సిబ్బంది సమస్యల పరిష్కారంకై ప్రత్యేక విభాగం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

నేటిధాత్రి, వరంగల్

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తునట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఇటీవల కాలంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది పలు వ్యక్తిగత సమస్యలతో పాటు, శాఖపరమైన సమస్యలతో బాధ పడుతున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ దృష్టి రావడంతో సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకోని వారి సమస్యలను పరిష్కరించేందుకుగాను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములోని పోలీస్‌ కంట్రోల్‌ రూంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇందుకోసం కంట్రోల్‌ రూంకు చెందిన మహిళా ఏఎస్‌ఐ జ్యోతి ప్రియాంకను నోడల్‌ అధికారిగా నియమించడం జరిగింది. ఇకపై పోలీస్‌ సిబ్బంది తమ వ్యక్తిగతం కాని శాఖపరమైన సమస్యలు వుంటే నోడల్‌ అధికారి ఫోన్‌ నంబర్‌ 9948685494 ఫోన్‌ ద్వారా తమ ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయాల్సి వుంటుంది. ఈ విధంగా వచ్చిన ఫిర్యాదులను సదరు నోడల్‌ అధికారి పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకవెళ్ళి సమస్య పరిష్కారం కొరకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సిబ్బంది తమ వ్యక్తిగత సమస్యలు, శాఖపరమైన సమస్యలు పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యక్షంగా కలుసుకోని తెలియజేసేందుగాను ఇకపై పోలీస్‌ సిబ్బంది కేవలం ప్రతి శనివారం రోజున మాత్రమే పోలీస్‌ కమిషనరేట్‌ సిబ్బంది రావల్సి వుంటుందని. అలాగే పోలీస్‌ కమిషనర్‌ కలిసేందుకు వచ్చే సిబ్బందికి స్టేషన్‌ అధికారులు తప్పని సరిగా అనుమతి మంజూరు చేయాల్సింది వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు ఉత్తర్వులు జారీచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *