విసికే పార్టీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జి అంబాలా అనిల్ కుమార్
పరకాల నేటిధాత్రి
విముక్తి చిరుతల పార్టీ ఆధ్వర్యంలో పరకాల పట్టణ కేద్రం ప్రభుత్వ జూనియర్ విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు మధ్యణ భోజణ పథకం ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని వీసికె పార్టీ ఉమ్మడి జిల్లాల ఇంచార్జి అంబాలా అనిల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి పేద విద్యార్థులు గ్రామాల నుంచి పట్టణ కేంద్రల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరియు డిగ్రీ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్నం తినడానికి ఆహారం లేక ఎన్నో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కావుణ తక్షణమే ప్రభుత్వం కాలేజీల్లో మధ్యన భోజనం ఏర్పాటు చెయ్యాలి విద్యార్థుల పక్షణ ఉండి విద్యార్థుల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు.అదేవిదంగా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేసి విద్యార్థులకు అన్యాయం చేసిందని ఇప్పుడు అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఆదుకొని పేద విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమం లో మచ్చ విశ్వతేజ,బొజ్జపెల్లి దిక్షిత్ కుమార్,పెండ్యాల సాయి, పవన్,పరకాల ఇంటర్ డిగ్రీ విద్యార్థులు,నాయకులు పాల్గొన్నారు.