అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం…

అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం

-హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘన సన్మానం
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుశాపురం గ్రామ నూతన సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. గురువారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతనంగా అంకుశాపురం గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన బీసీల ముద్దుబిడ్డ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులను మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ డిజిపి పూర్ణచందర్ రావు, సమాజ్ అధినేత సూర్యరావు, తొలి వెలుగు ఎడిటర్ రఘులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత-లింగమూర్తి దంపతులు మాట్లాడారు. ప్రజాసేవ చేసేందుకు తాము రాజకీయ రంగ ప్రవేశం చేశామని, తమను సన్మానించి..రాజకీయంగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version