డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కనీస సౌకర్యాలు లేవు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని గత ప్రభుత్వం 500 ఇండ్లను నిరుపేదలకు ఇవ్వడం జరిగింది కానీ వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విపులమైంది వేషాలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మహిళలకు తాగునీరు సౌకర్యం లేక రోడ్డుపై ధర్నా చేసిన మహిళలు అనంతరం మహిళలు మాట్లాడుతూ త్రాగునీటి కోసం మిషన్ భగీరథ నీళ్ళను ఇవ్వాలి డబ్బులు బెడ్ రూమ్ ఇండ్ల చుట్టుపక్కల వ్యవసాయ భూములు ఉండడం వలన మాకు నిరంతరం పాములు విపరీతంగా వస్తున్నాయి కావున డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల చుట్టుపక్కల పరహరి గోడ నిర్మించాలి సైడు డ్రైనేజీ కాలువలలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది క్లీన్ చేయకపోవడంతో మురుగు వాసన వస్తున్నాయి మున్సిపల్ అధికారులు స్పందించి మురికి కాల్వలను క్లీన్ చేయాలి కాలినలలో వీధిలైట్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం కావున వీధి లైట్లు ఏర్పాటు చేయాలి మున్సిపల్ సిబ్బంది రెండు రోజులకు ఒకసారి వచ్చి మా కాలనీలో ఉన్న చెత్తన మున్సిపల్ సిబ్బంది వ్యాన్లు తీసుకువెళ్లాలి మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంతో ఆ కాలనీ వాసులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాము కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి మాకు అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది