ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య.
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన అంబేద్కర్ సంఘం 48వ వార్షికోత్సవ సభ కరపత్రాలు* విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ గతంలో ఉన్న జిల్లా, మండల, గ్రామ స్థాయి అంబేద్కర్ యువజన సంఘాల పునః నిర్మాణం ల గురించి సంఘాలను బలోపేతం చేసేందుకు అనేక విషయాల గురించి చర్చించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మండల, గ్రామ స్థాయి అంబేద్కర్ యువజన సంఘాలకు అనుబంధ పత్రాలు అందజేయడం జరుగుతుందని అన్నారు.మరియు అంబేద్కర్ యువజన సంఘం లో మహానీయుల ఆశయాలను సిద్ధాంతాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తు దళిత బహుజనులను చైతన్య వంతులను చేస్తు అమరులైన వారికి నివాళులు అర్పించడం జరుగుతుందని చెప్పారు.ఈనెల 29న జరిగే 48వ వార్షికోత్సవ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలైన వరంగల్, జనగాం ,మహాబూబా బాద్ ,హన్మకొండ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అద్యక్ష, కార్యదర్శులతో పాటు ఆయా మండలాల గ్రామాల అద్యక్షులు కార్యదర్శులతో పాటు సంఘం నాయకులు అధిక సంఖ్యలో హాజరై 48వ వార్షికోత్సవ సభ ను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా, మండల నాయకులు పుల్ల ప్రతాప్ గురుకుంట్ల కిరణ్,కనకం తిరుపతి దాసారపు నరేష్,పాముకుంట్ల చందర్ నేరేళ్ళ సమ్మయ్య, కలికోట సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.