పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన
జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1994-94 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నాటి గురువులతో కలిసి వైభవంగా నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన విద్యార్థులు అందరు ఒకే వేదికపై కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చదివిన బడి, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన గురువులు పాపిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మల్లేశం, అజుముద్దీన్, చంద్రశేఖర్, మాణిక్యప్పలా పాదాలకు నమస్కరించి ఆశీర్వచనలు తీసుకుని పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. పూర్వ విద్యార్థులు ఆర్ నర్సింలు, విజయేందర్ రెడ్డి, శశికళ, అమరావతి, అస్లాం, రిహానా, నాగన్న, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, విజయ్ కుమార్, ముక్తార్, అనిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.