యాదవ కుల ఆచారంలో భాగంగా గొర్ల మందపై గాబు పట్టే కార్యక్రమాన్ని మండల కేంద్రంలో కుల పెద్దమనిషి బత్తిని మహేష్ ఆధ్వర్యంలో పెద్ద బోయిన కొమురయ్య వ్యవసాయ క్షేత్రంలో యాదవ కులదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గొర్రెను గాపు పట్టి ఆచారంలో భాగంగా బలి కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి యాదవ కుటుంబం సుభిక్షంగా సుఖశాంతులతో అందరూ క్షేమంగా ఉండాలని అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని.
Bathini Mahesh.
గొల్ల కులమ గావోచ్చోళ్ళు యాదవ కులదైవలను కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషకరం. ఆ దేవతల ఆశీర్వాదంతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల కాపర్లు భాష బోయిన సమ్మయ్య, మూటికే కట్టయ్య, వేల్పుల కృష్ణ, కుంట మల్లయ్య, నాన బోయిన పుల్లయ్య, గావచ్చోళ్ళు కిన్నెర వీరమల్లు, యాకమల్లు, భాస్కర్, నరేష్, నవీన్, ఐలయ్య, యాకమ్మ, హైమ, ప్రశాంత్, కుల పెద్దలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పర్యావరణంపై ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 6, 7 తరగతులు జూనియర్, 8, 9, 10 విద్యార్థులు సీనియర్ విభాగంలో పెయింటింగ్, వ్యాసరచన రాసి 63090 07828 నెంబర్ కు వాట్సప్ ద్వారా జూన్ 3 లోపు పంపాలని పేర్కొన్నారు. విద్యార్థి పేరు, తరగతి, పాఠశాల, ఫోన్ నెంబర్, గ్రామం తప్పనిసరిగా రాయాలన్నారు.
కమలాపురం గ్రామానికి చెందిన రాంపూరీ రాజేష్ @ ఎంపురం రాజేష్ తండ్రి కొట్టేన్న @ పొట్టెన్న కమలాపురం ఒక కేసు లో నిందితుడిగా ఉండి కోర్టు కు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతని ఆచూకీ తెలిసినచో 8712670092,8712670093కి తెలపగలరు అని వారికి తగిన పారితోషకం తో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎస్సై సూరి ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపుతో వెళ్తున్న TG 38. 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకు స్వల్పంగా ధ్వంసం కాగా ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్.
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో హాల్లో ఈ రోజు వివిధ సంక్షేమ కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డా. రామచంద్రు నాయక్ హాజరై, పలు పథకాలు లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన సామాన్య ప్రజలకు గణనీయమైన మేలు జరుగుతుందన్నారు,ప్రతి ఒక్కరి జీవన ప్రమాణం మెరుగుపడేందుకు ఈ కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి,” అన్నారు, కళ్యాణలక్ష్మి & షాదీ ముబారక్ పథకాల చెక్కులు 74 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద స్థలల పట్టాలు 258 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,ఇల్లు కట్టుకునే వారికి బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు, గోడలు కట్టినాక లక్ష రూపాయలు,స్లాప్ లెవెల్ లక్ష రూపాయలు ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందన్నారు,కల్లు గీత కార్మికులకు 82 కాటమయ్య రక్షణ కవచం, సేఫ్టీమెకుల కిట్టు పంపిణీ చేశారు,రాజీవ్ యువ వికాసo ద్వారా యువతకు వ్యాపార రంగంలో, ఇతర చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు లబ్ధి చేకూరుతుందని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంది అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు బీసీ కార్పొరేషన్ ఈడీ నరసింహమూర్తి,స్థానిక ఎమ్మార్వో కృష్ణవేణి,ఎంపీడీవో విజయ,ఎంపీఓ సొమ్లాల్,ఆర్ఐ శరత్ గౌడ్, మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు జిల్లా నాయకులు,నియోజకవర్గ స్థాయి నాయకులు,యూత్ కాంగ్రెస్ సభ్యులు,గ్రామస్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ
సిరిసిల్ల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ
సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను 1 జూన్,2025 నుండి వాలీబాల్ అకాడెమి రాజన్న సిరిసిల్ల, సరూర్నగర్ ఇన్డోర్ స్టేడియం, సిద్ధిపేట,మరియు మహబూబ్ నగర్ అకాడమి, ప్రాంతీయ క్రీడా హాస్టల్ – హన్మకొండ, అథ్లెటిక్స్ అకాడెమి – ఖమ్మం, సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి – సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., హాకీ అకాడెమి – వనపర్తిలో మంజూరు చేయబడిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా, ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం కొరకు ఎంపికలు/ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనుంది.
