Collector Orders Land Verification
దరఖాస్తులు పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూమి అభివృద్ధిలో భాగంగా వెంచర్ల ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హాజీపూర్ మండలం వేంపల్లి,మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతాలలో వెంచర్ ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులకు సంబంధించి భూమిని హాజీపూర్ మండల తహసిల్దార్ పుష్పలత, పట్టణ ప్రణాళిక అధికారి సంపత్ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.వెంచర్ల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచూసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
