చందుర్తి, నేటిధాత్రి:
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పరీక్ష గాను చందుర్తి మండలం మల్యాల గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివిన ఎల్ల చరణ్, గొర్రె దీక్ష అను ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు వీరికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకార వేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థిని, విద్యార్థులు గ్రామస్తులు అభినందించారు.