మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.
వరంగల్ తూర్పు, నేటిదాత్రి
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే దీక్ష దివాస్ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ రోజు నాని గార్డెన్స్ లో ముందస్తు సన్నాహక సమావేశం తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దీక్ష దివాస్ వరంగల్ ఇంచార్జ్ జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ మంత్రి దయాకర్ రావు హాజరైనారు. ఈ యొక్క సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి నరేందర్ మాట్లాడుతు ఈ నెల 29 న నిర్వహించే దీక్ష దివస్ కార్యక్రమంకు అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబురాలు ఘనంగా నిర్వహించుకుందాం అని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు…