పొద్దుగాలనే హోటల్ షురూ గిరాకి ఫుల్ గురూ
పరకాల నేటిధాత్రి
ఈ హోటల్ బయటికి కనిపించేది వేరు లోపల కనిపించేది వేరు వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గల వాసవి హోటల్ రుచి కి పెట్టింది పేరు ఈ హోటల్ పట్టణంలోని డాక్టర్ సంజీవయ్య హాస్పిటల్ సమీపంలో ఒక భారీ వేప చెట్టుకింద వాసవి టిఫిన్ సెంటర్ పేరుట నెన్నుట రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.గతంలో హన్మకొండ లో రమేష్ ఒక క్యాంటిన్ పెట్టి జీవనాన్ని కొనసాగించే వారు.
ఒక్కో వంటకానికి ఒక్కో మాస్టర్
ఈ హోటల్ లో ఇడ్లి,దోస,వడ పూరి ల వంటి రకాలు దొరకడం జరుగుతుంది.రుచి మీద దృష్టిపెట్టి ఒక్కో టిఫిన్ కి ఒక్కో మాస్టర్ ను పెట్టి ది బెస్ట్ అనిపించేలా తయారు చేయించడం జరుగుతుంది. ఒక్కో వంటకానికి ఒక్కో ప్రత్యేక రుచి కలిగి ఉందని చెప్పుకోవచ్చు.
పొద్దుగాలనే హోటల్ షురూ,గిరాకి ఫుల్ గురూ
దాదాపు 5 గంటలనుండి 12 గంటల వరకు ఈ హోటల్ అందుబాటులో ఉంటుందట అవసరాల నిమిత్తం పరకాల కు వచ్చే ప్రజలు ఎంత సమయనైన వెచ్చించి ఈ హోటల్ లో తప్పకుండ టిఫిన్ చేసి వెళ్తారంటా తమ కుటుంబ సభ్యులు అంతకలిసి ఈ హోటల్ పది మంది వరకు పనిచేస్తున్నారు.కుటుంబ సభ్యులంతా కలిసి సమిష్టి గా పనిచేయడం చాలా సంతోషమని చెప్పవచ్చు.