ఈ క్రింద తెలుపబడిన తేదీలలో, ఆయా సెంటర్లలో రాష్ట్రం లోని ప్రతి అకాడెమీకి/హాస్టల్ కు సంబంధించిన ఎంపికలు / సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించబడును.
ఎంపిక స్థలం / వేదిక క్రొత్తగా ప్రతిపాదించ బడిన తేదీలు నిర్ధారించబడిన వయసు
1 వాలీబాల్ అకాడెమి – రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల, వాలీబాల్ అకాడెమి , రాజీవ్ నగర్ మినీ స్టేడియం, సిరిసిల్ల 10 జూన్ 2025 Under 14 to 16 Years at Saroornagar & Rajanna Sircilla (30th June 2009 to 1st July -2011) (Under 16 to 18 years- only at Saroor nagar) ( 1st July-2009 to 30th June 2007)
వాలీబాల్ అకాడెమి, సరూర్ నగర్ 3 వాలీబాల్ అకాడెమి, (సిద్దిపేట) సిద్దిపేట, వాలీబాల్ అకాడెమి 1 జూన్ 2025 (Under 14 to 16 years) Between (30th June 2009 to 1st July -2011) 4 వాలీబాల్ అకాడెమి –మహబూబ్ నగర్ మెయిన్ స్టేడియం గ్రౌండ్ మహబూబ్ నగర్ 12, 13 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011) 5 సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి, సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., సైక్లింగ్ వేలోడ్రోమ్, O.U.,క్యాంపస్ 10 & 11 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011) 6 Regional క్రీడా వసతి గృహం, హనుమకొండ DSA, జవహర్లాల్ నెహ్రు స్టేడియం, హనుమకొండ 10 & 11 జూన్ 2025 Under10-12 Years ( for Gymnastics & Swimming ) ( 30th June 2013 to 1st July 2015) Under 14 to 16 Years ( Athletics, Handball, Wrestling) ( 30th June 2009 to 1st July 2011) 7 హాకీ అకాడెమి, వనపర్తి DSA, హాకీ అకాడెమి, వనపర్తి 12 జూన్ 2025 (Under 14 to 16years)(30th June 2009 to 1st July -2011) 8 అథ్లెటిక్స్ అకాడెమి, ఖమ్మం DSA,సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం 12 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)కావున,రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆసక్తిగల బాల బాలికలు పైన తెలిపిన స్పోర్ట్స్ అకాడెమీలలో మరియు స్పోర్ట్స్ హాస్టల్ లో అడ్మిషన్ పొందాలనుకొనే వారు పైన తెలిపిన తేదీలలో ఆయా సెంటర్లలో నిర్వహించే ఎంపికలకు/ సెలక్షన్ ట్రయల్స్ కు హాజరు కాగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్ పద్మజా మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ శైలజ,ప్రజ్వల సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ,మనుషుల అక్రమ రవాణా నిర్ములన లో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చు అని ప్రజ్వల స్వచ్చంద సంస్థ మరియు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో గీతానగర్ ఉన్నత పాఠశాల నందు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో కోఆర్డినేటర్ లు శైలజా, పద్మజ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య. దీనికి పేద మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువ గా గురి అవుతున్నారు. సమాజంలో ప్రజలతో మరియు విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహనా కల్పించాలి, ముక్యంగా పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్స్ లో వారికి అవగాహనా కల్పించాలి. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జటిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలి అని అన్నారు. సమాజంలో ఉన్న చాలా సమస్యలకు ఆర్థిక కారణలా తో పాటు, సామజిక కారణాలు దోహదం చేస్తాయి, మన చుట్టుపక్కల ఉండే ఇలాంటి వాళ్ళను ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి, మాయమాటలు, ఉద్యోగం సినిమా అవకాశం అంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహలలో అమ్ముతున్నారు, కాబట్టి మన డిపార్ట్మెంట్ జిల్లా నుండి గ్రామ స్థాయి వరకు అందరు అవగాహనా కలిగి ఉండి, అప్రమతం చేయడం ద్వారా దీన్ని నిర్ములించవచ్చు.
