రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలకు చెందిన వి.వంశిక, పి.శ్రీహర్ష తోమ్మిది తరగతి విద్యార్థినిలు సెప్టెంబర్ నెలలో షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి ఈనెల28, 29, 30 తేదీలలో బీహార్ రాష్ట్రంలో నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈసందర్భంగా గెలుపోందిన విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అభినందించడం జరిగింది. ఈకార్యక్రమంను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అనేక రంగాల్లో ముందడుగు వేయాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.