వెలిశాల రాజేందర్ రావు గెలుపు కోసం
వీణవంక,(కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:
కరీంనగర్ పద్మనాయక్ కళ్యాణ మండపం లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గారిని బలపరచడం కోసం ఏర్పాటు చేసిన గౌడ్ ఆత్మీయ సమ్మేళనం డులో తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా వచ్చారు ఇట్టి కార్యక్రమంలో గౌడ సమస్యలను పరిష్కరించాలని మ్యాడగోని బుచ్చయ్య గౌడ్ మాట్లాడుతూ… తాడిచెట్టు నుండి పడి గాయపడి మరణించిన వారి పెండింగ్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తా డి కార్పొరేషన్ నుండి వచ్చే 15 వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే ఇప్పించాలని గత ప్రభుత్వం ప్రకటించిన సేఫ్టీ మో కు లను వెంటనే అమలు చేయాలని గీతా కార్మికులకు ఇవ్వాలని స్కూలు బాక్సులతో కూడిన బైకులను ఇవ్వాలని ఒక సొసైటీకి ఐదు ఎకరాల నుండి 10 ఎకరాల వరకు భూమి కేటాయించి తాటి ఈత చెట్లను నాటించి బోర్లు వేయించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి సౌకర్యం అందించాలని గాయపడిన గీతా కార్మికులకు ముగ్గురు డాక్టర్లతో కూడిన కమిటీని తొలగించి అందుబాటులో ఉన్న గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ లో సర్టిఫికెట్ ఇచ్చే విధంగా జీవో సరి చేయాలని ప్రతి గీతా కార్మికునికి 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని గాయపడి వికలాంగులుగా మారిన గీతా కార్మికులకు వికలాంగుల పింఛను అమలు చేయాలని బెల్ట్ షాపులను పూర్తిస్థాయిలో తొలగించాలని మంత్రి గారిని కోరడం జరిగింది వెంటనే స్పందించి ఎలక్షన్ అయిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తానని తెలియపరిచారు ఎందుకుగాను నేను కాంగ్రెస్ కండువా కప్పుకోవడం మంత్రి గారి చేతుల మీదుగా కండువా కప్పి పార్టీలోకి తీసుకోవడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినారు.