రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి
తంగళ్ళపల్లి ఎంపీటీసీ కోడి అంతయ్య మా భూమిని ఆక్రమించుకున్నాడని తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బాధితురాలు గంగ శోభ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతికి సోమవారం ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 27 సంవత్సరాల క్రితం మా మామ 25 గుంటల భూమిని తాడూరు శివారులో 1156 సర్వే నంబర్ కొనుగోలు చేశాడని ఇప్పటికీ మేము అదే భూమిలో కబ్జాలో ఉన్నామని కానీ తంగళ్ళపల్లి ఎంపిటిసి కోడి అంతయ్య ఆ భూమిని అక్రమంగా పట్టా చేయించుకుని మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె వాపోయారు. దీనిపై అధికారులు స్పందించి తన భూమి తనకు ఇప్పించి కోడి అంతయ్య పై చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకున్నారు.