ఎల్లాపూర్ లో డిహెచ్పిఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం
జగిత్యాల,నేటిధాత్రి:
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో గురువారం దళిత హక్కుల పోరాట సమితి నూతన గ్రామ కమిటీని దళిత హక్కుల పోరాట సమితి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాళ్ల భూమేశ్వర్ ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా మోదుంపల్లి రాజు, ప్రధాన కార్యదర్శిగా మచ్చ అంజయ్య, ఉపాధ్యక్షులుగా మోదుంపల్లి లక్ష్మణ్, ఎండపల్లి భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా మహంకాళి కిరణ్, మోదంపల్లి నరసయ్య, కోశాధికారిగా ఆరెల్లి కనకయ్యను ఎన్నుకున్నట్లు భుమేశ్వర్ తెలిపారు.
ఈసందర్భంగా భుమేశ్వర్ మాట్లాడుతూ దళితులకు రాజ్యాంగ హక్కులు నేటికీ దళితులకు అందని ద్రాక్షలాగానే మిగిలాయన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపై అణిచివేత దాడులు మహిళలపై అత్యాచారాలు హత్యలు కులవివక్షత, అంటరానితనం కొనసాగుతుందన్నారు.
ఈకార్యక్రమంలో శనిగరపు ప్రవీణ్, మోదుంపల్లి మల్లయ్య, మల్లారపు నర్సయ్య, ఆరేపల్లి మల్లయ్య, ఆరేపల్లి రాజయ్య, మోదుంపల్లి అంజయ్య, దీకొండ రాములు, మల్లారపు చిన్న నర్సయ్య, మోదుంపల్లి నర్సయ్య, మోదుంపల్లి అంజయ్య, మల్లారపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.