అంగన్‌వాడీ టీచర్ల బడిబాట
చిన్నారులను బడిబాట పట్టించేందుకు అంగన్‌వాడీ టీచర్లు రోడ్డుబాట పట్టారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలబాలికలు ఐదేళ్లలోపు పిల్లలు అంగన్‌వాడీకి పంపాలని, ఐదేళ్లు దాటిని పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని అంగన్‌వాడీ టీచర్లు గ్రామాలలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో గ్రామగ్రామాన ర్యాలీలు చేపడుతున్నారు. 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ ఎ.రాధిక, సర్పంచ్ జెన్నయ్య, ఉపసర్పంచ్ గట్టు శివకుమార్, తరగం సునీత, ఆయా రజియా, కో ఆప్షన్ మెంబర్ ఎస్‌కె.లాల్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.