బలరామ కృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించు కోవచ్చు, ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు మహిళలు దీని బారిన పడుతున్నారు. ముక్యంగా యువత, పిల్లలు ఆకర్షణకు గురి అయి, పట్టణాలకు వచ్చి వ్యభిచార గృహలలో అమ్మబడుతున్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 30 వేల మంది అమ్మాయిలను మహిళలను కాపాడడం జరిగింది. ఇందులో చిన్న పిల్లలు, యువతులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సైబర్ ట్రాఫికింగ్ ద్వారా ఈ అక్రమ రవాణా చాలా పెరిగి పోయింది, ముక్యంగా విద్యార్థులు అనవసరం అయినా అప్స్ ద్వారా పర్సనల్ ఫొటోస్ వీడియోస్ పంపడం ద్వారా సెక్స్ ట్రాఫికింగ్ కి గురి అవుతున్నారు. మీరు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉన్న మన సిబ్బంది ఈ విషయాలపై అవగాహనా పొంది ఇతరులకు అవగాహనా కల్పించాలని సూచించారు.
ఈ శిక్షణలో మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం ఎలా జరుగుతుంది, బాధితురాలి పైన ఉండే ప్రభావాలు, సైబర్ అదారిత అక్రమ రవాణా, చట్టాలు BNS, ITPA, POCSO, PCMA, సఖి, భరోసా, చైల్డ్ లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181 ల గురించి చెప్పడం జరిగినది.ఈ శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు శైలజా , పద్మజ, ప్రజ్వల ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ ప్రజ్వల సిబ్బంది అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబర్ సింగ్,మరియు రాజన్న సిరిసిల్ల నుండి kGBV,Model school, ఊరు,TREIS స్కూల్ నుండి school assistant teacher పాల్గొన్నారు.
ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్
నేటిధాత్రి ఐనవోలు :-
ఐనవోలులోని ప్రభుత్వ యునాని వైద్యశాల నీ సందర్శించిన రిజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ (RDD) డాక్టర్. ప్రమీల దేవి సందర్శించారు. జూన్ 21 న జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ దశబ్ది వేడుకలు – 2025 దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 రోజుల పాటు నిర్వహించేలా యోగ దశబ్ది వేడుకల ప్రణాళికను రూపొందినట్లు ఐనవోలు యునాని ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.ఈ మేరకు ఆరోగ్య మందిరాలు, వైద్య సబ్బంది, అంగన్వాడీ టీచర్లు,పిల్లలు,పెద్దలు, గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘ యోగ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ ‘అనే నినాదంతో యోగ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్, ఫార్మాసిస్ట్ శంకర్, యోగ శిక్షకులు అర్చన, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
నిరంజన్ ఆధ్వర్యంలో గోడిశాల అరవింద్ గౌడ్ చిత్రపటానికి నివాళులు
పరకాల నేటిధాత్రి:
భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో షహీద్ గొడిశాల అరవింద్ గౌడ్ 26వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పోశాల ఆదిత్య అరవింద్ గౌడ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమంలో అమరవీరుల సంస్కరణ పరకాల అధ్యక్షులు దేవునూరి మేఘనాథ్,మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆర్పీ జయంతి లాల్,చందుపట్ల రాజేందర్ రెడ్డి,మార్త రాజభద్రయ్య,దార్నా నారాయణదాసు,కుక్కల విజయ్,సంఘపురుషోత్తం,మిడిదొడ్డి నరేష్ నాగేల్లి రంజిత్,పావుశెట్టి శ్రీనివాస్,గండ్ర శ్రీనివాస్ రెడ్డి, కానుగుల గోపీనాథ్,వనం రాజు,ఆర్పీ.సంగీత,సయ్యద్ గలిఫ్,వెనిశెట్టి రాజేష్,పాలకుర్తి ప్రతాప్,రామకృష్ణ నివాళులర్పించారు.
