ఈ దీపావళికి మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవ్వాలంటే ఇలా చేసి చూడండి
ఈ దీపావళి పండుగకు కొత్త అందంతో మెరిసిపోవాలనుకుంటున్నారా? చర్మం కాంతులీనేలా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ న్యూట్రిషనిస్టు చెబుతున్న సూచనలను ఓసారి ఫాలో అయ్యి చూడండి.
పండుగ నాటి వరకూ ప్రతి రోజు ఉదయం టీస్పూను ఉసిరి జ్యూస్, అర టీస్పూను అలోవిరా జ్యూస్, చిటికెడు పసుపు, కప్పు నీళ్లలో కలిపి తాగితే చర్మం కాంతివంతం అవుతుంది. ఉసిరి వల్ల చర్మం ముడతలు తగ్గుతుంది. ఆలోవిరా వల్ల స్కిన్ ఇరిటేషన్ మటుమాయం అవుతుంది. పుసుపులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
రోజువిడిచి రోజు జామ, వాల్‌నట్స్, ఒక టీస్పూన్ గుమ్మడి గింజలను తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
రాత్రంతా నానబెట్టిన గోండ్ కతిరాకు రోజు వాటర్, సబ్జా గింజలు, నిమ్మరసాన్ని జోడించి వారానికి మూడు నాలుగు సార్లు తాగితే శరీరానికి తగినంత తేమ అందుతుంది. నిస్సారంగా కనిపిస్తున్న చర్మానికి కొత్త జీవాన్ని అందిస్తుంది. చర్మం ఉబ్బినట్టు ఉండటాన్ని తొలగిస్తుంది.
పెసరపప్పు, మెంతికూరతో చేసిన కిచిడీకి ఒక టీస్పూను నెయ్యి జోడించి తింటే శరీరానికి జింక్, యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా అంది చర్మంలో డల్‌నెస్ తొలగిపోతుంది. రాబోయే పది రోజులు ఈ జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటిస్తే చర్మం కాంతులీనుతూ ఉంటుందని సదరు న్యూట్రిషనిస్టు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ రెసీపీలను ఎంజాయ్ చేయండి.