అనాథ బాలికకు అండగా కెటిఆర్
తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అండగా నిలిచారు. ఆ బాలికకు 50వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే…ముస్తాబాద్ గ్రామంలోని మద్దికుంట రజిత తల్లి మద్దికుంట కమలమ్మ, తండ్రి మద్దికుంట రాములు. రజిత తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ముస్తాబాద్ మండలకేంద్రంలోని గుడిసెలో నివసిస్తున్నది. రజిత దీనస్థితిని ట్విట్టర్ ద్వారా స్థానిక శాసనసభ్యుడు, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తెలుసుకున్నారు. కేటిఆర్ వెంటనే స్పందించి రూ.50వేల ఆర్ధిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బుధవారం ఉదయం డిఆర్వో ఖిమ్యానయక్ స్వయంగా ముస్తాబాద్ వెళ్లి రూ.50వేల రూపాయల చెక్కును మద్దికుంట రజితకి అందించారు. అలాగే మద్దికుంట రజితను తంగళ్ళపల్లి గ్రామంలోని కెజిబివిలో ఎంపిహెచ్‌డబ్ల్యు కోర్సులో చేర్పించారు. అదేవిధంగా రజితకు డబల్ బెడ్‌రూమ్ ఇండ్లలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. తన దీన పరిస్థితిపై సత్వరమే స్పందించిన కేటిఆర్‌కు మద్దికుంట రజిత, ప్రజలు కతజ్ఞతలు తెలిపింది. ట్విట్టర్ విజ్ఞప్తికి కెటిఆర్ స్పందించినందుకు ముస్తాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. వీరి వెంట డిఇఓ రాధకిషన్, ఎంఇఓ రాజయ్య, డిప్యూటీ తహసీల్దార్ బి.గోపాల్‌లు ఉన్నారు.