సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్డి అబ్బాస్.
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14, 15 తేదీల్లో జరిగే జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు కార్లమర్స్ కాలనీలో ప్రారంభమయ్యాయి. జెండా ఆవిష్కరణ చేసిన వెలిశెట్టి రాజయ్య, ఈనాటి క్లాసులకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ , సిపిఎం పార్టీ విశిష్టత ప్రతినిధులకు వివరించారు. ఎర్ర జెండా నే పేద ప్రజలకు అండ అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా పార్టీలే ముందు ఉంటాయని, ప్రజల మౌగోళిక సమస్యల పరిష్కారం ఎర్రజెండా పార్టీలతోనే సాధ్యమని, బూర్జివ పార్టీలు, పెట్టబడదారులు ప్రజల శ్రమను దోచుకొని లాభాలు గడిస్తాయన్నారు. ప్రపంచ దేశాలలో ఎర్రజెండాకు ఆదరణ పెరుగుతుంది. భారతదేశంలో కూడా సిపిఎం ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది. కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, కూలీల పక్షాన, మహిళలు, విద్యార్థులు, యువజనులు, దళిత గిరిజనులు, మైనార్టీల రక్షణ కోసం సమర శీలంగా పోరాటం చేసేది సిపిఎం పార్టీ దాని ప్రజాసంఘాలు మాత్రమే అని అన్నారు. పెట్టుబడి రాజ్యం కూల్చాలి, కార్మిక,శ్రామిక రాజ్యం రావాలి. దానికి ప్రతి కార్యకర్తసమరశీల పోరాటాలు నిర్వహించాలన్నారు.
సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ, జిల్లాలో రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని, ఇంజనీరింగ్ కాలేజీ, బీఈడీ కళాశాల, ఈ పట్టాలు లేని పేదలి పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని, ఇప్పుడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించాలని, ప్రభుత్వాన్ని కోరారు. రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో పార్టీ శ్రేణులకు శిక్షణ ఇస్తున్నాము భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. రెండు రోజులపాటు జరిగే ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా గుర్రం దేవేందర్ పార్టీ జిల్లా నాయకుడు వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, సతీష్ కుమార్,శ్రీకాంత్, ప్రీతి,
పార్టీ నాయకులుఏ రమేష్,శేఖర్,మహేందర్,రాజేందర్,కుమార్, లక్ష్మక్క, రజిని,రజిత, నరేష్, రోజా,తదితరులు పాల్గొన్నారు.