వరంగల్ తహసీల్దార్ ఎం.డి ఇక్బాల్ డిమాండ్
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యపై దేశాయిపేట, చిన్నవడ్డేపల్లి ప్రాంతానికి చెందిన జన్ను నూతన్ బాబు ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదును తక్షణమే వెనక్కి తీసుకొని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని వరంగల్ తహసీల్దార్ జన్ను నూతన్ బాబును డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 302లో నెలకొన్న సమస్య పూర్తిగా సివిల్ అంశం అని, ఏదైనా తనకు ఇబ్బంది ఉంటే కోర్టులో తేల్చుకోలని సూచించారు. ఏ సంబంధం లేని జిల్లా కలెక్టర్ పై తప్పుడు ఫిర్యాదు చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. నూతన్ బాబుకు రెవిన్యూ పరంగా ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో తనను కలిసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. తక్షణమే కలెక్టర్ పై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని వరంగల్ తహసీల్దార్ ఎం.డి ఇక్బాల్ డిమాండ్ చేశారు.