హన్మకొండ విద్యాశాఖ సూపర్డెంట్ కి ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం
హన్మకొండ, నేటిధాత్రి:
ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా పట్టణ పరిధిలోని నవయుగ ప్రవేట్ పాఠశాల పేర్లతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నవయుగ ప్రైవేట్ పాఠశాల పేరుతో అనుమతి ఉంటే దానికి భిన్నంగా గ్లోబల్ మైండ్ , ఐఐటి మెడికల్, సీబీఎస్ఇ పేర్లతో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండానే గ్లోబల్ పేర్లతో పాఠశాల ఏర్పాటు చేసుకొని నగరంలోని ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేసుకొని ప్రచారం నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు తీవ్ర నష్టం చేస్తున్నారని అన్నారు ఇట్టి విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి ప్రభుత్వ నియమాలు పాటించని నవయుగ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరారు.. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ వినయ్ రఘు, రాజేందర్ ప్రవీణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.