కొమ్మూరిని విమర్శించే స్థాయి నైతికత నీకు లేదు
అయినా పూర్ మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఐనాపూర్ మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి మరియు సనాది భాస్కర్ తాటికొండ సదానందం విమర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్న అముదాల మల్లారెడ్డి వైఖరి మార్చుకోవాలని, అన్నారు మా నాయకుడు డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అన్నారు ఆముదాల మల్లారెడ్డి ఇప్పటి వరకు మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి. అన్నారు గత పదేళ్లుగా ప్రజాసమస్యల మీద మత్తడి భూమి ఆక్రమమణకు వ్యతిరేకంగా మా నాయకునితో కలిసి పోరాటాలు చేసినపుడు మీకివన్ని కనపడలేదా…?? అన్నారు చందాల దందాలు చేసి బినామీల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టుకున్న మీరా మా నాయకున్ని విమర్శించేది. లేదు అన్నారు ,,ఉనికిలో లేని పార్టీల నాయకులతో కలిసి చిల్లర రాజకీయాలు చేస్తే త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామని . అన్నారు బినామీల పేర్ల మీద భూములు కొనడానికి నీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో ప్రజలకు చెప్పాలి అన్నారు.జనగామ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ కోట్లాది రూపాయల అభివృద్ధి నిధులు తెస్తున్న మా నాయకున్ని చూసి ఓర్వలేక ఎక్కడ ప్రజల్లో తమ ఉనికి కోల్పోతామనే భయంతో మీరు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారు. అన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యల పైన పోరాడాలని అన్నారుఈ సమావేశంలో ఎండీ జౌర్ శ్రీనాథ్ రెడ్డి మామిడాల నాగరాజు రాయకం ప్రభాకర్ బండి శ్రీనివాస్ మేడిచెల్మి రాకేష్ రేకులపల్లి సాయికుమార్ ఎండీ నవాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
[3:15 pm, 13/7/2024] +91 99892 22756: End