
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
భూమి భుక్తి విముక్తి కై గోదావరిలోయ పోరాటాల్లో అనేకమంది తమ జీవితాలను పేద ప్రజల కోసం పణంగా పెట్టి పోరాడారని అందులో కామ్రేడ్ ముక్తార్ పాషన్న నిర్వహించిన పోరాటాలు ఉద్యమ చరిత్రలో మైలురాళ్ళని సిపిఐ ఏంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బానోత్ ఊక్లా అన్నారు. బుధవారం పాశన్న స్వగృహంలో ఆయన నాలుగవ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ చిన్న వయసులోనే విప్లవద్యమాలు ఆకర్షితుడై విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి అనంతరం పార్టీ కేంద్ర కమిటీ నాయకుడి దాకా ఆయన జీవిత ప్రస్థానం నాలుగు దశాబ్ద కాలం ఖమ్మం వరంగల్ ఏజెన్సీ తో పాటు అనేక ప్రాంతాల్లో అనేక పోరాటాలకు నాయకత్వం వహించి ముందుండి నడిపించాడని అలాంటి నాయకుడిని కోల్పోవడం పార్టీకి విప్లవోద్యమాలకు తీరని నష్టమని అన్నారు.టైల్స్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ టీ యూ జాతీయ నాయకులు బి రామ్ సింగ్ మాట్లాడుతూ కార్మికోద్యమాలలో పాశన్న పోరాటాలు,విజయాలు చిరస్మరణీయమని టైల్ వర్కర్స్ యూనియన్ ను స్థాపించి అనేక ప్రాంతాలు విస్తరించడం లో పాశన్న పాత్ర మరువలేని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘాన్ని విస్తరించడంలో ఐఎఫ్టియును జాతీయ సంఘంగా నిలబెట్టడంలో అనేక రాష్ట్రాలు కలియతిరిగాడన్నారు.
ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు కొమరం సత్యనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీ పోడు భూముల పోరాటాల్లో ఆదివాసి హక్కులను కాపాడడంలో పాశన్న కీలక పాత్ర పోషించాడని ఆదివాసి జిల్లాల డిమాండ్ ని తీసుకొచ్చి ఐదవ షెడ్యూల్ ప్రాంతాలను విడగొట్టడం వ్యతిరేకించాడని దీక్షలకు పూనుకున్నాడని ఆదివాసి స్వయంపాలక మండల్ల ఏర్పాటు చేయాలని పాషన్న చేసిన పోరాటాలు చిరస్థాయిగా గుర్తుంటాయి అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఇల్లందుల నరసింహులు,గోవింద నరసింహారావు,పాపారావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.