన కోవిడ్‌ కేసుల సంఖ్య 11,100. 

పెరిగిన కోవిడ్‌ ఔషధ కంపెనీల షేర్లు

 కోవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన కోవిడ్‌ కిట్‌ తయారీ కంపెనీలు, హ్యుమాసిస్‌ కంపెనీ, ల్యాబ్‌ జీనోమిక్స్‌ కంపెనీ, సీజిన్‌ ఇన్‌కార్పొరేషన్‌, ఎస్‌.డి. బయోసెన్సార్‌ ఇన్‌కార్పొషన్‌ షేర్లు అమాంతం పెరిగిపో యాయి. ఇక ద.కొరియాకు చెందిన ఎస్‌.కె. బయోసైన్స్‌ కంపెనీ షేర్లు ఏకంగా 7.2% వృద్ధి నమోదు చేయడం గమనార్హం. ఒక కొరియాకు చెందిన డయాగ్నస్టిక్‌ కిట్‌ తయారీ సంస్థ సుజన్‌ టెక్‌ ఇన్‌కార్పొరేషన్‌ షేర్లు ఏకంగా 29% పెరిగాయి. ఇక జపాన్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ డైసీ శాంక్యో సంస్థ షేర్లు 7.4% పెరిగాయి. ఇక హాంకాంగ్‌కు చెందిన షాంఘై జున్సీ బయోసైన్సెస్‌ కంపెనీ షేర్లు కూడా వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 

గ్లోబల్‌ పాండమిక్‌ అగ్రిమెంట్‌

ఆసియా దేశాల్లో కోవిడ్‌`19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్‌.ఒ) మే 19న సమావేశమైంది. ఈ సందర్భంగా కోవిడ్‌`19పై ప్రపంచ దేశాల మధ్య గ్లోబల్‌ పాండమిక్‌ అగ్రిమెంట్‌ను కోరుతూ స్లొవేకియా ప్రవేశపెట్టిన తీర్మానానికి 124 సభ్యదేశాలు అనుకూలంగా ఓటువేశాయి.

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబి ట్రాప్.

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబి ట్రాప్

నేటిధాత్రి:-

 

 

ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు… సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు..,

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం లో డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావుద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ 30 వేలు లంచం స్వీకరిస్తూ ఏసీబీ కి పట్టు బడ్డ సబ్ రిజిస్టార్ అరుణ..,
ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడి
మొత్తం రూ 50 వేలు డిమాండ్ చేసి 30 వేల రూపాయలకు అంగీకారం…

తాళం విరగొట్టి నగదు దోచుకెళ్ళారు.

‘తాళం విరగొట్టి నగదు దోచుకెళ్ళారు’

బాలానగర్ నేటి ధాత్రి:

అర్థరాత్రి వేళలో.. ఎవరూ లేని సమయంలో.. బాలానగర్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం అర్ధరాత్రి నగదును దోచుకెళ్ళారు. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. ఈనెల 24వ తేదీన పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు తాళం వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పోస్ట్ కార్యాలయం వెనుక భాగంలో తాళం విరగొట్టి లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో పలు డాక్యుమెంట్స్ లు చిందరవందరగా పడేసి.

stole cash

రెండు లాకర్లలో ఉన్న సుమారు రూ. 30,740 వేల నగదును దోచుకెళ్ళారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఎవరూ చూడలేదు. సోమవారం స్వీపర్ కార్యాలయం శుభ్రం చేస్తుండగా.. విరిగిపోయిన తాళం చూసి అధికారులకు పోస్ట్ ఆఫీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఎస్సైకి సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాత్రి వేళలో పోలీస్ నిగా పెట్టి దొంగతనాలు జరగకుండా.. చర్యలు తీసుకోవాలని మండల కేంద్రం ప్రజలు అన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

కాకాణి అరెస్ట్ కూటమి కుట్ర !

కాకాణి అరెస్ట్ కూటమి కుట్ర !

తిరుపతి ఎంపి గురుమూర్తి

తిరుపతి(నేటి ధాత్రి)మే 26:

 

 

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఖండించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలకు తెరలేపిందన్నా
రు,ఆ క్రమంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేశారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్ బుక్” రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజల హక్కులను హరిస్తూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గ పాలన రాష్ట్రానికి పెనువిపత్తని తెలిపారు.
కూటమి అక్రమాలపై ప్రశ్నించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అధికార దుర్వినియోగం ద్వారా ప్రభుత్వం అక్రమ కేసులను నమోదు చేస్తోందని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. మాకు, మా పార్టీకి న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని అన్నారు. న్యాయస్థానాలలోనే ఈ కుట్రలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల.

రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ

తిరుపతి(నేటి ధాత్రి) మే 26:

 

 

శ్రీపద్మావతి మహిళా డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసామని శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ ఆ ప్రకటనలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీపద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థినులకు 28 ఏప్రిల్ నుండి 9 మే 2025 వరకు జరిగిన రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.నారాయణమ్మ విడుదల చేశారు. స్వయం ప్రతిపత్తిని సాధించి ఈ పరీక్షలు నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన తిరుమల తిరుపతి దేవస్థానముల కార్య నిర్వాహణాధికారి కి, సంయుక్త కార్య నిర్వాహణాధికారి కి, విద్యాశాఖాధికారి కి, సంబంధిత విభాగాధికారులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలలో 92 శాతం విద్యార్థినిలు ఉత్తీర్ణతను సాధించారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎ. విద్యుల్లత తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి భద్రమణి, డాక్టర్ సి దివ్యవాణి, సూపరిండెంట్ శాంతి, ఎగ్జామినేషన్ మెంబెర్స్ జి సుధాకర, చంద్రశేఖర్, సంధ్య మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు..

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

కల్వకుర్తి నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో సోమవారం యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ & 33/11 కెవి సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , AICC/CWC చల్లా వంశీ చంద్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి స్వాగతం పలుకుతున్న సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జర్పుల లక్పతి నాయక్ శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version