తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జుంజుపల్లి నర్సింగ్ నియామకం

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లాకు చెందిన జుంజుపల్లి నర్సింగ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సంఘం విస్తరణ,బలోపేతం చేయడం కోసం సమర్థవంతమైన నాయకత్వం అవసరం అన్నారు.గతంలో విద్యార్థి, యువజన,ప్రజా పోరాటాల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర ను పోషించి,ఉమ్మడి రాష్ట్రానికి నాయకత్వం వహించిన నర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి సమర్థవంతుడని కొనియాడారు.సంఘం బలోపేతం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ కులాలను ఐక్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా పనిచేయాలని కోరారు.దాని కొరకు సంఘంలో ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన నర్సింగ్ మాట్లాడుతూ.. నా పట్ల విశ్వాసంతో సంఘం బలోపేతం కోసం బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!