టీఎస్ జెయుఎన్.యూజేఐ నాయకులు డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
పత్రిక,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టును బెదిరింపుల గురిచేస్తున్న అధికారి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్.యూ.జే.ఐ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పావుశెట్టి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి జల్ది రమేష్ లు డిమాండ్ చేశారు.గురువారం కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ భూపాలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కులం,నివాసం,ఆదాయం సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ జర్నలిస్ట్ కథనం ప్రచురించగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అధికారి కథనం రాసిన జర్నలిస్టును కార్యాలయం కు పిలిచి బెదిరింపులకు గురిచేడాన్ని టీఎస్ జేయూ(ఎన్ యూ జే ఐ)యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.ప్రభుత్వానికి ప్రజలకు వారధి గా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు.ప్రజా సమస్యలు వెలికితీయడంలో జర్నలిస్టు పాత్ర కీలకమని అలాంటి సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే జర్నలిస్ట్ హక్కులు అణచివేసేలా ప్రవర్రస్తూ జర్నలిస్టులను బేధింపులకు గురిచేయడం హెయమైన చర్యగా పేర్కొన్నారు.జిల్లాలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా, జర్నలిస్టుల గౌరవం,హక్కులు కాపాడేలా సదరు అధికారి పై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.లేని పక్షంలో జర్నలిస్ట్ లంతా ఏకమై పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు