సిరిసిల్ల పట్టణంలో మోనో కార్పస్ చెట్ల వలన వాయు కాలుష్యము
పట్టించుకోని మునిసిపల్ అధికారులు
సిరిసిల్ల టౌన్:(నేటిదాత్రి)
సిరిసిల్ల పట్టణంలో ఉన్న (గత ప్రభుత్వ హయంలో లో ) పెట్టిన మోనో కార్పస్ చెట్లవలన వాయు కాలుష్యము ఏర్పడుతుందందని, ఇది ఏమాత్రం మంచిది కాదని పిల్లలకు, పెద్దలకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడుతుందని గతంలో కూడా మున్సిపల్ అధికారులకు చెప్పిన వారు పెడచెవిన పెట్టారు.
వాటి వలన ఏలాంటి ఇబ్బంది లేదంటే మోనో కార్పస్ మొక్కలు ప్రతి అధికారి ఛాంబర్లో టేబుల్ మీద ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని
మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న దాదాపు 10 చెట్లను తొలగించినారు. ( వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా).
కానీ పట్టణంలో డివైడర్ మధ్యలో, పార్కులల్లో అలాగే ఉంచారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని అట్టి చెట్లను తొలగించగలరని బూర యాదగిరి అనే సామాజిక కార్యకర్త తెలిపారు…