Air Travel with Irumudi Allowed for Ayyappa Devotees
విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్పస్వాములకు గుడ్ న్యూస్
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారత పౌర విమానయాన శాఖ అయ్యప్ప భక్తులకు శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇరుముడితో నేరుగా విమానంలో ప్రయాణించడానికి అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం భక్తుల సాంప్రదాయాలు, ఆచారాలకు గౌరవం ఇస్తూనే భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సాంస్కృతిక విలువలు, భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా ఈ నిర్ణయం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