పచ్చని పంట పొలాలకు సాగునీరు అందించే ఆ చెరువు నేడు కబ్జాకు గురవుతుంది. దీంతో చెరువు పరిధిలోని పంట భూములు పచ్చని పైరులతో కళకళలాడే పరిస్థితులు క్రమంగా కనమరుగయ్యే దుస్థితి నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు రోజు రోజుకు పెరగుతుండడంతో సులభంగా సంపాదించడానికి అలవాటు పడిన కొంతమంది దళారులు ప్రభుత్వ భూములను కూడా యధేచ్చగా కబ్జా చేస్తున్నారు. కాగా ప్రభుత్వ భూములను కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు శిఖం భూమిని ఒక రైతు తన ఇష్టారీతిగా కబ్జా చేస్తున్నట్లు పరిసర ప్రాంతాల రైతులు ఆరోపిస్తున్నారు. చెరువులో మునిగిన పట్టా భూములు కూడా తేలిన తర్వాతనే సాగు చేసుకునే హక్కుకలిగినవి. అయితే గిద్ద చెరువు సమీపంలోని ఒక సర్వే నంబర్ లో దాదాపు 2 ఎకరాలకు పైగా చెరువు శిఖం భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. శిఖం భూమి కబ్జాకు గురైందని గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం.చెరువు శిఖం భూములు కబ్జాలకు గురవుతుంటే భవిష్యత్తులో చెరువులు మాయమయ్యే పరిస్థితులు సంభవిస్తాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి మండల కేంద్రంలో చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతుండగా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి గిద్ద చెరువు కబ్జాదారుల కబందహస్తాల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తారకరామ హాస్పిటల్ లో పేర్టీ నైన్ ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న ఇతర గ్రామాల ప్రజలు అందుబాటులో ఉండే విధంగా సిరిసిల్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తారకరామ హాస్పిటల్ మేనేజ్మెంట్ దొంతుల రమేష్ తెలియజేశారు. అంతేకాకుండా పేర్టీ నైన్ హాస్పిటల్ సంస్థ హైదరాబాద్ వారు పాల్గొని ఉచిత క్యాంపును విజయవంతం చేయడం జరిగినది.
జహీరాబాద్ డిఎస్పీని ఎన్హెన్ఆర్సి బృందం కలవడం జరిగింది. వారికి జహీరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థులు, యువకులు మాదకద్రవ్యాలకు పాల్పడకుండా, మైనర్లు టూవీలర్స్ కానీ పోర్ వీ లర్స్ వాహనాలు నడపటం జరుగుతుంది. తద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతు న్నాయి. కావున వీటిపై దృష్టి సారించాలని కోరారు. లైసెన్స్ లేని వాహనాలు ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఐర్సి సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్పవర్, వారితోపాటు సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి సి. వీరేందర్, న్యాల్కల్ మండల చైర్మన్ రాజనర్సింహా, ఏఐటీఎఫ్ మొగుడంపల్లి ఇంచార్జీ రవీందర్ రాథోడ్, మహేష్, ధన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రఖ్యాత ఉర్దూ పరిశోధకుడు, విమర్శకుడు, రచయిత, జర్నలిస్ట్, అనువాదకుడు, విద్యావేత్త, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ముహమ్మద్ అస్లాం ఫారూఖీకి అరుదైన గౌవరం దక్కిందని ఒక ప్రకటలో ఆయన గురువారం తెలిపారు. ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలను ప్రచురించిన అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన “అదాబ్ వో అదీబ్” అనే పుస్తకంను యూఎస్ఏ వాషింగ్టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కొనుగోలు చేసి, ఆ లైబ్రరీలో చేర్చారని తెలిపారు. ఈ పుస్తకం కాపీని ఆసియా రీడింగ్ రూమ్లో సిరీస్ నంబర్ 38622021 కింద లైబ్రరీలో ఆసియా రచయితల వర్గం కింద ఉంచారని తెలిపారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ పుస్తకాన్ని ఎంపిక చేయడం ఏ భారతీయ, ఉర్దూ రచయితకైనా గౌరవమని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో మౌల్వీ అబ్దుల్ హక్ అజీజ్ అహ్మద్ ఇబ్రహీం జలీస్, రఫియా మంజూర్-ఉల్-అమీన్ ఫిరాక్, గోరఖ్ పురి, అక్తర్-ఉల్-ఇమాన్, ఎన్. ఎం. రషీద్ అబుల్ కలాం ఆజాద్, బర్తాని యా ఉర్దూ జీవిత చరిత్ర, పరి శోధనా వ్యాసాలు ఉన్నాయని తెలిపారు. ఈ పుస్తకంతో పాటు, ఆయన రాసిన మరో మూడు పుస్తకాలు కూడా అంతర్జాతీయ కేటలాగ్లో చేర్చబడ్డాయని తెలిపారు. ఆయన రాసిన 12 పుస్తకాలు అమెజాన్ లో కూడా అందు బాటులో ఉన్నాయని పేర్కొ న్నారు. ఈ సందర్భంగా ఉర్దూ ప్రేమికులు డాక్టర్ ముహమ్మద్ నజీమ్ అలీ, డాక్టర్ అబిద్ అబ్దుల్ వాసి, డాక్టర్ వసీవుల్లా, భక్తియారీ డాక్టర్ ముహమ్మద్ అహ్సన్ ఫారూఖీ, డాక్టర్ అజీజ్ సొహైల్, సయ్యద్ ముకర్రం నియాజ్, అర్షద్ హుస్సేన్, యాహ్యాఖాన్, సజ్జాదుల్ హస్నైన్, ఇతరులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు ఆయకట్టు వద్ద చెరువులో నుండి మోటార్ల ద్వారా పొలాలకు నీటిని అక్రమంగా వాడుతున్నారు. చెరువులో నుండి నీటిని మోటార్ల ద్వారా వాడడం చట్టరీత్యా నేరం అయినా కూడా కొందరు వ్యక్తులు చట్టాలను పట్టించుకోకుండా ఇష్టానురీతిలో చెరువు నుండి మోటార్ల ద్వారా నీటిని పొలాలకు వాడుతున్నారు. అధికారులకు ఈ విషయం తెలిపిన మౌనంగా ఉంటున్నారని గిద్ద చెరువు నీటి వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు నీటిని వినియోగిస్తున్న వ్యక్తులకు సన్నిహిత సంబంధాల వల్ల పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. చెరువు నీటిని నమ్ముకొన్న రైతులు చెరువు అడుగంటి పోతే మా పొలాలకు నీరు ఎలా అందుతుందని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మోటార్లను సీజ్ చేసి, మోటార్లను వినియోగించిన వారిపైన చర్యలు తీసుకోవాలని నీటి వినియోగదారులు కోరుకుంటున్నారు.
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి • మొబైల్ ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు • లోన్ అప్ లను నమ్మొద్దు
• ఇంచార్జ్ ఎస్ఐ సృజన
నిజాంపేట నేటి ధాత్రి:
ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది సైబర్ నేరగాళ్ళు నూతన పద్దతిలో ప్రజలను మోసం చేస్తున్నారని నిజాంపేట ఇంచార్జ్ ఎస్ఐ సృజన అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మాట్లాడుతూ.. ఎవరైనా కొత్త వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం.. మీ ఫోన్ కీ ఓటీపీ వచ్చింది. చెప్పండి అంటూ ఫోన్ చేస్తే నమ్మవద్దన్నారు. అలాగే లోన్ అప్ ల వేధింపులకు చాలా మంది బలివుతున్నారని ఎవరు కూడా లోన్ అప్ లను నమ్మవద్దన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే 1930కు కాల్ చేయాలన్నారు.
పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిద్దాం బంగారు భవిష్యత్తును కల్పిద్దాం
టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు పిలుపు
నమోదు కొరకు ప్రచార జాతా ప్రారంభం
చర్ల నేటిధాత్రి:
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు పిలుపునిచ్చారు.
గురువారం తేది 29మే 2025 నాడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యుటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాతాను స్థానిక అంబెడ్కర్ సెంటర్ భద్రాచలం నందు జెండా ఊపి సీనియర్ నాయకులు పి లక్ష్మి నారాయణ ప్రారంభించారు. జాతాను ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని విశాలమైన తరగతి గదులు ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను.
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేశారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే కొఠారి కమిషన్ చెప్పినట్లు దేశ జీడీపీలో ఆరు శాతం రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం విద్య కు కేటాయించాలి కానీ దేశ బడ్జెట్లో 2.9 శాతం రాష్ట్ర బడ్జెట్లో 7.5 శాతం మాత్రమే కేటాయింపులు జరుగుతున్నది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు వర్క్ బుక్కులు ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని నాణ్యమైన మధ్యాహ్న భోజనం వారానికి మూడు సార్లు కోడిగుడ్లు రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను.
ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలియజేశారు గుడి మసీదు చర్చిల నిర్మాణం కోసం ఐకమత్యంగా కదిలే ప్రజలు ఊరి బడి కోసం కూడా ఏకమై బడిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు. గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని టీఎస్ యుటిఎఫ్ శ్రేణులు ఈరోజు నుండి జూన్ 5 వరకు ప్రచారం నిర్వహిస్తాయని తెలియజేశారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు తల్లిదండ్రుల ఆశను ప్రైవేటు విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని చదువుల నాణ్యతలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అని మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌళిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం.
సన్నాహాలు చేస్తోందని ఏఐ ఆధారిత బోధన డిజిటల్ తరగతి గదులు లైబ్రరీ లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందని పిల్లల మానసిక ఆరోగ్యానికి వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలియజేశారు పిల్లలకు నాణ్యమైన విద్య.
ఉచితంగా అందుతుంది తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుంది కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని బి రాజు పిలుపునిచ్చారు చర్ల మండలంలో దేవరపల్లి. కుదునూరు ఆర్ కొత్తగూడెం సత్యనారాయణపురం తేగడ చర్ల పట్టణం ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార జాతాలో సంఘం జిల్లా అధ్యక్షులు బి మురళీమోహన్ ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర.
జాయింట్ సెక్రటరీ ఎన్ కృష్ణ జిల్లా కార్యదర్శులు డి తావుర్య ఎస్ విజయ కుమార్ వెంకటేశ్వర్లు చర్ల మండల అధ్యక్షులు కాక రాంబాబు సకినం బాలకృష్ణ రాధ జలంధర్ సీనియర్ నాయకులు పి నరసింహరావు గోపాలరాజు హిమగిరి రవికిషోర్ శ్రీలక్ష్మి వర్షిణి పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మే – 30 సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బి.వై. నగర్ లోని సి.ఐ.టి.యు ఆఫీసు వద్ద CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గం , కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం , హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం CITU అని 1970 మే 30 వ తేదీన ఐక్యత – పోరాటం అనే నినాదంతో కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిఐటియు ఆవిర్భవించడం జరిగిందని గత 55 సంవత్సరాలుగా దేశంలో , తెలంగాణ రాష్ట్రంలో , రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మిక హక్కుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని పోరాటంలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సి.ఐ.టి.యు కు అండగా ఉంటూ ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఈరోజు సిఐటియు 55 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కార్మిక వర్గ ఉద్యమ పోరాట కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ , గుర్రం అశోక్ జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ , సూరం పద్మ , నక్క దేవదాస్ , గుండు రమేష్ , దొబ్బల లచ్చయ్య , వావిలాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్ లను ఓటు బ్యాంక్ గా చూస్తున్న ప్రభుత్వాలు..
ముదిరాజ్ ల రిజర్వేషన్ హామీని మరిచిన ప్రభుత్వం.
మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్
నర్సంపేట నేటిధాత్రి:
ప్రభుత్వాలు ఎన్ని మారిన ముదిరాజ్ లను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ఆరోపించారు. ముదిరాజ్ లకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని ప్రభుత్వం మరిచిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు.గురువారం నాడు దుగ్గొండి మండల కేంద్రంలో మండల మెపా స్వామి ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య హాజరైనారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజుల రిజర్వేషన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మెపా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ మండల ఉపాధ్యక్షులు సంకెళ్ళ స్వామి,దండు తిరుపతి, జెట్టబోయిన రాజేందర్, గ్రామ పెద్దలు ముత్యం భూమయ్య ముదిరాజ్, పోన్నం కుమార్ ముదిరాజ్, పొన్నం సదానందం, ముదిరాజ్ అడ్వకేట్ ముత్యం కిషోర్ ముదిరాజ్,డా.చింతకాయల శంకర్ ముదిరాజ్, పొన్నం వేణు ముదిరాజ్, పొన్నం అశోక్ ముదిరాజ్, గేళ్ళ రాజు ముదిరాజ్ సానబోయిన శివ ముదిరాజ్ పొన్నం నాగరాజు ముదిరాజ్, బుస మల్లయ్య ముదిరాజ్ లు పాల్గొన్నారు.
#ఎదిగిన కొడుకు మృతి చెందడంతో తల్లి రోదనకు అవధులు లేకుండా పోయింది.
#యువకుని మృతితో గ్రామములో విషాదఛాయలు.
నల్లబెల్లి నేటి ధాత్రి:
వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్కు వైర్లను తగిలిస్తుండగా విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లె గ్రామంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాందాటి శ్రీనివాస్ రెడ్డి-మంజుల దంపతుల రెండవ కుమారుడు లక్ష్మణ్ రెడ్డి (19) తమ వ్యవసాయ భావి వద్దకు వెళ్లి నీళ్లు రావడంలేదని మోటారు వైర్లను సరి చేస్తున్న క్రమంలో కరెంటు రాకపోవడంతో 11 కెవి విద్యుత్తు లైనుకు వైర్లను తగిలించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక వైరు కాలికి తగలడంతో పడిపోగా గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం నర్సంపేటకు తరలించినట్లు పోలీసులు తెలిపారు మృతుని తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.
#యువకుని మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. పట్టుమని 19 సంవత్సరాలు నిండకముందే నూరేళ్ల జీవితం గడిచిపోయిందని మృతుని తల్లిదండ్రులు రోదన చేస్తుంటే గ్రామస్తులందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. ఎంతో చలాకీగా చదువులో సైతం ప్రతిభను కనబరిచి ఎంతో అత్యున్నత స్థానంలో ఉండాలని కోరికతో ఉండేవాడని అదేవిధంగా తల్లిదండ్రులకు తన వంతుగా వ్యవసాయ పనులలో చేదోడు వాదోడుగా ఉండి కుటుంబానికి పెద్దన్న పాత్ర పోషించేవాడని గ్రామ ప్రజలు చెప్పుకుంటూ బోరుణ ఏడ్చారు. ఏది ఏమైనాప్పటికీ చేతికి అందిన కొడుకు చేజారిపోవడంతో కన్న తల్లిదండ్రుల రోదన అంతా ఇంత కాదు.
కరోనా వర్షాకాల వ్యాధులు సోకకుండా జిల్లా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత
సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):
సిరిసిల్ల జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయంలో కాలానుగుణంగా వ్యాపించే వ్యాధులలో భాగంగా మాట్లాడుతూ సాధారణ జలుబు, దగ్గు(commoncold) గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండవలసిందిగా తెలియజేస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడాలని, ప్రయాణాలలో జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్రు లు వాడాలని, అదే విధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాల్సిందిగా సూచించినారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణ కొరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కొరకు వైద్యులను సంప్రదించవలసిందిగా తెలియజేసినారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు కరోనా విషయంలో భయాందోళన చెందవలసిన అవసరం లేదని, చికిత్స తోనే పూర్తిగా నయమవుతుందని, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ అవసరం ఉందని, కరోనా నిర్ధారణ కాగానే డాక్టర్ల సూచనలు పాటించాల్సిందిగా, మాస్కులు ధరించాల్సిందిగా, ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి తక్కువ స్థాయి లక్షణాలే నమోదవుతున్నాయని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులు ఎలాంటి కోవిడ్ కేసులు నిర్ధారణ కాలేదని ఈ సందర్భంగా తెలియజేసినారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.