రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచర్ల బాలరాజు.
న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరణ
నర్సంపేట,నేటిధాత్రి:
అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రెండు సంస్థల విలీనం సందర్భంగా ఈనెల 19 న రాష్ట్ర జనరల్ కౌన్సిల్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగనున్నదని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచర్ల బాలరాజు తెలిపారు.నర్సంపేట పట్టణంలోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏఐకేఎంఎస్ నాయకులు కార్యకర్తలు కరపత్రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాచర్ల బాలరాజు మాట్లాడుతూ వ్యవసాయక విప్లవం ఇరుసుగా కలిగిన నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం పోరాడుతూ భావ సారూప్యం కలిగినటువంటి వివిధ విప్లవ రైతాంగ సంఘాల విలీనం కోసం గత కొన్ని సంవత్సరాలుగా కృషి జరుగుతుందని ఈ క్రమంలోనే రెండు,వేర్వేరు నిర్మాణాలు కలిగిన ఏఐకేఎంఎస్ సంస్థలు విలీనం కావడానికి ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు.ఈ సభ ప్రారంభంకు ముందు ఉదయం 10 గం. ఓసి క్లబ్ నుండి గంగపుత్ర సంఘం భవనం వరకు ర్యాలీ ఉంటుందని , గంగపుత్ర భవనంలో కౌన్సిల్ ప్రారంభమవుతుందని సభకు అధ్యక్ష వర్గంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు వి.కోటేశ్వరరావు ,మామిడాల బిక్షపతి వ్యవహరిస్తారని ప్రధాన వర్తగా ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య హాజరై ప్రసంగిస్తారని ఇంకా ఈ సభలో ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు చిట్టి పార్టీ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, గౌని ఐలయ్య ప్రసంగిస్తారని తెలుపుతూ
ఈ సభను జయప్రదం చేయాలని నాయకులు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాడ అశోక్, గుగులోతు భద్రాజి, రమేష్, భీమగాని మల్లయ్య, ఎన్ సూరయ్య, ఆకుతోట రాజు, చిరంజీవి, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క, పివైఎల్ జిల్లా నాయకులు రంజిత్, పిడిఎస్యు నాయకులు అజయ్, ఐఎఫ్టియు నాయకులు అశోక్, వేముల వెంకన్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.