_ వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్.
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జే.యు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోతున్న 2కే రన్ కార్యక్రమ ప్రచార పోస్టర్ ను గురువారం వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో వరంగల్ ఏంఆర్ఓ మహమ్మద్ ఇక్బాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సామాజిక బాధ్యతగా సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ఇందు కోసం కృషి చేయాలని కోరారు. ఈ 2కే రన్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి.ఎస్.జే.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ఉపాధ్యక్షుడు కందికొండ గంగరాజు, లింగబత్తిని కృష్ణ, బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, ఈద శ్రీనాథ్, నాగపురి నాగరాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.